Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, January 28, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (16)

0 comments Posted by tyagaraju on 6:51 AM

28.01.2012 శనివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1994 16 వ. భాగాన్ని చదువుకుందాము

సాయి.బా.ని.స. డైరీ - 1994 (16)


15.05.1994

నిన్న రాత్రి కలలో శ్రీ సాయిని నా నిజ స్థితిని చూపించమని వేడుకొన్నాను. శ్రీ సాయి విచిత్రమైన సంఘటనలను చూపించినారు. వాటి వివరాలు. "అది ఒక వివాహ వేదిక. మగ పెళ్ళివారు అట్టహాసముతో ఊరేగింపుగా వివాహ బేదిక దగ్గరకు వచ్చి తమకు యివ్వవలసిన కట్నమును యివ్వమని ఆడ పెళ్ళివారిని కోరినారు.

ఆడపిల్ల తండ్రి కట్నమును దాచిన ట్రంకు పెట్టి నాదగ్గర భద్రపరచి యుంచినారు. ఆడపిల్ల తండ్రి కట్నము డబ్బు కోసము నా దగ్గరకు వచ్చి పెట్టిలోనుండి ధనము తీసు యివ్వమని కోరినారు. నేను తాళము కప్పను తాళము చెవితో తెరచి పెట్టె మూత తీసినాను. పెండ్లి కుమార్తె తండ్రికి పెండ్లి పనులలో సహాయము చేయాలని తలంపుతో డబ్బు గల పెట్టెను నా దగ్గర ఉంచుకొన్నాను. పెట్టె మూత తెరవగానే అందులో డబ్బు కనిపించలేదు. వివాహ వేదిక దగ్గర ఉన్న పెళ్ళి పెద్దలు అందరు నన్ను దొంగగా భావించినారు. పెట్టెలోని కట్నము ధనము దొంగిలించబడినది అని తెలియగానే పెండ్లి కుమార్తె తండ్రి కిరసనాయలను తన వంటి మీద పోసుకొని అంటించుకొని ఆత్మహత్యకు సిధ్ధపడినారు. పెండ్లి కుమర్తె తండ్రి ఆత్మహత్యకు నేను బాధ్యుడిని అనే ఉద్దేశముతో నేను కూడ మంటలోనికి దూకినాను. యింతలో ధనమును దొంగిలించిన వ్యక్తి అక్కడకు వచ్చి నవ్వసాగినారు. నేను మరియు పెండ్లి కుమార్తె తండ్రి అసలు దొంగను గుర్తించి, యిద్దరము కలసి అసలు దొంగను కౌగలించుకొంటాము. అసలు దొంగ కూడా మంటలలొ చిక్కుకొన్నాడు." నేను భయముతో నిద్రనుండి లేచి విధమైన కలకు అర్థము ఏమిటి అని ఆలోచించసాగినాను.

18.05.1994

నిన్నటిరోజున కొంతమంది స్వాములము అని చెప్పి శ్రీ సాయి పేరిట డబ్బు వసూలు చేసి తమ పబ్బము గడుపుకొంటున్న సంఘటనలు తెలిసినవి. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి, "సాయినాధ నీపేరిట డబ్బు వసూలు చేసి స్వాహా చేసే స్వాములవారి సంగతి ఏమిటి? వారిపై నీ ఉద్దేశము ఏమిటి తెలియచేయి తండ్రీ అని వేడుకొన్నాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి చెప్పిన మాటలు "తోడబుట్టిన అక్క, చెల్లెలు మీద ప్రేమ కూడ లేకుండ వాళ్ళ సొమ్మును స్వాహా చేసే పెద్ద మనుషులు ఉన్న సమాజములో నా పేరిట డబ్బు వసూలు చేసి స్వాహా చేయడము పెద్ద విశేషము కాదు. నా పేరిట గారడీ విద్యలు చేసి చూపించి తమ పొట్ట నింపుకొనే స్వాములవారి దగ్గరకు వెళ్ళటము నీ తప్పు. అంతే గాని స్వాములవారి తప్పు మాత్రము కాదు అని గ్రహించు.

