Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, June 16, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1998 (06)

0 comments Posted by tyagaraju on 10:13 PM
 

 


17.06.2012 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి.బా.ని.స. డైరీ -  1998 (06)

14.03.1998

శ్రీసాయి నిన్నరాత్రి తిరిగి ఫకీరు రూపములో దర్శనము ఇచ్చి అన్న మాటలు.

1) నేను శిరిడీలో 1916 సంవత్సరములో శరీరముతో యున్న రోజులలోని ప్రపంచ పరిస్థితి, భారతదేశ పరిస్థితిని చూపించుతున్నాను చూడు.  మొదటి ప్రపంచ యుధ్ధములో పట్టుబడిన ఖైదీలను చిత్రహింసలు పాలు చేస్తున్నారు కొందరు నియంతలు.  భారతదేశ స్వాతంత్ర్యము కోసము పోరాడుతున్నవారిని ఉరి కంబము ఎక్కించి చంపుతున్నారు బ్రిటిష్ పాలకులు.  
 
 
ఇది ఆనాటి పరిస్థితి.     

2) ఈనాడు నీవు నీవర్తమానములో సాయి మార్గములో ప్రయాణము చేస్తు నాపాదాల చెంతకు చేరాలని కోరుతున్నావు. 
 
 మరికొందరు వేరే మార్గములో ప్రయాణము చేస్తు తమ గమ్యాన్ని చేరాలని ఆరాటపడుతున్నారు.  ఎవరు ఏమార్గములో ప్రయాణము సాగించిన ఆఖరికి అందరు నాదరికి చేరవలసినదే.   

15.03.1998

నిన్నరాత్రి శ్రీసాయి నాతల్లి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) తల్లితండ్రులు చేసిన మంచి పనులకు, చెడు పనులకు కలిగే ఫలాలు వారి పిల్లలకు చేరుతాయి.  అందుచేత నీవు నీజీవితములో మంచి పనులు చేసి వాటి ఫలాలును నీపిల్లలు అనుభవించేలాగ చూడు. 

2) భగవంతుడు అన్నిచోట్ల అందరిలోను ఉన్నాడు అనేది నీవు నమ్మినావు.  యితరులు నీవు చెప్పినవాటిని నమ్మకపోవచ్చును.  నీనమ్మకాన్ని యితరులపై రుద్ది అనవసరపు గొడవలలో బాధలు పడవద్దు.  

3) సాయి తత్వము గురించి అనేకమంది అనేక రకాలుగా ప్రచారము చేస్తున్నారు.  నీవు వారి గురించి ఆలోచించవద్దు.  ఎవరితోను గొడవలు పడవద్దు. 

4) నీవు సాయి మార్గములో పయనించుతు యితరులకు ఆదర్శముగా నిలబడు.  అపుడు వారే వారంతటగా సాయి మార్గములో ప్రయాణము చేస్తారు.  

19.03.1998

నిన్నరాత్రి శ్రీసాయి ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు. 

1) మహాబలిపురము సముద్రపు ఒడ్డున పాడుబడిన మందిరాలను చూడు.  గతములో ఆమందిరాలలో భగవంతునికి పూజలు, ఉత్సవాలు జరిగినవి.  కాని ఈనాడు కొన్ని మందిరాలు సముద్ర గర్భములో మునిగిపోయినవి. మిగిలిన మందిరాలు శిధిలావస్థలో సముద్రపు ఒడ్డున జ్ఞాపకాలుగా 

మిగిలిపోయినవి. 

కాలవ్రవాహములో భగవంతునికి ఈకష్ఠాలు తప్పలేదు.  మరి మానవుల సంగతి ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచించు.    

2) నీజీవితము ఒక పచ్చని చెట్టు.  
 
ఈచెట్టు నీడలో కొందరు తమ కష్ఠాలును మర్చిపోవడానికి, మరికొందరు విశ్రాంతి తీసుకోవడానికి చెట్టు దగ్గరకు చేరుతారు.  వారి కష్ఠ సుఖాలకు నీవు ఒక సాక్షిభూతుడివి.  ఎందరికో కష్ఠసుఖాలలో తోడుగా నిలిచిన నీవు ఒకనాడు ఎండిపోయిన చెట్టుగా మారిపోతావు. 
 
  ఆఖరికి మట్టిలో కలసిపోతావు.  

