Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, August 11, 2012

శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 4

0 comments Posted by tyagaraju on 9:39 PM
 



                            



 12.08.2012  ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 4
31.  ఆధ్యాత్మిక జీవితములో సాక్ష్యాలు - ఆధారాలు ఉండవు.  అనుభవాలు, అనుభూతులు మాత్రమే యుంటాయి.  

     - 05.09.95

32.  నీవు ప్రాపంచిక రంగములో నీఆస్థిని, సంపాదనను భీమా చేసి నిశ్చింతగా యుంటావే, మరి ఆధ్యాత్మిక రంగములో నీవు సంపాదించినది నాదగ్గర భీమా చేయి.  నేను నీ ఆత్మను పరమాత్మ దగ్గరకు చేర్చుతాను.    

     - 31.10.95

33.  ఆనాడు అరిషడ్ వర్గాలు అనే హేమమాలిని "వాలి" తన మెడలో ధరించి పతనము చెందినాడు నీవు నీలోని అరిషడ్ వర్గాలును విడనాడి "భగవంతుని" మెడలోని వైజయంతిమాలగా మారిపో.

     - 02.11.95

34.  నీవు నీజీవితములో కష్టాలబాటలో ప్రయాణము సాగించుతున్నపుడు సాయి సత్ చరిత్ర అనే పసిపాపను నీఒడిలో ఉంచుకో. 
 
 ఆపాప చిరునవ్వు నీకష్టాల బాధను మరిపింప చేస్తుంది.  ఆచిరునవ్వు నీకు మానసిక, శారీరిక శక్తిని ప్రసాదించి కష్టాలను దాటించుతుంది.

     - 14.12.95

35.  నీవు నీశత్రువుని శిక్షించటానికి ధనవంతుల సహాయము, స్త్రీల సహాయము కోరవద్దు.  నీశత్రువునుండి నీవు దూరముగా యుంటు వారిని మరచిపోవటము నీశత్రువుకి తగిన శిక్ష. 

     - 27.15.95

36. నీగుమ్మములోనికి ధనవంతులు దాహముతో వచ్చిన నీవు ఈర్ష్య, ద్వేషాలులేకుండ వారికి చల్లని మంచినీరు యివ్వగలిగిన నీవే నిజమైన ధనవంతుడివి. 

     - 29.12.95

37. నీజీవితములో అరిషడ్ వర్గాలతో జీవించటము అనారోగ్యమునకు మూలము.  ఆమూలాన్ని విడనాడటము ప్రశాంత జీవితానికి ఆరంభము. 

     - 30.12.95

38. మరణము నీనీడలాగ నిన్ను వెంటాడుతూ  ఉంటుంది. నీనీడనుండి నీవు ఎంత దూరము పారిపోగలవు.  అందుచేత నీనీడను చూసి (మరణాన్ని) భయపడకు. 

     - 02.01.96

39.  నీయింట దొంగలు పడితే పోలీసులకు ఫిర్యాదు చేసుకొంటావు.  మరి నీమనసులో మమతలు, మమకారాలు అనే దొంగలు పడితే ఎవరితో ఫిర్యాదు చేసుకోవాలి అనే విషయము ఆలోచించు. 

     - 11.01.96

40.  మోక్షసాధనలో నీవు నీస్వధర్మము మీదనే ఆధారపడు.  స్వధర్మము బావిలోని నీరువంటిది. పరధర్మము ఎండమావులువంటివి.  ఎండమావుల వెనుక పరిగెత్తటములో అర్ధము లేదు. 

     -13.01.96


(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

Friday, August 10, 2012

పిలచిన పలికే దైవం

0 comments Posted by tyagaraju on 8:06 AM



                                      

09.08.2012  శుక్రవారం
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

పిలచిన పలికే దైవం

మన బ్లాగులో సాయి బంధువులకు ఒక విన్నపం అని ఎవరికయినా బాబా అనుభూతులు, లీలలు జరిగిఉంటే నాకు మైల్ చేయమని రాశాను.  దానికి స్పందిస్తూ ఈ రోజు సాయి బంధు వహీదా గారు తమ అనుభవాన్ని తెలుగులోనే రాసి నాకు పంపించారు.  దానిని యధాతధంగా మీకు అందిస్తున్నందుకు చాల సంతోషంగా ఉంది. నిజంగా సాయినాధులవారు వహీదాగారిని 9 గురువారముల వ్రతం చేయమని తేదీ తానే సూచించడం, వ్రతానికి సిధ్ధంగా తనే రావడం చాలా అద్భుతమైన లీల. పిలిచిన పలికే దైవము అంటే మనసాయినాధుడే అని భక్త సులభుడు అని మనకందరకూ తెలిసిన విషయమే.  ఈ లీల చదివిన తరువాత మన నమ్మకం మరింతగా ద్విగుణికృతమవుతుంది.

