Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, August 18, 2012

శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 7

0 comments Posted by tyagaraju on 8:01 AM


                                                               
                                                  

18.08.2012  శనివారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి


శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము)  -  7

56. నీకు ఆకలి వేసినపుడు నీదగ్గర ఉన్న ధనాన్ని ఖర్చు చేసి భోజనము చేస్తున్నావే - అపుడు నీకు తెలియలేదు అన్నము పెట్టినవాని కులము.  

ఎవరో ప్రేమతో నిన్ను భోజనానికి పిలిచినపుడు ఆపిలిచినవాని కులము, మతము గురించి ఆలోచించుతున్నావే, యిది ఎక్కడి న్యాయము.

    - 14.10.96

57. భగవంతుడు నీకు సహాయము చేయదలచినపుడు మానవ రూపములో గాని
జంతురూపములో గాని నీదగ్గరకు రాక తప్పదు.   





భగవంతుని రాకను నీవు గుర్తించిననాడు నీవు చాలా అదృష్టవంతుడివిఅటువంటి అదృష్టము నూటికి, కోటికి ఒకరికి లభించుతుంది

    - 11.11.96

58. నీకు అపకారము చేసినవారిని నీవు దూషించటము మానివేసిన రోజున 
నేను నీకు ఉపకారము చేయటానికి ఏదో ఒక రూపములో వస్తానునీజీవితములో నీకు సుఖశాంతులు ప్రసాదించుతాను.

    - 12.11.96

59. డబ్బు వ్యవహారాలలో మిత్రులు, బంధువులు, శత్రువులుగా మారే అవకాశముయున్నదిఅందుచేత డబ్బు వ్యవహారాలు ఆచరణలో పెట్టేముందు ఒకటి రెండుసార్లు ఆలోచించాలిహడావిడి పనికిరాదు

    - 27.11.96

60. చదువు తెలివితేటలు ఉండికూడా భగవంతుని మరచిపోయి వ్యసనాలకు బానిసలుగామారి జీవిత నౌకను కష్టాలకడలిలో నడిపించుతారు కొందరుచదువు తెలివితేటలు లేకపోయినా సద్గురుని నమ్ముకొని తమ జీవిత నౌకని సుఖసంతోషాలతో ఆనంద సాగరములో నడిపించుతారు మరికొందరు.

    - 13.11.96

61.  సంసారము సాగించటానికి ధన సంపాదన ముఖ్యమే, అలాగ అని బాధ్యతలు విస్మరించి, ధన సంపాదన కోసమే జీవించితే, ఆధన సంపాదనకు అర్ధము లేదుఅందుచేత నీబరువు బాధ్యతలను పూర్తి చేయటానికి కావలసిన ధనము సంపాదించి బాధ్యతాయుతమైన జీవితము గడపాలి.  

     - 22.11.96
62. ఇతరుల ఆధ్యాత్మిక రంగ ప్రయాణములో నీవు సలహా మాతమే యివ్వాలిఅంతేగాని వారితో కలసి ప్రయాణము చేయటానికి ప్రయత్నించటము తలనొప్పి కొని తెచ్చుకోవటములాంటిది.

    - 27.11.96

63.  నీ పుట్టినరోజు పండుగరోజున విష్ణుసహస్రనామ పారాయణ గావించు
నీకు. నీపితృదేవతల  ఆశీర్వాదాలు లబించును.

    - 28.11.96

64.  సంసార సాగరములో జీవితనౌక ఒడిదుడుకుల మధ్య ప్రయాణము సాగిస్తుంటే, అనౌక మీద విష్ణుసహస్రనామము అనే జండా ఎగరవేయిఅపుడు జీవితనౌక ప్రశాంతముగా ఆసాగరములో ప్రయాణము సాగించుతుంది.  

    - 28.11.96

65.  ప్రకృతిలో ఉన్న శక్తిని మానవుడు విద్యుత్ శక్తిగా మార్చి ప్రాపంచిక సుఖాలు పొందుతున్నాడు.  

