Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, April 28, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (26)

0 comments Posted by tyagaraju on 9:49 PM








29.04.2012  ఆదివారము  కాంప్:  విజయవాడ 


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి 
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు 


సాయి.బా.ని.స. డైరీ -  1995  (26) 




27.11.1995


నిన్నటి రోజున ఒక విచిత్రమైన ఆలోచన వచ్చినది.   అది శ్రీసాయి ఏనాడు తన భక్తులకు సంస్కృతములో నీతి బోధలు చేయలేదు. చిన్న చిన్న పిట్ట కధలు రూపములో వారికి ఆధ్యాత్మిక నీతి బోధలు చేసేవారు.  కాని నేడు ప్రతి స్వామీజీ సంస్కృతములో వేదాలునుండి, పురాణాలునుండి శ్లోకాలు తీసుకొని వాటికి వివరణలు చెబుతు గొప్పవారుగా వెలిగిపోతున్నారే! ఈనాబాధకు పరిష్కారము చూపు తండ్రి అని శ్రీసాయిని వేడుకొన్నాను.  రాత్రి కలలో శ్రీసాయి ఒక స్కూల్ మాస్టర్ రూపములో దర్శనము యిచ్చి ప్రసాదించిన సందేశము. "పవిత్రమైన నదులులోని నీరు తియ్యగా ఉండి కొన్ని వందలు చేపలు జీవించటానికి ఉపయోగపడుతుంది.  ఆఖరికి ఆపవిత్ర నదులు అన్నీ సముద్రములో కలవవలసినదే కదా - మరి ఆసముద్రములోని నీరు ఉప్పగా ఉన్నా ఆసముద్రము కొన్ని కోటానుకోట్ల చేపలు జీవించటానికి  ఉపయోగపడుతున్నది.  ఆసముద్రములోని నీరు ఉప్పగా ఉన్నా ఆపవిత్ర నదులు కలయికతో ఆసముద్రము కూడ పవిత్రముగా మారిపోతుంది. నాకోటానుకోట్ల భక్తులు సముద్రములోని చేపలువంటివారు.  వారు తియ్యటినీరు (సంస్కృతము) ఉన్న నదులలో జీవించలేరు.  వారి జీవనానికి ఉప్పునీరు (పామరభాష) శరణ్యము. 


09.12.1995 


నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి " ఈశేష జీవితము నీసేవకు అంకితము చేసుకొని నాఅఖరి శ్వాస నీపాదాలపై తీసుకొనే భాగ్యము ప్రసాదించు తండ్రీ" అని వేడుకొన్నాను.
 శ్రీసాయి నాకోరికకు సమాధానముగా చూపిన దృశ్యము, నాయింట బోర్ పంపునుండి నీరు తోడబడుతున్నది. అనేకమంది మంచినీరు బిందెలలో పట్టుకొనుచున్నారు.  అకస్మాత్ గా పంపుమోటర్ నుండి మంటలు చెలరేగి మోటారు ఆగిపోయినది.  నీటి ప్రవాహము ఆగిపోయినది. 


18.12.1995


నిన్నటిరోజు అంతా శ్రీసాయి నామస్మరణతో గడపినాను.  ఈవిధముగా జీవితము ఆఖరువరకు శ్రీసాయి నామస్మరణచేసుకొనే భాగ్యాన్ని ప్రసాదించమని రాత్రి నిద్రకు ముందు శ్రీసాయిని ప్రార్ధించినాను. శ్రీసాయి కలలో ప్రసాదించిన దృశ్యము.  "నాయింట నేను కష్ఠముతో బాధపడుతున్న సమయములో గుమ్మములో నిలబడిన ఒక ఫకీరు కనిపించినారు.  ఆయన నా నామస్మరణ చేయసాగినారు. నేను ఆశ్చర్యముతో వీధిలోనికి వచ్చి ఆయనపాదాలపై శిరస్సు ఉంచి ఆయన పాదాలకు పూజ చేసినాను.  ఆయనకు రెండు రూపాయల బిళ్ళలు దక్షిణగా యిచ్చినాను.  ఆయన నన్ను ఆశీర్వదించినారు."  


