Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, January 7, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 - రెండవ భాగము

0 comments Posted by tyagaraju on 5:52 PM



08.01.2012 ఆదివారము

ఓం సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి.బా.ని.. డైరీ - 1994

రెండవ భాగము

11.01.1994

నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి ఆధ్యాత్మిక రంగానికి మార్గము చూపమని వేడుకొన్నాను. శ్రీ సాయి కలలో అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అంటారు. - "ఆధ్యాత్మిక రంగములో పయనించటానికి అడవిలోనికి వెళ్ళి తపస్సు చేసుకోవలసిన అవసరము లేదు. నీవు చక్కగా సంసార జీవితము సాగించుతు ప్రకృతి నుండి పాఠాలు నేర్చుకొంటు ఆధ్యాత్మిక రంగములో ప్రయాణము చేయవచ్చును. మతాలు ఎన్ని ఉన్నా భగవంతుడు ఒక్కడే అని చాటి చెప్పు. యితర మతాల జోలికి పోవద్దు. మతం మారిపిడిని ప్రోత్సహించవద్దు. పండగలన్నిటిలోను పసిపిల్లలకు జరిపే అన్నపాశన పండగ అంటే నాకు చాలా యిష్ఠము.

13.01.1994

నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి - సాయి శక్తి గురించి చెప్పమని వేడుకొన్నాను. శ్రీ సాయి కలలో అన్ఞాత వ్యక్తి రూపములో కనిపించి అన్నారు. 1) నీ జీవితములో నిన్ను ఉన్నత స్థానానికి చేర్చగల శక్తి సాయి శక్తి. 2) పదిమందిలోను ధైర్ర్యముగా మాట్లాడగల శక్తి సాయి శక్తి 3) నీ యింట దారిద్ర్యాన్ని పారద్రోలే శక్తి సాయి శక్తి 4) జీవితములో క్రమ శిక్షణ యివ్వగల శక్తి సాయి శక్తి 5) చనిపోయిన వ్యక్తికి ప్రాణం పోయగల అమృత శక్తి సాయిశక్తి 6) నీ జీవితము నడకలో నిన్ను కాపాడే శక్తి సాయి శక్తి.

17.01.1994

నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను. కలలో శ్రీ సాయి చూపిన దృశ్యాలు కనువిప్పు కలిగించినవి. నేను జీవితములో "మంచి" "చెడు" అనే యిద్దరు స్నేహితులతో ప్రయాణము చేస్తున్నాను. చెడు స్నేహితుడు చాలా బలవంతుడు. మంచి స్నేహితుడు బలహీనుడు. ప్రయాణము మధ్యలో చెడు స్నేహితుడు మంచి స్నేహితుని బాధలు పెట్టసాగినాడు.


నేను అన్యాయాన్ని చూడలేక మంచి స్నేహితునికి సహాయము చేస్తాను. చెడు స్నేహితుడు నన్ను ప్రలోభపరచి నా చేతికి కత్తిని యిచ్చి మంచి స్నేహితుని చంపమంటాడు.


నేను ప్రలోభాలకు లొంగను. అపుడు మంచి స్నేహితుడుని రక్షించటానికి నేను కత్తితో చెడు స్నేహితుని పొట్టలో పొడుస్తాను. చెడు స్నేహితుడు చనిపోవడు. మంచి స్నేహితుడు నా దగ్గరకు వచ్చి చెడు స్నేహితుని గొంతులో అతని ప్రాణము యుంది అందుచేత గొంతులో పొడవమని సలహా యిస్తాడు. నేను ధైర్యముగా చెడు స్నేహితుని గొంతులో కత్తితో పొడుస్తాను. చెడు స్నేహితుడు చనిపోతాడు. చుట్టూ చేరిన ప్రజలు పోలీసులను పిలుస్తారు. నేను పోలీసులకు లొంగిపోవాలని ఆలోచించుతూ ఉంటాను. అపుడు మంచి స్నేహితుడు నా దగ్గరకు వచ్చి పోలీసులకు లొంగిపోతే నీవు అనవసరమైన కష్ఠాలలో యిరుక్కొని పోతావు. అందుచేత దూరంగా ఉన్న పవిత్ర స్థలానికి పారిపో అంటాడు. నేను పవిత్ర స్థలానికి వెళ్ళటానికి బస్సు కోసము ఎదురు చూడసాగినాను. బస్సు స్టాప్ లో చాలామంది ముసలి దంపతులు ఉన్నారు. వారు బస్సు కోసము ఎదురు చూస్తున్నారు.

