Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, August 19, 2011

సాయితో మరికొన్ని అనుభవాలలో -- సాయితో మరువరాని ఆ...ఖ...రి...కలయిక

0 comments Posted by tyagaraju on 9:18 PM






20.08.2011 శనివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయసాయి

సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు

సాయితో మరికొన్ని అనుభవాలలో -- సాయితో మరువరాని ఆ...ఖ...రి...కలయిక

సాయితో మరువరాని ఆ...ఖ...రి...కలయిక

లార్డ్ సాయితో తార్ఖడ్ కుటుంబంవారి స్వీయానుభవాలను వివరించడం పూర్తి చేశాను. తార్ఖడ్ కుటుంబానికి లార్డ్ సాయితో సాహచర్యం కలగడానికి కారణం వారి పూర్వ పుణ్యసుకృతం వల్లనేనని యిప్పుడు ప్రతివారు ఖచ్చితంగా అనుకుంటారు. ఒక విశేషం మీరు గమనించి వుంటారు. వారు బాబానుంచి యెప్పుడూ ఏదీ కోరలేదని. వారు మొదట షిరిడీ వెళ్ళినపుడు కూడా శారీరక బాథనుండి ఉపశమనం కోసమే అయినప్పటికీ వారి షిరిడీ రాకకి కారణం కూడా తెలియపర్చవలసిన అవసరం కూడా రాలేదు. బాబావారు ఆలోచనను ఉన్నది ఉన్నట్లుగా చదవగలిగి వారిని తనకు దగ్గరగా చేసుకోవడానికి వారిపై తన దీవెనలను కురిపించారు.

అది 1918 సం. నవరాత్రి రోజులు అనుకుంటాను, కారణం బాబా, బాథపడుతున్న పులికి మోక్షాన్ని ప్రసాదించిన ఏడు రోజులకి విజయదశమి నాడు మహా సమాథి చెందారు. బాబా బాగా పెద్దవారయిపోయారు. ఆనకి చెరొకవైపు యిద్దరు భక్తుల సహాయంతో నడిచేవారు.