అదే మానవుడు ప్రకృతిలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి (భగవంతుని శక్తి) ని గుర్తించలేక కష్టాలు, అశాంతి పొందుతున్నాడు

    - 01.12.96

(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 



Friday, August 17, 2012

శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 6

0 comments Posted by tyagaraju on 7:31 AM

17.12.2012 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


శిఖరాలు - లోయలలో శ్రీసాయి(రెండవభాగము) - 6

47. పిల్లలు పుట్టలేదనిపసి పిల్లలనుతెచ్చి పెంచుకొంటారుకొందరు. ఆపసిపిల్లలుతమ పిల్లలుకారుకదా అనేఆలోచనలతో ఆపెంపుడు తల్లిదండ్రులు,
తమ పిల్లలుఎలాగ పెరుగుతున్నారుఅనే ఆలోచనలతోకన్న తల్లిదండ్రులు,
ఆలోచనా తరంగాలలోబాధపడుతూ ఉంటారు. అందుచేత భగవంతుడుప్రసాదించిన
జీవితాన్ని అర్ధము చేసుకొని తలనొప్పిలేనిజీవితాన్ని గడపాలి తల్లితండ్రులు.

- 01.09.96

48. క్రీ..1918 నాటికే సినీమాల ప్రభావము సమాజముపై పడినది. ఆనాటిసినీమాలు నేటి (1996) సమాజములో నైతిక విలువలుపాడవటానికి పునాదిరాళ్ళుగా మిగిలినవి.

- 08.09.96

49. క్రీ..1918ముందు తల్లిదండ్రులుపిల్లల భవిష్యత్గురించి ఎక్కువగాఆలోచించేవారు కాదు. వారికి భగవంతునిపైచాలా నమ్మకముయుండేది. భగవంతుడువారి పిల్లలనుచక్కగా తీర్చిదిద్ది చక్కనిభవిష్యత్ ను ప్రసాదించేవాడు.

- 08.09.96

50. నాపై నీకునమ్మకము కలగటానికినేను నీగతించినజీవిత చరిత్రనునీకు చెబుతాను. దానితోనీకు నాపై నమ్మకముకలిగి భవిష్యత్లో నేనుచూపే మంచిమార్గములో నీవు ప్రయాణము చేస్తావు.

- 15.09.96

51. సాయి పేరిటఎంతసేపు భజనచేసినాము అనేది ముఖ్యము కాదు. సాయి పేరుతో ఏవిధముగా జీవించుతున్నాము అనేది ముఖ్యము.

- 28.09.96

52. ప్రాపంచిక రంగములోనిప్రయాణము ఆఖరులో కాలికి అంటుకొన్న బురదనుకడుగుతాము. ఆధ్యాత్మికరంగములోని ప్రయాణము మొదటిలో మనసుకు అంటుకొన్నబురదను కడుగుతాము.

- 28.09.96

53. నీగత జీవితఅనుభవాలను పునాదిరాళ్ళుగా చేసుకొనిఈవర్తమానంలో చక్కటి మేడను నిర్మించు. అందు ప్రశాంతముగా జీవించుతు మంచి భవిష్యను ఆశించు.

- 10.10.96

54. నీవు జితేంద్రునిదగ్గర నమ్మకముగాపని చేసినరోజున వేరేగాఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోనవసరములేదు.

- 11.10.96

55. దొంగలు నీయింటినిదోచుకుంటారు. బందుమిత్రులునీశరీర కష్టాన్నిదోచుకుంటారు.

నీభార్యపిల్లలు నీమనసునుదోచుకుంటారు.