నా భార్య నాకు తోడుగా రాలేదు. బస్సు స్టాప్ లో అజ్ఞాత వ్యక్తి వచ్చి నా చేతికి నాలుగు బ్యాటరీ లైట్లు యిస్తాడు. నేను సంతోషముగా స్వీకరించుతాను --- నిద్రనుండి మెలుకువ వచ్చి కల గురించి ఆలోచిచినాను. మంచి, చెడు అనే స్నేహితులు నాలోని మంచి, చెడు ఆలోచనలకు ప్రతిరూపము. చెడు స్నేహితుని చంపటము మంచి ఆలోచనలను పెంచుకోవటము పోలీసులు అంటే సంసార బంధాలు. ముసలి దంపతులు అందరు సాయి భక్తులు. బస్సు ప్రయాణములో నాకు తోడుగా నా భార్య రాదు అంటే సంసార బంధాలు నుండి నేను ఒక్కడిని విడివడి ఆధ్యాత్మిక ప్రయాణము సాగించాలి. అజ్ఞాత వ్యక్తి శ్రీ సాయి. ఆయన యిచ్చిన బ్యాటరీ లైటు - జీవితములో నాలుగు వైపులనుండి కమ్ముకొనే చీకట్లని పారత్రోలటానికి ఉపయోగ పడే సాధనము, ఆశీర్వచనాలు అని భావించినాను.

(యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు


మన ప్రశ్న - చీటీ ద్వారా బాబా జవాబు

0 comments Posted by tyagaraju on 5:32 PM


08.01.2012 ఆదివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

మన ప్రశ్న - చీటీ ద్వారా బాబా జవాబు

ఈ రోజు నెల్లూరునించి సుకన్యగారు పంపిన ఒక సాయి భక్తురాలి బాబా అనుభూతిని, సాయి బా ని స. డైరీ - 1994 రెండవ భాగాన్ని అందిస్తున్నాను. అమెరికానుంచి ఒక భక్తురాలు పంపిన బాబా అనుభూతి ఆమె మాటలలోనే.

నేను డిగ్రీ చదువుతున్న రోజులలో నాకు బాబా వారి గురించి తెలిసింది. స్నానం చేసినతరువాత ప్రతీ రోజు సాయిబాబా సచ్చరిత్రలో ఒక పేజీ చదవడం ప్రారంభించాను. నిర్ణయాలను తీసుకోలేని పరిస్థితులలో నేను బాబాముందు చీటీలను వేసి సమాధానం కోసం ప్రయత్నిస్తూ ఉండేదానిని. (ఆ పరిస్థితులలో సమస్యతీరడానికి తగిన కారణాలను అన్నిటినీ చీటీలమీద రాసేదానిని). బాబా నామాన్ని ఉచ్చరిస్తూ చీటీలను తీసేదానిని. చీటీ తీసినప్పుడు ఏది వస్తే దానిని బాబా సమాధానంగా అనుసరించేదానిని.

ప్రముఖ కాలేజీలో అప్పుడు కొన్ని యింటర్వ్యూ లు జరుగుతున్నాయి. ఆ కాలేజీ మా యింటివద్దనిముచి రెండుగంటల ప్రయాణం దూరంలో ఉంది. నా స్నేహితులందరూ ఆ కాలేజీకి దగ్గరలోనే ఉన్నారు. మా యిల్లు ఒక్కటే చాలా దూరంలో ఉంది. ఇక యింటర్వ్యూ కి ఒకరోజు ఉందనగా ప్రభుత్వంవారు బందు ప్రకటించారు. ఆరోజున బస్సులు ఏవీ తిరగడంలేదు. ఆరోజున బస్సులు లేని కారణంగా మా నాన్నగారు యింటర్వ్యూ కి వెళ్ళవద్దని చెప్పారు. నా స్నేహితులందరూ వెడుతున్న కారణంగా నేను కూడా వెళ్ళి తీరాలసిందేనని నిర్ణయించుకున్నాను. నేను మా నాన్నగారితో బాగా వాదించాను. కాని మానాన్నగారు ఒప్పుకోలేదు. ఆఖరికి చీటీలమీద యింటర్వ్యూకి హాజరవడానికి తగిన కారణాలన్నిటినీ రాసి ఏది వస్తే దానినే అనుసరిస్తానని చెప్పాను. మానాన్నగారు దానికి ఒప్పుకున్నారు.

