Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, August 4, 2012

నన్ను దూషించినా నిన్ను నిర్లక్ష్యం చేయను

0 comments Posted by tyagaraju on 9:46 AM
                                                                                      



                                                                                       
                                    


04.08.2012 శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు 


నన్ను దూషించినా నిన్ను  నిర్లక్ష్యం చేయను  


ఈ రోజు సాయి బంధు శివకిరణ్ గారు చెప్పిన బాబా లీలను తెలుసుకుందాము.  మనం అనుకున్నవి అనుకున్నట్లు జరగకపోయినా, నిరాశ చెందినా, మనము పూజించే దేవుడిని తిడతాము. దూషిస్తాము. ఆఖరికి కోపంతో ఏదయినా చేస్తాము.  కాని మన బాబా తన పిల్లలమీద కోపగించుకోరు.  అందుచేతనే బాబా చెప్పారు. శ్రధ్ధ, సబూరీ ఉండాలి అని. ఎంతటి కష్ట దశలో ఉన్నాసరే మనం నిరాశ పడకుండా బాబా మీదే భారమంతా వేసి ఓర్పు వహించాలి. మనకి సహాయం చేసేది భగవంతుడు (బాబా) కాక మరెవరు చేస్తారు?  ఇప్పుడు మీరు చదవబోయే లీలలో బాబా స్వయంగా వచ్చిన అధ్బుతమైన లీలని చదివి మనసారా ఆస్వాదించండి.  మనం అనుకున్నది అనుకున్నట్లు జరగలేదని బాబాని నిందించవద్దు, దూషించవద్దు.  ఆయన మనకెప్పుడూ మంచే చేస్తారు తప్ప అపకారం చేయరు అని మాత్రం మన సాయి బంధువులందరూ గుర్తు పెట్టుకోవాలి.  





సాయి బంధు శివ కిరణ్ గారు వివరించిన బాబా లీల


నాపేరు సీ.హెచ్.శివకిరణ్. నేను  హైదరాబాదులో ఉంటాను. మాస్వంత ఊరు కర్నూలు. 2010 వ సంవత్సరం లో నాకు కలిగిన  అనుభవాన్ని మీకు వివరిస్తాను. నా తల్లితండ్రులు నాతో హైదరాబాదులోనే ఉంటున్నారు.  2010 వ. సంవత్సరం మధ్యలో ఇద్దరూ కర్నూలులో ఉన్న మా పెద్ద అన్నయ్యని, పిల్లలని చూడటానికి కర్నూలు బయలుదేరి వెళ్ళారు. హైదరాబాదునుంచి బయలుదేరేటప్పుడు మానాన్నగారు ఆరోగ్యంగానే ఉన్నారు. అక్కడకు వెళ్ళినతరువాత మానాన్నగారి స్నేహితుని కొడుకు వివాహానికి వెళ్ళవలసి ఉంది. ఇంతవరకూ అంతా బాగానె ఉంది. వివాహానికి వెళ్ళిన తరువాత కర్నూలులో యింటికి వచ్చారు. మధ్య రాత్రిలో మానాన్నగారు బాత్ రూముకు కూడా వెళ్ళలేనంతగా నీరసంగా అయిపోయారు. మా అన్నయ్య, వదిన ఆయనని బాత్ రూముకి తీసుకునివెళ్ళారు. బాత్ రూం నుంచి వచ్చిన తరువాత బాగా నీరసంతో నేలమీదనే పడిపోయారు. వెంటనే ఆయనని హాస్పటలికి తీసుకుని వెళ్ళి జాయిన్ చేశారు. ఆయన వయస్సు 63 సంవత్సరాలు. ఈ విషయం తెలియగానే నేను కర్నూల్ కి బయలుదేరాను. లో బీ.పీ.వల్ల ఎడమవైపు కిడ్నీ  కుంచించుకు పోయిందని, ఇంకా సివియర్ గా హార్ట్ ప్రోబ్లెం కూడా ఉందని డాక్టర్ గారు చెప్పారు. అందుచేత ఆయనని  హైదరాబాదులోని కార్పోరేట్ హాస్పిటల్ లో చూపిస్తే మంచిదని చెప్పారు. నాకు నెలకి 8,000/- జీతం వస్తుంది,అటువంటప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకునివెళ్ళడం చాలా కష్టం. చిన్నప్పటినుంచీ నేను బాబా భక్తుడిని,  మాయింటిలోనివారందరూ కూడా.      

అలా 10 రోజులు గడిచాయి. ఆఖరికి డాక్టర్స్ హైదరాబాదులోని కార్పొరేట్ ఆస్పత్రిలో జాయిన్ చేస్తే తప్ప లాభం లేదని తేల్చి  చెప్పి డిస్చార్జ్ చేశారు. నేను ఉద్యోగానికి సెలవు పెట్టి కర్నూల్ లో ఉన్నాను. మాయింటిలో పెద్ద బాబాఫోటో ఉంది. 11 వ రోజు రాత్రి నేను ఆ పటం వంక నిరాశగా చూస్తూ, "ఒకవేళ నాన్నగారికి ఏమన్నా అయితే కనక ఆముసలివాడి ఫోటోని యింటి బయటకు విసిరివేయమని" మా అమ్మతో చెప్పాను. ఆమరుసటిరోజే నేను హైదరాబాదుకు తిరిగి వచ్చేశాను. ఆరోజున నా స్నేహితుడొకడు  విశాఖపట్నం  నించిచి ఫోన్ చేశాడు. (మిస్టర్. ప్రసాదరావు, సిమ్హా చలం lలో ఉంటాడు)  మానాన్నగారి ఆరోగ్యం గురించి అడిగాడు. నేను మొత్తం విషయమంతా వివరించాను. అతను, "మీనాన్నగారి నోటిలో ఊదీ వెయ్యి అంతే, బాబాఆయనని రక్షిస్తారు" అని చెప్పాడు.  అతను ఇవే మాటలని పదే పదే అరగంటసేపు ఫోన్ లో చెప్పాడు. వెంటనే నేను మా అమ్మగారికి ఫోన్ చేసి బాబా గుడికి వెళ్ళి ధునిలోని ఊదీని తీసుకునివచ్చి నాన్నగారి నోటిలో వేయమని చెప్పాను. మరునాడు నేను మా అమ్మకి ఫోన్ చేసినప్పుడు మనసు బాగుండక గుడికి వెళ్ళలేకపోయానని చెప్పింది.  కాని ఆరోజు రాత్రి జరిగిన లీలని చెప్పింది. 


