Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, April 7, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (20)

0 comments Posted by tyagaraju on 9:01 PM



08.04.2012 ఆదివారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి.బా.ని.. డైరీ - 1995 (20)

01.08.1995

నిన్న రాత్రి కలలో శ్రీసాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి చెప్పిన నగ్న సత్యాలు.

"నీవు ధరించిన వస్త్రాలు, ఆభరణాలు నీశరీరానికి అందమును ప్రసాదించుతాయి. నీవు మరణించినపుడు నీశరీరానికి అంతిమ సంస్కారాలు నీవు ధరించిన వస్త్రాలు, ఆభరణాలు విలువతో జరగవు. నీజీవితములో నీవు సంపాదించిన నైతిక విలువలు బట్టి జరుగుతాయి అని గ్రహించు.

02.08.95

నిన్న రాత్రి కలలో శ్రీసాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి, ఋణానుబంధము గురించి చెప్పిన మాటలు.

1. నీకుమార్తెకు వివాహము చేసి ఆమె ఋణము తీర్చుకో.

2. నీకుమారునికి విద్యాబుధ్ధులు నేర్పి అతని ఋణము తీర్చుకో.

3. నీభార్యకు శారీరకముగాను, మానసికముగాను సహాయము చేయుచు ఆమె ఋణము తీర్చుకో.

4. తల్లితండ్రుల మరణానంతరము వారికి సవ్యముగా అంతిమ సంస్కారాలు చేసి వారి ఋణము తీర్చుకో.

5. నీవు జీవితములో మంచి పనులు చేసి నీగురువు ఋణము తీర్చుకో.

09.08.1995

నిన్నటి రాత్రి శ్రీ సాయికి నమస్కరించి నామనసులో ఎప్పటినుండో ఉన్న సందేహాన్ని ఈవిధముగా తెలియపర్చుకొన్నాను. "సాయినాధ - మనిషి మరణించిన తర్వాత పునర్జన్మ ఎత్తుతాడు కదా మరి అతనికి ప్రతిసంవత్సరము ఆబ్ధికము నిర్వహించటము ఎందుకు?" నాప్రశ్నకు శ్రీ సాయి అజ్ఞాతవ్యక్తి రూపములో దర్శనము యిచ్చి ప్రసాదించిన సమాధానము. మానవుడు మరణించిన తర్వాత పునర్జన్మ ఎత్తటము నిజము. మానవ జన్మ ఎత్తిన తర్వాత మనిషి తన వంశము పురోభివృధ్ధిలో మూడు తరాలను మాత్రమే చూడగలడు. అంటే కుమారుడు, మనవడు, మునిమనవడులను చూడగలడు. మూడు తరాలను చూసిన వ్యక్తి మరణించిన అతని ఆత్మ మాత్రము మూడు తరాల తనవారి మీద ఉన్న మమకారాన్ని వదలలేదు. ఆవ్యక్తి మరణించిన అతని ఆత్మ తన వంశములోనివారు సంవత్సరానికి ఒకసారి అయిన తనను ఆహ్వానించి తనకు ఆబ్ధికము జరపగలరని నమ్ముతాడు. ఆత్మకు నమ్మకాన్ని కాపాడటము ఆవంశములోనివారి ధర్మము. ఈధర్మాన్ని కాపాడి మన పూర్వీకుల ఆశీర్వచనాలను పొందగలగటము మన అదృష్ఠము. మనము జీవితములో ఒక్కసారి పనసపండును తిన్న చాలు ఆసువాసనను ఎన్నటికీ మర్చిపోలేము.

అదే విధముగా తనవంశము అభివృధ్ధిని చూసిన వ్యక్తి మరణించిన అతని ఆత్మ తనవారిని ఎన్నటికి మరవలేదు. అందుచేత మన పూర్వీకులకు సంవత్సరానికి ఒక్కసారి ఆబ్ధికము నిర్వహించి వారిని గౌరవించి వారి ఆశీర్వచనాలు పొందవలెను.

(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు


Thursday, April 5, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (19)

0 comments Posted by tyagaraju on 6:41 PM


06.04.2012 శుక్రవారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

గత వారం రోజులుగా ప్రచురణకు కొంత ఆలశ్యం జరుగుతూ ఉంది. నెట్ కనెక్షన్ సరిగా లేకపోవడం వల్ల సాధ్యం కావడంలేదు.

ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1995 19 వ.భాగాన్ని చదువుకుందాము.

సాయి.బా.ని.. డైరీ - 1995 (19)

నిన్న రాత్రి శ్రీసాయికి నమస్కరించి ఆధ్యాత్మిక సందేశము ప్రసాదించమని వేడుకొన్నాను. శ్రీసాయి కలలో చూపిన దృశ్యముయొక్క సారాంశము. మనము తోటలోనికి వెళ్ళి పూలు కోస్తాము.

ఆపూలచెట్టుకు తెలియదు తన చెట్టు పూలు భగవంతుని పాదాల చెంతకు చేరుతాయా లేక మరేదైన కార్యక్రమాలకు ఉపయోగపడతాయా?

కాని భగవంతుడు అనే పూల చెట్ట్లుకు పూచిన సాయి అనే పుష్పాలను నీవు కోసినపుడు భగవంతుడు నీవు కోసిన "సాయి" అనే పుష్పముతో నీజీవితాన్ని నీవు బాగు చేసుకొంటున్నావా లేదా అని నిన్ను అనుక్షణము చూస్తూ ఉంటాడు.

26.07.1995

నిన్న రాత్రి శ్రీసాయికి నమస్కరించి "సాయినాధ సంసారము చేస్తూ ఆధ్యాత్మిక రంగములో ముందుకు సాగిపోవటానికి సలహాలు, సూచనలు యివ్వమని కోరినాను. రాత్రి కలలో శ్రీసాయి చూపిన దృశ్యాల సారాంశము.

1. ప్రాపంచిక రంగములో నీవు మొదట భోజనము చేసినపుడు నీలో నేను నాది అనే భావన విపరీతముగా పెరిగిపోతుంది. అందుచేత నీవు భోజనము చేసేముందు నీప్రక్కవాడికి ముందుగా భోజనము పెట్టి తర్వాత నీవు భోజనము చేయి.

2. ఆధ్యాత్మిక రంగములో నీవు మొదట భోజనము చేసినపుడు నీలో నేను నాది అనే భావన తొలగిపోయి యిది అంత భగవంతునిది అనే భావన కలుగుతుంది. అందుచేత ఆధ్యాత్మిక రంగములో నీవు ముందు భోజనము చేసి ఆభొజనమును జీర్ణించుకొనిన తర్వాతనే ఆధ్యాత్మిక భోజనముమును నీప్రక్కవాడికి పెట్టాలి.

27.07.1995

నిన్న రాత్రి శ్రీసాయికి నమస్కరించి భగవంతుని అనుగ్రహాన్ని నాజీవితములో ప్రసాదించమని వేడుకొన్నాను. శ్రీసాయి ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూపించినారు. దాని సారాంశము. జీవితము అనే వస్త్రానికి కష్ఠాలు అనే మురికి అంటుకొన్నపుడు శ్రీసాయి అనే మంచి డిటర్జెంటు సబ్బుబిళ్ళ వాడు. అపుడు నీజీవితము అనే వస్త్రము స్వచ్చమైన పితికిన పాలరంగులో ఉంటుంది. నేను కలలో బట్టలు ఉతుకుతు నిద్రనుండి లేచినాను. శ్రీసాయికి నమస్కరించి సదా భగవంతుని అనుగ్రహాన్ని ప్రసాదించమని వేడుకొన్నాను.

27.09.1995

నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి, భగవంతుని గురించి తెలియచేయమని కోరినాను. శ్రీసాయి రాత్రి కలలో చూపిన దృశ్యాల సారాంశము. "భగవంతునికి నాగురించి, నాగతము గురించి, నావర్తమానము గురించి, నాభవిష్యత్ గురించి అన్నీ తెలుసును. ఆయన నంతుడు. శక్తిమంతుడు.

అటువంటి భగవంతుని గురించి తెలుసుకోవటము నాకు సాధ్యము కాదు అని గ్రహించినాను. యిక మీదట నేను భగవంతుని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించను. భగవంతుడు ఉన్నాడు - భగవంతునికి నాగురించి అన్నీ తెలుసును. భగవంతుడు అనుక్షణము నన్ను కాపాడును. నన్ను నాగమ్యానికి చేర్చును అని నమ్ముతున్నాను.

(యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

Monday, April 2, 2012

స్నానాల గదిలో సత్ చరిత్ర పారాయణ

0 comments Posted by tyagaraju on 1:38 AM


స్నానాల గదిలో సత్ చరిత్ర పారాయణ

సాయి కీ బేటీ - సాయి లీల



ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు శ్రీమతి ప్రియాంకా రౌతేలా గారి ఆంగ్ల బ్లాగులోని ఒక సాయిభక్తురాలి బాబా అనుభవాన్ని పంచుకుందాము. ఈ లీల మార్చ్ 2వ. తేదీన ప్రచురితమైంది. దానిని ఈ రోజు మీముందు ఉంచుతున్నాను. తన పేరును వెల్లడించవద్దని ఆమె కోరినందువల్ల ఆమెను "సాయి కీ బేటీ" అని ఆమె కోరిక ప్రకారం సంబొధించడం జరిగింది. ఈ లీల చదివితె మనకి బాబామీద శ్రధ్ధ ఉండాలనీ, అపరిమితమైన నమ్మకం ఉండాలని తెలియచేస్తుంది. సరియైన స్థలంలో సత్ చరిత్ర పారాయణకు మనకు అవకాశం లేనప్పుడు ఎక్కడ చదివినా గాని మనసులో గాఢమైన శ్రధ్ధ ఉంటే చాలు అని కూడా మనకి తెలియచెస్తుంది. యిక చదవండి.

శ్రీమతి ప్రియాంకా గారు ప్రచురించిన విధం గానే అనువాదం చేస్తున్నాను.

***

పాఠకులందరికీ సాయిరాం

ఇన్నిరోజులుగా ప్రియాంకా సాయి లీలలను ఎందుకు ప్రచురించడం లేదు, ఏమయింది ప్రియాంకా గారికి అని మీరందరూ అనుకుటున్నారని నాకు తెలుసు. గత రెండునెలలు నేను చాలా తీవ్రమైన జ్వరంతో బాధపడ్డాను. మేము కొత్త యింటిని కొనుక్కున్నాము. దాని పేరు "సాయి శరణ్". తరువాత మేము పూనా, ముంబాయిల మీదుగా షిరిడీ వెళ్ళాము. తిరుగు ప్రయాణంలో నేను పిజా తిన్నాను. అది కొంచెం కలుషితమయి ఉండి ఉంటుంది.. దాని వల్ల నేను 15 20 రోజులు అస్వస్థతకు గురయ్యాను. తరువాత మా అమ్మాయికి వార్షిక పరీక్షలు, తరువాత నా తల్లితండ్రులు 2 సంవత్సరాల తరువాత అమెరికా నుంచి రావడం, దీని వల్ల నేను ప్రతీ రోజు, ప్రతీ క్షణం వారితో గడిపాను.

నా షిరిడీ యాత్రా విశేషాలని, నేను తిరిగి వచ్చినవెంటనే ప్రచురిస్తానని నేనిచ్చిన మాటని మర్చిపోయాననుకోకండి. కాని నాకు దానికి కొంత సమయం కావాలి. నిజానికి ఈ రెండు నెలలలో చాలా సంఘటనలు జరిగాయి అవన్ని కూడా సాధ్యమైనంత తొందరలోనే మీకు వివరిస్తాను. ఆయన లీలలను తొందరలోనే పూర్తి చేయించేలా చేయమని దానికి తగిన సమయాన్నీ, శక్తినీ ఇమ్మని బాబాని ప్రార్ధిస్తున్నాను. ఇక చెప్పబోయేముందు మేము కొత్తగా కొనుక్కున్న యింటి పేరు ఉన్న నేం ప్లేట్ ను ఇక్కడ పొందుపరుస్తున్నాను. మాయింటికి సంబంధించిన మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మాయింటి సంఖ్య 108. దానిని కూడగా వచ్చే సంఖ్య 1 + 0 + 8 = 9 బాబా సంఖ్య. క్రింద ఈ చిత్రాన్ని చూడండి.

