Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, March 12, 2016

బాబాయే ఆటో పంపించారా? - నాలోని భయాన్ని పారద్రోలిన బాబా

0 comments Posted by tyagaraju on 12:11 AM
    Image result for images of golden shirdi saibaba
     Image result for images of rose hd

12.03.2016 శనివారం 
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి 
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు 

ఈ  రోజు చెన్నైనుండి సాయి భక్తురాలు శ్రీమతి కృష్ణవేణి గారు పంపించిన రెండు అనుభవాలను ప్రచురిస్తున్నాను.
బాబాయే ఆటో పంపించారా?
2015 సెప్టెంబరులో మొదటిసారి మేము షిరిడీ వెళ్ళాముమేము బయలుదేరేటప్పటికి చెన్నైలో వర్షాలు ప్రారంభం కాలేదుసరిగా దీపావళికి కొంచెం ముందుగా బాబా గారి దర్శనం బాగా జరిగిందిబాబా గారి అనుమతితో తిరుగు ప్రయాణం అయ్యాముఅప్పుడే చెన్నైలో వర్షాలు మొదలయ్యాయినేను, మా పాపలిద్దరూ, మా అమ్మగారు, తమ్ముడుమా ఆయన అందరం బయలుదేరాము

Thursday, March 10, 2016

శ్రీ సాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం – 4 వ. భాగం

0 comments Posted by tyagaraju on 7:06 AM

    Image result for images of shirdi sai baba in flower garden
        Image result for images of rose hd

10.03.2016 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
ఈ రోజు సాయిబానిస గారికి బాబావారు ఆధ్యాత్మికతపై ఇచ్చిన సందేశాలను ప్రచురిస్తున్నాను.  చదవండి.
           Image result for images of saibanisa

శ్రీ సాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం – 4 వ. భాగం

16.12.2004

31.  ముందుగా నీవు శరీరము కాదు అని గ్రహించు శరీరానికి ఆకర్షణ వికర్షణ గుణాలు ఉన్నాయికాని, నీలో ఉన్న శక్తి ఆత్మశక్తి ఆత్మశక్తి పవిత్రమయిన శక్తిఈశక్తిని పరమాత్మ శక్తిలోకి విలీనం చేయడానికి ప్రయత్నం చేయి.  

01.01.2005

32.  ప్రేమను పొందటం, ప్రేమను పదిమందికి పంచి పెట్టడం, ఇది అందరికీ లభించే యోగంకాదుఇది భగవంతుని అనుగ్రహంతోనే లభిస్తుంది వరము పొందడానికి జన్మనన్మలు ఎత్తినా ఆశ్చర్యపడనవసరం లేదు

Wednesday, March 9, 2016

శ్రీసాయి లీలామృత ధార - బంగారు చెవిపోగులు

0 comments Posted by tyagaraju on 7:05 AM
                Image result for images of golden rose flower

09.03.2016 బుధవారం 
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి 
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు 
ఈ  రోజు సాయిలీలా మాసపత్రిక మే నెల 1975, లో ప్రచురించిన ఒక సాయి లీలామృతం. 

శ్రీసాయి లీలామృత ధార
బంగారు చెవిపోగులు
నిజం చెప్పాలంటె  నా ప్రియమిత్రుడు ఒకసారి బాబాగురించి చెపుతుంటే యధాలాపంగా వినడం తప్ప,  1956 ముందు వరకు నాకు బాబా గురించి అంతగా తెలీదు.  అతని తాతగారు బాబాకు గొప్ప భక్తులు.  బాబా జీవించి ఉన్న రోజులలో ఆయనను దర్శించుకున్న అదృష్టవంతులు ఆయన.  11 సంవత్సరాలు క్షయవ్యాధితో బాధపడి 1956 వ.సంవత్సరంలో నేను ఆరోగ్యవంతుడినయ్యాను.  

Tuesday, March 8, 2016

శ్రీసాయి పుష్పగిరి - ఆధ్యాత్మికం – 3వ.భాగం

0 comments Posted by tyagaraju on 8:04 AM
Image result for images of shirdi sai baba flower garden
Image result for images of rose hd

08.03.2016 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయిబానిస గారికి సాయిబాబావారు ఆధ్యాత్మిక విషయాలపై ఇచ్చిన సందేశాలను ప్రచురిస్తున్నాను. 
Image result for images of saibanisa

శ్రీసాయి పుష్పగిరి -  ఆధ్యాత్మికం – 3వ.భాగం


21.05.2003

21.  భగవంతుని సేవించడానికి సర్వజనులకూ, సర్వజీవులకూ, హక్కు ఉందినీవు భగవంతుని సేవ చేసుకుంటూ ప్రశాంతంగా జీవించుఅంతేకాని, భగవంతుడిని ఇంకా ఎవరెవరు సేవిస్తున్నారు అనే ఆలోచనలతో నీ జీవిత పరమార్ధము నుండి దూరంగా జీవించవద్దు.

23.05.2003

22.   నిజాన్ని మనము ఎప్పుడూ మార్చలేమునీటిని అనేక రూపాలుగా మనము మార్చగలముకాని, దాని సహజ గుణాన్ని మార్చలేముఅదే విధముగా భగవంతునికి అనేక రూపాలను మనము ఆపాదించగలముకాని, ఆయన లక్షణాన్ని మనము మార్చలేముఅందువలననే భగవంతుడే సత్యముసత్యమే భగవంతుడు.

Monday, March 7, 2016

నా మదిలోని కోర్కెను తీర్చిన బాబా

0 comments Posted by tyagaraju on 6:33 AM
       Image result for images of shirdi sai with lord siva
      Image result for images of rose hd

07.03.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
నా మదిలోని కోర్కెను తీర్చిన బాబా 
విచిత్రం ఏమిటంటే బాబా భక్తులకు చాలా విచిత్రంగా కలుగుతూ ఉంటాయి అనుభవాలు.  మనసులో అనుకున్న మరుక్షణమే మన కోరికని ఆయన తీర్చే విధానం చూస్తే మనకే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది.  అ అనుభూతి జీవితాంతం మనకి పదే పదే మనసులోకి వచ్చి ఒక విధమైన ఆనందం కలుగుతుంది.  ఆ విధమైన అనుభూతులను పొందిన ఒక సాయి భక్తురాలు  పంపించారు.  చదవండి. 

చెన్నై నుండి శ్రీమతి కృష్ణవేణి గారు రెండు అనుభూతులను పంపించారు.  ఈ రోజు వాటిని ప్రచురిస్తున్నాను.
1          

     
    
   మేము చెన్నైలో మైలాపూర్ లో ఉన్న బాబా గుడికి వెడుతూ ఉంటాము.  ఈ సంవత్సరం జనవరి ఒకటవ తారీకున కొత్త సంవత్సరం సందర్భంగా బాబా గుడికి వెళ్ళాము.  కొత్త సంవత్సరం కాబట్టి గుడిలో చాలా రద్దీగా ఉంటుందని మా చిన్న పాపతో వరుసలో (లైన్ లో) నుంచోవడం చాలా కష్టమని భావించాము.  బాబా గుడి బయట బాబాని అందరూ చూడటానికి వీలుగా పెద్ద తెరలతో సీ.సీ.టీ.వీ లు ఏర్పాటు చేశారు. 

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List