మా అమ్మగారు, మాఅ న్నయ్య,  వదిన, పిల్లలు అందరూకూడా హాలులో పడుకున్నారు. మరొక గదిలో మానాన్నగారు పడుకున్నారు  . హటాత్తుగా మధ్యరాత్రిలో రెండు గంటలకు పెద్ద శబ్దం వినపడిండి. ఎవరో దొంగ దొంగతనానికి వచ్చి ఉంటాడని మా అమ్మ చాలా భయపడిపోయింది. సహాయం కోసం మా వదినని లేపిందిటగాని, ఆమె చాలా గాఢ నిద్రలో ఉండి లేవలెదు. వెంటనే మా అమ్మ కళ్ళు మూసుకుంది.  ఆపుడామె ఒక ముసలివానిని చూసింది.  కాని మోకాళ్ళనించి కాళ్ళ వరకు మాత్రమే కనపడుతున్నాయి. అతను తన కాళ్ళతో పెద్ద శబ్దం చేసుకుంటూ మానాన్నగారి గదిలోకి వెళ్ళాడు. కోపంగా మంచం చుట్టూ తిరిగాడు. మా అమ్మకి చాలా భయం వేసి నిద్రపోయింది. వేకువజాముననె  4, 5 గంటల మధ్య తెల్లటి పైజామా, నామాలతో ఉన్న ఒక వ్యక్తి వచ్చి ఇంటి తలుపు తట్టాడు. ఆసమయంలో మా వదిన మేలుకొని, భయంతో మా అమ్మని లేపడానికి ప్రయత్నించింది. కాని మా అమ్మ చాలా గాఢ నిద్రలో ఉంది. ఆఖరికి మా వదిన తలుపు తీసి చూసేటప్పటికి అక్కడ ఒక ముసలివాడు నిలబడి ఉన్నాడు.  నీకేమి కావాలి అని అడిగింది మావదిన. నువ్వు నాతో రా, నీకు దారి చూపిస్తాను అని అన్నాడు ఆ ముసలివాడు. మావదిన చాలా  సందిగ్ధంలో పడి, ఆఖరికి ఆతనితో కొంతదూరం వరకూ వెళ్ళింది. తెల్లవారుజాము కాబట్టి రోడ్డుమీద ఎవరూ లేరు. తను ఆ ముసలివాని కూడా వెళ్ళింది. కొంత దూరం వెళ్ళినతరువాత ఒక సందు చూపించి నువ్వు ఈదారిలో రా, నేను వెడుతున్నాను అని చెప్పాడు.  ఆసందు షిరిడీ సాయిబాబా గుడికివెళ్ళే రోడ్డుతప్ప మరేదీ కాదు. మాకు పాలుపోసే అతను పొద్దున్నే వస్తూ ఉంటాడు. అతను మా వదినను రోడ్డుమీద చూసి, "అమ్మా, ఇంతపొద్దున్నే ఇక్కడ రోడ్డుమీద ఎందుకు నుంచున్నారు," అని అడిగాడు. యింతవరకూ జరిగినది అర్ధం చేసుకోలేని స్థితిలో ఉండి, దిగ్భ్రమ చెందింది.  వెంటనే మా వదిన యింటికి వెళ్ళింది. మొత్తం జరిగిన విషయమంతా మా అమ్మ, వదిన నాకు ఫోన్ లో చెప్పారు. అప్పుడు నేను ఊదీ తీసుకురావడానికి గుడికి వెళ్ళారా అని అడిగాను. తాము వెళ్ళలేదని చెప్పారు. నేను వెంటనే అదేరోజు కర్నూలుకు బయలుదేరాను. బాబా గుడికి వెళ్ళి ఊదీని తీసుకుని వచ్చి మా నాన్నగారి నోటిలో వేశాను. 3 రోజుల తరువాత, సెకండ్ ఒపీనియన్ కి ఎందుకు వెళ్ళకూడదు అని అనిపించింది. కర్నూలులో ఉన్న  ఎండీ.డాక్టర్ దగ్గరకు వెళ్ళి మానాన్నగారి రిపోర్టులన్నీ చూపించాను. మరలా ఆయన, హార్ట్ కి, కిడ్నీకి, లివర్ కి, అన్నీ పరీక్షలు చేయించమని చెప్పారు. రిపోర్ట్స్ వచ్చాక, చూసి, ఎవరు చెప్పారు, ఆయన కిడ్నీ పనిచేయటల్లేదని, కిడ్నీ చాలా బాగా పనిచేస్తోంది, ఎవరు చెప్పారు, హార్ట్ ప్రోబ్లెం ఉందని, హార్ట్ చాలా బాగా పనిచేస్తోంది అని చెప్పేటప్పటికి మాకు చాలా ఆశ్చర్యం వేసింది. వయసు పెరిగేకొద్దీ కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి అంటే దాని అర్ధం లివరు, కిడ్నీ, హార్ట్ సరిగా పనిచేయటల్లేదని కాదు.  అని డాక్టర్ గారు చెప్పారు.   


సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 


Friday, August 3, 2012

బాబా లీలలు - ఊదీ వైద్యము

0 comments Posted by tyagaraju on 8:32 AM





03.08.2012 శుక్రవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీశ్శులు
బాబా లీలలు - ఊదీ వైద్యము
ఈ రోజు పేరు పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలి అనుభవాలను తెలుసుకుందాము. 