(ఇంకా ఉంది)

సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

Thursday, June 14, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1998 (05)

0 comments Posted by tyagaraju on 8:02 AM




14.06.2012 గురువారము


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


సాయి భక్తులకు గమనిక::

మీరందరూ సాయి.బా.ని.స. డైరీ చదువుతూ బాగా ఆకళింపు చేసుకుంటున్నరనుకుంటున్నాను.  బాబాగారు ఆయనకు కలలలో ఫకీరు రూపములోను, అజ్ఞాత వ్యక్తి రూపములోను ఇచ్చిన సందేశాలు నేటి సమాజానికి అనుగుణంగా ఏనాడొ చెప్పారు.  సాయి.బా.ని.స. కు దాదాపు 12 సంవత్సరాల క్రితమే నేటి సమాజ స్థితిగతులను యధాతధాంగా చెప్పినట్లుగా మనకి అర్ధమవుతుంది.  అందుచేత సాయి.బాని.స. డైరీ మామూలుగా చదివేయడం కాకుండా, నేడు సమాజంలోని స్థితిగతులను కూడా బాబాగారు చెప్పినట్లు వాటికి తగినవిధంగా ఉన్నాయని మీరందరూ గ్రహిస్తున్నరనుకుంటున్నాను. 
ఇంతకుముందు డైరీలో బాబాగారు --  "నీ డైరీ నాపిల్లలు చదువుతారు అని సందేశాన్నిచ్చారు..  మరి మనమందరమూ కూడా ఆయన డైరీని చదువుతున్నాము.
బాబాగారు ఏనాడొ చెప్పినమాట నేడు నిజమయింది కదూ...

ఇక చదవండి .....



సాయి.బా.ని.స. డైరీ - 1998 (05)

08.03.1998

శ్రీసాయి నిన్నరాత్రి ఒక ఫకీరు రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) నీకు ఇతరమతాలు, వారి ఆచార వ్యవహారాలు తెలిసియుండవచ్చును.  నీవు మాత్రము వారి మత సాంప్రదాయాలలో తలదూర్చవద్దు.  నీవు నీ స్వధర్మాన్ని పాటించుతు భగవంతుని పాదాల చెంతకు చేరు. 

2) నాభక్తునికి అతని గత జీవితాన్ని చూపించి అతనికి నాపై నమ్మకాన్ని కలిగించి అతనికి మంచి భవిష్యత్ కలిగేలాగ సలహాను ఇచ్చి సదా అతని వెంట అతని నీడలాగ ఉంటాను. 

3) నిత్యము నీవు స్నానము చేసేటప్పుడు నీవు నీశిరస్సుపై పోసుకొనే మొదటి చెంబు నీరు నా నామస్మరణతో పోసుకో.  

అపుడు అదినీవు నాకు చేసే అభిషేకముగా భావించుతాను.

4) నీవు నీయింటికి ఎవరినైన పిలిచి భోజనము పెట్టదలచినపుడు నన్ను తలచుకొని ఆతిధికి భోజనము పెట్టు.  ఆభోజనమును నేను తప్పక స్వీకరించుతాను. 

10.03.1998

శ్రీసాయి నిన్నరాత్రి ఒక పాఠశాల ఉపాధ్యాయుని రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు. 

1) నీజీవితములో సుఖశాంతులు పొందాలి అంటే నీవారి సుఖశాంతులు గురించి భగవంతుని ప్రార్థించటములో తప్పులేదు.  నీవాళ్ళు సుఖశాంతులతో యున్నపుడే నీవు ప్రశాంతముగా జీవించగలవు. 

2) కాలప్రవాహాన్ని కొలమానముతో కొలవటానికి వీలుపడదు.  నీవు కొలవగలిగినది వర్తమానాన్ని మాత్రమే.  అందుచేత వర్తమానములో నీవారితో సుఖశాంతులతో గడ్లుపు.  భూతకాలములో నీవు నీవారితో గడిపినరోజులు తిరిగిరావు.  భవిష్యత్ లో నీవు నీవారితో గడిపే రోజులను ఊహించలేవు. అందుచేత వర్తమానము ఒక సత్యము అని నమ్మి జీవించు. 

3) నీలో అహంకారము అనె సూదులు ఎదుటివానిని గుచ్చుతున్నాయి.  నీవు ఆసూదులను తీసిపారవేయి. అపుడు నీసంగత్యములో ఉన్న ప్రతి మనిషి నీకు మిత్రుడుగా మారిపోతాడు.  నీజీవితము ప్రశాంతముగా గడచిపోతుంది. 

