Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, April 19, 2015

బాబానే నమ్ముకోండి - అనుభూతులు పొందండి

3 comments Posted by tyagaraju on 3:53 AM
                         Image result for images of shirdisaibaba

                       Image result for images of rose hd
19.04.2015 ఆదివారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు

దాదాపు మూడు నెలల తరువాత బ్లాగులో ప్రచురణకు వీలు కుదిరింది.  నేను నరసాపురం నుండి హైదరాబాదు రావడం ఇక్కడే స్థిరపడటం, బాబా దయవల్ల కొత్తగా అపార్ట్ మెంటు తీసుకోవడం, ఈ పనుల వల్ల బ్లాగులో ప్రచురణకు చాలా ఆలస్యమయింది.  ఈ మూడు నెలలూ ఇళ్ళ వేటలో ఉండటం వల్ల ప్రచురణ సాద్యపడలేదు.  

ఈ రోజు సాయి బంధు యోగమీనాక్షి గారి అనుభవాలను ప్రచురిస్తున్నాను. ఆమె అనుభవాలు  హెతాల్ పటేల్ రావత్ గారి బ్లాగులోనుండి సంగ్రహింపబడింది.  ఇక చదవండి.  త్వరలోనే ప్రతిరోజు బ్లాగులొ ప్రచురణ కొనసాగుతుంది.    (ఆత్రేయపురపు త్యాగరాజు 9440375411 
tyagaraju.a@gmail.com)

బాబానే నమ్ముకోండి - అనుభూతులు పొందండి 

బాబా నాకు విద్యనిచ్చారు 

మనజీవితాలకి మార్గదర్శకుడు సాయిమాత.  ఆయన మనలని సరియైన మార్గంలో నడిపిస్తూ దిశానిర్దేశం చేస్తారు.  బాబాతో నా అనుభవాలని వివరిస్తాను.  నేను 12వ.తరగతి చదువుతుండగా సాయి గురించి తెలిసింది.  నేను ఎప్పుడూ భగవంతుడిని ప్రార్ధిస్తూ ఉంటాను.  కాని గాఢమైన నమ్మకం, భక్తి మాత్రం లేదు.  కాని బాబాని పూజించడం ఎప్పుడయితే మొదలుపెట్టానో ఆయనతో నా అనుబంధం తొందరలోనే బాగా ఎక్కువయింది.  బాబా లేకపోతే నేనే లేను అన్నంత ధృఢంగా  ఆయన మీద భక్తి కలిగింది. 
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List