Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, May 26, 2017

ఈనాటి సమాజములో మానవత్వము ఇంకా బ్రతికే ఉంది – 8 & 9

Posted by tyagaraju on 5:27 AM
       Image result for images of shirdi sainath
       Image result for images of rose hd

26.05.2017 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈనాటి సమాజములో మానవత్వము ఇంకా బ్రతికే ఉంది – 8 & 9
శ్రీ సాయిబానిస నిజ జీవితములోని అనుభవాలు)
సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు

8.  అనాధ ప్రేత సంస్కారము
శ్రీసాయి సత్ చరిత్ర 31.అధ్యాయములో మేఘశ్యాముడి గురించి వివరాలు చదవండిమేఘశ్యాముడు బాబాకు అంకిత భక్తుడుఅతను బాబా సమక్షములో తన 35.సంవత్సరములో మరణించాడుషిరిడీలో అతనికి బంధువులు ఎవరూ లేరుబాబా సేవలోనే తన జీవితాన్ని సార్ధకం చేసుకొన్నాడుఒంటి కాలుపై నిలబడి బాబాకు హారతి ఇచ్చిన మహానుభావుడుఅటువంటి మేఘశ్యాముడు మరణించినపుడు బాబా చిన్న పిల్లవానివలే దుఃఖించి అతని శవమువెంబడి స్మశానమువరకు వెళ్ళి అక్కడ అతని పార్ధివ శరీరానికి అంతిమసంస్కారాలు చేయించి, సాయిభక్తులు కూడా అనాధప్రేత సంస్కారం చేయవలసినది అని ఒక మంచి సందేశాన్నిచ్చారు.


ఈమధ్య కాలములో మాబంధువులలో ఒక స్త్రీ కేన్సరు వ్యాధితో బాధపడి మరణించిందిఆమె దహన సంస్కారాలు చేయడానికి ఆమె సవతిపిల్లలవద్ద కావలసినంత ధనం లేదుఅక్కడి పరిస్థితిని నేను అర్ధము చేసుకొని ఆమె పార్ధివశరీరం దహనానికి కావలసిన ధనమును సమకూర్చి ఆమె దహన సంస్కారాలు పూర్తిచేయించాముఈసంఘటన తర్వాత నేను అనేకమంది అంత్యక్రియలకు వెళ్ళానుమనము వివాహ వేడుకలకు వెళ్ళి అక్కడి పెండ్లివారికి బహుమానాలు ఇస్తాముమరి మనిషి చనిపోతే అతని అంతిమ సంస్కారాలకు వెడతాముపూలమాలలువేసి చనిపోయిన వ్యక్తికి శ్రధ్ధాంజలి ఘటిస్తాము పూలమాలలను స్మశానములో తీసి బయట పారవేస్తారుఅదే మనము పూలమాలల బదులు ఒక మంచి చీరగాని, పంచెలచాపు గాని శరీరము మీద కప్పిన స్మశానములో వాటిని కాటికాపరి తీసుకొని తన ఇంటిలో వాడుకొంటాడుఈవిధముగ మనము ఆచనిపోయినవారి పేరిట వస్త్రదానము చేసినవారం అవుతామునేను ఈపద్ధతిని గత నాలుగు సంవత్సరాలనుండి పాటిస్తున్నాను

శ్రీసాయిభక్తులందరము మేఘశ్యాముని జీవితాన్ని గుర్తు చేసుకొంటూ ఈపధ్ధతిని పాటించి శ్రీసాయి చూపిన మార్గములో మనము ప్రయాణము చేద్దాముసమాజంలో ఇంకా మానవత్వము బ్రతికే ఉంది అని నిరూపించుదాము.
జై సాయిరామ్

9.  24.04.2017 నాడు శ్రీసాయి ప్రసాదించిన అనుభవం

శ్రీసాయి సత్ చరిత్ర 40.అధ్యాయమును ఒక్కసారి గుర్తు చేసుకొందాముశ్రీసాయి 1917 .సంవత్సరం హోలీ పండగ తెల్లవారుజామున హేమాద్రిపంతుకు కలలో చక్కని దుస్తులు ధరించిన సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి, హేమాద్రిపంత్ ఇంటికి మధ్యాహ్నము భోజనానికి వస్తానని తెలియచేసారుభోజన సమయానికి ముందుగా ఒక పటం రూపంలో శ్రీసాయి వచ్చి తన మాటను నెలబెట్టుకొన్నారు
                   Image result for images of megha shyam sai devotee

ఇటువంటి అనుభవం నాకు 24.04.2017 కలిగిందిశ్రీసాయి తాను జీవించి ఉండగా తన భక్తులను ఏవిధంగా అనుగ్రహించారో ఇప్పటికీ అదే రీతిలో అనుగ్రహిస్తున్నారు అని తెలుస్తోంది