చీటీలలో నేను రాసినవి ఇవి:

1) యింటర్వ్యూకి వెళ్ళు నువ్వు సెలెక్ట్ అవుతావు

2) నువ్వు యింటర్వ్యూకి వెళ్ళినా లాభం లేదు

3) వెళ్ళు, అనుభవం వస్తుంది

4 ) వెళ్ళవద్దు

ఇవే నేను చీటీలలో రాసినవి.

సాయిబాబా నామస్మరణ చేస్తూ ఒక చీటీ తీసాను. అందులో నువ్వు యింటర్వ్యూకి వెళ్ళినా లాభం లేదు అని వచ్చింది. అందుచేత నేను యింటర్వ్యూ కి వెళ్ళడం మానుకొన్నాను. రెండు రోజుల తరువాత యింటర్వ్యూ ఫలితాలు వచ్చ్చాయి. నా స్నేహితులందరూ సెలెక్ట్ అయ్యారు. నేను యింటర్వ్యూ కి వెళ్ళనందుకు చాలా బాధ పడ్డాను. కొన్ని రోజుల తరువాత అది ఒక మోసపూరిత కంపెనీ అని తెలిసింది. చెసిన సెలెక్షన్ ప్రోసెస్ అంతా కూడా కాన్సిల్ చేసారని తెలిసింది.

నాకొక చెల్లెలు ఉంది. ఆమె నాకన్నా రెండేళ్ళు చిన్నది. ఈ సంఘటన తరువాత తను కూడా ఏదైనా సమస్య వచ్చినపుడు చీటీలను వేసి నన్ను సాయిబాబా పేరు ఉచ్చరిస్తూ తీయమని అడిగేది. . ఇప్పటివరకు బాబా పేరు ఉచ్చరిస్తూ నేనేచీటీ తీసినా అదే నా చెల్లెలి భవిష్యత్తుగా ఉండేది. (తన ఎంసెట్ రాంక్, కాలేజీ లో డిగ్రీ చదువు, అన్నీ కూడా బాబా చీటీ లలో వచ్చిన ప్రకారమే జరిగింది.

అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి అయేముందు నేను మొదటిసారిగా షిరిడీ వెళ్ళాను. నా అండర్ గ్రాడ్యుయేషన్ తరువాత మాస్టర్స్ డిగ్రీ కోసం నేను అమెరికా వచ్చాను. ఇక్కడ మాస్టర్స్ డిగ్రీలో నేను కొంతమంది ప్రముఖులని కలుసుకున్నాను. ఇక్కడ ప్రతీ క్షణం ఒక అద్భుతమైన క్షణం. ప్రతీ రోజు కూడా మంచి రోజు. నేనిక్కడ ప్రతీ క్షణం ఎంతో ఆనందాన్ననుభవించాను. కాని అది ఒక సంవత్సరం మాత్రమే. నా మాస్టర్స్ డిగ్రీలో 3, మరియు 4 సెమిస్టర్ లు చాలా కష్టంగా గడిచాయి. ఆ సమయం లో నేను సాయిబాబా సచ్చరిత్ర ఒక వారం పారాయణ చేశాను. 3 వ సెమిస్టర్ తరువాత నేను యిండియాకి వెళ్ళాను. రెండవసారి షిరిడీ వెళ్ళాను. నేను షిరిడీకి వెళ్ళిన రోజు బాబా రోజు, గురువారము. నాకు సాయంత్రం ఆరతి చూడాలని కోరికగా ఉంది. బాబాని నాకోరిక నెరవేర్చమని ప్రార్థించాను. సెక్యూరిటీ గార్డ్ మా కుటుంబాన్నాంతటినీ ముందుకు వెళ్ళమని చెప్పాడు. మేము ముందుకు జరుగుతే కనక సెక్యూరిటీ గార్డ్ మా వెనకనున్నవారిని ఆరతి చూడటానికి ఆపేస్తాడు. నేను ముందుకు జరగకుండా ఆగిపోదామనుకున్నాను. కాని సెక్యూరిటీ గార్డ్ ముందుకు నడవమని అరిచాడు. నేను కొంతసేపు బాబా నామస్మరణ చేసి, సెక్యూరిటీ గార్డ్ తో నాకు సాయంత్రం ఆరతి చూడాలని ఉందని చెప్పాను. అప్పుడతను నవ్వి మమ్మలిని వెనుకకు రమ్మన్నాడు. మాకు సాయి బాబా దర్శనం బాగా జరిగింది. ఆరోజు గురువారము కనక పల్లకీ ఉత్సవం కూడా ఉంది. కొంతమంది పూజారులు సమాధి మందిరం లోకి పల్లకీని తీసుకుని వచ్చారు. భక్తులందరూ కూడా ఆపల్లకీని ముట్టుకుందామనే ప్రయత్నం లో ఉన్నారు. నేను కూడా పల్లకీని ముట్టుకుందామనుకున్నాను కాని నాకు పల్లకీ కి మధ్యన చాలామంది జనం ఉన్నారు. హటాత్తుగా పల్లకీని మోస్తున్న పూజారి ఆగి నావైపు చూసి చిరునవ్వు నవ్వాడు. నేను కూడా ఆయనవైపు చూసి నవ్వి పల్లకీని ముట్టుకున్నాను. దర్శనం తరువాత నేను వేప చెట్టు దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఉన్న భక్తులందరూ కిందకు చూస్తున్నారు. వారందరూ కిందకి ఎందుకు చూస్తున్నారో నాకర్ధం కాలేదు. వారంతా వేపాకులకోసం చూస్తున్నారని కొంతసేపటికి నాకర్ధమయింది. నాకు కూడా కొన్ని వేపాకులనిమ్మని బాబాని ప్రార్ధించాను. నేనప్పుడు వేప చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తున్నాను. ప్రదక్షిణ చేస్తుండగా నేను 6, 7 ఆకులదాకా సేకరించాను. నా షిరిడీ యాత్ర యింత అద్భుతంగా జరిగినందుకు నేను బాబాకి ఎంతో కృతజ్ఞురాలిని.

యిండియానుంచి తిరిగి వచ్చిన తరువాత బాబా దయ వల్ల నా మాస్టర్స్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేశాను. ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఒక కన్సల్టెన్సీ లో చేరాను. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి మా చెల్లెలు వచ్చింది. మా చెల్లెలిని కూడా నేనే చూసుకోవాలి కనక నాకు ఉద్యోగం చాలా అవసరం. మా చెల్లెలు నా ఉద్యోగం కోసం, యింకా తనకి కాలేజీ ప్రాగణంలో జరిగే ఆన్ కాంపస్ లో ఉద్యోగం రావడానికి సాయి సచ్చరిత్రను చదవడం ప్రారంభించింది. నేను 9 గురువారముల వ్రతం మొదలుపెట్టాను. 9 గురువారముల వ్రతము చదివిన మొట్టమొదటి గురువారమునాడు మాయిద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి.


నాకు ఉద్యోగము వచ్చిన తరువాత రెండవసారి సాయి సచ్చరిత్ర పారాయణ చేశాను. పారాయణ చేసినప్పుడెల్లా ప్రతీరోజూ నా కళ్ళనుండి కన్నిరు వస్తూ ఉండేది. అక్టోబరు 17 వ.తారీకున నేను చదువుతున్న అధ్యాయములో, అక్టోబరు 15 వ తారీకున బాబావారు సమాధి అయారనీ, భక్తులందరూ ఆయన శరీరాన్ని అక్టోబరు 17 వ తారీకున బూటీవాడాకు తీసుకుని వెళ్ళారనీ ఉంది. నేను ఆ అధ్యాయము చదువుతున్న రోజు, బాబా వారి శరీరాన్ని బూటీవాడాకు తీసుకునివెళ్ళిన రోజు రెండూ కూడా సరిపోలాయి. కాకతాళీయంగా జరిగిన ఈ సంఘటనకి నాకు చాలా ఆనందం వేసింది.