ఇక అసలు విషయానికొస్తే ఈ రోజు "సాయికీ బేటీ" పంపించిన అనుభవాన్ని ప్రచురిస్తున్నాను. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆమె తన పేరుని ప్రచురించడానికి అంగీకరించనందు వల్ల, ఆమెను "సాయికీ బేటీ" అనే సంబొధిస్తాను. ఆమె నాకు గత కొన్ని నెలలుగా తెలుసు. ఆమె తన జీవితంలో ఎన్నో కఠినతరమైన కష్ఠాలనెదుర్కొంటున్న సమయంలో నన్ను, ఫోన్ లోనూ, మైల్స్ ద్వారానూ సంప్రదిస్తూ ఉండేది. కొన్ని రోజులుగా తను నాతో మాట్లాడలేదు. ఆమె వైవాహిక జీవితం లో ఏమిజరిగిందోననని నాకు చాలా ఆందోళనగా ఉంది. కాని నా ప్రార్ధనలలో నాకామె గుర్తుకొస్తూ ఉండేది.

రెండు రోజుల క్రితం నాకామె నుంచి ఈ మైల్ వచ్చినప్పుడు నాకళ్ళలోనుంచి ఆనంద భాష్పాలు వచ్చాయి . బాబా ఆమె మీద కురిపించిన అనుగ్రహపు జల్లులకు బాబాకి కృతజ్ఞతలు తెలుపుకొన్నాను. యదార్ధమైన ఈ సాయి లీలను చదివిన తరువాత, మంత్ర తంత్రాలు ఏమీ లేకుండా నిర్మలమైన మనసుతో బాబాని పూజిస్తే, ఆయన శక్తి ఎటువంటిదో మీకు కూడా అవగతమౌతుందని నాకు బాగా తెలుసు.

*****************

ప్రియమైన ప్రియాంకా,

నేను నీకు గుర్తుండే ఉంటాననుకుంటున్నాను. అతి దుర్భరమైన పరిస్తితులలో నేను నిరాశలో ఉన్నప్పుడు నీతో ఫోన్ లో మాట్లాడుతూ ఉండేదానిని. ఆమెనే నేను. అటువంటి సమయంలో నువ్వునాకు ఎంతో ధైర్యాన్నిచ్చావు. నీకెంతో కృతజ్ఞురాలిని. ఇవి కేవలం మాటలు మాత్రమే కాదు. నేను బాధలనుభవించిన రోజులలో నా పెద్ద సోదరిలాగా ఉండి నన్నాదుకుని నా వైవాహిక జీవితాన్ని రక్షించినందుకు , బాబా మీద నమ్మకం ఎలా ఉంచుకోవాలో తెలియ చేసినందుకు, నువ్వే కనక నాముందుంటే లేక నేనే కనక భారతదేశంలో ఉండి ఉంటే నేను నీవద్దకు వెంటనే పరిగెత్తుకుని వచ్చి నీకు కృతజ్ఞతలు చెప్పుకునేదానిని.

ప్రియాంకా, మీ పాఠకులందరితోనూ నా ఈ అనుభవాన్ని పంచుకుందామనుకుంటున్నాను. అటువంటి లీలను చదివినప్పుడు జీవితంలో ఆశతో ఎలా బ్రతకాలో తెలుస్తుంది. దయచేసి పాఠకులెవరికీ నా పేరునుగాని, మైల్ ఐ.డీ.ని గాని వెల్లడించవద్దు. నన్ను "సాయి కీ బేటీ" (సాయి కుమార్తె) అని పిలు. వాస్తవంగా చెప్పలంటే నాలుగు సంవత్సరాలుగా నేను నాతల్లి తండ్రులతో మాట్లాడలేదు, వారిని చూడలేదు. ఆ సమయంలో బాబాయే నాతండ్రి. కొన్ని కొన్ని సమయాలలో ఆయనే నా తల్లిగా నన్నాదుకుని నా కన్నీటిని తుడిచారు. ఆరతిలో చాలా చక్కగా సరిగా చెప్పారు, "ఆప్ మజే ఆయీ, ఆప్ మాజె బాబా" అని. నా అనుభవాన్ని నా మనసులోకి వచ్చిన మాటలతో రాస్తున్నాను. దానిని నువ్వు అవసరమైన చోట సవరించు.

