Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, April 30, 2016

కేశవ్ భగవాన్ గావన్ కర్

0 comments Posted by tyagaraju on 7:22 AM
   Image result for images of shirdi saibaba rare photos
   Image result for images of rose white hd

30.04.2016 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి భక్తులైన శ్రీ కేశవ్ భగవాన్ గావన్ కర్  గురించి సమగ్రంగా తెలుసుకుందాము.  బహుశ రెండు నెలల క్రితం శ్రీ షిరిడీ సాయి వైభవంలో ప్రచురించాను.  అందులో పూర్తి సమాచారమ్ లేదు.  నిన్ననే "సాయిఅమృతాధార' అనే ఆంగ్ల వెబ్ సైటులో పూర్తి సమాచారం కనిపించింది.  సాయిబంధు శ్రీ చాగంటి సాయిబాబా గారు ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా, వెంటనే దీనిని అనువాదమ్ చేయాలనిపించింది.  ఇందులోని కొన్ని సంఘటనలు ఇంతకు ముందు మీరు చదివే ఉంటారు.  ఇప్పుడు పూర్తిగా చదవండి.



కేశవ్ భగవాన్ గావన్ కర్
(28 ఏప్రిల్, 1906 – 29 జూన్ 1985)

ముంబాయికి వాయవ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాసై గ్రామమయిన బెస్తలపల్లె ఆర్నాల గ్రామంలో డా.కేశవ భగవాన్ గావన్ కర్ గారు 28.04.1906 వ.సంవత్సరం శనివారం, వైశాఖ శుక్ల పక్ష పంచమినాడు (శక సం.1828) లో జన్మించారు.  (ఈయనని ప్రేమగా అప్పాసాహిబ్ అని కూడా పిలిచేవారు). ఆయన పూర్వీకులు కూడా ఆర్నాల గ్రామానికి  చెందినవారే. వారి కుటుంబమంతా ప్రతి రోజు ఎంతో భక్తి శ్రధ్ధలతో గణేశుడిని పూజిస్తూ ఉండేవారు.   ఆయన అనుగ్రహం వారందరికీ పుష్కలంగా ఉంది. కుటుంబంలోనివారంతా ఎంతో భక్తి తత్పరులు.

Friday, April 29, 2016

శ్రీ సాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం – 7వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:26 AM
Image result for images of saibanisa
         Image result for images of flower garden

29.04.2016 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
         Image result for images of saibanisa

శ్రీ సాయి పుష్పగిరిఆధ్యాత్మిక జీవితం – 7.భాగమ్
రోజు ఆధ్యాత్మిక జీవితం మీద బాబా గారు సాయిబానిస గారికి ప్రసాదించిన మరికొన్ని సందేశాలు.


07.05.2006

61.  లంచాలు తీసుకుని భోగాలు అనుభవిస్తున్నపుడు బంధువులు చీమలలా మన చుట్టూ తిరుగుతారుమన సంపాదన వారికి బెల్లం దిమ్మలాగ కనిపిస్తుందిఅవినీతి నిరోధకశాఖ వారు ఆ బెల్లం దిమ్మ తీసుకునిపోయినపుడు ఆ చీమలన్నీ వాటంతటవే వెళ్ళిపోతాయిఅపుడు నీకు మిగిలేది ఏమీ లేదు.     

Thursday, April 28, 2016

శ్రీ షిరిడీసాయి వైభవమ్ - గర్భధారణ సాధ్యమా?

0 comments Posted by tyagaraju on 7:34 AM

           Image result for images of shirdisaibaba with child
Image result for images of flowers


28.04.2016 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ షిరిడీసాయి వైభవమ్
గర్భధారణ సాధ్యమా?

ఈ రోజు ‘ది గ్లోరీ ఆఫ్ షిరిడీ సాయి’ 28.04.2016 సంచికలో ప్రచురింబబడిన వైభవానికి తెలుగు అనువాదం.ఇది అత్యద్భుతమైన వైభవమ్.  మనమందరం కలిసి ఈ వైభవాన్ని వీక్షిద్దాము.
            Image result for images of chandrabai borkar

బొంబాయి, విలే పార్లే లోని చంద్రబాయి బోర్కర్ కి బాబా అంటే ఎంతో భక్తి.  ఆయనకు అంకిత భక్తురాలామె.  ఆమె భర్త రామచంద్ర బోర్కర్ గారు సివిల్ ఇంజనీరు.  ఆయన నాస్తికుడు.  ఆయనకు బాబా అంటే నమ్మకం లేదు.  ఆవిడ షిరిడీ ఎప్పుడు వెడుతున్నా గాని ఆమె భర్త ఆగ్రహించేవాడు కాదు, అడ్డు చెప్పేవాడు కాదు.  ఆది ఆవిడ అదృష్టమనే అనుకోవాలి.  
                Image result for images of baba giving udi to woman

రామచంద్ర గారు సివిల్ ఇంజనీరు కాబట్టి విధి నిర్వహణలో వంతెనల నిర్మాణం ఎక్కడ జరుగుతున్నా అక్కడికి వెళ్ళవలసి వస్తూ ఉండేది.  

Wednesday, April 27, 2016

దుష్ట శక్తులు - బాబా వారి వివరణ

0 comments Posted by tyagaraju on 4:16 AM
Image result for images of shirdi sai bhagavan
        Image result for images of rose hd

27.04.2016 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయి వైభవమ్

దుష్ట శక్తులు - బాబా వారి వివరణ

ఈ రోజు శ్రీ షిరిడీసాయి వైభవంలో మరొక వైభవం తెలుసుకుందాము.  దెయ్యాలు, భూతాలు ఉన్నాయా అంటే కొంతమంది ఉన్నాయంటారు, కొంత మంది అదంతా మన భ్రమ అని కొట్టి పారేస్తారు.  సైన్స్ ఇటువంటి వాటిని అసలే నమ్మదు.  ఈ విషయంలో బాబా ఏమి చెప్పారో ఈ నాటి వైభవంలో తెలుసుకుందాము.
Image result for images baba grinding

బాబా, లక్ష్మీబాయి, జనాబాయి, ద్వారకామాయిలో తిరగలిలో గోధుమలు విసురుతూ ఉన్నారు.  ఆ సమయంలో బొంబాయినుండి ఒక స్త్రీ వచ్చింది.  ఆమె కూడా ద్వారకామాయిలో వారి ప్రక్కన కూర్చుని “బాబా, నేను కూడా గోధుమలను విసరనా?” అని అడిగింది.  “నువ్వు అలసిపోతావు, వద్దు” అన్నారు బాబా. 

Monday, April 25, 2016

శ్రీసాయి అమృత ధార - బాబా స్వయంగా రావచ్చు

0 comments Posted by tyagaraju on 9:42 AM
Image result for images of shirdi sai bhagavan
         Image result for images of rose hd yellow

25.04.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీసాయి అమృత ధార
బాబా స్వయంగా రావచ్చు

ఈ రోజు మరొక అధ్బుతమైన అమృత ధార ను ప్రచురిస్తున్నాను.  బాబా వారి అనుగ్రహం ఏ విధంగా ఉంటుందో మనం ఊహించలేము.  ఆశలన్నీ అడుగంటిపోయి నిరాశా నిస్పృహలతో ఉన్నప్పుడు ఆయన తన చేయిని అందించి సహాయం చేస్తారు.  కాని ఆ సమయంలో మనకు కావలసినది ప్రగాఢమయిన భక్తి.  ఆ భక్తిని మనసులో నింపుకుని మనం నిశ్చింతగా ఉండటమే.  ఆ తరువాత ఆయనే చూసుకుంటారు. 
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List