Thursday, August 9, 2012

శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 3

1 comments Posted by tyagaraju on 9:18 AM

                                           
                              

09.08.2012  గురువారము

ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 3

21.  నీవు సంపాదించిన ఆస్థి పాస్తులను చూసి దొంగలు వాటిని దోచుకొని నీమనసుకు కష్ఠాన్ని కలిగించుతారు. నీవు సంపాదించిన ఆధ్యాత్మిక సంపదను చూసి భగవంతుడు నీమనసును దోచుకొని నీమనసుకు సుఖాన్ని కలిగించుతాడు. 

     - 31.10.95

22.  భార్యతో వైవాహిక జీవితము శరీరములోని చక్కెరవంటిది.  పరస్త్రీ వ్యామోహము వైవాహిక జీవితములో శరీరానికి వచ్చిన చక్కెర వ్యాధివంటిది. ఆచక్కెర వ్యాధిని కొనితెచ్చుకొని నీఆరోగ్యాన్ని ఎందుకు పాడుచేసుకొంటావు.                                    

      Diabetes : Diabetes Just Ahead Green Road Sign with Dramatic Clouds, Sun Rays and Sky.

23.  నీవు భగవంతుని అనుగ్రహము అనే మజ్జిగ త్రాగిననాడు, ఆమజ్జిగ రుచిని పదిమందికి చెప్పి, వారు కూడ భగవంతుని అనుగ్రహము అనే మజ్జిగ పొందేలాగ చూడాలి, అంతే గాని నీవు పొందిన ఆభగవంతుని అనుగ్రహము అనే మజ్జిగలో నీరు పోసి జనాలకు అమ్మరాదు. 

     - 22.11.95

24.  నాతత్వాన్ని తియ్యటి భాషలో చెప్పటము అంటే తియ్యటి నీరు ఉన్నబావిలోని చేపలకు చెప్పటమువంటిది.  నాతత్వాన్ని పామర భాషలో చెప్పటము అంటే సముద్రములోని చేపలకు చెప్పటమువంటిది.   

     - 27.11.95

25.  నీవు తలచే పామాణికాలు అనబడే శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్ లు స్వచ్చమైన నదీజలాలు, ఆఖరికి ఆనదీ జలాలు సాయిసాగరము అనే ఉప్పునీటి సముద్రములో కలవవససినదే.  సాయిసాగరములో జీవించుతూ ప్రామాణికాలు కోసము వెతకటములో అర్ధము లేదు.

     - 27.11.95

26.  ఈప్రాపంచిక విషయాలలో నీయజమాని సంతోషించుతాడు అనే ఆలోచనలతో అతని పిల్లలను నీవు ముద్దు చేస్తున్నావే! మరి నాయజమాని (భగవంతుడు) పిల్లలను (అనాధ పిల్లలను) నీవు ముద్దు చేసిననాడు నేను సంతోషించుతానే -

     - 23.07.95

27.  ధనవంతుల వెనుక వారి వంతపాడటము మాని భగవంతుని ముందు నీపాట నీవు పాడు. 
                                              

     - 28.07.95

28.  ధనగర్వముతో చెడు ఆలోచనలు గల పురుషునికి సౌందర్యగర్వముతో చెడు ఆలోచనలుగల స్త్రీకి నీవు దూరముగా యుండు.  

     - 30.08.95

29.  నేను ధులియా కోర్టు వ్యవహారములో చెప్పిన విషయాలు మాత్రమే నీకు తెలుసు.  నేను వెనకటి జన్మలో నాయజమాని శ్రీకృష్ణుని యింటిలో పురోహితుడుగా (గర్గముని) పని చేసినాను.  