రోగాలు నీశరీరాన్ని దోచుకొంటాయి.
యిక మిగిలినది నీఆత్మ.
నీఆత్మగురించి తెలుసుకోవటముఅంటే నిన్నునీవు తెలుసుకోవటం.
- 05.10.96

(యింకాఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు



Thursday, August 16, 2012

శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 5

0 comments Posted by tyagaraju on 8:56 AM


                                             


16.08.2012  గురువారము

శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 5

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

41.  భార్యభర్తలకు ఒకరిపై యింకొకరికి మోహము అనేది వారి జీవిత బరువు బాధ్యతలు నిర్వర్తించటానికి చాలా అవసరము.  ఆబరువు బాధ్యతలు పూర్తి అయిన తర్వాత వారు యిరువురు భగవంతుని వ్యామోహముతో భక్తిమార్గములో పయనించాలి.  

     - 17.06.96

42.  చెడు అలవాట్లకు మొదట్లో చాలా గిరాకీ యుంటుంది.  ఆఖరికి ఆగిరాకీ తగ్గిపోయిన తర్వాత మంచి అలవాట్లు కోసము తపన పడిపోతారు ప్రజలు.  ఆతపన జీవితములో తొందరగా వస్తే బ్రతికిపోతారు.  లేకపోతే ఆల్ప ఆయుష్ తో మరణించుతారు ప్రజలు.

     - 21.06.96

43.  నీశత్రువు ఈత చెట్టులాంటివాడు.  నీశత్రువుని నీవు 



కౌగలించుకోనవసరములేదు.  

ఈత చెట్టుకు తియ్యటిపండ్లు ఉన్నవిధముగానే నీశత్రువులో కొన్ని మంచి గుణాలు యుండవచ్చు.  ఆమంచి గుణాలను నీవు స్వీకరించు.  

     - 12.07.96

44.  ఈప్రపంచములో నీవు నీశత్రువుతో పోరాడే సమయములో నీబంధువులు, స్నేహితులు నీకు తోడుగా నిలచి నీకు సహాయము చేస్తారు.  మరి నీవు మరణము అనే శత్రువుతో పోరాడే సమయములో నీకు సహాయము చేయటానికి ఎవరు వస్తారు అని ఒక్కసారి ఆలోచించు. 

     - 12.07.96

45.  పసిపాపకు జన్మ యివ్వబోతున్న స్త్రీ పరిస్థితి,  జీవితములో ఆఖరి క్షణాలు లెక్కపెడుతున్న మసలివాని పరిస్థితి,  ఒక్కలాగే యుంటుంది.  ఆస్త్రీ భగవంతుని స్మరించుతూ ఒకరికి జన్మ యిస్తుంది.  

ఆముసలివాడు భగవంతుని స్మరించుతూ 

పునర్ జన్మకు ఎదురు చూస్తూ ఉంటాడు.  

     - 10.08.96

46.  బ్రతికి యున్న మనిషిని పూజించలేకపోయిన ఫరవాలేదు.  ఆవ్యక్తి మరణీంచిన తర్వాత అతని పుణ్య తిధిరోజున మనసార అతనికి నమస్కరించటము గొప్పవిషయము  ఈవిషయాన్ని ఆబ్ధీకము పేరిట మన సాంప్రదాయములో చేస్చినారు మన పూర్వీకులు. 

     - 25.08.96


(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు


Tuesday, August 14, 2012

బాబా ఇచ్చిన ఉద్యోగం

0 comments Posted by tyagaraju on 9:21 PM



                                                        


15.08.2012  బుధవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు అమెరికా నుంచి మహలక్ష్మి గారు పంపిన బాబా లీలను తెలుసుకుందాము.