ఒకరోజు సాయంత్రం పెట్రోమాక్స్ దీపాలని వాటి వాటి స్థానాలలో ఉంచిన తరువాత, మా నాన్నగారు బాబా చాలా అలసటగా ఉండటం చూశారు. ఆయన బాబాతో కాస్త ఉపశమనంగానూ, సౌఖ్యంగానూ, ఉంటుందని కాళ్ళు నొక్కమంటారా అని అడిగారు. " నీ కోరికను నువ్వు వెల్లడించావు. నీ తృప్తికోసం అలాగే కానీ" అన్నారు బాబా. మా నాన్నగారు ఆయన పాదాలవద్ద కూర్చున్నారు. కొంచెం సేపయిన తరువాత బాబా ఆయనవైపు తిరిగి "భావూ ! యిదే మన ఆఖరి కలయిక దీని తరువాత మనం కలుసుకోము. షిరిడీకి చాలా రకాలయిన ప్రజలు వస్తారని నీకు తెలుసు. వారంతా సంపద, పిల్లలు, మంచి ఆరోగ్యం వగైరా యిలాంటి రకరకాలయిన కోరికలు నానుంచి పొందటం కోసం వస్తారు. నేనెవ్వరినీ నిరాశ పరచను. వారి తరఫున భగవంతుడిని ప్రార్థిస్తాను భగవంతుడు కూడా నా ప్రార్థనలకు అనుకూలంగా స్పందించి వారి అవసరాలని తీరుస్తాడు. నా దగ్గరకు వచ్చినవాళ్ళలో ఏమీ అడగనివాళ్ళలో నువ్వు ఒకడివి. నీకు వివాహము అవకపోవడంవల్ల, సంసారం లేకపోవడం వల్ల నీకు ఏదీ అవసరమనిపించకపోవచ్చు. కాని, భావూ, మనం యిక ఎప్పటికీ కలుసుకోలేము కాబట్టి నీకిష్టమైనది ఏదయినా అడుగు. లేకపోతే నువ్వింతవరకు నాకు చేసిన సేవలన్నిటికీ యెప్పటికి ఋణగ్రస్థుడినవుతాను" అన్నారు. మా నాన్నగారు అప్పుడు "బాబా నీదయవల్ల జీవితంలో నాకన్నీ ఉన్నాయి. నాకు ఈ భౌతికమయినవేమీ అవసరం లేదు. నీ ఆశీర్వాదాలు యెల్లప్పుడూ నామీద ఉండేలా మాత్రం చూడు. యెటువంటి పరిస్థితులలో కూడా భవిష్యత్తులో నువ్వు నా జ్ఞాపకాలనుంచి మాత్రం తొలగిపోవద్దు (హేచి దాన్ దేగా దేతుఝా నిసార్ న వ్హవ) అన్నారు. బాబా 'భావూ, నా భక్తుల విథి నిర్వహణకు నేను బథ్థుడను. ప్రత్యేకంగా నీకోసం ఏదయినా ఆగమని నేను అడుగుతున్నాను. కారణం ప్రతీ మానవునికి అతని/ఆమెకి తమకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. తమ జీవితంలో విజయవంతంగా సాగడానికి బయటనుంచి సహాయం అవసరమవుతుంది. మొహమాట పడకుండా అడుగు?" అన్నారు. మా నాన్నగారు అది తనకి పరీక్ష అనుకున్నారు. బాబా నువ్వు అంతగా నొక్కి చెపుతున్నావు కనక నేనడిగేముందు నా కోరికను కాదనకుండా తీరుస్తానని మాటివ్వు" అన్నారు. అప్పుడు బాబా, "భావూ, నేను చాలా మంది కోరికలను తీర్చాను. నువ్వు నాయందు లేశమాత్రమైనా అనుమానం పెట్టుకోవద్దు. నువ్వుఅడుగు నేను తీరుస్తాను" అన్నారు. మా నాన్నగారు, "బాబా నాకు నీనుంచి ఒక్కటే కావాలి. నాకు ఏ జన్మనయినా యివ్వు నేను నీ పాదాలను చూడాలి" .


బాబా అప్పుడు కొంచెంసేపు మవునంగ ఉన్నారు. ఆయన నిశ్శబ్దాన్ని భంగ పరుస్తూ చెప్పారు. "భావూ ఈ నీ కోరికను నేను తీర్చలేను", మా నాన్నగారు "బాబా నేనేదీ కోరటంలేదు. ఈ విషయంలో నువ్వే బలవంత పెట్టావు. యిది తప్ప నీ నుంచి నాకింకేమీ అవసరం లేదు" అన్నారు. అప్పుడు బాబా ఒక చిరునవ్వు నవ్వి, "భావూ యెంతో మంది షిరిడీకి వస్తారు. కాని నీలాగా నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నది కొద్దిమంది. నీ కోరికతో నువ్వు నన్ను శాశ్వతంగా బథ్థుణ్ణి చేద్దామనుకుంటున్నావు. ఈ విథంగా యెవరితోనూ బంథం ఏర్పరచుకోవడానికి నాకు నా ప్రభువునుంచి అనుమతి లేదు. ఏమయినప్పటికి నువ్వు నిరాశ పడనవసరంలేదు. మన తరువాతి జన్మలో మనకి పది సంవత్సరాల వయసప్పుడు మనమిద్దరం కలిసి కూర్చుని ఒకే కంచంలో తింటామని మాట యిస్తున్నాను". మా నాన్నగారు, "బాబా నీ యిష్టం" అన్నారు. మరుసటి జన్మలో మరలా కలుస్తానని బాబా ఆయనకి మాట యిచ్చారు. మా నాన్నగారు తృప్తి చెంది వెంటనే బాబా ముందు సాష్టాంగ పడ్డారు. బాబా ఆయనని లేవనెత్తి తన ప్రక్కనే ఉన్న ఊదీ కుండలో చేయి పెట్టి చేతినిండా ఊదీ తీసి ఆయనకిచ్చి, "భావూ, దీనిని చాలా జాగ్రత్తగా భద్రపరచుకో. బాగా అవసరమయినప్పుడు మాత్రమే ఉపయోగించు. యెందుకంటే దానిలో యెవరి శరీరంలోకైనా సరే ప్రాణాన్నయినా తిరిగి ప్రవేశపెట్టేంత అనంతమైన శక్తి ఉంది."