నా జీవితాశయం ఒకటి ఉంది. దానినిగురించి బాబావారిని మూడు సంవత్సరాలనుంచి అడుగుతున్నాను. ఈ విషయం గురించి నేను చీటీలు కూడా వేసాను. జవాబు నాకు అనుకూలంగా వచ్చింది. అది అసాధారణమైన విషయం, బాబా అనుగ్రహంతో తప్ప అది సాధ్యంకాదు. బాబా నాయందే ఉన్నారు కనక అది జరుగుతుంది. అది జరిగిన వెంటనే నాకు కలిగిన అనుభవాన్ని మీకు తెలియచేస్తాను.

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు


Friday, January 6, 2012

సాయి బా ని స డైరీ 1994

0 comments Posted by tyagaraju on 4:18 PM


07.01.2012 శనివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజూంచి సాయి బా ని స డైరీ 1994 ప్రారంభము

సాయి.బా.ని.. డైరీ - 1994

1 . భాగము

03.01.1994

నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను. శ్రీ సాయి కలలో దృశ్యరూపములో యిచ్చిన సందేశము.

"జీవిత ప్రయాణములో అంటరానివారు అనే భేదభావము లేకుండ సకల జనులతోను, అనాధ బాల బాలికలతోను, దైవ భక్తులతోను, కలసి భగవన్ నామస్మరణ చేస్తూ ధైర్యముగా ప్రయాణము చేయాలి."

04.01.1994

నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను. శ్రీ సాయి కలలో విచిత్రమైన దృశ్యాన్ని ప్రసాదించినారు. "నేను - నా స్నేహితుడు గొడవపడుతు కత్తి యుధ్ధము చేయసాగాము.

నేను నా ఆత్మ రక్షణ కోసము అతనిని హత్య చేసినాను. సమాజము నన్ను హంతకుడిగా చిత్రించినది. పోలీసులు నా గురించి గాలించుతున్నారు. నా అంతట నేను పోలీసులకు లొంగి పోతాను. కోర్టులో భగవంతుడు న్యాయపరమైన తీర్పు యిస్తాడు అనే నమ్మకముతో కోర్టుకు హాజరు అగుతాను. నిద్రనుండి ఉలిక్కి వడిలేచినాను. శ్రీ సాయి పటము వైపు చూసినాను. శ్రీ సాయి దృశ్యము ద్వారా యిచ్చిన సందేశము .. "ఆధ్యాత్మిక శక్తి మనలో ఉన్నంతవరకు ధైర్యముగా ఎట్టి పరిస్తితినైనను ఎదుర్కొనవచ్చును"

06.01.1994

శ్రీ సాయి నిన్న రాత్రి కలలో చూపిన దృశ్యము శ్రీ సాయి నన్ను నా గత జీవితములోనికి తీసుకొని వెళ్ళి నాపాపాలకు పరిహారము - పరిష్కారము చూపించినారు. వాటి వివరాలు. అది 1962 - 65 మధ్య కాలము. కాకినాడలోని శ్రీ వాడ్రేవు కోదండరామయ్యగారి యింటిలో మేము అద్దెకు ఉన్న రోజులు. నేను మంచి చెడు అనే విచక్షత లేకుండ గడుపుతున్న రోజులు ఒక రోజున పెద్ద త్రాచు పాము యింటి చూరులో వ్రేలాడుతూ అతి కష్ఠము మీద తనవంటిమీద ఉన్న కుబుసాన్ని విడిచివెళ్ళిపోయినది. నేను 1965 లో ఉద్యోగము నిమిత్తము కాకినాడ వదలివెళ్ళినాను. దృశ్యము ద్వారా శ్రీ సాయి యిచ్చిన సందేశము "మనిషి జీవితము నాగుపామువంటిది. అహంకారము అనే కుబుసాన్ని వదలిపెట్టి భగవంతుని మెడలో హారము కావాలి.