బాబా ఇచ్చిన ఉద్యోగం

నేను మీ అందరితో ఒక శుభవార్త పంచుకోవాలనుకుంటున్నాను.  నాకు ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఇంటి నుండే పనిచేసేలాగ ఉద్యోగం దొరికింది. (వర్క్ ఫ్రం హోం)  ఇది నిజంగా బాబా లీలే అని చెప్పవచ్చు. ఎందుకంటే నేను నిజానికి ఈ ఉద్యోగానికి అప్లై చేయలేదు. కొన్ని రోజుల క్రితం నేను నా రెజ్యూం ని   (బయోడేటా) ను ఒక జాబ్ సైట్ లో పెట్టాను. ఆ సంఘటన జరిగిన వారం లో గురువారము నాడు ఉద్యోగం గురించి ఎన్నో సమస్యలతో దిగులుగ వున్నాను. అదికాక నా పిల్లలను చూసుకోవడం, ఇటువంటి బాధ్యతల వల్ల  నేను చేసే ఉద్యోగంలో  ఎన్నోఆటంకాలు వచ్చాయి. ప్రతీసారి నేను పెట్టిన అప్లికేషన్స్ కి ప్రత్గ్యుత్తరాలు వచ్చేవి,  దానితో నాకెంతో ఆశ కలుగుతూ ఉండేది కాని అందులో ఉన్న కొన్ని సమస్యలవల్ల మళ్ళి అదికాస్తా  అడియాశ అయిపోతూ ఉండేది.

  ఇంటువంటి పరిస్థితులలో ఒక గురువారము నాడు నేను చాలా దిగులుగా ఉన్నాను.  శుక్రవారం ఉదయం నా సెల్ కి ఒక కాల్ వచ్చింది.  ఉదయం పిల్లల పనులతో పని వత్తిడిలో ఉండి నా సెల్ కి వచ్చిన కాల్ చూసుకోలేదు. తరవాత నేను మిస్డ్ కాల్ చూసుకున్నాను.  ఆ కాల్ చేసింది ఎవరో తెలుసుకోవడం కోసం నేను మళ్ళి తిరిగి ఆ నంబర్ కి కాల్ చేసాను. కాల్ ఏమిటో కాదు,  నన్ను ఇంటర్వ్యు చేయడానికి ఒక వ్యక్తి కాల్ చేసాడు. ఆయన వెంటనే ఇంటర్వ్యూ చేయాలని  చెప్పడం తో 45నిమిషాలు ఇంటర్వ్యూ జరిగింది.   నేను ఆ జాబ్ గురించి వివరాలు అడిగితే అతడు నీవు ఇంటి నుండే ఐదు రోజులు పనిచేయగలను అనుకుంటే (వర్క్ ఫ్రం హోం) అప్పుడు కంపెనీ పేరు ,లొకేషన్  చెప్పగలను అన్నాడు. (నేను విన్నది అసలు  నమ్మలేకపోయాను). తర్వాత అదే రోజు అతని టెక్నికల్ లీడర్ నన్ను ఇంటర్వ్యూ చేయాలని చెప్పాడు. నాకు ఆ రోజు డాక్టర్ అపాయింట్ మెంట్ వుండడంతో తర్వాత నేనే వాళ్ళ నంబర్ కి కాల్ చేసాను.  నన్ను వాళ్ళు ఇంటర్వ్యూ చేసారు.  ఇంటర్వ్యూ అయ్యాక నా రెజ్యూం  ని కస్టమర్  కంపెనీ కి పంపారు.  నిజం చెప్పాలంటే నేను ఆ రెండు ఇంటర్వ్యూలకు ఏమి ప్రిపేర్ కాలేదు.  ఒక వారం తర్వాత కస్టమర్ కంపెనీ నన్ను ఇంటర్వ్యూ చేసారు. ఎక్కువ కష్టం లేకుండ ఫార్మల్ గా జరిగింది.  ఇంటర్వ్యూ అయ్యాక బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసారు. ఇదంతా జరిగే సమయం లో నేను చాల టెన్షన్ పడ్డాను.  కాని బాబా దయ వలన అంతా బాగా జరిగింది. నన్ను మొదట ట్రైనింగ్ కోసం 2 రోజులకు కస్టమర్ లొకేషన్ కి రమ్మని చెప్పారు.   ఈ వెయిటింగ్ సమయమంతా నేను సాయినాథ స్తవనమంజరి చదువుతూ సాయి అమృతవాణి వింటుండేదాన్ని. ప్రతి నిమిషం కన్నీటి తో సాయి ని వేడుకున్నాను.

