Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, May 24, 2017

ఈ సమాజంలో మానవత్వము ఇంకా బ్రతికే ఉంది - 7

Posted by tyagaraju on 9:15 AM
     Image result for images of shirdi sai
        Image result for images of rose hd
24.05.2017 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈనాటి సమాజములో మానవత్వము ఇంకా బ్రతికే ఉంది
(శ్రీ సాయిబానిస నిజ జీవితములోని అనుభవాలు)
సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు


7.  మానవ సేవయే మాధవసేవ
.    నిర్మల శిశుభవన్సికింద్రాబాద్
మన ఇళ్ళలో ఒక శిశువు జన్మించినపుడు, ఇంటిలోని పిల్లలు, పెద్దలు సంబరాలు చేసుకొంటారుమిఠాయిలను పంచుకొంటారు శిశువు పెరుగుతుంటే అచ్చట, ముచ్చట పేరిట పండగలు చేసుకొంటాము
               Image result for images of birthday for newborn baby
మరి తల్లి, తండ్రి ఎవరో తెలియక అనాధపిల్లల ఆశ్రమంలో పెరిగి పెద్దవారుగా అవుతున్న పిల్లల గురించి ఎవరైన ఒకసారి ఆలోచించారా?  



ఒక్కసారి మీ పట్టణములోని అనాధ పిల్లల ఆశ్రమానికి వెళ్ళండిఆ పిల్లలతో మీప్రేమను పంచుకోండిఅప్పుడు మీకు మానవతా దేవతయొక్క ఆశీర్వచనాలు లభిస్తాయి.
                               Image result for images of nirmala shishu bhavan secunderabad
నేను, నాభార్య, మాసాయి దర్బార్ కార్యకర్తలందరం కలసి అనేకసార్లు సిదింద్రాబాద్ లోని నిర్మలశిశుభవన్ కు వెళ్ళాము పిల్లలతో కలసి ఆటపాటలలో పాల్గొన్నాము పిల్లలతో కలసి భోజనాలు చేసాము సమయంలో పిల్లలతో గదుపుతూంటే ప్రపంచము చాలా విశాలమైనది,   ప్రపంచము నాఇల్లుకు మాత్రమే పరిమితంకాదు అనే భావన కలిగింది పిల్లలతో ఆడుకొంటూ వారికి కధలు చెబుతుంటే నా జీవితంలో నేను నాపిల్లలతో గడిపిన రోజులు గుర్తుకు వచ్చాయివాళ్ళు తాత, అంకులు అని పిలుస్తుంటే వారికీ నాకు గతజన్మ నుండి బంధము ఉంది అనే భావన కలిగిందిశ్రీసాయి షిరిడీలోని చిన్నపిల్లలతో ఆటలు ఆడేవారు.  
    Image result for images of shirdi sai baba playing with children
    Image result for images of shirdi sai baba playing with children
వారికి పాటలు పాడి వినిపించేవారు అనే విషయాన్ని మనం శ్రీసాయి సత్ చరిత్రలో చూడగలమునిత్యము తన వద్దకు వస్తూ ఉండే ఇద్దరు పిల్లలు అమాలి, జమాలిలకు చెరొక రూపాయి ఇస్తూ ఉండేవారు బాబాబాబాను మొదటిసారిగా 1908లో పూజించిన బాలుడు బాపూరావుఅతను ప్రతిరోజూ బడికి వెడుతూ ద్వారకామాయికి వచ్చి బాబా శిరస్సు పైన ఒక గులాబి పూవును ఉంచి బాబాను పూజించేవాడుఒకనాడు షిరిడీకి దూరములో ఉన్న ఒక గ్రామములో ఒక కమ్మరివాని పసిపాప కమ్మరికొలిమిలో పడిపోయినపుడు బాబా తన చేయిని ద్వారకామాయి ధునిలో పెట్టి గ్రామములోని పసిపాపను కాపాడిన విషయము మనందరికి తెలిసినదే.
                             Image result for images of shirdi sai baba putting his hand in dhuni
మనం భగవంతుని అనుగ్రహము కోసం మందిరాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తాముఅది మన ఆరోగ్యానికి మంచిదికాని భగవంతుడు నీచుట్టూ ప్రదక్షిణలు చేయాలంటే నీవు ఒక అనాధపిల్లవానిని నీ ఒడిలో కూర్చుండబెట్టుకొని నీ ప్రేమను వానికి పంచిపెట్టుఅపుడు భగవంతుడు తన అనాధపిల్లవానికి నీవు ప్రేమను పంచుతున్నావా లేదాలేక ఆపిల్లవానిని హింసించుతున్నావా అనే విషయాన్ని తెలుసుకోవడానికి నీచుట్టూ తిరుగుతూ ఉంటాడుఅందుచేత ప్రతి వ్యక్తి సమాజంలో ఉన్న అనాధపిల్లలకు తన ప్రేమను పంచి భగవంతుని ఆశీర్వచనాలు పొంది సాయిమార్గములో పయనంచాలి

