Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, February 4, 2016

శ్రీ షిరిడీసాయి వైభవమ్ – పూర్ణబ్రహ్మ - పరబ్రహ్మ

0 comments Posted by tyagaraju on 7:44 AM






  
Image result for images of rose hd





04.02.2016 గురువారమ్
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు ‘ద గ్లోరీ ఆఫ్ షిరిడీ సాయి’ 03.02.2015 సంచికలో ప్రచురింపబడిన వైభవాన్ని చూద్దాము.

శ్రీ షిరిడీసాయి వైభవమ్ – పూర్ణబ్రహ్మ - పరబ్రహ్మ

బాబా తనకు ప్రతిరోజు దక్షిణగా వచ్చిన సొమ్ములోనుండి రూ.800/- ఇంకా ఎక్కువగా కూడా అందరికీ పంచిపెట్టేస్తూ ఉండేవారు.  ఆఖరికి ఆయన వద్ద కొద్ది నాణాలు మాత్రమే మిగిలి తిరిగి సాయంత్రానికల్లా ఫకీరయిపోయేవారు.  ఆయన దాతృత్వం గురించి సాధులకు, జ్ఞానులకు, భజనలు, పాటలు పాడేవారందరికి నలుదిశలా వ్యాప్తి  చెందింది.  

Tuesday, February 2, 2016

శ్రీ షిరిడీ సాయి వైభవం - బాబా గారి చిలుం మహిమ

0 comments Posted by tyagaraju on 5:52 AM

         







  
 


       Image result for images of rose hd

02.02.2016 మంగళవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ షిరిడీ సాయి వైభవం - బాబా గారి చిలుం మహిమ

నిన్న బాబా వారి మహిమ గల చిలుం గురించి చదివాం.  ఈ రోజు మరొక మహిమ తెలుసుకుందామా?  ఆ మాహాత్మ్యం చిలుములో ఉందా?  కాదు, బాబా వారి హస్త స్పర్శలొ ఉంది. ఆయన పవిత్ర హస్త స్పర్శద్వారా ఆ మహత్తు చిలుము ద్వారా భక్తులకు ప్రసరించేది అవునంటారా? ఈ రోజు 'ద గ్లోరీ ఆఫ్ షిరిడీ సాయి ' ఆగస్ట్ 20, 2015 వ. సంచికలో ప్రచురింపబడిన ఈ వైభవం మనందరి కోసం...

Image result for images of nana chandorkar

1901వ.సంవత్సరంలో నానా చందోర్కర్ జనాభా లెక్కల పర్యవేక్షణాధికారిగా ఉన్నాడు.  అతనివద్ద వాసుదేవ జనార్ధన్ గుమాస్తాగా ఉండేవాడు.  నానా వాసుదేవునితో తన కూడా షిరిడీకి రమ్మన్నాడు.  

Monday, February 1, 2016

శ్రీ షిరిడీ సాయి వైభవం - మహిమ గల చిలుం

0 comments Posted by tyagaraju on 7:35 AM
     Image result for images of shirdi sai baba chillum
   Image result for images of rose hd
01.02.2016 సోమవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు 'ద గ్లొరీ ఆఫ్ షిరిడీ సాయీ జూలై, 2015 సంచికలోని ఒక అద్భుతమయిన వైభవాన్ని తెలుసుకుందాం. ప్ప్పుడు మీరు చదవబోయేది బాబావారి చిలుము యొక్క మహాత్మ్యం. 

ఈ వైభవంలో శ్రీ జీ.ఎస్.ఖపర్డె గారి ప్రస్తావన కూడా వస్తుంది.  ఇంతకు ముందు ప్రచురింపబడిన ఆయన డైరీలో ఈ విషయం మీరు చదివే ఉంటారు.  గమనించండి. 

శ్రీ షిరిడీ సాయి వైభవం - మహిమ గల చిలుం 

వాస్తవానికి బాబాగారు  చిలుం పీల్చడం చాలా తక్కువ.  ఆయన సంవత్సరానికి రెండు, మూడు చిలుములు మాత్రమే పీల్చేవారు.  కుండలు చేసే కుమ్మరికి ఈ విషయం తెలుసు.  అయినా గాని, అతను రోజూ రెండు నుంచి మూడు వందల చిలుములు పట్టుకుని వచ్చి బాబాకు ఇచ్చి వాటి ఖరీదు చెల్లించమని అడిగేవాడు. 

Sunday, January 31, 2016

శ్రీ షిరిడీ సాయి వైభవం - పంచ భూతాలపై ఆధిపత్యం

0 comments Posted by tyagaraju on 4:20 AM
Image result for images of shirdi saibaba talking
      Image result for images of rose hd

31. 01. 2016 ఆదివారం 
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి 
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు 

ఈ రోజు "ది గ్లోరీ ఆఫ్ షిరిడి సాయి" జూలై, 2015 సంచికలో ప్రచురింపబడిన ఒక వైభవాన్ని తెలుసుకుందాము.

బాబా వారికి మానవాతీత శక్తులు ఉన్నాయనే విషయం మనకందరికీ తెలుసు.  మానవ కళ్యాణానికై పంచభూతాలను కూడా ఆయన శాసించగలరు.  ఈ వైభవంలో అగ్నిమీద ఆధిపత్యం ఎలా చూపించారో తెలుసుకుందాం. 

శ్రీ షిరిడీ సాయి వైభవం - 
పంచ భూతాలపై ఆధిపత్యం
షిరిడీ నివాసి కొండజీకి బాబా మీద మిక్కిలి ప్రేమ, భక్తి.  అతని భక్తి ప్రేమలకు బాబా అతనిని ముద్దుగా 'కొండ్యా, అని పిలుస్తూ ఉండేవారు.  ఒక రోజున కొండ్యా బాబా వద్ద కూర్చుని కబుర్లు చెబుతూ ఉన్నాడు.  అది మిట్ట మధ్యాహ్నం, ఎండ చాలా తీవ్రంగా ఉంది.  దానికి తోడు ఈదురు గాలి కూడా వీస్తూ ఉంది.  
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List