27.12.1995


నిన్నటి రాత్రి శ్రీసాయికి నమస్కరించి "భగవంతునికి భక్తునికి మధ్య ఉన్న సంబంధము తెలియచేయి తండ్రి అని వేడుకొన్నాను.  శ్రీసాయి కలలో ప్రసాదించిన దృశ్యము - "అప్పుడే పుట్టిన పసిబిడ్డ తన తల్లిని గుర్తించలేదు.  కాని ఆతల్లి ఆ పసిబిడ్డను తన రొమ్ములకు హత్తుకోగానే తల్లి గుండె చప్పుడును విని ఆ పసిబిడ్డ తను తల్లి గర్భములో యున్నపుడు అదే గుండె చప్పుడుతో నవమాసాలు బ్రతికినాను అనే భావనతో ప్రశాంతముగా తల్లిఒడిలో నిద్రించుతుంది.




 అదే విధముగా భవతంతుడు తన భక్తుల గుండెలలో భగవన్ నామస్మరణను విని భక్తుల గుండెలలో ప్రశాంతముగా నివసించుతాడు." ఆదృశ్యాన్ని చూసిన తర్వాత భగవంతుడు పసిబిడ్డ మనస్తత్వము కలవాడు.  భక్తుడు తల్లి మనస్తత్వము కలవాడు అని గుర్తించగలిగినాను.         


సాయి.బా.ని.స. డైరీ -    1995  సమాప్తము 


సర్వం శ్రీసాయినాధార్పణమస్తు  



సాయి.బా.ని.స. డైరీ - 1995 (25)

0 comments Posted by tyagaraju on 2:30 AM



28.04.2012  శనివారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి.బా.ని.స.  డైరీ -  1995  (25)

18.11.1995

నిన్నటిరోజున పరుల ధనము ఆశించినాను.  నిద్రకు ముందు నేను చేసిన పని తప్పు అని గ్రహించి, శ్రీసాయికి నమస్కరించి సాయినాధ పరుల ధనము మీద వ్యామోహము లేకుండ యుండేలాగ మార్గము చూపు తండ్రీ అని వేడుకొన్నాను. శ్రీ సాయి ఒక తోట కాపలావాని రూపములో దర్శనము ఇచ్చి ప్రసాదించిన సందేశము "నీవు కష్ఠపడి సంపాదించిన ధనము నీచింత చెట్టుమీదకు ఎక్కి పండిన చింతకాయలను కోసి వాటిని యెండపెట్టి ఆ చింత పండును మట్టికుండలలో దాచుకొని నీనిత్య అవసరాలకు కొంచము కొంచముగా వాడుకోవటమువంటిది.  మరి పరుల ధనమును ఆశించటము అంటే సీమ చింత చెట్టు ఎక్కి ఆచెట్టుకు ఉన్న ముళ్ళతో శరీరానికి బాధ కలిగించుకొని ఆరంగురంగుల సీమ చింతకాయలను తిని గొంతులో దగ్గు బాధను అనుభవించటము వంటిది.  అందుచేత పరుల సొమ్మును ఆశించి మానసిక బాధలు, శారీరక బాధలు పొందవద్దు.
  
 21.11.1995  నిన్నరాత్రి శ్రీసాయి ఒక వృధ్ధుని రూపములో దర్శనము యిచ్చి ప్రసాదించిన సందేశము "ప్రాపంచికము అనే బెల్లము నీదగ్గర యున్ననాడు స్నేహితులు, బంధువులు చీమల లాగ, ఈగలలాగ నీదరికి చేరుతారు.  అదే ఆధ్యాత్మికము అనే బెల్లము నీదగ్గర యున్ననాడు ఏస్నేహితుడు ఏ బంధువు నీదగ్గరకు చేరడు, కాని సమర్ధ సద్గురువు నీదగ్గర ఉన్నా ఆధ్యాత్మిక బెల్లమును చూసి నీదగ్గరకు వచ్చి తల్లిలాగ ప్రేమతో ఆబెల్లమును నీచేత తినిపించి నీకు మోక్షమును ప్రసాదించుతారు."  

