Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, April 16, 2016

శ్రీ షిరిడీ సాయి వైభవమ్ - మామిడిపళ్ళు – బాబా అనుగ్రహమ్

0 comments Posted by tyagaraju on 9:22 AM
Image result for images of shirdisai as lord rama
      Image result for images of rose


16.04.2016 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయి వైభవమ్
మామిడిపళ్ళుబాబా అనుగ్రహమ్

ఈ రోజు “ది గ్లోరీ ఆఫ్ షిరిడీసాయి” 14.04.2016 సంచికలో ప్రచురించిన మరొక సాయి వైభవం గమనిద్దాము.

హరిశ్చంద్ర పితలే కుమారుడికి మూర్చవ్యాధి ఏవిధంగా నివారణయిందో దాని గురించి శ్రీ సాయి సత్ చరిత్ర 26వ. అధ్యాయంలో వివరింపబడింది.  బాబా హరిశ్చంద్రతో “బాపూ! ఇంతకు ముందు నీకు రెండు రూపాయలిచ్చాను.  ఈ మూడు రూపాయలు కూడా ఉంచుకుని వాటితోపాటుగా ప్రతిరోజు భక్తితో పూజించుకో.  అది నీకు ఎంతో మేలు చేస్తుంది” అని ఆశీర్వదించారు.  హరిశ్చంద్ర ఇంటికి తిరిగి వచ్చాడు.  అతనికి షిరిడీకి వెళ్ళడం అదే మొదటిసారి. మరి బాబా తనకు ఇంతకు ముందు రెండు రూపాయలనిచ్చానని చెప్పారు?  ఆయన మాటలు అర్ధం కాలేదు.  జరిగినదంతా తన తల్లికి చెప్పాడు . అప్పుడామె “నాయనా, నీ తండ్రికి స్వామి సమర్ధ రెడు రూపాయలనిచ్చారు” అని బాబా అన్న మాటలలోని అర్ధాన్ని వివరించింది.
               Image result for images of swami samarth

కుటుంబ సభ్యులందరూ అతను తన షిరిడీ యాత్ర విశేషాలను చెబుతుంటే చాలా ఆసక్తిగా విన్నారు.  అతని సోదరుడయిన విష్ణు పంత్ బల్వంత్ కూడా ఆ విశేషాలన్ని విన్నాడు.  

Thursday, April 14, 2016

సాయి రామాయణం

0 comments Posted by tyagaraju on 9:14 AM
Image result for images of shirdisai as lord rama
Image result for images of jasmine flowers

14.04.2016 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీరామనవమి శుభాకాంక్షలు
సాయి రామాయణం 

రేపు శ్రీరామనవమి సందర్భంగా సాయిబానిస గారు రచించిన “రామాయణంలో సాయి” ని కాస్త తగ్గించి (ఎడిట్) చేసి సాయి భక్తుల కోసం మరలా ప్రచురిస్తున్నాను.  పూర్తిగా చదవడానికి సాయి దర్బార్ తెలుగు (www.teluguvarisaidarbar.blogspot.in ) చూడండి. మన బ్లాగు, తెలుగువారి సాయి  దర్బార్ రెండు బ్లాగులలోను 2012 వ. సంవత్సరంలో ప్రచురించాను.  ఇంతకు ముందు ఎప్పుడో మీరు చదివి ఉండవచ్చు.  కాని శ్రీరామనవమి సందర్భంగా మరొక్క సారి  మననం చేసుకుందాము.

రామాయణంలో సాయి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు
(సంకలనం ; ఆత్రేయపురపు త్యాగరాజు – 9440375411)

శ్రీ సాయి సత్ చరిత్ర 6 . అధ్యాయములో హేమాద్రిపంతు చాలా మధురంగా చెప్పిన మాటలు : " నేను రామాయణాన్ని చదువుతున్నపుడల్లా, ప్రతీ చోట సాయే రాముడు అన్న భావన కలిగింది".  నేను భాగవతం చదువుతున్నపుడల్లా "సాయియే శ్రీకృష్ణుడనే భావన కలిగింది". రెండు వివరణల అధారంగా,రామాయణం చదివి ఆయన చెప్పిన మాటలు సత్యమేనా అని ఇందులోని వాస్తవాలను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించానుఇప్పుడు నేను చెప్పబోయే విషయం 
"శ్రీరామునిగా సాయి"

నేను ముఖ్యంగా "రామాయణంలో రాముడికి" "శ్రీ సాయి సత్చరిత్రలో సాయికి" రెండిటికి ఉన్న పోలికలను వివరిస్తాను. 1838 సంవత్సరమునకు ముందే షిరిడీలో మారుతి దేవాలయము ఉంది.
మనకందరకూ 1858 తరవాతనుంచే సాయి గురించి తెలుసు. అంటే దాని అర్ధం 1858 కి ముందు ఆయన లేరా? మహా భాగవతంలో "శేష సాయి" గురించి, "వటపత్ర సాయి" గురించి విన్నాము. 
                   Image result for images of vatapatra sai
శేష సాయి అనగా శ్రీమహావిష్ణువువటపత్ర సాయి అనగా శ్రీకృష్ణుడు. అంచేత సాయి అన్న పవిత్రమైన నామం మనకి ఇతిహాసాలలోను,పురాణాలలోను కనపడుతుందిమహల్సాపతి బాబాని  పిలవకముందు నుంచే  సాయి అన్న పదం మన సనాతన  ధర్మం నుంచే పుట్టింది.

Wednesday, April 13, 2016

శ్రీసాయి పుష్పగిరి – జీవితం – 2వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 5:12 AM
Image result for images of saibanisa
       Image result for images of rose garden

13.04.2016  బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావాఅరి శుభాశీస్సులు
ఈ రోజు సాయిబానిస గారికి బాబావారు ప్రసాదించిన జీవిత సందేశాలనుండి కొన్ని సందేశాలు తెలుసుకుందాము.
         Image result for images of saibanisa

శ్రీసాయి పుష్పగిరి – జీవితం – 2వ.భాగమ్


31.07.2001

11) మన ఇంటిలో ఈగల బాధ ఉన్నట్లే, అదే విధంగా  ప్రాపంచిక జీవితంలోను, ఆధ్యాత్మిక జీవితంలోను అసూయాపరుల నుండి బాధలు ఉంటాయిఅవి క్షణికమయినవిఆ బాధలను మనం ఓరిమితో భరిస్తూ జీవిత పాఠాలు నేర్చుకోవాలి.
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List