నా స్నేహితురాలికి సాయి దర్శనమిచ్చుట

బాబా ప్రేరణతో నేను ప్రతీరోజు భక్తుల అనుభవాలను కొంతమంది నాస్నేహితులకు (మెయిల్ ద్వారా) పంపడం మొదలుపెట్టాను .రోజూ ఒక అనుభవం అయినా వాళ్ళకు మెయిల్ చేస్తూ ఉండేదానిని.  సహజంగా నేను భక్తుల అనుభవాలు మెయిల్ చేసేటప్పుడు అనుభవం యొక్క హేడ్డింగ్ పెట్టి  అనుభవం  జత చేసి పంపేదాన్ని.  బాబా యొక్క ఫోటో అనుభవంకు జత చేసి పంపేదాన్నికాదు.  ఇంటర్నెట్ యొక్క సర్వీసు  నెమ్మదిగా వుండడం వలన బాబా ఫోటో జతచేసినా అది వాళ్ళు చూడలేరు అని బాబా ఫోటోపంపేదాన్ని కాదు.
ఎప్పటిలాగేపోయిన వారం నేను  ఒకరి అనుభవం మామూలుగానే  ఒకే గ్రూపులోని స్నేహితులందరికీ పంపించాను.  సాయంత్రం  నేనుహాస్టల్ కి వెళ్ళాక నాస్నేహితులలో ఒకామె నువ్వు పంపిన మెయిల్  లో బాబా ఫోటో చాలా బాగుందనీ, అందుకని బాబా ఫోటోని మళ్ళీ మళ్ళీ చూడడంకోసం మెయిల్ మూడుసార్లు చూశానని చెప్పింది.  నేను బాబాఫోటో ఏదీ మెయిల్ కి జత చేసిపంపలేదు అని చెప్పాను.  కానితను ఖచ్చితంగ బాబా ఫోటో చూశానని, అది ఎలాగుందో కూడా నాకు వివరించిచెప్పింది. నాకు బాబాఫోటో కొన్ని రోజుల క్రిందట బ్లాగులో చూసినట్టు గుర్తు. కాని రోజునేను  బాబా ఫోటోఏదీ  జత చేయలేదనినమ్మకంగా చెప్పగలను.నా ఫ్రెండ్ చెప్పిందినిజమే అని ఋజువు చెయ్యడానికి తను మెయిల్ మళ్ళి ఓపన్ చేసి చూసింది. కానిఅప్పుడు అక్కడ యే బాబాఫోటో లేదు. మేము ఆబాబా లీలకు విస్మయం చెందాము.నా ఫ్రెండ్ రోజూబాబా గుడికి వెళ్తుండేది. ఋతుక్రమం వలన కొన్ని రోజులుగా గుడికి వెళ్ళడం లేదు. అందుకని బాబాఆమె కోసమే మెయిల్ లో కనపడి దర్శనము, ఆశీర్వాదము ఇచ్చాడు .  ఇక ఏమి చెప్పను. అద్భుతమైన బాబా లీలచూసి మేము అందరం యెంతోసంతోషపడ్డాము. బాబా తన అద్భుతలీలలుమాపై కురిపించారు.
  
మరొక బాబా లీలను కూడా మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

నా వివాహ శుభకార్యమునకు బాబాచేసిన సహాయము.
 
నేనుబాబా అనే చల్లని నీడనిఆశ్రయించాక నాకు మా స్వంత ఊరిలో ఉన్న బాబా గుడిలో వివాహం చేసుకోవాలనే కోరిక ఉంది. తీరా బుక్ చేసుకున్న తరువాత అబ్బాయి తరఫు వాళ్ళు అంగీకరిస్తారో లేదో తెలీదు. బాబాదయ వలన నాబాయ్ ఫ్రెండ్ తన తప్పులు తెలుసుకొని నా దగ్గరకి వచ్చి క్షమాపణ చెప్పాడు. అప్పటి నుండి బాబా దయవలన అన్నీ శుభంగా జరుగుతున్నాయి. మా యిరువైపుల పెద్దలు మా పెళ్ళి జూన్ లేదా జూలై లో జరపాలనినిర్ణయించారు. అబ్బాయి తండ్రి పెళ్ళికని మూడు,నాలుగు తేదీలు   అనుకొని ఆ తేదీలలో ఏదో ఒకరోజుకు వివాహం జరగాలని అనుకున్నారుమా అమ్మ కూడా జ్యోతిష్యులను మంచి ముహూర్తం కోసం సంప్రదించింది. వారు మేము అనుకున్న రెండు తేదీలు కూడా బాగున్నాయని చెప్పారు.  ఆరెండు తేదీలలో ఏతేదీ నిర్ణయించుకోవాలో తెలీని అయోమయంలో పడ్డాము. మేము మంచి రోజు కోసం బాబాని ప్రార్థించాముమేము గుడికి వెళ్లి విచారిస్తే రెండు తేదీలలో ఒకతేదీ అప్పటికే మ్యారేజ్ హాల్ బుక్ అయ్యిందనిచెప్పారు.  అందుకని మేము జూలై 9వతేదీన వివాహం జరపాలని నిశ్చయించుకొని మ్యారేజ్ హాల్ బుక్ చేశాము. మేము చాలా ఆనందించాము.ఎందుకంటే9 సంఖ్య బాబా కుచలా ఇష్టమైన సంఖ్యబాబాయే 9వతేదీన మావివాహం జరిగేల చూస్తున్నారని సంతోషించాము. అందుకే రొజే హాలు ఖాళీగా వుండడం, మేము బుక్ చేసుకోవడం జరిగిందిబాబా మాకు ప్రతీదీ చేసిపెడుతున్నందుకు మేము బాబాకు ఎల్లప్పుడూ ఋణపడిఉంటాముఇంకో విషయం ఏమిటంటేఅబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు బాబా భక్తులు కాకపోయినప్పటికి,  బాబా గుడిలో వివాహం  జరిపించేoదుకు అబ్బాయి తనతల్లిదండ్రులని ఒప్పించాడు.  అందుచేత ఏమి సందేహమేలేదు బాబా యే ఇదంతాజరిపించారు. నేను  బాబాపాదాలకు మనః పూర్వకంగా ప్రణమిల్లి మావివాహం   ఏఆటంకం లేకుండ జరగాలని వేడుకున్నాను. మా పెళ్ళి కివచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని బాబా ని వేడాను.