                                             


     - 05.09.95

30.  భగవంతుడు ఈసృష్టిలో ముందుగా ఆత్మను సృష్టించినాడు.  ఆ ఆత్మ సంఖ్య పెరగదు, తరగదు.  ఆ ఆత్మ శరీరాన్న్ని వదలిన తర్వాత తనకోరిక ప్రకారము నూతన శరీరములో చేరుతుంది.  అందుచేత ఈసృష్టికి అంతములేదు.   

     -  05.09.95

(యింకా ఉంది)

సర్వం శ్రీసాయినాధార్పణమస్తు.

Wednesday, August 8, 2012

శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 02

0 comments Posted by tyagaraju on 8:41 AM


                                              
                                                   

08.08.2012  బుధవారము 

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 02


11.  ఓటమిలో గెలుపును, గెలుపులో ఓటమిని  చవి చూడటానికి వీలుగా శ్రీరామనవమి రోజున కుస్తీ పోటీలను ఏర్పాటు చేసినాను.

     - 09.04.95

12.  ఈప్రాపంచిక సుఖాలు పొందటానికి ఎవడి కాళ్ళు అయిన పట్టుకోవటానికి వెనకాడడు, ఈ మానవుడు.  నీకు కావలసిన సుఖ శాంతులు భగవంతుని పాదాలు పట్టుకొంటే వస్తాయి అని నేను గట్టిగా చెప్పినా వినడే ఎవడూ, ఎంతటి వెర్రివాళ్ళు ఈమానవులు. 

     - 11.04.95

13.  ధనవంతుని ద్వేషించకు - బీదవానిని అవమానించకు.  ధనవంతుని యింట జన్మించటము - బీదవాని యింట జన్మించటము అనేవి పూర్వజన్మలో చేసుకొన్న కర్మఫలము మీద ఆధార పడియున్నది.  నీకు కర్మ సిధ్ధాతము మీద నమ్మకము ఉన్ననాడు రాబోయే జన్మగురించి జాగ్రత్తపడు. 

     - 15.05.95

14. పాత స్నేహితులతో మాట్లాడటము అంటే జీవితములో పాత భవనాలును చూసి వాటిలో నివసించినవారి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవటము మాత్రమే.  ఆభవనాలు నేడు నివసించటానికి ఉపయోగపడవు అని గుర్తుంచుకో. 

15. యింటి యజమాని తన కుటుంబ సభ్యులను అందరిని ప్రేమతో పోషించగలడు.  కాని ఆకుటుంబ సభ్యులలో అసూయ, ద్వేషాలు తలెత్తినపుడు వారు యింటియజమానిపై విశ్వాసాన్ని చూపలేరు.  యిది అనాదిగా ఉన్న విషయమే.  దీని గురించి ఎక్కువగా ఆలోచించనవసరము లేదు.  

    - 02.06.95

16.  భగవంతుని నమ్మండి  అని "నమ్మకము" అనే యిటుకలు తయారు చేసి నాభక్తులకు ఇస్తూ ఆశిరిడీ మట్టిలో కలసిపోయినాను.  నేను ఆశిరిడీ మట్టిలో ఉన్నాను అనే నమ్మకము నీలో యుంటే శిరిడీకి వచ్చి ఆమట్టితో నీవే "నమ్మకము" అనే యిటుకలు తయారు చేసుకొని భగవంతుని దయకు పాత్రుడివు అగు. 

17.  శరీరానికి అనారోగ్యము కలిగినపుడు, దెబ్బలు తగిలినపుడు భరింపరాని బాధ కలుగుతుంది.   ఆనొప్పి, బాధ, శరీరానికి మాత్రమే పరిమితమైనది.  అటువంటపుడు ఆత్మ శరీరాన్ని ఓదార్చి ఆబాధను  మరిచేలాగ చేయాలి.  ఎలాగ అంటే నీఒడిలో అనారోగ్యముతో బాధపడుతున్న పసిపాపను నీవు ఓదార్చినట్లుగా శరీరాన్ని ఓదార్చి బాధను మరిచేలాగ చేయాలి. 
  