జై సాయిరామ్

వృధ్దుల ఆశ్రమాలుసికింద్రాబాద్హైదరాబాద్

నాజీవితంలో మాసాయిదర్బార్ కార్యకర్తలతో కలసి అనేకసార్లు వృధ్దుల ఆశ్రమాలకు వెళ్ళి అక్కడ అన్నదానం, వస్త్రదానం, కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమాలు చేసామువృధ్ధుల ఆశ్రమాలలోనివారి జీవితాలలో ఒకసారి తొంగి చూసిన వారు వృధ్ధాప్యములో ఎంతగా మానసికముగా బాధ పడుతున్నది మనకు తెలుస్తుందివారిలో చాలా మందికి పిల్లలు ఉన్నా వారు తమ పిల్లల ప్రేమకు నోచుకోలేక వారి పిల్లల చేతనే ఇంటినుండి గెంటివేయబడి ఇటువంటి వృధ్ధుల ఆశ్రమాలలో చేరుతున్నారు.  
               Image result for images of old age homes in india

ఒక స్త్రీని (వయస్సు సుమారు 80.)  అమె బంధువులు ఒక ఆటోలో తీసుకొనివచ్చి ముషీరాబాద్ జైలు దగ్గర  ఉన్న వృధ్ధాశ్రమం గేటు దగ్గర దింపివేసి వెళ్ళిపోయారుఆమెను వృధ్ధాశ్రమంలోని క్రేస్తవ సిస్టర్స్ ఆదుకొని ఆశ్రమములో చోటు కల్పించారు.  
    Image result for images of old age homes in india

ఇక్కడ ఉన్నవృధ్ధులతో మాట్లాడానువారు అన్నమాటలు నాకు గుర్తున్నాయిమా ఇళ్ళలో మాపిల్లలు పెట్టే బాధలు భరించలేక ఆశ్రమానికి చేరుకొని భగవంతుని దయతో ప్రశాంతముగా జీవిస్తున్నాము.  వారి మాటలు గుర్తుచేసుకొన్నపుడు మన జీవితాలలో వృధ్ధాప్య దశ ఏవిధముగా గడుస్తుంది అనే ఆలోచన రాకమానదునేడు ప్రభుత్వమువారు వృధ్ధుల పట్ల గౌరవముతో పింఛను ఇవ్వడము సంతోషకరంమనము వృధ్ధాశ్రమాలకు మన పుట్టినరోజున లేదా మనపెళ్ళిరోజున, లేదా మనపిల్లల పుట్టినరోజులనాడు వెళ్ళి, వృధ్ధులతో మన సంతోషాన్ని పంచుకొన్ననాడు, మనము మానవతాదేవతయొక్క ఆశీర్వచనాలను పొందగలము.
                         Image result for images of sevashram secunderabad
ప్రభుత్వమువారే కాకుండా, హెల్ప్ ఏజ్ డ్ ఇండియా అనే స్వఛ్చంద సంస్థ కార్యకర్తలు వృధ్ధులకు సేవచేస్తూ ఈసమాజములో వృధ్ధులకు కూడా గౌరవప్రదమైన స్థానము ఉంది అని తెలియపరుస్తున్నారుబాబా ఏనాడు తనకు బంగారు కిరీటాలు, బంగారు సింహాసనము కావాలని కోరలేదుఆయన ఒక సాధారణ ఫకీరుగానే జీవించి షిరిడీలో మహాసమాధి చెందారుదయచేసి సాయినాధులవారి పేరిట అనాధాశ్రమాలకు, వృధ్ధుల ఆశ్రమాలకు, మానసిక వికలాంగుల ఆశ్రమాలకు ధనసహాయము చేసి బాబావారి కృపకు పాత్రులమవుదాముసాయి చూపిన మార్గములో పయనిద్దాముఇంకాఈసమాజములో మానవత్వము బ్రతికే ఉందిఅని ప్రపంచానికి చాటి చెప్పుదాము.

జై సాయిరామ్

మరణానికి చేరువలో ఉన్న అనాధులకు ఆశ్రయము ఇస్తున్న సంస్థ

ఇది సిదింద్రాబాద్ భోలక్ పూర్ లో ఉందిఇది మదర్ థెరిసా స్థాపించిన సంస్థ సంస్థలోకి ఒకసారి వెళ్ళి చూసిన మానవత్వానికి ప్రతీక అయిన మదర్ థెరిసా యొక్క సేవలను గుర్తు చేసుకోవచ్చునుఅనాధ ఆశ్రమాలు, వృధ్ధుల ఆశ్రమాలలో మనం ఆరోగ్య వంతులను చూడగలముకాని ఆశ్రమంలో మృత్యువుతో పోరాడుతు సమాజములో తోటి మానవుల నిరాదరణకు గురయిన అభాగ్యులను ఈసంస్థవారు చేరదీసి వారికి సహాయము చేస్తున్నారు

సంస్థలో అనేక పర్యాయాలు అన్నదానము వస్త్రదానము చేసాముఒకసారి అన్నదానములో ఒక వృధ్దురాలికి మిఠాయి పెట్టానుఆమె సంతోషంతో రాత్రి భోజనము చేయను, ఇంకొక మిఠాయి ఉండ ఇవ్వమని కోరిందిఆమె ఆమిఠాయిని ప్రేమతో స్వీకరించి తన దగ్గర ఉన్న చిన్న డబ్బాలో దాచుకోవడం నాహృదయాన్ని కలచి వేసింది వీరందరిని చూసిన తర్వాత మనం చాలా అదృష్టవంతులమని, సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నామని అనిపించింది.