లవ్ యు  బాబా.మీరు లేకుండ నేనేమిజీవితం లో సాధించలేను సాయి.

బాబాఆశీర్వాదాలు అందరికి లభించు గాక
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి


దీర్ఘకాలంగా వున్న నా వీపునొప్పిని బాబా నయం చేశారు.

2, 3 సంవత్సరముల నుండి నేను విపరీతమైన వీపు నొప్పితో బాధపడుతూ ఉండేదానిని. నొప్పి  తరచుగా వస్తూ ఉండేది, కాని ఏమందులూ పనిచేయలేదు. చివరగా బాబా ఊదీని ఆశ్రయించాను

నా వీపు నొప్పితగ్గించమని, భరించలేనని  మనఃస్పూర్తిగ వేడుకొని  ఊది తీసుకోవడం మొదలుపెట్టానుకొన్ని రోజల తర్వాత నొప్పితగ్గడం మొదలయిందికొన్ని నెలల నుండి నొప్పినుండి చాల రిలీఫ్ గావుందిబాబా నే నానొప్పిని నయం చేసారని నాకుతెలుసుబాబా మీకు ధన్యవాదాలు.నిజంగా బాబా ఊది ఎటువంటి అనారోగ్యానికైన అమోఘమైన నివారణోపాయం.

బాబానా చర్మ సమస్యను నయంచేశారు.

నా మొహం మీద మొటిమలవల్లాశరీరం వేడి చేయడం వలన చర్మం మీద బాగ మచ్చలువచ్చాయి . చర్మం గురించినాకు చాల బాధగ వుండేది. నేను ఒకసారి భక్తుల అనుభవాలు చదివేటప్పుడు ఇలానే ఒక అమ్మాయికి చర్మ సమస్యతో ఉన్నప్పుడు  రోజు రాత్రి బాబా ఫోటో ముందు ఒక గ్లాసు నీటిలో బాబా ఊది కొచెంవేసి రాత్రంతా అలాగే వుంచి ఉదయంలేవగానే  తీసుకొనేది అని చదివానునేను అలానే చెయ్యడం మొదలు పెట్టానుఇప్పుడు నా చర్మ సమస్యచాలా తగ్గి మెరుగయిందిఏదో ఒక రోజుబాబా దయ వలన మొహంమీద ఉన్న మచ్చలు తగ్గి  మునుపటి అందమైన చర్మం వస్తుందని నాకునమ్మకంబాబా తన భక్తులయొక్క చిన్న కోరికలను కూడ వినివాళ్ళ కోరికలు తీరుస్తున్నందుకుఎంతో కృతజ్ఞతలు సాయి మీకు.

సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 

Tuesday, July 31, 2012

ఆపదలో ఆపద్భాందవుడు - బాబా

0 comments Posted by tyagaraju on 9:18 AM





                                              

31.07.2012  మంగళవారము


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


ఈ రోజు సాయి భక్తురాలు సునీల గారి బాబా అనుభవాలను తెలుసుకుందాము. 


ఆపదలో ఆపద్భాందవుడు -  బాబా


మొదటి సారి షిరిడి దర్శనం



1994 లో మొదటి సారిగ మేము షిరిడి ని దర్శించాలనుకున్నాము.1994 డిశంబర్ 24 న మేము కెకె.ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ కి రిజర్వేషన్ చేయించుకున్నాము.కాని దురదృష్టవశాత్తు నాకు విపరీతంగ వీపు నొప్పి మొదలయింది. నేను బెడ్ మీదే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది.కొన్ని అడుగులు కూడా వేయలేక పోయేదాన్ని. మేము షిరిడి కి రిజర్వేషన్ చేయించుకున్న ట్రెయిన్ టికెట్స్ క్యాన్సల్ చేసుకోవాల్సివచ్చింది. అప్పటికి బాబా నుండి మాకు షిరిడి కి పిలుపు రాలేదు. అనేక రకాల మెడిసన్స్ తీసుకుంటూ రెండు నెలలు  ట్రీట్మెంట్ తీసుకున్నాను. మేము అప్పుడు రోహిని లో వుండే వాళ్ళము.రోహిని లో ప్రతి గురువారము బాబా గుడి కి వెళ్ళేవాళ్ళము.  షిరిడి కి వెళ్ళాలని మేము ఎంతో ఆశతో వున్నాము.


మేము శివరాత్రికి షిరిడి కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము.దానిప్రకారం ట్రెయిన్ టికెట్స్  షిరిడికి (మన్మాడ్ ) రిజర్వేషన్ చేయించుకున్నాము. మాకు రెండు టికెట్స్ మాత్రమే రిజర్వేషన్ కి దొరికాయి. ఒకటి నాకు, మరొకటి మా అమ్మాయి కి (కాలేజీలో చదువుతోంది). మూడవ టికెట్ వెయిటింగ్ లిస్ట్ లో వుంది. రైల్వే హెడ్ క్వార్టర్స్ వాళ్ళు ప్రయత్నం చేసినా  కూడా మూడవ టికెట్ కన్ ఫర్మ్ కాలేదు. మా అబ్బాయి,  డ్రైవర్,  మా వారిని ఆఫీసు నుండి కారు లో ఎక్కించుకొని వచ్చి మమ్మల్ని స్టేషన్ లో వదిలి పెట్టడానికి వచ్చారు.మేము వెళ్ళే ట్రెయిన్ న్యూ ఢిల్లీ స్టేషన్ నుండి రాత్రి 9.15 గంటలకు బయలుదేరుతుంది . స్టేషన్ కి చేరుకోవడానికి   ఒక కిలో మీటర్ వుంది అనగా పహర్గంజ్ దగ్గర రాత్రి 8.45 గంటలకు మా కారు చెడిపోయింది. కారు అస్సలు స్టార్ట్ అవ్వలేదు. మా అబ్బాయి , మా వారు,  డ్రైవర్ ముగ్గురు మూడు దిక్కులకు  మెకానిక్ కోసం వెళ్ళారు. అప్పుడు రాత్రి 9 గంటలు అయింది  .మా అమ్మాయి , నేను కారు లో కూర్చొని వున్నాము. మా అమ్మాయి ఈ సారి ఏమైన సమస్య వచ్చి షిరిడి కి వెళ్ళలేకపొతే ఇక ఎప్పుడు  షిరిడి కి వెళ్ళము అని చెప్పింది. ఇంతకు ముందు కూడ చాలా సార్లు షిరిడి కి వెళ్ళాలని ఎంత ప్రయత్నించిన టికెట్స్  దొరకక వెళ్ళ లేకపోయాము. నేను , మా అమ్మాయి స్టేషన్ కి వెళ్ళడానికి రిక్షా లో ఎక్కి కూర్చున్నాము.  అప్పుడు గూని తో వున్న ఒక ముసలాయన  (ఆయనని  చూస్తే చెత్త పోగుచేసుకునే వ్యక్తిలాగ వున్నారు) వచ్చి కారు రిపేరు చేస్తానని చెప్పాడు.  మా ఆయన నీవేమి రిపేరు చేయగలవని గొణిగి, ఆఖరికి సరే ప్రయత్నించమని అన్నారు.


