Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, February 3, 2017

శ్రీషిరిడీ సాయి వైభవమ్ - బాబా, విశ్ కాంతగారికి జీవితాన్ని ప్రసాదించుట

0 comments Posted by tyagaraju on 7:41 AM
      Image result for images of shirdisaibaba cross legged standing
(ఒరిజినల్ గ్లాస్ నెగిటివ్ నుండి రూపుదిద్దుకున్న శ్రీసాయి 
  సహజ ఛాయా చిత్రం)

Image result for images of rose
03.02.2017 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీషిరిడీ సాయి వైభవమ్
బాబా, విశ్ కాంతగారికి జీవితాన్ని ప్రసాదించుట
(బాబా తన భక్తునిపై అనుగ్రహమ్ – 2 వ.భాగమ్)
ప్రొఫెసర్ విశ్ కాంతగారు వెనుకటి రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ బాబా తనను ఏవిధంగా కాపాడినది చాలా వివరంగా చెప్పిన అనుభవమ్.

“తర్వాత సంవత్సరాలన్నీ చాలా కష్టాలు, కడగండ్లతో సాగాయి.  బీదరికం మమ్మల్ని తీవ్రంగా బాధించసాగింది.  మా అమ్మగారు ఎంతో మంది బీద బ్రాహ్మణ బాలురకు భోజనం పెట్టారు.  అటువంటిది మాకు కడుపునిండా తిండిపెట్టలేని దుస్థితికి చేరుకుంది.  తరచుగా కాకపోయినా మేము ఒక్కొక్కసారి పస్తులతో పడుకోవలసివచ్చేది.  

Tuesday, January 31, 2017

శ్రీషిరిడీసాయి వైభవమ్ – తన భక్తునిపై బాబా అనుగ్రహమ్

0 comments Posted by tyagaraju on 8:08 AM
         Image result for images of shirdisaibaba smiling
          Image result for images of pink rose


31.01.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీషిరిడీసాయి వైభవమ్ – తన భక్తునిపై బాబా అనుగ్రహమ్
ఈ రోజు మరొక అద్భుతమైన వైభవాన్ని తెలుసుకుందాము. 
బెంగళూరు నివాసి ప్రొఫెసర్ ఆర్. విశ్ కాంత 7 సంవత్సరాల వయసులోనే బాబా అనుగ్రహాన్ని పొందిన భాగ్యశాలి. 
2015 వ.సంవత్సరంలో ప్రొఫెసర్ ఆర్.విశ్ కాంత గారు చెప్పిన అనుభవాల మాలిక.

Sunday, January 29, 2017

శ్రీ షిరిడీ సాయి వైభవమ్ – సహాయం చేయకుండా ఉండగలనా?

0 comments Posted by tyagaraju on 7:15 AM
       Image result for images of shirdisaibaba kind look
            Image result for images of rose hd yellow


29.01.2017 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయి వైభవమ్ – సహాయం చేయకుండా ఉండగలనా?
నెలరోజులనుండీ కొన్ని అనుకోని సంఘటనల వలన ప్రచురణకు పెద్ద ఆటంకమే కలిగింది.  ప్రతిరోజూ మన సాయి బంధువులకు బాబా లీల ఒక్కటయినా ప్రచురిస్తే ఎంతో తృప్తిగా ఉండేది.  మీరందరూ బాబా లీలలను ప్రతిరోజూ చదువుతూ ఆయన మనకందరకూ దగ్గరగా ఉన్నారనే భావంతో ఉంటూ ఉంటారని తెలుసు.  కాని ఏమీ చేయలేని పరిస్థితులలో ప్రచురించలేకపోయాను.  ఈ రోజు సమయం చూసుకుని ఒక చిన్న లీల ప్రచురిస్తున్నాను. 
ఓమ్ సాయిరామ్

Image result for images of sakharwadi sugar factory
శ్రీ ఎమ్.ఆర్. తగారే షిరిడీకి దగ్గరలో ఉన్న సాకర్ వాడీ చక్కెర కర్మాగారానికి సంబంధించి డాక్టర్ గా పనిచేస్తున్నారు.  1914 వ.సంవత్సరంలో ఆయన తన వద్దనున్న 2,500 రూపాయల విలువగల వార్-బాండ్స్ ను అమ్మేయడానికి కోపర్ గావ్ లో ఉన్న పోస్ట్ ఆఫీసుకు ఎడ్లబండిలో బయలుదేరారు.  
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List