మహారాష్ట్రలోని ఒక చిన్న పట్టణంలో మధ్యతరగతి కుటుంబం మాది. బయటి ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి సమస్యలు ఎదురుకాకుండా, నా తల్లితండ్రులు నాకు చదువుకి, తరువాత ఒక ఆడపిల్లగా యింటి బాధ్యతలు ఎలా నిర్వహించాలో దానికి ఎంతో ప్రాముఖ్యాన్నిచ్చారు. నాకు వివాహమైన తరువాత అమెరికాకి వచ్చాను. అప్పటినుండే నాకు కష్టాలు మొదలయ్యాయి. . నా భర్త 15 సంవత్సరాలుగా అమెరికాలోనే ఉన్నారు. తను చిన్నతనంలోనే అమెరికా వచ్చారు. జీవితంలో కొన్ని కొన్ని విషయాల్లో ఆయన నమ్మకాలు చాలా బలీయంగా ఉండేవి. ఆయన తల్లి తండ్రులు తనని చాలా క్రమశిక్షణతో పెంచారు. చిన్న చిన్న తప్పులకి కూడా తనని కొడుతూ ఉండేవారు. అందుచేత అదే సరైనపధ్ధతి అనే భావంలో ఉండిపోయారాయన. వారి కుటుంబాలలో ఈరోజుకీ ఆడదానికి ఏవిధమైన గౌరవం లేదు. కోడళ్ళని చాలా పనికిమాలినవాళ్ళలాగా చూసేవారు. అందరూ ఇప్పటికీ కూడా పూర్వకాలపు పధ్ధతులనే ఆచరిస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. వివాహం అయినతరువాత నేను నా అత్తమామలతో సుమారు సంవత్సరం ఉన్నాను. అప్పటినుండే నాకు కష్టాలు మొదలయ్యాయి. నా అత్తగారు నా భర్తకి నన్ను మరొక విధంగా చిత్రీకరించి చెప్పింది. నేను పని తొందరగా చెయ్యననీ, చాలా నెమ్మదిగా చేస్తానని, నేను సోమరిననీ యింకా చాలా చాలా చెప్పింది. యిటువంటి చిత్రీకరణతో నేను అమెరికాకి వచ్చాను. ఒక వారం వరకూ బాగానే ఉంది. అనేక విషయాలలో మాయిద్దరిమధ్య గొడవలూ, యుధ్ధాలు జరగడం ప్రారంభమయింది. భారత దేశంలో ఉన్న నాతల్లితండ్రులకి, నేను సోమరిననీ, పని చాలా నెమ్మదిగా చేస్తాననీ యిలా నేరాలు చెబుతూ ఉండేవారు. నాకు కొంత సమయం ఇవ్వమని నా తల్లి తండ్రులు సమాధానం చెపుతూ ఉండేవారు. కాని పరిస్తుతులన్నీ క్లిష్ట దశనుండి అతి క్లిష్టదశకి చేరుకున్నాయి. ఆయన నా తల్లితండ్రులతో దెబ్బలాడుతూ వారిని దూషిస్తూ ఉండేవారు. నా అత్త మామలు కూడా నా భర్త పక్షమే వహించి, తప్పంతా నాదేనన్నట్లుగా మాట్లాడేవారు. అందుచేత నేను వారితో చెప్పడం, మాట్లాడటం మానేశాను.

ఈక్రమంలో రెసిషన్ వచ్చి నాభర్త ఉద్యోగం పోయింది. ఉద్యోగం లేకుండా ఒక సంవత్సరంపాటు యింట్లోనే ఉన్నారు. ప్రతీ చిన్న విషయానికీ కూడా నాతో దెబ్బలాడుతూ నామీద నేరారోపణ చేస్తూ ఉండేవారు. అయ్యో! పనిచేసి అలసిపోయి వచ్చింది తనకీ కొంత విశ్రాంతికావాలి అని కూడా ఆలోచించేవారు కాదు కనీసంగానైనా. పరిస్థితులు బాగా ముదిరిపోయి ఒకరోజు ఆయన నా తల్లితండ్రులతో దెబ్బలాడి, నాకు నా తల్లితండ్రులు కావాలో లేక భర్త కావాలో తేల్చుకోమన్నారు. లేకపోతే విడాకులు ఇచ్చేస్తామన్నారు. ఆరోజు నాహృదయం బాగా గాయపడింది. ఏంచేయాలో తోచలేదు. ఆయనని ఒప్పించడానికి ప్రయత్నం చేశాను కాని వినలేదు.