ఆశ్రమంలో ప్రత్యేకత ఒకటుంది ఆశ్రమంలో మతాలకు అతీతంగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తులను చేర్చుకొంటారుదాతలు ఇచ్చే ధనంతో ఆశ్రమాన్ని నడుపుతున్నారు ఆశ్రమంలోని వృధ్ధులు మరణించితే వారివారి మత సాంప్రదాయములతో అంతిమ సంస్కారములు నిర్వహిస్తారుఇది చూసిన తర్వాత సమాజంలో మానవత్వము ఇంకా బ్రతికే ఉందిఅనే భావన కలిగిందిఅందుచేతనే పుస్తకానికి ఆ పేరు పెట్టానుశ్రీసాయి అంటారు. “భగవంతుడు నీలో ఉన్నాడు, నీతోటివానిలో ఉన్నాడునీవు నీతోటివానికి సేవ చేసిన అది మాధవసేవ అని గుర్తుంచుకో”.  అందుచేతనే మనపెద్దలు చెప్పిన ఒక్కమాటను సదా గుర్తు పెట్టుకొందాముఅదే "మానవసేవయే మాధవసేవ”.  సేవా కార్యక్రమాలలో పాల్గొని శ్రీసాయి మార్గములో మన జీవన ప్రయాణాన్ని కొనసాగిద్దాము.
జై సాయిరామ్

మానసిక వికలాంగుల ఆశ్రమము

ఇది సికింద్రాబాద్ లోని జీరా ప్రాంతములో ఉంది ఆశ్రమంలో అనేక పర్యాయాలు అన్నదానము, పండుగ రోజులలో మిఠాయి మరియు ఫలాల దానము చేసిన రోజులు గుర్తుకు వస్తునాయి.

ఆశ్రమాన్ని క్రైస్తవ మిషనరీలు నడుపుతున్నాయి ఆశ్రమంలో చూడటానికి అందరూ ఆరోగ్యవంతులుగా కనిపిస్తారుకాని వారు మానసిక వికలాంగులువారు శారీరకముగా 30, లేదా 40 సంవత్సరముల వ్యక్తులుకాని మానసికముగా వారు 5 లేక 10 సంవత్సరాల పిల్లయినట్లుగా ప్రేమతో పలకరించి వారి మంచిచెడులను కన్నపిల్లలలాగ చూసుకుంటున్న అక్కడి క్రైస్తవ సిస్టర్స్ కు నమస్కరించాలివారు ఆపిల్లలకు  మాతృప్రేమను పంచుతున్నారుసమాజములో కన్న పిల్లలను పెంచలేక ఇటువంటి ఆశ్రమాలవద్ద వదలి వెళ్ళిపోతున్న తల్లిదండ్రులకన్న క్రైస్తవ సిస్టర్స్ మానవతాదేవతలకు ప్రతిరూపాలుఅందుచేత వారికి నమస్కరించాలి ఆశ్రమానికి నా మనసులో ఒక ప్రత్యేకస్థానం ఉంది

ఒకసారి నేను, నాభార్య ఆశ్రమంలో అన్నదానం చేయడానికి వెళ్లాము  సమయంలో ఒక బాలిక నాభార్య చేయిపట్టుకొని తనకు అటువంటి గాజులు కావాలి అని కోరసాగింది బాలిక కోరిన చిన్న కొరిక తీర్చానుఆమె కళ్ళలోని తృప్తిని సంతోషాన్ని చూసాము.

భారతప్రభుత్వమువారు మానసిక వికలాంగులకు ప్రత్యేకమైన పాఠశాలను నిర్వహించుతున్నా సదుపాయము అందరకు చేరువలో ఉండటంలేదుఈనాటి సమాజంలో సాయిప్రేమికులు అందరూ ముందుకు వచ్చి ఇటువంటివారి కోసం ప్రత్యేకమైన పాఠశాలలను నిర్వహించాలిసాయిప్రేమకు పాత్రులు కావాలిసాయి మందిరాలలో ఎన్నిసార్లు పాలాభిషేకాలు చేసాము అనేది ముఖ్యము కాదుఇటువంటి పాఠశాలలలో ఎంతమంది పిల్లలకు మనము పాలు త్రాగడానికి ఇచ్చాము అనేది ముఖ్యముఅభిషేకాలు పేరిట పాలను వృధాచేయకండిఅనాధపిల్లల ఆశ్రమాలలోని పిల్లలు త్రాగడానికి క్షీరదానము చేయండిమరియు శ్రీసాయి అనుగ్రహానికి పాత్రులయి సాయి మార్గములో పయనించండి.
జై సాయిరామ్
(రేపటి సంచికలో మరికొన్ని)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List