  ఆ ముసలాయన బోనెట్ ని ఓపన్ చేసి ఇంజన్ ని తాకాడు.  కారు స్టార్ట్ అయ్యింది. మా ఆయన ఆ పని చేసినందుకు ఆ ముసలాయనకి 20 రుపాయలు ఇచ్చారు.  నేను,మా అమ్మాయి రిక్షా లో స్టేషన్ చేరాము. మా ఆయన, అబ్బాయి, డ్రైవర్ ముగ్గురు కారు లో స్టేషన్ కి వచ్చారు.ఆశ్చర్యంగ నేను స్టేషన్ బయటి నుండి ప్లాట్ ఫారం వరకు దాదాపు 300 మీటర్లు నడవగలిగాను. మేము ట్రెయిన్ లో కూర్చున్నాము.  ఆ ముసలాయన శ్రీ సాయిబాబా తప్ప మరెవరూ కాదని మాకర్ధమయింది.  నేను, మా అమ్మాయి  మా బెర్త్ లో కూర్చున్నాము. కాని మా ఆయనకు బెర్త్ లేదు. ట్రెయిన్ బయలుదేరింది. మా కంపార్ట్ మెంట్   లో ఒక బెర్త్ ఖాళీ గా వుంది. రెండు స్టేషన్స్ వరకు ఆ బెర్త్ లోకి ఎవ్వరు రాలేదు. అందువలన మా ఆయన ఆ బెర్త్ లొ కూర్చున్నారు. ఆశ్చర్యంగ మా ప్రయాణము చివరి వరకు ఆ బెర్త్ లోకి ఎవ్వరు రాలేదు. మా ఆయన కూడ ప్రశాంతంగా ప్రయాణము చేయగలిగారు. ఇది అంతా బాబా దయ వలనే జరిగింది.


             మరుసటి రోజు సాయంత్రము ఎటువంటి ఇబ్బందులు లేకుండ మేము షిరిడి చేరుకోగలిగాము.మొదటగా మేము బాబా సమాధి మందిరము ను దర్శించాము.అప్పుడు ఎక్కువ రష్ లేదు. అప్పట్లో  సమాధి మందిరము, మందిరము చుట్టు ఇప్పుడు వున్న విధంగ ఎటువంటి కట్టడాలు లేవు   అప్పుడు విజిటర్స్ కోసం వెయిటింగ్ హాల్ , స్పెషల్  దర్శనం కోసం స్పెషల్ లైన్స్  వుండేవి కావు. మరుసటి రోజు మధ్యాహ్నం ట్రెయిన్ కి షిరిడి నుండి బయలుదేరేముందు  బాబా దర్శనం మరొక సారి చేసుకుందాం అనుకున్నాము.


 మరుసటి రోజు ఉదయం దర్శనం కోసం వచ్చినపుడు చాలా రద్దీగా ఉండటంతో  మేము ఆశ్చర్యపోయాము. ఆ రోజు శివరాత్రి కావడం వలన చాలా మంది వచ్చ్హారు. దర్శనం కోసం వచ్చిన భక్తులు  క్యూ లైన్ లో ఖండోబా గుడి దాటి లెండిబాగ్ నుండి, మెయిన్ రోడ్ లో వున్న షాప్ లు, బజార్లు , బస్ స్టాండ్ వరకు క్యూ లైన్ లో వున్నారు. మేము ఆ క్యూ లైన్ లో వున్నాము. కాని మాకు బాబా దర్శనం అవుతుందని నమ్మకం లేదు. ఎందుకంటే క్యూ లైన్ నిదానంగా ముందుకు కదులుతోంది.  మేము ట్రెయిన్ కి సరైన సమయానికి  చేరుకోవాలంటే షిరిడి నుండి మధ్యాహ్నం 1.30 కి  బయలుదేరాలి . మేము కనీసం మధ్యాహ్నం 1 గంట కల్ల లెండి బాగ్ ని దాట గలిగితే సమాధి మందిరం దర్శనం చేసుకోగలుగుతాం . లేకపోతే క్యూ లైన్ నుండి వెనక్కివచ్చేద్దాం అనుకున్నాం.  మేము లెండి బాగ్ ని దాట లేకపోయాము.అందువలన క్యూ లైన్ నుండి వచ్చేద్దాం అనుకున్నాము. నంద దీపం దగ్గర మేము క్యూ నుండి అస్సలు బయటికి రాలేకపోయాము. చుట్టూ జనం ఎక్కువ వుండడం తో చిక్కుకుపోయి క్యూ లైన్ నుండి బయటికి రాలేకపోయాము. నంద దీపం దగ్గర కొంతమంది ఆడవాళ్ళు పూజ చేసుకుంటున్నారు . వాళ్ళు మాకు చాల పండ్లు  ఇచ్చి  ఎవరికైన పెళ్ళి అయిన ఆడవాళ్ళకు ఇమ్మని చెప్పారు.  మేము క్యూ లైన్ నుండి ఎప్పటికప్పుడు బయట పడాలని చూశాము.  కాని ఎప్పుడు ప్రయత్నించిన బయటికి రాలేక ఇంకా ముందుకు నెట్ట బడ్డాము.  ఇలా జరుగుతుండగానే మాకు తెలియకుండానే సమాధి మందిరం గేట్ దగ్గరికి వచ్చాము. ఆఖరికి ఇక్కడ కూడా క్యూ నుండి బయటకు రావాలని చూశాము. కాని మమ్మల్ని సెక్యూరిటి గార్డ్ వాళ్ళు సమాధి మందిరం గేట్ లోపలికి తోసేసారు. అదంతా బాబాగారి ప్రేరణతోనే జరిగింది.  ఒకప్రక్క మాకు శివరాత్రికి సాయిబాబా దర్శనం చేసుకోవాలని వున్నామరొకప్రక్క మన్మాడ్ లో మేము వెళ్ళాల్సిన రైలు ఎక్కడ తప్పి పోతుందోనని భయం వేసింది.  మాకు  సమాధి మందిరం లో బాబా దర్శనం చాలా బాగా జరిగింది.  ఆ సంతోషం లో నాకు ఆనంద భాష్పాలు వచ్చాయి.  ఆ అనుభూతి చాల గొప్పగా వున్నది.అంతా బాబా గారి దయ.