12.03.1998

శ్రీసాయి నిన్న రాత్రి ఒక ఫకీరు రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) నీవు నాతోపొందిన అనుభవాలు, అనుభూతులు పుస్తకరూపములో ప్రచురించి సాయి బంధువులు చదవగలిగేలాగ చూడు.


2) నారూపము, నావేష భాషలు తురానియన్ సాంప్రదాయానికి చెందినవి.  నీవు మాత్రము నీసాంప్రదాయములో శివ స్వరూపముగా చూడు.  నీసాంప్రదాయము ప్రకారము నన్ను పూజించు. 








3) నేను నాటి సమాజములో జరుగుతున్న అన్యాయాలను, అరాచకాలను, అవినీతిని రూపుమాపటానికి వచ్చిన భగవంతుని విధేయ సేవకుడిని.  నీవు నన్ను సాయి భక్తులకు భగవంతుని విధేయ సేవకుడిగా మాత్రమే పరిచయము చేయి. 
4) నేను భగవంతుని గొప్పతనాన్ని నావారికి ధనాపేక్ష లేకుండ, ఉచితముగా వారికి తెలియ చేసినాను.  నీవు నాగురించి పదిమందికి తెలియచేసేటప్పుడు వారినుండి ధనాన్ని ఆశించవద్దు. 


(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు


Wednesday, June 13, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1998 (04)

0 comments Posted by tyagaraju on 7:18 AM







13.06.2012  బుధవారము


సాయి.బా.ని.స. డైరీ - 1998 (04)
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


23.02.1998


శ్రీసాయి నిన్నరాత్రి కలలో ఒక బడిపంతులు రూపములో దర్శనముఇచ్చి అన్నమాటలు.


1  నైతిక విలువలు అనేవి స్వతహాగా రావు. సజ్జన సాంగత్యముతో అలవాటు అయి, స్వయంకృషితో నైతిక విలువలు పెరుగుతాయి.  అందుచేత సజ్జన సాంగత్యము మనిషి జీవితములో చాలా అవసరము.


2. ప్రజలలో నైతిక విలువలు పెరగాలి అంటే నాయకులలోముందు నైతిక విలువలు పెరగాలి.  ఆటువంటి నాయకులు ఉన్ననాడు ప్రజలలో నైతిక విలువలు పెరుగుతాయి.  


3. కార్యాలయాలలో పనిచేసేవారు నైతిక విలువలు కలిగియుండాలి.  కార్యాలయాలను తమ స్వప్రయోజనాలకు వినియోగించరాదు.  


4. ఒకరినుండి సహాయము పొందినవారు తమకు సహాయము చేసినవారి పట్ల కృతజ్ఞతా భావము కలిగియుండాలి.  నైతిక విలువలు పెంచుకోవాలి.   


5. సంసార జీవితములో భార్య భర్తలు నైతిక విలువలు కలిగియుండటము చాలా ముఖ్యము. 


24.02.1998


నిన్నరాత్రి శ్రీసాయి నాకు జన్మ యిచ్చిన నాతల్లిరూపములో దర్శనముఇచ్చి అన్నమాటలు.


1) పిల్లలను కనగానె సరిపోదు.  వారిని పెంచిపెద్ద చేసి బరువు బాధ్యతలను పూర్తిచేసుకొన్న జీవితమే ధన్యము. 


2) అనాధపిల్లలకు సాయి పేరిట ప్రేమ, అనురాగాలను పంచిన సాయి ప్రేమకు పాత్రుడివి కాగలవు. 



3) నీయింట పెద్దవయసువారు కాలము చేసిన నీబంధుమిత్రులను పిలిచి చనిపోయినవారి ఆత్మశాంతి కోసము కర్మకాండలు సరిగా నిర్వర్తించు. 


4) వయసుమీరినకొలది ఆమనిషిలో మంచి అలవాట్లు పెంచుకోవాలి.  వృధ్ధాప్యములో చెడు అలవాట్లకు బానిస అయి జీవితమును నాశనము చేసుకోరాదు. 


27.02.1998


నిన్నరాత్రి శ్రీసాయి దివంగతులైన నాతండ్రి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు. 


1) నీజీవిత రైలు ప్రయాణములో నీతోపాటు ప్రయాణము చేయటానికి నీపిల్లలకు టికెట్లు మాతమే కొనగలిగినావు. ప్రయాణములో వారు నీకు చాలా చికాకులు కలిగించుతారు.  నీవు ఆచికాకులను మరచిపోయి నీస్టేషన్ రాగానె నీవు దిగిపో.  నీపిల్లకు వారి గమ్యము చేరడానికి ఆరైలులో ముందుకు సాగిపోతారు.  