     నా పిల్లలు చిన్న పిల్లలు అవడం వలన ట్రెయినింగ్ కోసం మా ఫ్యామిలి అంతా వెళ్ళాము. అది కార్పొరేట్ కంపెనీ అవడం వలన మేము వుండడానికి కార్పొరేట్ హోటల్ లో బస ఏర్పాటు చేశారు .  హోటల్ వాతావరణం ఎంతో అద్భుతంగ వుంది (వరల్డ్ క్లాస్ హోటల్ వాతవరణం లాగ వుంది) .   ఇంత అద్భుతమైన వసతులు మాకు దొరికాయంటే బాబా కృప వల్లనే గాక వేరేమి కాదు. ఇదంతా చాలా వేగంగా జరిగింది.  మా ప్రయాణం అంతా  బాగా జరిగింది.   సోమవారం నుండి నేను ఇంటి నుండి పని మొదలు పెట్టచ్చు .   ఈ లోపల  ఇంట్లో పిల్లలను చూసుకోడానికి ఒక మంచి ఆయా దొరికింది.   నేను గత రెండు నెలల నుండి జాబ్ చేస్తున్నాను. నాకు ఈ జాబ్ బాబా ఇచ్చిన ఒక వరం గా భావిస్తున్నాను.



       నా పిల్లలను జాగ్రత్తగ చూడమని సాయి ని అభ్యర్థించాను. ఇంకా నా జాబ్ మీద ధ్యాస పెట్టి నా పని బాగ చేయగలగాలని , ఎందుకంటే నేను పని చేసే ప్రాజెక్ట్ చాల పెద్దది కాబట్టి ప్రతి విషయం లో సాయి నాకు సహాయంగా వుండి నాకు ఆత్మ విశ్వాసం పెరిగేల, నా పై ఆఫీసర్స్ నేను చేసే పని లో నమ్మకం,సంతోషం కలిగి నా జాబ్ కాంట్రాక్ట్ మంచి జీతం తో పొడిగించబడాలని సాయి ని కోరుకుంటున్నాను. ఈ జాబ్ రావడం తో నా కల నిజమైంది.ఎందుకంటే నేను మళ్ళి నా జాబ్ కెరీర్ మొదలుపెట్టాలనుకున్నాను. కాని మా పిల్లలకు దీని వల్ల  ఏమి ఇబ్బందిలేకుండ అంతా సజావుగా జరగాలని  కోరుకున్నాను. నన్ను నమ్మండి ఈ ఉద్యోగం కోసం నేనిక్కడికి చేసిన ప్రయాణం లో నేను ఎన్నో సార్లు భయం తో వణికాను ఏడ్చాను. ప్రతి క్షణం చాలా గండంగ గడిచింది. బాబా పై మన నమ్మకం మరియు   బాబా పై మనం చేసిన  శరణాగతి మనల్ని జీవితపు ఎగుడు దిగుడు లను తట్టుకొని ధైర్యంగా నిలబడే శక్తినిస్తుంది. అందరికి చెప్పేది ఒక్కటే మీరు జీవితం లో ఎన్ని ఒడిదుడుకులకు లోనవుతున్న  బాబా ని ప్రార్థిస్తూవుండండి. కష్టాల్లో ఇంకా ఎక్కువ ప్రార్థిస్తూ మంచితనం తో  సహనంగ వుండాలి. సాయి అంతా చూస్తూనే వుంటారు. మనము కార్చే ప్రతి కన్నీటి బొట్టు ను సాయి సాక్షిగా వుండి చూస్తూ వుంటారు. మన ప్రతి ఆలోచన,ఆవేదన సాయి కి ఎరుక. సాయి మన జీవితంలోని ఆటుపోట్ల నుండి క్రింద పడకుండా ,మన జీవితం అనే ఓడ ఎటో కొట్టుకొని పోకుండ  క్రమంగా, జయప్రదంగా ఒడ్డుకు సాగేలా చూస్తారు.