     - 17.10.95

18.  నీవు శరీరానికి చక్కని వస్త్రధారణ చేసిన సుగంధ లేపనాలు పూసిన ఆశరీరము సంతోషించదు.  అలాగే ఆవస్త్రాలను తీసివేసిన, సుగంధ లేపనాలు తుడిచి వేసిన ఆశరీరము విచారించదు.  సంతోషము, విచారము అనేవి నీమనసుకు పరిమితమైనవి.  నీమనసుకు నిజమైన సుఖ, సంతోషాలు, వివేక వైరాగ్యాలు తెలుసుకోవాలి అనేకోరిక ఉంటే నాదగ్గరకు రా.  నేను తెలియ చేస్తాను. 

     - 17.10.95

19.  కొంతమంది తమ యోగసాధనతో తమ శరీరాన్ని మంచులోనూ ఉంచగలరు, అగ్నిలోను ఉంచగలరు.  కాని జ్ఞాని అనేవాడు తన శరీరాన్ని భగవంతుని సేవకే పరిమితము చేసి నిజమైన యోగి అనిపించుకొంటాడు.
   
     - 17.10.95

20.  బీదవాడిలాగ  వేషధారణ చేసి గొప్ప గొప్ప భవనాలలో సర్వ సుఖాలు అనుభవించేవాడు, భగవంతుని సేవకులము అని చెబుతూ సర్వ సుఖాలు అనుభభవించేవాడు - యిద్దరు ఒక జాతికి చెదినవారే.  వారినుండి దూరంగా యుండు.  

     - 17.10.95


(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు



Tuesday, August 7, 2012

శిఖరాలు లోయలలో శ్రీ సాయి (రెండవ భాగము )

0 comments Posted by tyagaraju on 5:33 AM

                                          
                                         

07.08.2012  మంగళవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి 


సాయి బంధువులకు ఒక మనవి.

మన సాయి బంధువులకు కూడా బాబావారి లీలలు, అనుభవాలు కలిగి ఉండవచ్చు.  వాటిని నామెయిల్ ఐ.డీ. కి పంపితే మన బ్లాగులో ప్రచురిస్తాను.  tyagaraju.a@gmail.com



శిఖరాలు లోయలలో శ్రీ సాయి   (రెండవ భాగము )

సాయి బంధువులారా యింతకు ముందు సాయి.బా.ని.స శిఖరాలు లోయలలో శ్రీ సాయి - చదివారు.  తరువాయి భాగాన్ని ఈ రోజునుండి అందిస్తున్నాను.

 ఇక చదవండి.

                           ************

ఒక్కమాట.      గురుపూర్ణిమ  03.07.1993

శ్రీ షిరిడీ సాయి బాబా జీవిత చరిత్ర (21 వ అధ్యాయము) లో శ్రీ సాయి అన్నమాటలు "ఈలోయ మిక్కిలి లోతు అయినది.  దీనిని  దాటుట చాలా కష్ఠము" అటువంటి లోయలు - శిఖరాలను శ్రీ సాయి ఈ భక్తుడికి స్వప్నములో దృశ్యరూపముగాను, సందేశములుగాను ప్రసాదించినారు. 
  
21 వ. అధ్యాయములో శ్రీ అనంతరావు పాటంకర్ శ్రీ సాయితో అన్నమాటలు. "నీ చమత్కారము మాటలవలన నీవు అందరికి శాంతిని ప్రసాదించుతావని వింటిని. నాయందు కూడా దాక్షిణ్యము చూపుము". చమత్కారపు మాటలతో శ్రీ సాయి శ్రీపాటంకర్ కు శాంతిని ప్రసాదించి ఆశీర్వదించెను.  అదే విధముగా శ్రీ షిరిడీసాయి ఈ సాయి బా.ని.స కు చమత్కారపు మాటలతో శాంతిని  ప్రసాదించెను. 
   
శ్రీ షిరిడీసాయి స్వప్నములో ప్రసాదించిన దృశ్యాల సారాంశము, సందేశాల కూర్పు ఈ శిఖరాలు - లోయలలో శ్రీ సాయి.  ప్రతీ సందేశము చివర తేదీ యిచ్చినాను. శ్రీ సాయి ఆతేదీ (రోజు) న ఈ భక్తుడికి ఆసందేశము యిచ్చినారని, సాయి బంధువులు గ్రహించగలరు.  

యిట్లు 
సాయిసేవలో 
సాయి బా.ని.స.  రావాడ గోపాలరావు  03.07.1993

సాయి.బా.ని.స.  =  సాయిబాధ్యతలను నిర్వర్తించే సన్యాసి.   

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List