23.05.1994

నిన్నటి రోజున కొంతమంది సాయి భక్తులు నా యింటికి వచ్చినారు. వారు శ్రీ సాయి గురించి చాలా ప్రశ్నలు వేసినారు. నేను నాకు తెలిసిన విషయాలు వారికి చెప్పినాను రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి, శ్రీ సాయి తత్వ ప్రచారములో నేను అనుసరించవలసిన పధ్ధతిని తెలియచేయమని వేడుకొన్నాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అంటారు. "యితరుల జ్ఞాన నేత్రము తెరిపించాలి అనే ప్రయత్నము మంచిదే కాని ముందు నీవు నీ నేత్రాలతో మంచిని చూస్తూ నీ జ్ఞాన నేత్రమును తెరచిన తర్వాతనే యితరుల జ్ఞాన నేత్రము గురించి ఆలోచించు". శ్రీ సాయి యింకొక కలలో చూపిన దృశ్యము వివరాలు. అది ఒక గ్లాసులు తయారు చేసే దుకాణము.

దుకాణము యజమాని ఒక ముసల్మాన్. నేను దుకాణములో అల్యూమినియం రేకులతో అల్యూమినియం గ్లాసులు తయారు చేసి వాటిలో నీరు నింపి దారిని పోయే బాటసారులకు దాహము తీర్చుతున్నాను. కాని నేను తయారు చేసే గ్లాసులకు రంధ్రాలు యుండటము చేత నేను పోసిన నీరు కారిపోయి వృధా అగుతున్నది. అపుడు దుకాణదారుడు (శ్రీ సాయి) నన్ను దగ్గరకు పిలచి "నీవు నాదగ్గర గ్లాసుల తయారీ అనేక జన్మలనుండి చేస్తున్నా పనితనము సరిగా నేర్చుకోలేదు. అందుచేత జన్మలో గ్లాసుల తయారీ పనిని మంచిగా నేర్చుకొని గ్లాసులు తయారు చేసి బాటసారుల దాహము తీర్చటానికి అందులో నీరు నింపి వారికి ఈయి." విధమైన సూచనకు నాకు తెలివి వచ్చినది. ముందుగా నేను శ్రీ సాయి తత్వము బాగా నేర్చుకొని యితరులకు తర్వాతనే చెప్పాలి అని నిశ్చయించుకొన్నాను.

26.05.1994

నిన్నటిరోజున శ్రీ సాయి గురించి ఆలోచించుతూ శిరిడీకి అనేక భాషల ప్రజలు వచ్చి శ్రీ సాయి దర్శనము చేసుకొంటున్నారు.

మరి శ్రీ సాయికి అన్ని భాషలు తెలుసునా అనే చిత్రమైన ప్రశ్నతో రాత్రి నిద్రపోయినాను. కలలో ఏవిధమైన దృశ్యము కనిపించలేదు. కాని ఒక శ్రావ్యమైన కంఠముతో నాకు వినిపించిన మాటలు "నీవు భాషలోనైనా మాట్లాడు, నీ భావాలను నేను అర్ధము చేసుకోగలను. వెంటనే నేను నీ దరికి చేరుతాను." వెంటనే తెలివి వచ్చినది. ఎవరో నా ప్రక్కనే నిలబడి నాతో మాట్లాడిన అనుభూతిని పొందినాను. అనుభూతిలో శ్రీ సాయిని గుర్తించగలగినాను.


(యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

Friday, January 27, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (15)

0 comments Posted by tyagaraju on 7:18 AM

27.01.2012 శుక్రవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఈ రోజు సాయి బా ని స డైరీ - 1994 15 వ. భాగాన్ని చదువుకుందాము

సాయి.బా.ని.స. డైరీ - 1994 (15)

01.05.1994

నిన్నటిరోజున ఆఫీసులో జరిగిన సభలో నన్ను ఎవరు గుర్తించలేదు అనే బాధతో యింటికి వచ్చి చాలా ఆలోచించినాను. శ్రీ సాయి బా.ని.. గా మారిన తర్వాత కూడా గుర్తింపు అనే వ్యామోహముని వదలించుకోలేకపోతున్నానే - వ్యామోహము వదిలించుకొనే మార్గము చూపించమని శ్రీ సాయినాదుని వేడుకొని నిద్రపోయినాను. శ్రీ సాయి అజ్ఞత వ్యక్తి రూపములో కలలో దర్శనము యిచ్చి అంటారు. "తిండికి లేక ధన సంపాదన కోసము కొండజాతి కోయవాడు అందరి చేతులు చూస్తూ వాళ్ళకు జాతకాలు చెబుతూ వాళ్ళతో ఫొటోలు తీసుకొని మళ్ళీ ఆఫొటోలు యితరులకు చూపి వాళ్ళ జాతకాలు చెబుతూ ధన సంపాదన చేసుకొంటాడు. గుర్తింపు అనేది తిండి తిప్పలు లేనివాడికి, వాడి ప్రాపకము వీడి ప్రాపకము గురించి ప్రాకులాడేవాడికి కావాలి. నా భక్తులకు బాధ లేదు. నా భక్తుల యింట లేమి అనే శబ్దమురాదు - అన్న వస్త్రాలకు లోటు యుండదు. యింక నా భక్తుని గుర్తింపు అనే వ్యామోహము ఎక్కడిది." నిద్రనుండి తెలివచచ్చినది. లేచి శ్రీ సాయినాధునికి కృతజ్ఞతలు చెప్పుకొన్నాను.

