Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, May 16, 2017

శ్రీసాయి లీలా తరంగిణి –47వ.భాగమ్

Posted by tyagaraju on 9:31 AM
         Image result for images of shirdi sai
                    Image result for images of rose hd
16.05.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి –47వ.భాగమ్
రచనః  శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
         Image result for images of bharam mani
(మూల రచన :  తెలుగు.   ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త మాత్రుడుః  ఆత్రేయపురపు త్యాగరాజు
 కె.పి. ఆర్. దివ్య ప్రభాస్ ఎన్ క్లేవ్, ఫ్లాట్ 102, లోటస్ బ్లాక్,
నిజాంపేట, హైదరాబాద్
Mail id  :  tyagaraju.a@gmail.ocm
ఫోన్ : & వాట్స్ ఆప్  : 9440375411
                            8143626744


నేను రచించిన పుస్తకం గురించి బాబా అన్న మాటలు
1993వ.సంవత్సరం మే నెలలో ఒకరోజు రాత్రి నాకొక కల వచ్చింది.  ఆ కలలో నేను, నాభర్త ఒక పెద్ద దేవాలయానికి వెడుతున్నాము.  
                     Image result for images of big temple
మొదటగా నాభర్త గుడి లోపలికి వెళ్ళారు.  నేను దుకాణంలో పూలు, పండ్లు కొని గుడిలోపలికి అడుగు పెడుతున్నాను.  నాభర్త ఎవరితోనో మాట్లడుతున్నారు.  నాభర్త దగ్గరకు వెళ్ళడానికి వేగంగా ఆయనవైపు అడుగులు వేస్తున్నాను.  నాకు కుడివైపున పొడవాటి రాతి స్థంభాలు ఉన్నాయి.  


                                  Image result for images of big temple
వాటి వెనుక చిన్న గుడి, అందులో దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి.  నేనలా నడుచుకుంటూ వెడుతూ ఉండగా తెల్లని దుస్తులలో పొడుగ్గా ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు.  కాని నేనతనిని గమనించలేదు.  నేనింకా కొంచెం ముందుకు వెళ్ళి ఒక మెట్టు క్రిందకు దిగగానే ఆవ్యక్తి నా వెనకాలే వచ్చి నా భుజాలు పట్టుకుని నన్ను ఆపాడు.  తన ఎడమ చేతితో నాదవడను పట్టుకుని తన ముఖం వైపుకు తిప్పుకున్నాడు.  అలా తిప్పుకుని నా చెవిలో “సాయి లీలా తరంగిణి’ పుస్తకం చాలా బాగుంది" అని మెల్లగా అన్నాడు.
                   Image result for images of shirdi sai
ఎవరో అపరిచితుడు అనుకోని విధంగా నన్ను ఆపడంతో అతనినే తేరిపార చూస్తూ అచేతనంగా నిలబడిపోయాను.  పొగడదలచుకుంటే ఇది పధ్ధతి కాదని చెప్పి అతనిని హెచ్చరిద్దామని తల ప్రక్కకి తిప్పి చూశాను.  ఆశ్చర్యం ఆనందం ఒకేసారి కలిగాయి నాకు.  శ్రీసాయిబాబా అక్కడ నిలబడి ఉన్నారు.  నాభర్త కూడా బాబా దర్శనం చేసుకుంటారనే ఉద్దేశ్యంతో ఆయనని పిలుచుకురావడానికి లోపలికి పరుగెత్తుకుని వెళ్ళాను.  కాని ఈలోపులోనే బాబా అదృశ్యయిపోయారు.

‘సాయిలీలా తరంగిణి’ పుస్తకం రచింపబడటానికి ముఖ్యకారకులు శ్రీసాయిబాబాయే. నన్ను ప్రోత్సహించడానికి ఆయన కేవలం పొగిడారు.  ఆయన నామీద కురిపించిన కరుణకి నాసాష్టాంగ నమస్కారాలను తెలియచేసుకున్నాను.