           ఓ సద్గురు సాయి నీ బిడ్డలమైన  మాకు, మరియు అందరికి జీవితం లో ఎదురయ్యే ఒడిదుడుకుల నుండి తట్టుకొని మా గత జన్మ,  ఈ జన్మ యొక్క పాప కర్మలను ధ్వంసం చేసి మాకు ఎప్పుడు  తోడు నీడగ వుండమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.  నిరంతరం బాబా నామస్మరణ,బాబా కీర్తనలు చేస్తూ వుండండి. బాబా మనల్ని సురక్షితంగ జీవిత గమ్యం చేరుస్తాడు. నేను కూడ బాబా ని ప్రశ్నించాను. బాబా తో పోట్లాడాను. నిన్ను పూజించనని సాయి తో చెప్పాను. కాని సాయినాథుని పూజించకుండ ,  సాయి నామ స్మరణ చేయకుంటే ఏదో పోగొట్టుకున్నట్టు చాల భాధగ వుండేది.  బాబా తో పోట్లాడడం మానేసి ఆయనతో చెప్పాను.  ఇప్పుడు నా పూర్వపు కర్మను అనుభవిస్తున్నాను. నా చెడ్డ కర్మ తోలగిపోని. నాకు నీవు తప్ప వేరెవరులేరు.నిన్నే పూజిస్తుంటాను. నాకు ఎప్పుడు మంచి చెయ్యాలనుకుంటే అప్పుడే చెయ్యి .  నేను నీ పాదాలను విడవను. నిన్ను విడచి నేను వుండలేను. బాబా   కూడా నన్ను విడచి వుండలేడు.  అంతే కాదు ఆయన బిడ్డలైన మన అందరిని వదిలి వుండలేడు. బాబా పిచ్చుక కాలికి దారం కట్టి ఈడ్చినట్టు మన అందరిని తన దగ్గరికి లాక్కొని మన నమ్మకాన్ని మరింత గట్టి పరుస్తాడు.  కావలసినదల్ల మనకు ఆయన మీద అచంచల విశ్వాసం. బాబా నే మన దయగల తల్లి,తండ్రి. తల్లి ఎప్పుడైన తన బిడ్డ పైన కోపించునా? అలాగే సాయి ఎప్పుడైన మనపై కోపించి ఎరుగునా?  దయ చేసి సాయి పై నమ్మకం ఉంచండి.  సాయి ప్రతి విషయం లో మనకు తోడుగ నిలుస్తాడు.


    దయచేసి అందరు కలిసి ఒక్కసారి పలకండీ.

అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.



--మహలక్ష్మి.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Sunday, August 12, 2012

శిఖరాలు - లోయలలో శ్రీ సాయి (రెండవ భాగము) - 5

0 comments Posted by tyagaraju on 7:35 PM




                                            


13.08.2012  సోమవారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శిఖరాలు - లోయలలో శ్రీ సాయి (రెండవ భాగము) - 5



41.  నీవు కాలానికి కట్టుబడియుండు.  ఆసమయములో నీవు నిర్వర్తించవలసిన బాధ్యతలను సక్రమముగా నిర్వర్తించు.  అంతేగాని నీబాధ్యతల వలన ఫలాన్ని అనుభవించేవారి వ్యామోహములో చిక్కుకోవద్దు.   

     - 30.01.96

42.  నీదగ్గర ఉన్న ధనముతో పదిమింది ముందు నీ గొప్పతనాన్ని ప్రదర్శించిన తప్పులేదు.  అంతేగాని నీకు భగవంతుని అనుగ్రహము ఉంది అని పదిమందికి చాటిచెప్పుకోవటము క్షమించరాని నేరము. 