09.01.1994

నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి, ధన - ధారా - సంతానము పై వ్యామోహము తొలగించమని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యాలు నాకు కనువిప్పు కలిగించినవి. ధన సంపాదన కోసము భార్య భర్తలు జీవితములో అడ్డదారులు త్రొక్కినపుడు ప్రభావము వారి పిల్లల మీద పడుతుంది. అపుడు సంసారములో నైతిక విలువలు యుండవు. అటువంటి కుటుంబమును సంఘము వెలివేస్తుంది. ఇంకొక దృశ్యములో భార్య భర్తల సంసార జీవితములో భార్య, భర్త అదుపు ఆజ్ఞలలో యుండకుండ స్వాతంత్రము ప్రకటించి సంసారము కుక్కలు చింపిన విస్తరిగా మార్చిన సంఘటన. యింకొక దృశ్యములో సంసార జీవితములో యింటి యజమాని కష్ఠపడి ధనము సంపాదించి భార్య, పిల్లలను పోషించుతాడు. పిల్లలు పెద్దవారు అగుతారు. ఆయజమాని ఉద్యోగమునుండి రిటైరు అగుతాడు. అపుడు యజమాని అనారోగ్యముతో బాధపడుతున్న సమయములో, భార్య పిల్లలు డబ్బు ఖర్చు అగుతుంది అనే ఆలోచనలతో ఆయింటి యజమానికి కనీసము మందు కొని యివ్వరు. యజమాని తనకు మందు కొని యివ్వకపోయిన ఫరవాలేదు కనీసము విషము కొని యివ్వమని వేడుకొన్నా విషము కూడ కొని యివ్వరు పిల్లలు. కారణము యింటి యజమాని చనిపోతే నెల నెల వచ్చే పించను రాక ఆగిపోతుంది అనే భయము. యిటువంటి దృశ్యాలు శ్రీ సాయి చూపించిన తర్వాత యింకా ధనము (డబ్బు), ధార (భార్య), సంతానము (పిల్లలు) మీద ఏమి వ్యామోహము ఉంటుంది.

10.01.1994

నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి నాలో ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించమని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యాలు నాలో చాలా ఆలోచనలను రేకెత్తించినవి. వాటి వివరాలు.

1) అనాధ స్త్రీలకు, అనాధ పిల్లలకు సేవ చేస్తున్నపుడు మనసులో వికారాలకు పోకుండ బ్రహ్మచర్యము పాటించుతు, దయ, త్యాగము సానుభూతిని వారికి అందచేయాలి.

2) పసిపిల్లలలోను, అన్ని జీవులలోను భగవంతుని చూడాలి.

3) నీకు అన్యాయము చేసినవారు నీ యింటికి వచ్చినపుడు చిరునవ్వుతో మాట్లాడగలగాలి.

(యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు



Thursday, January 5, 2012

సాయి ఆపద్భాందవుడు

0 comments Posted by tyagaraju on 6:43 PM


06.01.2012 శుక్రవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి ఆపద్భాందవుడు

ఈ రోజు బంగళూరు నించి సాయి భక్తురాలు విజయ గారు పంపిన బాబా లీలని ప్రచురిస్తున్నాను. ఈ లీలలో బాబా మీద ఆమెకు ఎంతటి ఢృఢమైన భక్తి, నమ్మకము, విశ్వాసం ఉందో మనకి అర్థమవుతుంది. బాబా తన భక్తులనెప్పుడు ప్రమాదాల బారిన పడకుండా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. బాబా లీల విజయగారు పంపిన మాటలలోనే. ఆయన మీద మనకు అచంచలమైన విశ్వాసం ఉంటే ఆయన మనవెంటే ఉంటూ మన రక్షణ చూస్తూ ఏదో ఒక రూపంలో అనుక్షణం మనలని కాపాడుతూ ఉంటారు.

ఓం
సాయిరాం



సాయికి
తెలియనిదంటూ ఏమి లేదు సర్వాంతర్యామి, భక్తులకి కామధేనువు వంటివారు. బాబాని ఒకసారి తలుచుకుంటే చాలు ....ప్రతిక్షణం మనవెంటే వుంటూ కాపాడుతారు..కావలసినది భక్తితో కూడిన ప్రేమ..బాబా కి ఏమయినా సమర్పించాలని మనం అనుకొని మరచిపోతే గుర్తు తెప్పించి మరీ వసూలుచేసుకుంటారు....అలాంటిది ఒక లీల నా జీవితం లో జరిగింది..నేను హైదరాబాదులో వున్నపుడు అది రైనీ సీజన్... ఎందుకో నా మనసులో బాబాకి స్వీట్ కారన్ పెట్టాలని అనిపించింది..సాయంత్రము బాగా వర్షం పడుటోంది..సిటీ మొత్తం రోడ్డులన్ని వర్షపు నీటితో నిండిపోయిఉన్నాయి...