ఒక అర్ధమంటులేకుండా జీవితాన్ని గడిపాను. ఒకరోజున భగవంతుడికి నాబాధలు చెప్పుకుని ఏడిచాను. నీ వెబ్ సైట్ చూసి అందులో బాబాలీలలను చదివిన తరువాత నీతో ఫోన్ లో మాట్లాడాను. ఆవిధంగా నాకు బాబా గురించి తెలిసింది. నేనాయనను ప్రార్ధించడం మొదలుపెట్టాను. పరిస్తితులు కొంత చక్కబడటం మొదలయింది. మాయిద్దరి మధ్య కూడా సాన్నిహిత్యం కొంత మంచిగానే ఉండటం ప్రారంభమయింది. నేను గురువార వ్రతం చేశాక ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఈలోపులో మా బడ్జెట్ కు తగ్గట్లుగా యింటికోసం వెతుకుతున్నాము. నువ్వు నమ్మవు, అమెరికా లాంటి దేశంలో, నాభర్తకు సంవత్సరంపాటు ఉద్యోగం లేకపోయినా,నేను కారు, యిల్లు కొనుక్కున్నాను.అప్పుచేయకుండా ఇవి ఎలా సంపాదించానో నాకే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మేము దాచుకున్నదానితోనే ఇవన్ని కొనగలిగాము. నాపనితనానికి ఆయన చాలా సంతోషించారు. పరిస్థితులు కొంచెం చక్క బడటం మొదలైంది. కాని నన్ను నాతల్లితండ్రులతో మాట్లాడనిచ్చేవారు కాదు.

ప్రతీవారం ఆయన తన తల్లితండ్రులతో మాట్లాడుతూ ఉండేవారు. నాకళ్ళల్లోంచి కన్నీరు వస్తూఉండేది. నేను బాబావంక చూస్తూ ఉండేదాన్ని. నాకు నాతల్లితండ్రులు గుర్తుకు వచ్చిన ప్రతీసారి, నేను ప్రసాదం తయారు చేసి బాబాకి నివేదన చేస్తూ ఉండేదానిని. నాభర్త అంత భక్తిపరుడు కాదు. నేనెక్కువ సమయం పూజలో ఉండటం ఆయనకిష్టముండేది కాదు. కాని నేను సత్ చరిత్ర పారాయణ చేద్దామని ప్రారంభించాను. కాని ఒకరోజున నాభర్తకి చాలా కోపం వచ్చి పారాయణను ఆపుచేయమన్నారు. నువ్వు నమ్మవు గానీ ప్రియాంకా, నేను స్నానాలగదిలోకి వెళ్ళి అక్కడ చదివి, బాబాని ఆమోదించమని వేడుకొన్నాను. "స్వచ్చమైన భక్తినే నేను నమ్ముతాను" అన్నమాటలు సత్యమని నేను నమ్ముతున్నాను. నేనాయనకు పుష్పాలను సమర్పించలేదు. ధూపం వేయలేదు, అగరువత్తులను వెలిగించలేదు. నీచ స్థానమైన స్నానాల గదిలో నేను సత్ చరిత్రను పారాయణ చేశాను.

మాచెల్లెలికి వివాహం నిశ్చయమయింది. నేను భారతదేశానికి వెడదామనుకున్నను. కాని నా భర్త నన్నుపంపడానికి ఒప్పుకోలేదు. నాతల్లితండ్రులు ఫోన్ చేసినప్పుడు ఆయన అమర్యాదకరంగా ప్రవర్తించారు.