శ్రీసాయిబాబా సజీవులే

1994వ.సంవత్సరం జనవరి 21వ.తారీకున నాకు చిత్రాతి చిత్రమయిన కల వచ్చింది. మాయింటిలో మంచం మీద శ్రీసాయిబాబా వారి శరీరం ఉంది.  ఆయన సమాధి చెందినప్పటినుండి ఆయన శరీరం అలాగే ఆ మంచం మీదనే ఉన్నట్లుగా కనపడింది.  బాబా తెల్లని దుస్తులలో ఉన్నారు.  ఆయన చాలా దీర్ఘమయిన నిద్రలో ఉన్నట్లుగా కనిపించారు.   
           
నేను ఆయన గదిలోకి వెళ్ళి నానుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టుకుని తిరిగి వచ్చాను.  వచ్చిన తరువాత బాబాని చూసినపుడు ఆయన నేత్రాలు సగం వరకు తెరిచి ఉన్నాయి.  ఆయన నేత్రాలు పూర్తిగా మూసుకునే ఉండేవి.  ఇంకా పూర్తిగా పరీక్షించడానికి ఆయన దగ్గరగా వెళ్ళి చాలా జాగ్రత్తగా గమనించాను.  ఆయన మొహంలో కాస్త తేడా కనిపించింది.  బాబా జీవించే ఉన్నారని నాకర్ధమయింది.  నా భర్తవైపు చూస్తూ “బాబా బ్రతికే ఉన్నారు” అని సంతోషంతో గట్టిగా అరుస్తూ చెప్పాను.  అనుకోని విధంగా అకస్మాత్తుగా ఈసంఘటన జరగడంతో ఆనందోద్రేకాలతో నన్ను నేను సంబాళించుకోలేకపోయాను.  ఇనుమడించిన ఉత్సాహంతోను, బాబాపై ప్రేమతోను బాబాకు దగ్గరగా వెళ్ళి ఆయనను నాచేతుల్లోకి తీసుకుని చుంబించాను.  నేనాయనను చుంబించగానే ఆయనలో కదలిక కనిపించింది.  బాబాలో బాగా ప్రతిస్పందన కనిపించింది.  బాబా జీవించే ఉన్నారని నాకర్ధమవగానే నాసంతోషానికి అవధులు లేవు.

కొన్ని కోట్ల రూపాయల విలువైన వజ్రాన్ని పోగొట్టుకుని, తిరిగి ఆవజ్రమే లభించినంతగా బ్రహాండమయిన సంతోషాన్ని పొందాను.  బొందితో స్వర్గానికెళ్ళినంత సంతోషం కలిగింది నాకు.  నాసంతోషాన్ని వర్ణించడానికి ఉదాహరణలు ఇవ్వడానికి కూడా సాధ్యపడదు.  సూర్యుని ముందు దివిటీని పట్టుకుని ఉన్నానేమో అని మాత్రమే చెప్పగలను.

నాభావాలను మాటలలో వ్యక్తీకరించలేను.  వర్ణించడానికి మాటలు కూడా లేవు.  స్పష్టంగా చెప్పే స్థితి కూడా లేదు. నాహృదయంలోనే కొలువై ఉన్న సాయినాధులవారికి నామనఃపూర్వకమయిన ప్రణామాలను అర్పించుకొన్నాను.

(ఈరోజుతో సాయిలీలా తరంగిణి ముగిద్దామనుకున్నాను. కొన్ని స్వంత పనుల వల్ల  ఆఖరి భాగమ్ అనువాదమ్ చేయడంలో కాస్త మిగిలిపోయింది. పూర్తి చేసి ప్రచురించడానికి ఇంకా సమయం పట్టేటట్లుగా ఉండటం వల్ల   ఈ రోజు ప్రచురణను ఆపివేయడానికి ఇష్టం లేక కొన్ని ప్రచురిస్తున్నాను)
రేపు సద్గురువు శ్రీసాయిబాబా
(రేపటితో ఆఖరి భాగమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List