Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, May 10, 2014

శ్రీసాయితో మధురక్షణాలు - 40 పవిత్రమైన ఊదీ చేసిన అద్భుతం

0 comments Posted by tyagaraju on 7:07 AM

                       
               
10.05.2014 శనివారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారై శుభాశీస్సులు

ఈ రోజు సాయితోమధుర క్షణాలలోని మరొక మధుర క్షణం గురించి తెలుసుకొందాము. 


శ్రీసాయితో మధురక్షణాలు - 40

పవిత్రమైన ఊదీ చేసిన అద్భుతం

పిల్లలు కష్టాలలో ఉన్నపుడు గాని, యిబ్బందులలో ఉన్నప్పుడు గాని తల్లితండ్రులను పిలిచిన వెంటనే వారు వెంటనె తమ పిల్లలవద్దకు ఏవిధంగానయితే పరిగెత్తుకుని వస్తారో అదే విధంగా శ్రీ సాయినాధుల వారు కూడా తన భక్తులు కష్టాలలో ఉన్నప్పుదు ఆర్తితో పిలచినప్పుడు ఆయన కూడా అదే విధయిన ప్రేమతో వారి రక్షణకోసం పరిగెత్తుకొని వస్తారు.  ఈ లీల ఒక తాతగారు, ప్రమాదకర పరిస్థితిలో ఉన్న తన మనమరాలు ఏవిధంగా రక్షింపబడిందో వివరిస్తున్నారు. 

Friday, May 9, 2014

శ్రీసాయితో మధురక్షణాలు - 39 బాబా చూపిన కృప - బాబా దివ్యదర్శనం

0 comments Posted by tyagaraju on 7:11 AM

                         

                  
09.05.2014 శుక్రవారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి

శ్రీసాయితో మధురక్షణాలు - 39

బాబా చూపిన కృప - బాబా దివ్యదర్శనం 

సాయిబంధువులకు ఈ రోజు మరొక అద్భుతమైన బాబా లీలను అందిస్తున్నాను.  పిలిచిన వెంటనే నేనున్నను నీచెంత, నీకెందుకా బెంగ అనిపించేలా తక్ష్ణం వచ్చి ఆదుకునే బాబా.  అనుకోకుండా ఆయన చేసే అధ్బుతమైన లీలలు జన్మ జన్మలకూ మరపురాని మధురానుభూతులుగానే మిగిలిపోతాయి.  అటువంటి అత్యధ్బుతమైన ఒక లీలను ఈ రోజు తెలుసుకొందాము.  ఇక చదవండి.  ఆనందాన్ని పొందండి.


దయగల సాయికి మొట్టమొదటగా నా వినమ్రపూర్వకమైన ప్రణామములు సమర్పించుకుంటున్నాను.  1960వ.సంవత్సరంలో నెల్లూరు లో మా పొరుగింటివారి ద్వారా నాకు సాయిబాబా గురించి తెలిసింది.  వారు నాకు సాయిబాబాను ఆశ్రయించమని సలహానిచ్చారు. 

Thursday, May 8, 2014

శ్రీసాయితో మధుర క్షణాలు - 38 అందరి హృదయాలలోను నివసించువాడను నేనే

0 comments Posted by tyagaraju on 3:58 AM



                      
                 
08.05.2014 గురువారం ( విశాఖపట్నం నుండి) 

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి 
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు

ఈ రోజు సాయితో మధురక్షణాలలో 38 వ.క్షణం తెలుసుకుందాము .   ఏజన్మలో బాబాతో సన్నిహితంగా ఉన్నామో ఎవరికీ తెలియదు.  తన భక్తులు ఏ జనంలో తనతో ఉన్నారో బాబాకే తెలుసు.  వారిని ఈ జన్మలో తనే తనవద్దకు లాగుకొని తానెవరో తెలుసుకునేలా చేస్తారు బాబా.  ఈ రోజు అటువంటి భక్తుడయిన శ్రీస్వామి కేశవయ్యజీ గారి గురించి తెలుసుకుందాము.


శ్రీసాయితో మధుర క్షణాలు - 38 

అందరి హృదయాలలోను నివసించువాడను నేనే


శ్రీసాయినాధుని యొక్క లీలలు(అంతుపట్టని అనుభూతులు) ఆయన భక్తులకు బాబా మీద ఎంతటి భక్తి ఉన్నదో  ధృవపరుస్తాయి.   శ్రీసాయి బాబాను అర్ధం చేసుకోవడం ఆయన భక్తులయినవారికి చాలా సులభం. బాబా తన భక్తులను తనవైపునకు పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లుగా లాగుకొని తన దయను వారిపైన ప్రసరింపచేయడమన్నది చాలా అద్భుతమయిన విషయం.  లేకపోతే ఎక్కడో ధర్మవరంలో పనిచేస్తున్న శ్రీస్వామి కేశవయ్యజీ గారికి బాబా గురించి తెలుసుకొనే అదృష్టం ఎలా కలుగుతుంది?  ఆయన ఎప్పుడూ శ్రీసాయి సత్ చరిత్రను చదవలేదు.  ఎవరినించీ ఆయన శ్రీసాయిబాబా లీలలను గురించి వినలేదు.  అనంతపురం జిల్లా ధర్మవరంలో నివసిస్తున్న ఆయనకు 1939వ.సంవత్సరం జూలై 1 వ.తేదీన సాయిబాబా గురించితెలిసింది .  
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List