Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, January 1, 2016

శ్రీ షిరిడీ సాయి వైభవం - అందరి హృదయాలను పాలించువాడను నేనే

0 comments Posted by tyagaraju on 5:41 AM
   Image result for images of shirdi sai baba
  Image result for images of blue rose hd
01.01.2016 శుక్రవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బంధువులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు 

ఈ రోజు శ్రీ షిరిడీ సాయి వైభవంలోని రెండు వైభవాలు తెలుసుకుందాం.  

శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ చేస్తున్నవారికి, చేసినవారికి, ప్రతిరోజు పారాయణ చేస్తున్నవారందరూ గ్రహించే ఉంటారు.  సాయి చెప్పిన మాట ... తాను అందరి హృదయాలలోను ఉన్నానని, సకల జీవరాసులలోను ఉన్నానని.  మానవులే గాక సకల జీవరాసులన్నిటిలోను ఆకలి ఒక్కటే.  ఏ జీవి  ఆకలి తీర్చినా నా ఆకలి తీర్చినట్లే అని చెప్పారు బాబా. ఈ విషయాన్ని తెలిపే ఈ రెండు వైభవాలనుండి మనం గ్రహించవచ్చు.  ఇక చదవండి.

"ది గ్లోరీ ఆఫ్ షిరిడీ సాయి" ఏప్రిల్, 2015 సంచికనుండి అనువదింపబడింది. 

శ్రీ షిరిడీ సాయి వైభవం - అందరి హృదయాలను పాలించువాడను నేనే 

ఒకసారి నానా మధ్యాహ్నం  12 గంటలకు షిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకొన్నాడు.  తనకు బొబ్బట్లు తినాలనుందని, వాటిని తెచ్చిపెట్టమని నానాను కోరారు బాబా. 

Thursday, December 31, 2015

శ్రీ జీ.ఎస్. ఖపర్డే డైరీ - 14

0 comments Posted by tyagaraju on 3:31 AM

     Image result for red rose hd images

31.12.2015 గురువారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం
ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించమని బాబాని మనమందరం వేడుకుందాం.

ఈ రోజు శ్రీ జీ.ఎస్.ఖపర్డే గారి డైరీలోనుండి మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం. 

శ్రీ జీ.ఎస్. ఖపర్డే డైరీ - 14 
Image result for images of g s khaparde

27.12.1911

రాత్రి సరిగా నిద్రపట్టలేదుకాని, ప్రొద్దున్న తొందరగానే లేచి స్నానం చేసి ప్రార్ధన చేసుకొన్నానుప్రతిరోజు కంటే   ముందరే తయారయ్యానుఇక్కడ ఉన్న గూఢచారులు మునుపటికన్నా రోజు చాలా చురుకుగా అన్నీ కనిపెడుతూ వ్యవహరిస్తున్నారుఒకతను సాయిమహరాజ్ దగ్గరే ఉండిపోయాడుమరొకతను నా వెంటే తిరుగుతున్నాడు.  
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List