యిక ఆపుడు సాయంత్ర వేళ ఆరతి సమయం అయింది. ఆక్షణంలో మా నాన్నగారికి యెంతో తృప్తి కలిగిన అనుభూతి కలిగింది. అదే క్షణంలో ఆయనకి కాస్తంత విచారం కూడా కలగడానికి గల కారణం బాబా అదే తమ ఆఖరి కలయిక అని చెప్పేయడం. మరునాడు బాబా ఆయనని బొంబాయి వెళ్ళిపొమ్మని చెప్పారు. యింటికి చేరుకోగానే ఆయన తన తల్లిదండ్రులకు షిరిడీలో జరిగినదంతా చెప్పారు. వారు ఒక చిన్న వెండి పెట్టికొని దానిని ఊదీతో నింపారు. దానిని వారు స్వయంగా భగవంతుడిచ్చిన మథువులాగా విలువైనదిగా భావించారు. మాలో యెవరికయినా తీవ్రంగా సుస్తీ చేస్తే మా నాన్నగారు కొంచెం ఊదీ నీళ్ళలో వేసి, నయమవడానికి మాకు త్రాగడానికివ్వడం నాకు గుర్తు. ఒక విషయం ఖచ్చితం, ఆయన బ్రతికుండగా ఆయన ఏడుగురి సంతానంలో యెవరూ కూడా మరణించలేదు.

ప్రియమైన సాయి భక్త పాఠకులారా మా నాన్నగారు తన జీవితంలో యెన్నో ఒడిదుడుకులనెదుర్కొన్నారు. ఆయనకి స్వంత బంగళా, కారు. ప్రతీదీ, జీవితంలో యెవరైనా వేటిని కావాలనుకుంటారో అవన్నీ ఉన్నాయి. కాని తరువాతి దశలో ఆయనకి ఈ భౌతిక ప్రపంచం మీద ఇఛ్ఛ పోయింది. ఆయన జబ్బుపడటం నేనెప్పుడూ చూడలేదు. ఆయన తన 70 వ యేట జబ్బుపడి మరణించారు. దాని గురించి నేను తరువాత వివరిస్తాను.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.