05.05.1994

నిన్నరాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి సాయి తత్వము గురించి చెప్పమని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యాలు ద్వారా గ్రహించిన సందేశము.

1) శ్రీ సాయి దయ అనే గాలి ఎన్నివంకరలు ఉన్న గొట్టాలు ద్వారా అయినా పయనిస్తూ ఆఖరికి సాయి భక్తుని దగ్గరకు చేరుకొంటుంది.

2) సర్వ జీవాలలో సర్వ దేవతా స్వరూపుడు శ్రీ సాయి ఉన్నారు. ఏనుగులో శ్రీ సాయి గణేష్ ను చూడు పాలు యిచ్చే ఆవులో శ్రీ సాయి మాతను చూడు.


08.05.1994

నిన్నటిరోజున పరస్త్రీ వ్యామోహమునుండి మనసును మళ్ళించలేక మానసికముగా చాలా బాధపడినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి నా సమస్యకు పరిష్కారము చూపమని వేడుకొన్నాను. శ్రీ సాయి ఒక స్నేహితుని రూపములో దర్శనము యిచ్చి విధముగా అన్నారు. "నీ జీవితములో వావి, వరస యుండి నిన్ను వివాహము చేసుకొనేందుకు సిధ్ధముగా యున్న స్త్రీవైపు కనీసము చూడటానికి అయినా యిష్ఠపడటములేదు. కారణము ఆమె అందవికారముగా ఉండటమే కదా. అందవికారము నీలో వ్యామోహాన్ని కలిగించటములేదు. నీలో ఉన్న జ్ఞాన శక్తి అందవికారాన్ని గుర్తించగలిగినది. మరి అదే జ్ఞాన శక్తితో అందమైన పరస్త్రీలను మండుతున్న కొలిమిలాగ ఊహించుకో.

పరస్త్రీ మండుతున్న కొలిమి అనే భావనతో బ్రతుకు. అపుడు నీ మనసులో పరస్త్రీ వ్యామోహము కలగదు.

09.05.1994

నిన్నటిరోజున శ్రీ సాయి తత్వము గురించి ఆలోచించుతూ నిద్రపోయినాను. రాత్రి కలలో శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అన్నారు. "ఆసుపత్రిలో నీ పిల్లలు జ్వరముతో బాధపడుతుంటే నీ మనసు గిలగిల కొట్టుకొనుచున్నదే. మరి నా పిల్లలు (నా భక్తులు) వారి జీవితాలలో వారు బాధలు పడుతు ఉంటే నేను చూస్తూ ఉండగలనా! నా పిల్లలు నా నుండి ఎంతదూరములో యున్న నేను వాళ్ళను రక్షించుకొంటాను."


(యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

Thursday, January 26, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (14)

0 comments Posted by tyagaraju on 8:11 AM


26.01.2012 గురువారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయి బా ని స డైరీ - 1994 14 వ. భాగాన్ని చదువుకుందాము

సాయి.బా.ని.స. డైరీ - 1994 (14)


23.04.1994

నిన్న రాత్రి శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి, అన్న మాటలు - "కాలము అనేది భగవంతుడు మనకు యిచ్చిన వరము. దానిని వ్యర్ధము చేసుకోకుండ జాగ్రత్తగా మంచి కార్యాలకు వినియోగించుకొంటు, శరీరాన్ని భగవంతుని సేవలో ఉపయోగించుకొంటు జన్మను సార్ధకము చేసుకోవాలి."