   మేము మన్మాడ్ కి ట్రెయిన్ కి అందుకోవాలని ఆత్రంగా బయలుదేరాము.ఎటువంటి ఇబ్బంది లేకుండా మన్మాడ్ కి వెళ్ళడానికి సరైన సమయం లో వాహనాలు కూడా రెడీగ  వున్నాయి. అంతా బాబా గారే ఏర్ప్పాటు  చేసినట్లు బాగా జరిగింది.  మేము సరైన సమయానికి వెళ్ళి రైలు అందుకోగలిగాము.అప్పటి నుండి దాదాపు ప్రతి సంవత్సరం బాబా దర్శనం చేసుకుంటున్నాము.

రెండవ అనుభవం:

 ఢిల్లీలో ఒకసారి నేను కాళీమార్గ్ వద్దనున్న కాళీకాదేవి గుడినుంచి లోకల్ బస్సులో తిరిగి వస్తున్నాను.  నేను దిగవలసిన బస్ స్టాప్ దగ్గర్లో వస్తుందనగా  ,  నేను నా సీట్ నుండి లేచి బస్ ముందరుండే ఎగ్జిట్ గేట్ దగ్గరికి వచ్చాను.  బస్ డ్రైవర్  బ్రేక్ సడన్ వేయడం వలన పెద్ద కుదుపు  వచ్చేసరికి బస్ లో అందరు పెద్దగ అరిచారు. ఆ కుదుపుకు  నేను బస్ మెట్ల మీదకి తోయబడ్డాను. నేను బస్ నుండి క్రిందకి పడిపోతానేమో అని, పెద్ద యాక్సిడెంట్ జరుగుతుందని ఎంతో భయపడి  "బాబా"అని పెద్దగా అరిచాను .  మరుక్షణం నేను బస్ చివరి మెట్టు మీద కూర్చొని ఉన్నానని తెలిసింది.  ఏదో దైవ శక్తి నన్ను తీసుకొని పోయి చివరి మెట్టు మీద కూర్చోబెట్టినట్టు వుంది .చిత్రంగ నాకు ఒక్క గాటు కూడ పడ లేదు. సాయిబాబా నన్ను రక్షించారు.

మూడవ అనుభవం:

2010 వ సంవత్సరంలో ఢిల్లీ లో కరోల్ బాగ్ లో షాపింగ్ చేసేటప్పుడు ఎగుడుదిగుడు గా వున్న రోడ్ లో ఒక చోట కాలు పడి కింద పడ్డాను.  నాశరీరం మొత్తం బరువంతా కూడా నామణికట్టుమీద, మోకాలుమీద పడింది. నా మోకాలికి దెబ్బ తగిలి రక్తం వచ్చింది. కుడి చేతికి చాలా చోట్ల గాట్లు పడ్డాయి. నేను నొప్పి భరించలేక ఏడుస్తున్నాను. అప్పుడు నా వయస్సు 62 సంవత్సరాలు .  ఆ వయసులో సామాన్యంగ ఆస్టియోపొరోసిస్ (అంటే బోలు ఎముక వ్యాధి లేదా ముసలి తనంలో ఎముక మెత్త బడుట)వల్ల ఎముకలు బలహీనంగ వుంటాయి. నేను క్రింద బడటం వలన బహుశ నా ఎముకలు విరిగాయోమో అని చాల భయపడ్డాను.నేను ఆర్థొపెడిక్(ఎముకల డాక్టర్) దగ్గరికి వెళ్ళాను.నాకు ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఎక్స్ రే తీసారు.ఏమి ఫ్ర్యాక్చర్ కాలేదని చెప్పారు. మోకాలు, చేతి వ్రేళ్ళు ఉబ్బాయి . ఆ వాపు మీద కట్టు(డ్రెస్సింగ్ చేసారు)కట్టారు.దెబ్బలు తగ్గాయి కాని నొప్పి ,కొన్ని చోట్ల చేతి మీద వాపు తగ్గలేదు. నొప్పి చేతికి మొత్తం పాకుతూ వచ్చింది.నేను చాలా మంది మంచి ఆర్థోపెడిక్స్ ని కలిశాను. వాళ్ళు  నా చేతి యొక్క కార్టిలేజ్ దెబ్బ తినింది అని చెప్పారు.  సహజంగా నేను అలోపతి మందులను వాడను.  అవి నా శరీరానికి సరిపడవు.  ఇది ఆర్ధరైటిస్ (కీళ్ళ వాపు)మొదటి స్టేజ్ లో ఉంది అని నాకు చెప్పారు. దీనికి నేను వాడే హోమియోపతి  లో మందు లేదు అని చెప్పారు. నేను ఎంతో మంది ర్యూమటాలజిస్ట్ లను (కీళ్ళ మరియు వాటి కండర వ్యాధుల నిపుణుడు) కలిసాను.  కాని వాళ్ళు  నాకు రాసిచ్చిన మందులు ఏమి నాశరీరానికి పడవు.  నాకు ఎసిడిటి , శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులు, ఎప్పుడు వాంతికి వచ్చేటట్టు ఉండేది . అందువలన అలోపతి ట్రీట్మెంట్  మానివేయాల్సివచ్చింది. నొప్పి ఏమీ తగ్గడం లేదు.  ఇంకా అంతా వ్యాపిస్తూ వచ్చింది.నాకు చాలా భాధ గా ఉండేది. ఎప్పుడు ఏడుస్తు ఉండేదాన్ని.  మంచి హోమియోపతి డాక్టర్ దొరికేలా చేయమని బాబా ని ప్రార్థించాను. చివరగా బాబా దయ వలన ఒక మంచి హోమియోపతి డాక్టర్ దొరికారు.  ఆయన ఈ ఆర్ధరైటిస్ మొదటి స్టేజ్ లోనే తగ్గించగలను అని చెప్పారు.  కొన్ని నెలలు ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాక ,  ఆ డాక్టర్ ఇచ్చిన మందులు పని చేయడం మొదలుపెట్టడం గమనించాను.  కొంచెం ఊరట కలిగింది. దాదాపు ఒక సంవత్సరం ట్రీట్మెంట్ తర్వాత నా చేతులకు కొంచెం శక్తి ,పటుత్వం వచ్చాయి.  మంచి హోమియోపతి డాక్టర్ ని కలుసుకొనేలా  చేసి నాఆర్ధరైటిస్  ని తగ్గించినందుకు బాబా మీకు శతకోటి ధన్యవాదాలు.

సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

Monday, July 30, 2012

సాయినాధా ... దయామయా.. 9 గురువారముల వ్రత మహిమ

0 comments Posted by tyagaraju on 7:36 AM






30.07.2012 సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి 
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

చాలా రోజుల తరువాత మరల మీకందరికీ బాబావారి అనుభవాలను అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు పేరు చెప్పడానికి యిష్ట పడని ఒక భక్తురాలి గాధను చదువుకుందాము.

సాయినాధా ... దయామయా.. 9 గురువారముల వ్రత మహిమ 





కొన్ని సంవత్సరాల క్రితం నేనెప్పటినుంచో కలలు కంటున్న ప్రముఖ  ఐ .బీ .ఎమ్ .కంపనీలో ఉద్యోగంలో చేరాను.  కాని, దీనికి ముందు నేను నాభర్తతో కలిసి వేరే రాష్ట్రంలో ఉన్నాను  కాని కొన్ని ఆర్థిక సమస్యల వల్ల ఐ .బీ .ఎమ్ లో చేరడానికి నేను వేరే రాష్ట్రానికి వెళ్ళవససివచ్చింది.  ఎంతో ఆనందంగా ఐ .బీ .ఎమ్  కంపనీలో చేరాను ఐ .బీ .ఎమ్  లో నాకు అప్పగించిన ప్రాజెక్ట్ కొత్తది. ఐ .బీ .ఎమ్   కంపనీ నిజంగా చాలా బ్న్రహ్మాండమైన కంపినీ.  కానీ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన మా లేడీ టీం లేడర్ వల్ల నాకు కఠినమైన సంస్యలు తలెత్తాయి.  ప్రవేశించిన మొదటి రోజునుంచే ట్రైనింగ్ లో నామీద అరవడం మొదలుపెట్టింది. ఒక బాధ్యత గల ఉద్యోగినిగా అది తగనిది.  సంవత్సరము న్నరపాడు ఆమె నన్ను చాలా బాధపెట్టింది.  లోలోపల ఎంతో దుఖించాను.  ఎటువంటి కారణమ్  లేకుండా నామీద అలా ఎందుకు అరుస్తోందో  చెప్పమని అన్నీ వివరించడం మొదలు పెట్టాను.  ఆమెకు కొన్ని సమస్యలు ఉన్నాయి.  ఆకారణం చేత ఆమె నన్ను, నేను బాగా పనిచేస్తున్నా కూడా  నన్ను మానసికంగా చాలా బాధపెడుతూ ఉండేది.  నాఉద్యోగ బాధ్యతలలో నేను చూపే ప్రతిభ తారాస్థాయిలో ఉండటం వల్ల నాకు ప్రశంసలు కూడా లభించాయి.  నా ఆత్మ గౌరవాన్ని చంపుకోవడానికి యిష్టం లేక  నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపించేది.  కాని, ఒక విధంగా ఆలోచిస్తే  నేను ఉద్యోగానికి కూడా రాజీనామా చేయలేని పరిస్థితి.  నేనెంతగానో ప్రేమిచే నాభర్త ఎప్పటినుం చో కలలు కంటున్న కొత్త యిల్లు కొనుక్కోవాలనె కల నిజమయే పరిస్థితి.  యింకొక విధంగా ప్రస్తుతం నేను పని చేస్తున్న కంపనీలో ఒక సంవత్సరం పూర్తి కాకూండా మరొక కంపనీలో చేరడానికి వీలులేని పరిస్థితి.  నేను చాలా సున్నితమైన మనస్కురాలిని కావడమ్  వల్ల ఎవరినీ కూడా నొప్ప్పించలేను. ఎవరితోనూ  కఠినంగా మాట్లాడలేను. యితరులతో నేను చాలా దయగానూ సున్నితంగాను ప్రవర్తిస్తాను.  ప్రతి రాత్రీ , పగలూ నాకు ఏడవటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి.  మరొక దారి లేని పరిస్థితిలో కొట్టుమిట్టడుతూ ఉన్నాను.  సంవత్సరం న్నరపాటు నేనెంతగానో  క్షోభ  అనుభవికంచాను.  కంపనీ ద్వారాను,. ఎల్ ఐ. సీ ద్వారాను యిన్సూరెన్స్ పాలసీలు ఉన్నందు వల్ల కొన్ని సార్లు ఆత్య్మ హత్యకు కూడా ప్రయత్నించాను.  వచ్చే సొమ్ము నాభర్త యిల్ల్లు కొనుక్కోవడానికైనా పనికి వస్తుందనే ఉద్దేశ్యం.     

