Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, May 28, 2014

భక్త మహల్సాపతి

0 comments Posted by tyagaraju on 5:40 AM

                        
          
28.05.2014 బుధవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

భక్త మహల్సాపతి 
                   
                                        (మహాల్సాపతి గృహము)
ఈ రోజునుండి మీకు మధ్య మధ్యలో బాబాకు సేవ చేసిన కొంతమంది భక్తుల గురించి తెలియచేస్తూ ఉంటాను. ఇవి చదివిన తరువాత మీ అభిప్రాయాలను కుడా తెలపండి.  వీటికి సంబంధించిన వివరాలన్ని కూడా జనారధనరావు గారి బ్లాగునుండి సంగ్రహింపబడినవి.  వారికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. వివరాలు అందించడంలో కాస్త ఆలశ్యమవచ్చు కారణం తెలుగులోకి అనువదించి మీకు అందించడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి. ప్రతీరోజు ప్రచురించడానికి సాధ్యమయినంతవరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాను.  
  

(మొట్టమొదటగా బాబా షిరిడీలోకి అడుగుపెట్టినపుడు ఆయనను "సాయి" అని పిలిచినది మహల్సాపతి.  ఆతరువాతనుంచి బాబాకు సాయి అన్న పేరు స్థిరపడింది.  1886వ.సంవత్సరంలో బాబా ఆయన ఒడిలో పడుకొని తమ ప్రాణాన్ని బ్రహ్మండంలో లీనం చేసి సమాధిలోకి వెళ్ళారు.  మరుసటిరోజు షిరిడీ గ్రామ ప్రజలందరూ వచ్చి చలనం, ఉచ్చ్వాశ నిశ్వాసాలు లేని బాబా శరీరం చూసి ఆయన మరణించారని భావించారు.  మహల్సాపతి చెప్పినదానికి వ్యతిరేకించి, లాంచనాలన్నీ పూర్తిచేసి బాబా శరీరాన్ని సమాధి చేయవసిందేనని అన్నారు.  కాని మహల్సాపతి ఒక్క అంగుళం కూడా కదలక "మూడురోజులు వేచి చూసినందువల్ల నష్టమేమీ లేదనీ, బాబా మూడు రోజులలో మరల తిరిగి వస్తారని చెప్పారు. బాబా మాటలు సత్యమని నమ్మకంగా చెప్పాడు.)

Sunday, May 25, 2014

శ్రీమతి తారాబాయ్ తార్ఖడ్ - 2 వ.(ఆఖరిభాగం)

0 comments Posted by tyagaraju on 3:52 AM
                    
                
24.05.2014 ఆదివారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు శ్రీమతి తారాబాయి తార్ఖడ్ గారి గురించి రెండవ మరియు ఆఖరి భాగం అందిస్తున్నాను.  చదవండి.

శ్రీమతి తారాబాయ్ తార్ఖడ్ - 2 వ.(ఆఖరిభాగం) 

(ప్రముఖ సినీనటి శ్రీమతి నళినీ జయవంత్ తల్లి) 
       
       (నళినీ జయవంత్ )

ఆమె భర్త సదాశివ్ పూనాలోని ఒక బట్టల మిల్లులో మానేజర్ గా కొంతకాలంగా పని చేస్తూ ఉండేవారు.  తరువాత ఉధ్యోగం పోవడంతో చాలా కాలం  ఖాళీగా ఉన్నారు.  మరలా ఉద్యోగం కోసం ప్రయత్నాలుచేస్తూ బాబా దీవెనలు అందుకుందామని షిరిడీ వచ్చి అక్కడ కొద్ది రోజులు ఉన్నారు.  ఒకరోజు బాబా, తాత్యాపాటిల్ కొంత మందితో కలిసి సినిమా చూడటానికి అహ్మద్ నగర్ వెడుతున్నాడనీ, సదాశివ్ ని కూడా వారితో కలిసి వెళ్ళమన్నారు. అహ్మద్ నగర్ లో సినిమా చూసిన తరువాత పూనా వెళ్ళి అక్కడినుండి యింటికి వెళ్ళమని చెప్పారు.  బాబా నోటివెంట ఈ మాటలు విన్న సదాశివ్ కలవర పడ్డాడు.  బాబా ఎందుకిలా అంటున్నారు?  ఇప్పుడు వినోదకార్యక్రమాలలో పాల్గొని ఆనందించడానికి తగిన సమయమా?  కాదే? అనుకొన్నాడు.  
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List