Thursday, August 18, 2011

సాయితో మరికొన్ని అనుభవాలలో - తాతమ్మకు సాయి దర్శనమగుట

0 comments Posted by tyagaraju on 5:43 PM


19.08.2011 శుక్రవారము


ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు



సాయితో మరికొన్ని అనుభవాలలో -

తాతమ్మకు సాయి దర్శనమగుట




ప్రియమైన సాయి భక్త పాఠకులారా, మారాఠీలో సామెత చెప్పినట్లుగా, ఆ 17 షిరిడీ యాత్రలలో యెన్నో అనుభవాల సంపదని ఆయన తన స్వంతం చేసుకున్నారు. ఆయన ఆథ్యాత్మిక స్థితిలోకి వెళ్ళినప్పుడెల్లా ఆ అనుభవాలని వివరిస్తూ మమ్మల్ని ఆనంద పరుస్తూ ఉండేవారు. అందులో ఆయన అమితానందం పొందేవారని నాకు తెలుసు. మరొకసారి నేననుకునేదేమిటంటే ఆయన వాటిని రాసి ఉండవసిందని. నేను తిరిగి గుర్తు చేసుకునే స్థితిలోనే ఉన్నందువల్ల వాటిలో కొన్ని బాగా చెరగని ముద్ర వేసిన వాటిని నేను మీకు వివరిస్తాను. నా అబిప్రాయాలు షిరిడీ సాయిబాబావారి యొక్క గొప్ప నైపుణ్యాన్ని సాయి భక్తులందరికీ తెలియచేయాలనీ, అలా చేస్తూ ఆయన మీద నా భక్తిని తెలుపుకునే ప్రయత్నం కూడా.
చార్నీ రోడ్ చౌపతీ (గిర్ గాం బీచ్) లో తమ స్వంత బంగళాలో ఉంటున్న మా తాత ముత్తాతలకి, రామచంద్ర (మా తాతగారు), జ్యోతీంద్ర (మా నాన్నగారు) తరచుగా షిరిడీకి వెడుతున్నారని తెలిసింది. తండ్రీ, కొడుకులిద్దరూ బాంద్రా లోని టాటా బ్లాక్స్ లో అద్దెకు ఉంటున్నందున వారు అప్పుడప్పుడు వారిని కలుసుకుంటూ ఉండేవారు. మా తాత ముత్తాతల జీవన విథానం అప్పటి ఆంగ్లేయుల పథ్థతిలో ఉండేది. యేమయినప్పటికీ మా తాతమ్మగారికి బాగా జిజ్ఞాస యెక్కువ. మానాన్నగారు వారిని చూడటానికి చౌపాతీ వచ్చినప్పుడెల్లా ఆవిడ షిరిడీ సాయిబాబా గారి గురించి ఆయన లీలల గురించీ అడుగుతూ ఉండేవారు.