(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

Wednesday, April 25, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (24)

0 comments Posted by tyagaraju on 8:05 PM


26.04.2012  గురువారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

గత 10 రోజులుగా ప్రచురించడానికి కొంత ఆలశ్యము జరిగింది.  బెంగళురునించి వచ్చిన తరువాత నెట్ సరిగా పనిచేయకపోవడం వల్ల ఆలశ్యం జరిగింది.  ఈ రోజు సాయి.బాని.స. డైరీ -  19995 చదువుకుందాము.

సాయి.బా.ని.స.  డైరీ -  1995  (24)

13.11.1995

నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి - "సాయినాధ గతములోని చేదు అనుభవాలను ఆచేదు అనుభవాల వెనుక యున్న మనుషులను మరచిపోవటానికి మార్గము చూపు తండ్రి" అని వేడుకొన్నాను.  శ్రీసాయి నా చిన్ననాటి స్నేహితుని రూపములో దర్శనము యిచ్చి నన్ను ఆశ్చర్యపరచినారు.  నిజానికి 40 సంవత్సరాల వెనుక మితృని నేను మరచిపోయినాను.  కాని, శ్రీసాయినాధునికి నా గత జీవితములోని నా చిన్ననాటి స్నేహితుని జ్ఞాపకము ఉంచుకొని ఆ స్నేహితుని రూపములో దర్శనము యివ్వటము సందేశమును ప్రసాదించటము అదృష్ఠముగా భావించినాను.  శ్రీసాయి యిచ్చిన సందేశము "గతాన్ని మర్చిపోవాలి అంటే గతములోని వ్యక్తులకు కొన్నాళ్ళపాటు దూరంగా యుంటు కొత్త వాతావరణములో జీవించటానికి అలవాటుపడాలి.  అపుడు కాలమే గతాన్ని గతములోని పరిచయాలను మరచిపోయేలాగ చేస్తుంది.; గతాన్ని తలచుకొంటు వర్తమానాన్ని పాడుచేసుకోవటములో అర్ధము లేదు" "గత జీవితములోని చెడు స్నేహాలు చేడు స్నేహితులు పేడకుప్ప మీద పురుగులువంటివారు.  వారిని నీవు మరచిపోక తప్పదు, లేనిచో వారు చెడు స్నేహాలు అనే పేడను చక్కగా బంతులుగా చేసి నీకు వినోదము కల్పించుతాము అని నీదగ్గరకు చేరి నీజీవితాన్ని నాశనము చేస్తారు.  అందుచేత అటువంటి స్నేహితులు నీదగ్గరకు వచ్చినపుడు వారిని దూరముగా నెట్టివేయి."    

14.11.1995

నిన్నరాత్రి కలలో శ్రీసాయి ఒక ముస్లిం వ్యక్త్రి రూపములో దర్శనము యిచ్చి తన విషయము యిలాగ చెప్పినారు.  "నాకు యిద్దరు కుమారులు - యిద్దరికి చెరొక గ్లాసు పాలు యిచ్చినాను.  ఒకడు ఆపాలుతో టీ పెట్టుకొని త్రాగినాడు. రెండవవాడు ఆపాలను కాచి, తోడుపెట్టి, పెరుగును చిలికి, వెన్నతీసి, ఆవెన్నను కాచి, స్వచ్చమైన నెయ్యిని తీసి, దానిని భుజించి  నేను యిచ్చిన పాలలోని పరమార్ధాన్ని గ్రహించినాడు.  ఆయిద్దరిలోని తేడా యేమిటి అంటే మొదటివాడు పరమార్ధాన్ని నేరుగా స్వీకరించినాడు.  రెండవవాడు పరమార్ధాన్ని అర్ధము చేసుకొని స్వీకరించినాడు"

(యింకా ఉంది)

సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List