నేనెంతో రోదించాను. సహాయంకోసం బాబాని ప్రార్ధించాను. నేను నీకు మైల్ చేసి నీతో మాట్లాడాను. పూర్తిగా భారమంతా బాబామీదే పెట్టమని నాకు చెప్పావు. నాలో శ్రధ్ధ సహనం లోపించాయి, యెందుకంటే ఇన్ని సంవత్సరాలుగా జరగనిది ఇప్పుడెలా జరుగుతుందనుకున్నాను. పరిస్థిలన్నీ చక్కబడి ఏదైనా అద్భుతం జరిగితే కనక షిరిడీ వస్తానని బాబాకి చెప్పుకున్నాను అంతే. నా భర్త తల్లితండ్రులు ఫోన్ చేసి నన్ను పెళ్ళికి పంపమనీ, లేకపోతె పెళ్ళివారి కుటుంబంలో కూడా మాట వస్తుందని చెప్పారు. తను ముందర ఒప్పుకోలేదుగానీ, తరువాత ఏమి జరిగిందో తెలీదు, నా తల్లి తండ్రులతో మాట్లాడి మాచెల్లెలి పెళ్ళికి నన్ను పంపడానికి ఒప్పుకున్నారు.

విమానాశ్రయంలోనాతల్లితండ్రులను నాలుగు సంవత్సరాల తరువాత చూసి నేనెంత సంతోషించానో నాకే తెలీదు. నేనొక విషయం మాత్రం చెప్పగలను. తను లేకపోయినా నా ఎముకలు మాట్లాడతాయి అని బాబా తన భక్తులకిచ్చిన మాట యదార్ధం. నాజీవితంలో ఆయన ఉనికిని అనుభవించాను. నేను నా చెల్లెలి పెళ్ళికి వెళ్ళాలి అని అడిగాను అంతే. కాని బాబా నా భర్తనుకూడా వివాహానికి వచ్చేలా చేశారు. అక్కడాయన అందరితోనూ చాలా మర్యాదగా ప్రవర్తించారు.

బాబాకి ధన్యవాదాలు తెలుపుకుందుకు షిరిడీ వెళ్ళాను. నా చెల్లెలి పెళ్ళిలో నేను కొత్త బట్టలు ధరించాను. బాబాకి కూడా క్రొత్త బట్టలు పెడదామని, బట్టలు ఏరంగువి కావాలో బాబా నిర్ణయానికే వదిలేశాను. నేను పెళ్ళిలో ఏరంగు బట్టలు వేసుకున్నానో అదేరంగు, ఆకుపచ్చ బట్టలు షాపతను యిచ్చేటప్పటికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది.

ప్రియంకా !, 4 సంవత్సరాల తరువాత నాకింతటి దివ్యమైన సమయాన్ని బాబా నాకు కల్పించినందుకు నా కళ్ళల్లోంచి కన్నీరు వస్తోంది. బాబా మహరాజును మధ్యాహ్న్న ఆరతికి తయారు చేస్తున్నపుడు ఆయన నావైపు చిరునవ్వుతో చూస్తూ, నారాక కోసం ఎదురు చూస్తున్నట్లనిపించింది.

నేను నాతో,నాతోటి సాయి భక్తులందరి కోరికలను తీసుకుని వెళ్ళాను. అవన్నీ కూడా బాబా వారికి సమర్పించాను. ఫలితంగా నాకు శాలువా, బాబాకు సమర్పించబడ్డ హల్వా,ప్రసాదంగా లభించాయి..

నేనిప్పుడు చాలా ఆశాజనకంగా ఉన్నానని చెప్పగలను ఆయన నాప్రార్ధనలను వింటున్నారు. నావైవాహిక జీవితం బాగా కాకాపోయినా కాస్త మెరుగయింది. బాబా నాకు మంచిరోజులు యిస్తారని ఆయననే నమ్ముకున్నాను.

సాయి భక్తు.లెవరికీ సలహా యిచ్చేటంతటి పెద్దదానిని కాదు. నా అనుభవాన్ని మీ అందరితోనూ పంచుకుంటూ బాబా మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని ఉంచమని చెప్పగలను. మనం ఆయనను వదలినా ఆయన మనలను వదలరు. తన భక్తులందరికీ ఆయనే తల్లి, తండ్రి. రెసెషన్ సమయంలో నాకు ఉద్యోగాన్నిచ్చారు. నాకు అనుభవం లేకపోయినా అది కూడా మంచికంపనీలో ఇచ్చారు. కష్ఠ కాలం సమయంలో నేను డబ్బుకిబ్బంది పడలేదు.


సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List