24.04.1994

నిన్న రాత్రి నిద్రకుముందు శ్రీ సాయికి నమస్కరించి "తెల్లవారితే నా పుట్టినరోజు పుట్టిన రోజు సందర్భముగా సందేశము ప్రసాదించు తండ్రీ " అని వేడుకొన్నాను. శ్రీ సాయి నాకు చూపిన దృశ్యాల సారాంశము. ఒక చోట ఒకవ్యక్తి చనిపోయినాడు. అతని బంధువులు అతని అంతిమయాత్ర కోసము అన్ని సిధ్ధము చేస్తున్నారు హడావిడి అంత చూస్తు ఉంటే పుట్టినరోజు పండగలాగ ఉన్నది. జన సమూహములో ఒక వ్యక్తి శ్రీ సాయి రూపములో యున్నారు. ఆయన నన్ను చూసి అంటారు. "మనిషి మరణించిన రోజే నిజమైన పుట్టినరోజు. కారణము మనిషి శరీరము వదలి యింకొక తల్లి గర్భములోని శరీరములో ప్రవేశించిన రోజు కూడా రోజే కదా ! కనుక యిదే నిజమైన పుట్టిన రోజు. మిగిలినవన్ని మానవుడు కల్పించుకొన్న పుట్టిన రోజు పండగలు మాత్రమే."

26.04.1994

నిన్న రాత్రి శ్రీ సాయి కలలో దర్శనము యిచ్చి అంటారు - " విందులు వినోదాలు చూడు.

అక్కడివాళ్ళకు అన్నము పరబ్రహ్మ స్వరూపము అని తెలియదు.

అన్నాన్ని అగౌరవముపరచి ఎట్లాగ వినోదము పొందుతున్నారో చూడు. జీవించటానికి అన్నము చాలా అవసరము. అన్నము సంపాదించటానికి నిరంతరము కృషి చేయాలి. సోమరి పోతులాగ ఉంటు ఎదుటివాని సంపాదనపై అన్నము తినరాదు".

28.04.1994

నిన్న రాత్రి కలలో శ్రీ సాయి చూపించిన దృశ్యాల సారాంశము. మనిషి జీవితములోని ముఖ్య ఘట్టాలు అయిన సంసార జీవితము, పిల్లల పెంపక జీవితము (పిల్లల చదువులు - వారి వివాహాలు) విషయాలలో నీవు శ్రీ సాయి సహాయము కోరటములో తప్పులేదు. నీ కోరికలు తీరిన తర్వాత ఆయన నీనుండి ఏమి కోరుతున్నది ఆలోచించకుండ ఆయనను మర్చిపోవటము అసలైన పెద్ద తప్పు అని గ్రహించు.

30.04.1994

నిన్న రాత్రి కలలో శ్రీ సాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి చిన్న కధ చెప్పినారు. ఆకధ వివరాలు "ఒక బ్రాహ్మణుడు మండుటెండలో ఎడారిలో దారి తెన్ను తెలియకుండ నడచిపోతున్నాడు.

అతనికి మార్గములో రాతి బండపై రెండు సంచులు కనిపించినవి. ఒక సంచిలో తినుబండారాలు మరియు మరియొక సంచిలో చెప్పుల జత యున్నాయి. అక్కడ ఒక చీటీ వ్రాసి యుంది. చీటీలో ఏమి వ్రాసి యుందో అని ఆతృతగా చదివినాడు. చీటీలోని వాక్యాలు "దారి తెన్ను తెలియకుండ ఎడారిలో నడచిపోతున్న బాటసారీ నీ పరిస్థితి నాకు తెలుసు. నీవు రెండు సంచులు కావాలని కోరుకొంటున్నావు. అది వీలుపడదు. రెండు సంచులలో ఒక సంచిని మాత్రమే కోరుకో. తినుబండారాలు సంచి నీ ఆకలిని తీర్చుతుంది. చెప్పుల జత నీపాదాలకు నీవు ధరించగానే అది చక్కగా నీ గమ్యాన్ని చేరుస్తుంది." రెండు సంచులలో సంచిని తీసుకోవాలి అనే ఆలోచనలో పడ్డాడు భ్రాహ్మణుడు. మరి నీవు బ్రాహ్మణుడి స్థానములో ఉన్ననాడు సంచిని తీసుకొంటావు గోపాలరావు అంటారు. వెంటనే తెలివి వచ్చినది.

(యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు





 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List