అది 24.04.2017 (నాపుట్టిన రోజు) తెల్లవారుజామున బాబా మాఆఫీసులోని సీనియర్ మేనేజరు సర్దార్ అలువాలియా రూపంలో దర్శనం ఇచ్చి, తాను సాయంత్రం నాయింటికి ఇడ్లి దోశ తినడానికి వస్తానని మాట ఇచ్చారు
                    Image result for images of idli, dosa

శ్రీ అలువాలియా నాకు మంచి స్నేహితుడు ఆయన రెండు సంవత్సరాల క్రితం కాలము చేసారుఅటువంటి అలువాలియాగారు నాయింటికి నాపుట్టిన రోజు సందర్భముగా ఇడ్లి, దోశ తినడానికి ఎలాగ వస్తారు అని ఆలోచించసాగానుబాబా హేమాద్రిపంతుకు సన్యాసి రూపంలో దర్శనము ఇచ్చి, తాను పటం రూపంలో హోళీ పండగనాడు భోజనానికి వచ్చారే, మరి నావిషయములో చనిపోయిన నాస్నేహితుడు సర్దార్జీ అలువాలియా రూపంలో రాకపోయినా వేరే యింక ఎవరి రూపంలోనైన వస్తారు అనే నమ్మకంతో ఎదురు చూడసాగానునేను నాపుట్టినరోజుకు ఎవరినీ ఆహ్వానించలేదుఎవరైన వస్తే తినడానికి వీలుగా సమోసాలు, రస్ మలయ్, పుల్లారెడ్డి నేతిమిఠాయి, మరియు కూల్ డ్రింక్ తెప్పించి ఉంచాను.
                            Image result for images of samosa, rasmalai and mithai
                Image result for images of shirdisaibaba eating

సాయంత్రం ఆరు గంటలు కావచ్చిందినాకుమార్తె టాక్సీలో బంజారహిల్స్ లోనున్న తన ఇంటినుండి బయలుదేరి దారిలో ఒక పూలగుత్తిని కొందిఆసమయంలో ఆటాక్సీ డ్రైవరు ఈపూలగుత్తి ఎవరికోసం మేడమ్ అని అడిగినాడటనాకుమార్తె యిది నాతండ్రిగారి కోసం ఈరోజు ఆయన పుట్టినరోజు అని చెప్పిందిటనాకుమార్తె 7 గంటలకు నాయింటికి చేరింది పూలగుత్తిని నాకు ఇచ్చి నా ఆశీర్వచనాలు తీసుకొంది
                    Image result for images of bouquet of flowers for birthday

ఆమె వెనకాలే ఆటాక్సీ డ్రైవరు వచ్చి నాకు జన్మదినశుభాకాంక్షలు తెలియచేసాడునేను ఎవరిని నాపుట్టినరోజుకు పిలవలేదు టాక్సీడ్రైవరు వచ్చి నాకు జన్మదినశుభాకాంక్షలు తెలియపర్చసాగాడునేను సంతోషముతో అతనిని కౌగలించుకొని అతని పేరు అడిగానుతన పేరు ముక్తార్ అని తను హైదరాబాద్ పాతబస్తీలోని ముస్లిమ్ సాంప్రదాయానికి చెందిన వ్యక్తినని, ఈరోజు మీఅమ్మాయి మీగురించి పూల బుకే (పూలగుత్తి) కొంటున్న సమయంలో మీదర్శనం చేసుకోవాలనే కోరిక కలిగింది, అందుచేతనే మీయింటిలోకి వచ్చి మిమ్మలని అభినందించాను అన్నాడుఒక్కసారిగా, బాబా తెల్లవారుజామున నాయింటికి సర్దార్ అలువాలియా రూపంలో వస్తానని మాట ఇచ్చి, తన మాటను నిలబెట్టుకోవడానికి శ్రీముక్తార్ (టాక్సీడ్రైవర్) రూపంలో వచ్చారా అని భావించి, అతనితో కలసి నాపుట్టినరోజు పండుగను గడిపానుఅతను నాతోపాటు, సమోసాలు, రస్ మలాయ్ తింటూ ఉంటే, బాబా తానే స్వయంగా ఇడ్లి దోశ తింటున్న అనుభూతిని నాకు ప్రసాదించారుబాబా ఒక హిందువుగా కలలో దర్శనము ఇచ్చి ఒక ముస్లిమ్ గా నాయింటికి వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్ళారు అనే భావనతో రాత్రి అంతా ఆలోచించానురాత్రి కలలో శ్రీసాయి ముక్తార్ రూపంలో దర్శనము యిచ్చి తను తన మాటను నిలబెట్టుకొన్నానని చెప్పారు.
జై సాయిరామ్
(రేపటినుంచి బాబా శ్రీ భారం ఉమామహేశ్వరరావు గారికి
ప్రసాదించిన శ్రీసాయి తత్త్వ సందేశములు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)




Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List