2) జీవితములో మమతలు, మమకారాలకు దుర్ వ్యసనాలకు దూరంగా యుండు. 


3) అంటరానితనము అనే భావన నీమనసునుండి తొలగించు. 


4) భార్యా వ్యామోహము విడనాడు.  



నీపిల్లలు పెద్దవారు అయినారు.  వారు స్వతంత్రముగా జీవించగలరు అనే విషయాన్ని గ్రహించిన చాలా మంచిది.  


(ఇంకాఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 

Tuesday, June 12, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1998 (03)

0 comments Posted by tyagaraju on 6:59 AM





12.06.2012  మంగళవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి.బా.ని.స. డైరీ - 1998 (03)

21.01.1998

శ్రీసాయి నిన్నరాత్రి ఒక స్వాతంత్ర్య సమరయోధుని రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) స్వేచ్చ - స్వాతంత్ర్యము యొక్క విలువ నీకు తెలియనంతవరకు నీవు బందీగా ఈశరీరములో యుంటు పడరాని బాధలు పడుతున్నావు.  నీగురువుయొక్క అనుగ్రహము పొందగానే ఈశరీరముపై విజయాన్ని సాధించి శరీరముపై మమకారమునుండి బయటపడినపుడు స్వాతంత్ర్యముయొక్క విలువ తెలుసుకోగలవు.   

2) జీవితములో నీపై నీకు నమ్మకము కలిగేలాగ జీవించటము నేర్చుకో.  నీస్వశక్తితో ఎంతపని చేయగలవు అనేది నీకు తెలిసిననాడు, నీవు నీపై అధికారుల ప్రాపకమును ఆశించవు.  జీవితాన్ని సుఖసంతోషాలతో ముందుకు సాగించుతావు.  

3) నీయింటికి వచ్చిన అతిధికి ముందుగా నీవు భోజనము పెట్టి ఆతర్వాత నీవు భోజనము చేసిన నీవు ఆభోజనమును నాకు పెట్టినట్లే.   
08.02.1998

శ్రీసాయి నిన్నరాత్రి కలలో నాదగ్గర బంధువు రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) నీకుమారుడు ఉన్నత పదవిలో యున్నరోజున నీలో మదము (అహంకారము) రానీయకు.

2) నీవు ఎవరికైన సహాయము చేసినపుడు ఆవిషయము మర్చిపో.  లేకపోతే నీలో మాత్సర్యము (అసూయ) జనించుతుంది.

3) నీవు కన్యాదానము చేసిన తర్వాత నీకుమార్తె విషయములో ఎక్కువగా ఆలోచించకు. 
 నీనుండి కన్యాదానము స్వీకరించినవారు నీకుమార్తె బరువు బాధ్యతలు స్వీకరించవలసియున్నది.  కన్యాదానము తర్వాత నీకుమార్తె అత్తమామలు నిన్ను గుర్తించటములేదు అనే ద్వేషమును విడనాడు. 

4) స్కూల్ పిల్లలు ఆటస్థలములో డ్రిల్లు చేసేవిధముగా ఆధ్యాత్మిక రంగమైదానంలో నీవు సాధన చేయి.  అపుడు మద, మాత్స్ర్యాలు రాగద్వేషాలు నీనుండి తొలగిపోతాయి. 

11.02.1998

శ్రీసాయి నిన్నరాత్రి ఒక సన్యాసి రూపములో దర్శనముఇచ్చి అన్నమాటలు.

1) శత్రువుపై పగ పట్టడము జంతువులకు సహజలక్షణము.  పగ వైషమ్యాలు వదలి క్షమాభిక్ష పెట్టడము మానవునికి భగవంతుడు ఇచ్చిన ప్రత్యేక లక్షణము.  మానవుడు ఈప్రత్యేక లక్షణము మరచిపోయి దానవుడుగా జీవించటములో అర్ధము లేదు.

2) జీవిత  పరీక్షలో పాల్గొటానికి నీకృషి నీవు చేయి.  ఫలితాన్ని నేను చూసుకొంటాను.  నాదగ్గరకు వచ్చేవారికి ఆధ్యాత్మికాన్ని సరళమైన వ్యావహారిక భాషలో బోధించి అదే భాషలో వారిని ప్రశ్నించి, వారికి ఫలితాన్ని ప్రసాదించుతాను. 