     - 05.02.96

43.  నీకు సత్ గతిని ప్రసాదించుతాము అని చెప్పి నీగొంతు కోసే దొంగ స్వాముల బారినుండి దూరంగా ఉండు.  సత్ గతి గురించి నీవు ప్రయత్నించాలి అంతేగాని ఎవరు నీకు సత్ గతిని తెచ్చి యివ్వలేరు.

     - 05.02.96

44. గర్భిణీ స్త్రీ నవమాసాలు మోసి బిడ్డను ప్రసవించాలి కాని ఏడవ నెలలోనే ప్రసవించిన బిడ్డను తిరిగి తల్లి గర్భములోనికి వెళ్ళమనటము ఎలా సాధ్యముకాదో - ఎవరి కర్మానుసారము వాళ్ళు ఈలోకంలో జన్మించి వాళ్ళకాలము పూర్తి అవగానే ఈలోకమునుండి వెళ్ళిపోయేవారే.  వారిని నిండు నూరేళ్ళు జీవించే లాగ చేయటము సాధ్యము కాదు.   

     -06.01.93

45.  మనిషి విమానములో కూర్చుని ఆకాశములో ఎగరగలడు.  విమానములో ఉన్న యింధనము పూర్తిగా ఆగిపోయేవరకు ఎగిరితే విమానము కూలటము ఖాయము.  అలాగే జీవితములో పదవిలో కూర్చోవటము సహజమే.  ఆఖరి శ్వాస తీసుకొనేవరకు పదవిలో ఉండాలి అనే కోరిక యింధనము లేక నేలపై దిగలేక కూలిపోయే విమానము వంటిది అని గుర్తుంచుకో. 

     - 08.04.96

46.  నీవు చనిపోయిన తర్వాత నీశరీరానికి ఏవిధముగా దహన సంస్కారాలు జరపబడతాయి అని ఆలోచించటము మూర్ఖత్వము.  నీవు చేసుకొన్న పాప పుణ్యఫలితము ప్రకారము నీశరీరానికి దహన సంస్కారాలు జరపబడుతాయి.  అందుచేత పాప పుణ్యాల గురించి మాత్రమే ఆలోచించు. 
     - 13.04.96

47.  ఈరోజున మీరు అందరు కలసికొని మేము అందరము సాయిబంధువులము అని చెప్పుకొంటున్నారు.  మీలో మీకు ఉన్న బంధుత్వాలు, పరిచయాలు అన్నీ నాకు తెలుసు.  మీఆలోచనలకు అందని విశ్వబంధువుని నేనే. 

     - 18.04.96

48.  ఆధ్యాత్మిక భోజనము కోసము మఠాలు చుట్టూ, మఠాధిపతుల చుట్టూ తిరగనవసరము లేదు.  గుడెశెలలో యుంటూ ఆధ్యాత్మిక తత్వాలు పాడుకొనే పామరులును ఆశ్రయించిన నీకు ఆధ్యాత్మిక భోజనము లభించుతుంది.  
  
     - 19.04.96


49.  నీయింట (నీలో) అరిషడ్ వర్గాలు అనే ఆరుగురు దొంగలు ప్రవేశించినారు.  వారు నీయింట (నీలో) పసిపిల్లలను అడ్డుగా పెట్టుకొని (ప్రేమ, అనురాగాలును కొల్లగొడుతున్నారు.  నీవు నిజముగా అరిషడ్ వర్గాలనే దొంగలను ఓడించదలచితే ప్రేమ అనురాగాలు అనే పసిపిల్లలవైపు చూడకుండ దొంగలతో దెబ్బలాడి వారిని ఓడించు. 

     - 27.04.96

50.  పూలకుండీలోని పూవులు వాడిపోకుండ తాజాగా యుండాలి అంటే వాటిపై నీళ్ళు చిలకరించుతూ ఉండాలి.  
 
అలాగే సాయి భక్తుడుగా ఎల్లపుడు జీవించాలి అంటే సాయి సత్ సంగాలలో పాల్గోనాలి .      

     - 08.05.96
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు


 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List