ఆశ్చర్యకరమైన విషయం ఎమిటంటే స్వీట్ కారన్ బండి చాల చోట్ల వుండేవి కాని రోజు ఒక్కటి కూడా కనిపించలేదు....బాబా ఈరోజు నన్ను పరీక్షించదలచారేమో....ఒక్క బండి కూడా లేదు..నేను మొండిగా రోజు ఎలాగయిన బాబాకి స్వీట్ కారన్ పెట్టాల్సిందే అని వర్షం లో తడుస్తూ తిరగసాగాను. ..అలా చాలా సేపు తిరిగాక ఒక బండి కనిపించింది....

నేను వెళ్ళి స్వీట్ కారన్ తీసుకున్నాక మళ్ళీ తిరిగి వచ్చే దారిలో నాకు రోడ్డు కనిపించడం లేదు..ఎలాగా అని బాబా ని తలుచుకుంటున్నాను....వేరే దారి నుంచి వెడదామని ఒక అడుగు ముందుకు వేయాలని అనుకున్నాను. అంతలోనే ఒకతను గట్టిగా పిలుస్తూ మీరు అటు వెళ్ళద్దు అని అరిచాడు...నేను వెంటనే వెనక్కి వచ్చేసాను..తరువాత రోజు అక్కడ చూసినప్పుడు మట్టితో కూడిన గొయ్యి ఉంది ...బాబానే నాకు సహాయం చేసారు..లేకపోతే నేను పడిపోయేదాన్ని వర్షపు నీటిలో....బాబా కరుణ ఎప్పుడూ మా మీద ఇలాగే వుండాలని వేడుకుంటున్నా.....


విజయ

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు


Wednesday, January 4, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1993

0 comments Posted by tyagaraju on 4:45 PM


05.01.2012 గురువారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి ముక్కోటి ఏకాదశి శుభాశీస్సులు


ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ 1993 24 వ. భాగాన్ని చదువుకుందాము

సాయి.బా.ని.స. డైరీ - 1993


08.12.1993 09.00 .ఎం.

రోజున మెహది పట్నములోని అద్దె యిల్లు ఖాళీ చేసి తిరిగి కమలానగర్ లోని స్వంత యింటికి వెళ్ళాలని సామానులు సర్దుకొని సిధ్ధముగా ఉన్నాను. మెహదీపట్నము వదలి వెళ్ళేముందు ఒక్కసారి శ్రీ హఫీజ్ బాబాగారి దర్శనము చేసుకోవాలి, వారి ఆశీర్వచనాలు తీసుకోవాలి అనె కోరికను శ్రీ సాయికి తెలియపర్చి, హఫీజ్ బాబాగారి యింటికి వెళ్ళినాను. కాని నా దురదృష్ఠము హఫీజ్ బాబాగారు అనారోగ్యముతో నిద్రపోతున్నారు. వారిని లేపటానికి కుదరదు అని వారి కుమారుడు చెప్పినారు. బరువైన మనసుతో యింటికి వచ్చి లారీలో సామానులు సర్దుతున్నాను. సమయములో శ్రీ హఫీజ్ బాబాగారు చేత కఱ్ఱ పట్టుకొని మెల్లిగా నడచుకొంటు నాయింటికి వచ్చి ఉదయము నేను వారి యింటికి వచ్చిన సంగతి వారి కుమరుడు వారికి చెప్పినాడట. వెంటనే నన్ను చూడాలనే ఉద్దేశముతో నాయింటికి వచ్చినారు అని చెప్పినారు. నేను వారి ఆశీర్వచనాలు పొందినాను. నా మనసు సంతోషముతో పొంగినది. శ్రీ సాయికి నమస్కరించి నేను శ్రీ హఫీజ్ బాబా యింటికి వెళ్ళితే శ్రీ సాయి హఫీజ్ బాబాగార్ని నా యింటికి పంపటము శ్రీ సాయి లీలగా భావించినాను.

20.12.1993

నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి, ఆధ్యాత్మిక సందేశము ప్రసాదించమని వేడుకొన్నాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపంలో దర్శనము యిచ్చి అన్నారు.

1. రోగముతో బాధపడుతున్న రోగికి ఔషధ దానము చేయి.

2. నీవు తినటానికి తిండిలేక మొక్క జొన్న పొత్తు తింటుయున్న సమయములో పరమ పిసినిగొట్టు ఆకలితో నీదగ్గరకు వచ్చినపుడు నీవు తింటున్న మొక్కజొన్న పొత్తులో సగము అతనికి అన్నదానముగా ఈయి.