3) నాజీవితము నిరాడంబరానికి మారుపేరు. 

మరి నాజీవితము గురించి తెలిసికూడ నీవు నాకు బంగారు ఆభరణాలు, విలాసవస్తువులు కొని వాటిని నాదర్బారులో ఉంచటములో అర్ధము లేదు. 

(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

Monday, June 11, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1998 (02)

0 comments Posted by tyagaraju on 7:29 AM







సాయి.బా.ని.స. డైరీ - 1998 (02)
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు




10.01.1998


శ్రీ సాయి నిన్నరాత్రి ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు. 


1) నీగత జీవితములో జరిగిన సంఘటనలకు నీవు సాక్షీ భూతుడివిగా మిగిలిపోయినావు.  గత జీవిత ఆలోచనలకు విలువ ఇవ్వరాదు.  వర్తమానాన్ని నమ్ముకొని ప్రశాంతముగా జీవించు.

2) వర్తమానములో నీవు పూర్తి చేయవలసిన బాధ్యతలు మిగిలియున్న భగవంతుని సహాయముతో వాటిని పూర్తి చేయి.  ఆతర్వాత వాటి గురించి ఆలోచించకుండా ఆధ్యాత్మిక రంగములో ముందుకు సాగిపో.  


3) భగవంతుడు కొందరికి మంచి గొంతును ఇచ్చినాడు, కాని వారు భగవంతుని కీర్తించటానికి ఆలోచించరు కదా.  పైగా, ఎప్పుడూ తిండిమీద ధ్యాసతో జీవితాన్ని కొనసాగించుతారు.  భగవంతుడు కొందరికి ఆకలిని తీర్చడానికి గోధుమపిండిని ఇచ్చినాడు.  కాని, వారు దానిని కలిపి రొట్టెగా చేసుకొని తినడానికి బధ్ధకముతో ఆపిండినే తినుచున్నారు.  



అంటే ఎవరికి ఏది ప్రాప్తమో వారికి అదే దొరుకుతుంది అని చెప్పక తప్పదు.  


14.01.1998


శ్రీసాయి నిన్నరాత్రి కలలో ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.


1) నిత్యము భగవంతుని స్మరించుతు నీసంపాదననుండి రోజుకు ఒక రూపాయి నమ్మకాన్ని నాకు సమర్పించు.  భగవంతుని అనుగ్రహము అనే అక్షయపాత్ర నీవు పొందేలాగ నీకు నేను సహాయము చేస్తాను.  


2) భక్త ప్రహ్లాదుని ఆదర్శముగా తీసుకొని అతను పయనించిన మార్గములో ప్రయాణము చేస్తు భగవంతుని అనుగ్రహము సంపాదించు. 

3) క్రిందటి జన్మలో నీవు నీతల్లితండ్రులతో కలసి రైలు, బస్సు, టాంగా ఎక్కి శిరిడీకి వచ్చి నాకు నమస్కరించినావు.  

4) ఈనాడు నీజీవితములో నీతో బంధాలు ఉన్న నీరక్త సంబంధీకులు, నీబంధువులు, నీస్నేహితులు క్రిందటి జన్మనుండి నీతో సంబంధము ఉన్నవారే.  ఈజన్మలో వారి అందరి ఋణాలు తీర్చుకొని నూతన జన్మకు మార్గము ఏర్పాటు చేసుకో.   


20.01.1998


శ్రీసాయి నిన్నరాత్రి ఒక బాటసారి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు. 


1) జీవితములో నీవు మంచి పనులను తెలిసి చేసిన లేక తెలియక చేసిన వాటికి మంచి ఫలితాలు పొందుతావు.  మరి జీవితములో చెడ్డపనులు చేయడము మానివేసిన రోజున యింక నీవు చేసే పనులలో ఎంతో కొంత మంచి పనులు ఉంటాయి.  దానివలన నీకు తెలియకుండానే మంచి ఫలితాలను పొందుతావు.  


2) దాహముతో ఉన్నవాడికి త్రాగడానికి మంచినీరు ఇవ్వడము ఒక మంచిపని.  

అటువంటి పని చేస్తున్నపుడు నీవు ప్రేమతో ఆపని చేసిన భగవంతుని ప్రేమను నీవు మంచి ఫలముగా పొందగలవు. 



(ఇంకాఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List