చాలా సార్లు బాబా ముందు రోదిస్తూ ఉండేదానిని.  కాని, ఆయన నా మొఱ ఆలకించలేదు.  ఈలోపులో మా టీం లీడరు మూడు నెలలు ప్రసూతి సెలవులో వెళ్ళింది.  టీంలో ఉన్నవారందరూ ఎంతో సంతోషించారు. అందరికీ కూడా ఆమె అంటే అయిష్టం అని తరువాత తెలిసింది.  నేను ఆమె ప్రక్కనే కూర్చుండటంవల్ల నేనే ఆమె వల్ల ఎక్కువగా బాధపడ్డాను.  

ఆమె మనస్తత్వం అటువంటిది కాబట్టి నేనామెని నిందించలేను.  అదే సమయంలో ఎవరూ కూడా ఎదటివారి మనోభావాలని గా యపరచకూడదు. పరిస్థితులను  లెక్కచేయకుండా నేను చాలా ఎక్కువ కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాను.  కాని, పనిచేసే చోట యిబ్బంది విషయానికి వస్తే   ఉద్యోగస్తుల సమస్యలని ఐ.బీ.ఎం పరిష్కరించలేకపోయేది.  యిందులో మానేజర్ పాత్ర ఏమీ లేకపోవడంతో ఆసమస్యలు అలా ఉంటూనే ఉన్నాయి.  అది నిజంగా చాలా హింస.

నా భర్త ఎప్పుడు తనున్న చోటికి తరచూ  ప్రయాణం చేస్తూ ఉండేవారు.అందుచేత నేను ఒంటరిగా  ఉండవలసి వచ్చేది .  ఒక రోజు రాత్రి అనుభవాలతో ఉన్న బాబాగారి వెబ్ సైట్ చూడటం తటస్థించింది.  అపుడు 9 గురువారాల వ్రతం గురించి తెలిసింది .  యిందులో తమ తమ  అనుభవాలను ప్రచురించిన వారిందరికీ నేనెంతో కృతజ్ఞురాలిని.  ఐ.బీ.ఎం.లో నేను సంవత్సరం పైగా పనిచేశాను.  నౌకరీ.డాట్ కాం లో నేను నా రెజ్యూం ని పంపించడం ప్రారంభించాను.  పరిస్తితుల ప్రాబల్యం వల్ల నేను బాబామీద ఆశ వదలుకున్నాను.  కాని యింకా  బాబామీద ఒక్క ఆశవుంది. 

జీవితంలో నాకు నమ్మకం పోయింది .  ఒంటరితనాన్ని అనుభవించాను.  నావ్యక్తిగత జీవితంలో కూడా ఒకామే వల్ల యిదేవిధమయిన హింసను ఎదుర్కొన్నాను.  యింట్లో నాకు నిద్ర పట్టేదికాదు.  ఆఫీసులో కూడా అదే పరిస్థితి.  మనుషులంటేనే నాకు భయం ఏర్పడిపోయింది.  నిద్రలో మధ్యలో లేస్తూ ఉండేదానిని.  దానివల్ల మానసికంగా చాలా బలహీనపడ్డాను.  వ్రతం చేయడానికి ప్రయత్నించాను.  కాని దురదృష్టవశాత్తు ఒకామే నన్ను యింటివద్ద  వ్రతం చేసుకోవడానికి ఒప్పుకోలేదు.  ఆమెకు నేను అడ్డుచెప్పలేకపోయాను .  ప్రతిసారి బాబా నాఓర్పుని పరీక్షిస్తున్నారు. .  ప్రతీసారి నేనింతగానో ఏదిచేదానిని.  కాని ఒక గురువారమునాడు 


నేను ఉపవాసము ఉండి మొదటి గురువారం తరువాత రెండవ గురువారం పూర్తిచేశాను.  నాస్వస్థలానికి ట్రాన్స్ ఫర్  కి మామేనేజర్ నుంచి అనుమతి లబించింది.  నేను నాభర్త కలిసి ఉండవచ్చు.  యిదంతా బాబా దయవల్లనే జరిగిందని నాభర్తకు చెప్పాను. ఆయన నమ్మలేదు.  కాని చాలా సంతోషించారు.  రెండవ గురువారం తరువాత నంబర్ వన్ అమెరికన్ కంపెనీనుంచి నాకు ఆఫర్ లెటర్ వచ్చింది.  అది చాలా మంచి కంపెనీ.  జీతం కూడా ఎక్కువగానే ఉంటుంది.  నాసంతోషాన్ని మాటలలో వివరించలేను.  ఆకంపెనీ కూడా నాభర్త స్వస్థ్లంలోనే ఉంది.  నేను ఆశించినదానికంటే వారు ఎక్కువ ప్యాకేజీ, జీతం కాక యింకా ఎక్కువ లాభా లు కూడా ఉన్నాయి.  మేము యింటికోసం తీసుకున్న అప్పు తీర్చడానికి దోహదపడుతుంది.  యింకా నేను నాభర్త వద్దే తను పని చేస్తున్న చోటే ఉండచ్చు.  నేను చాలా సంతోషంగా 9 గురువారాల వ్రతం పూర్తి చేసి బాబాను దర్శించుకున్నాను.  మావారికి కూడా బాబా అంటే చాలా యిష్టం.  బాబా సద్గురువు.  ఆయనని నమ్ముకుంటే మనం ఆశించినదానికన్నా ఎక్కువ ప్రసాదిస్త్రారు.  మనం యింకొకరి మనోభావాలని గాయపరచకుండా ఉండటానికి ప్రయత్నించాలి.  

సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List