3. నీ విరోధి నీకు తారసపడినపుడు చిరునవ్వుతో అతనికి ఒక కప్పు టీ త్రాగటానికి యివ్వు.

4. దానాలలో అన్నదానము - జీవితములో కన్యాదానము చేయటము చాల మంచిది.

21.12.1993

నిన్నటిరోజున నా విరోధుల గురించి ఆలోచించుతు రాత్రి శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను. శ్రీ సాయి తెల్లని గడ్డము, తలకు తెల్లని బట్ట కట్టుకొని, తెల్లని కఫనీ ధరించి, ఒక గుడిలో భోజనము చేసి బయటకు వచ్చి చేతులు కడుగుకుంటు నన్ను చూసి అన్నారు. "నీవు ఎవరిని నిందించటము నాకు యిష్ఠము లేదు. నీకు యిష్ఠము లేనివారినుండి నీవు దూరముగా ఉండు. ఎవరి ఖర్మ వారిది. ఖర్మను అనుభవించి తీరాలి. ఒకరి ఖర్మకు యింకొకరు బాధ్యులు కారు. అందుచేత ఎవరిని నిందించవద్దు. వ్యభిచారము చేయకపోయినా మానసిక వ్యభిచారము పాపము కదా. అదే విధముగా నీవు నీ విరోధినుండి దూరముగా యున్నపుడు అతని పరోక్షములో అతనిని నిందించటము కూడ పాపమే అని గుర్తుంచుకో".

27.12.1993

నిన్నటిరోజున టీ.వీ లో క్రిస్మస్ పండుగ వేడుకలు చూసినాను. శ్రీ సాయికి నమస్కరించి క్రిస్మస్ పండగ సందేశము ప్రసాదించమని వేడుకొన్నాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో అన్నారు. "నేను భగవంతుని కుమారుడిని - నా సేవను మీరు అంగీకరించి భగవంతుడిని చేరండి".

శ్రీ సాయి క్రీస్తు రూపములో కూడ తన భక్తుల సేవ చేసుకొంటాను అని చెప్పినారు.

31.12.1993

నిన్నటిరోజున శ్రీ సాయికి నమస్కరించి నేను తెలుసుకోవలసిన మంచి విషయాలు చెప్పమని వేడుకొన్నాను. శ్రీ సాయి దృశ్య రూపములో చెప్పిన విషయాలు.

1. విందులువినోదాలలో భోజనముమితముగ చేసి ఆరోగ్యము కాపాడుకో.

2. అడగనిదే శ్రీ సాయి తత్వముఎవరికిచెప్పవద్దు. నమ్మకమున్న వారికే సాయి తత్వము చెప్పు.

3. శ్రీ సాయి భక్తులలో కులమత భేదాలు యుండరాదు.

4. సాయి భక్తులు వీలు చేసుకొని శిరిడి యాత్ర చేసి తమ నమ్మకాన్ని బలపరచుకోవాలి.

5. శిరిడీలో అన్ని మతలవారినిసరిగా గౌరవించాలి.

6. గురుపూర్ణిమ రోజున శ్రీ సాయి పేరిట నూతన వస్త్రాలు దానము చేయాలి.


01.01.1994

నిన్నటిరోజున గుండెనొప్పితో చాలా బాధపడినాను. నా మానసిక బాధలే నా గుండె నొప్పికి కారణము అని గ్రహించినాను. రాత్రి శ్రీ సాయికి నమస్కరించి గుండె నొప్పి రాకుండ యుండే మార్గము చూపించమని వేడుకొన్నాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి చెప్పిన సలహాలు (1) యితరుల యింట అనవసరముగా భోజనము చేయవద్దు (2) యితరుల ముందు నీ పాండిత్యము ప్రదర్శించవద్దు (3) బంధువుల స్త్రీలకు, పరస్త్రీలకు దూరముగా ఉండు (4) నీ బంధువులతో గొడవలు పడటము మాని వేయి. (5) నీకు మానసిక శాంతి కావాలంటే ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడేవారితో స్నేహము చేయి.

(యింతటితో సాయి.బా.ని.. డరీ - 1993 సమాప్తం)


సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List