ఆవిడ తనని కూడా షిరిడీకి తీసుకు వెళ్ళి సాయి దర్శనం చేయించమని ఆయనని అడుగుతూ ఉండేవారు. మా నాన్నగారు యెప్పుడూ ఆవిడకి మాట యిస్తూ ఉండేవారు. ఆయనకది జరిగే పని కాదని తెలుసు. కారణం ఆయన తాతగారు అటువంటి యాత్రకి యెప్పుడూ వెళ్ళనివ్వరు. ఆవిడ వయస్సు డభ్భై పైన. తాతగారికి బాబాలన్నా,సాథువులన్నా నమ్మకం లేదు. ఒకసారి ముంబాయిలో భయంకరమైన ప్లేగు వ్యాథి ప్రబలింది. వైద్యులు ఆ భయంకరమైన వ్యాథిని నివారించడానికి అప్పటివరకూ సరైన ముందుని కనుక్కోలేదు. మా తాతమ్మగారికి జ్వరం వచ్చింది. వైద్యులయిన ఆవిడ భర్త వైద్యం చేస్తున్నప్పటికి మంచి గుణం ఏమీ కనపడలేదు. . ఆవిడ సుస్తీ గురించి తెలిసి మా నాన్నగారు వారింటికి వెళ్ళారు. అలా వెళ్ళినపుడు మా తాతమ్మ మా నాన్నగారితో తనా ప్లేగు వ్యాథినుంచి బయట పడలేననీ తనని రక్షించమని సాయిబాబాని ప్రార్థించమని మా నాన్నగారికి చెప్పారు. తానప్పుడు షిరిడీ వచ్చి ఆయన దర్శనం చేసుకుంటానని చెప్పారు. ఆమెకు బాబా మీద స్వచ్చమైన నమ్మకం ఉంటే మంచం మీద నుండే బాబాని ప్రార్థించవచ్చని సలహా ఇచ్చారు. లార్డ్ సాయి తప్పకుండా వచ్చి ఆమెకు సహాయం చేస్తారని చెప్పారు.
మా నాన్నగారు చిన్న ఊదీ పొట్లం తీసి (యెప్పుడు తన పర్స్ లో పెట్టుకుంటారు) ఆమె తలగడ కింద పెట్టి, యింటికి వచ్చిన తరువాత, ఆమెకునయం చేయమని బాబాని ప్రార్థించారు. మూడవ రోజున పొద్దున్నే చౌపాతీ బంగళానుంచి ఒక పనివాడు బాంద్రాకు వచ్చి జ్యోతిబా (మా నాన్నగారు) ని తనతో కూడా తీసుకు రమ్మని పంపారని చెప్పాడు. మా తాతగారు, నాన్నాగారు ఆందోళనపడి జరగరానిది యేదీ జరగకూడదని ప్రార్థించారు. వారు వెంటనె చౌపాతీకి బయలుదేరారు. వారక్కడికి చేరుకోగానే తాతమ్మగారు మంచం మీద కూర్చుని ఉండటం, వారిని జీవితంలో కదిలించింది. ఆవిడ కన్నీళ్ళతో నిండి వుంది. "జ్యోతిబా, కిందటి రాత్రి సాయిబాబా యిక్కడికి వచ్చారు. ఆయన కాషాయ దుస్తులు థరించి తలకు తెల్లని గుడ్డ కట్టుకుని వున్నారు. ఆయనకి తెల్లని గడ్డం ఉంది. ఆయన నా మంచం దగ్గిర నుంచుని ఊదీతో ఉన్న ఆయన అఱచేతిని నా నుదిటిమీద వుంచి "అమ్మా యిప్పటినుంచీ నీకు నయమవడం మొదలవుతుంది. నయమవుతుంది " అని ఆయన అదృశ్యమయిపోయారు " ఆ తరువాత నాకు బాగా చెమటలు పట్టి నా జ్వరం యెగిరిపోయింది. పొద్దుటే నేను మామూలుగా ఉన్నాను. నేను నా పళ్ళు కూడా తోముకోకుండా పనివాడిని అద్దం తెమ్మని అడిగాను. నా మొహం చూసుకున్నాక నా నుదిటిమీద ఆయన ఊదీతో ఉన్న అఱచేయి ముద్రని స్పష్టంగా చూశాను. అప్పుడే నేను పనివాడిని నిన్ను తీసుకు రమ్మని పంపించాను. యిప్పుడు నువ్వే చూడు" అన్నారు తాతమ్మగారు. తాతమ్మగారి, మనవడి సంతోషానికి అవథులు లేవు. ఆక్షణంలో మా నాన్నగారు అప్పటికప్పుడే లార్డ్ సాయికి ఆయన చేసిన భగవత్ సేవలకి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. డా.తార్ఖడ్ (ముత్తాత) గారు కూడా ఆశ్చర్యపోయారు, కారణం ప్లేగు సోకిన ఆయన రోగులు చాలా మంది బతికి లేరు. వారు తమ బంగళాలో దాసగణు కీర్తనని ఏర్పాటు చేశారు. దానివల్ల తాతమ్మగారికి అప్పటికే సాయిదర్శనం అయింది. లార్డ్ సాయి తమంత తానుగా ఆమె కోరికను తీర్చారు. సాయీ నీకు మా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి నాకు మాటలు చాలవు. దయచేసి మా అందరిమీద నీ దివ్యమైన ఆశీస్సులు యెప్పుడూ కురిపిస్తూ ఉండు.

ప్రియమైన సాయి భక్త పాఠకులారా తార్ఖడ్ కుటుంబంలోని ఈ స్వీయ అనుభవంతో నేను ఈ అథ్యాయాన్ని ముగించదలచుకున్నాను. యికముందుకు వెళ్ళబోయేముందు, మేము దాదా అని పిలిచే మా నాన్నాగారి ఆత్మకు, విలువకట్టలేని ఆయన అనుభవాలని వివరించడంలో యక్కడయినా దాటవేసినా, యేమయినా తప్పులు చేసినా మనఃస్పూర్తిగా క్షమించమని, నేను వినయంగా ప్రార్థిస్తున్నాను.

ఆయన ఆత్మ యెక్కడున్నా సరే నన్ను క్షమిస్తుందని నాకు తెలుసు. కారణం ఈ పుస్తకం రాయడానికి ముఖ్య ఉద్దేశ్యం ప్రత్యేకంగా దాదాకి నమస్కరించడానికి ఆయన జీవించి ఉండగా నేను చేయలేనందుకు. అసలు చేయలేకపోవడంకన్నా ఆలశ్యంగా నయినా చేయడం మంచిదని నా ఉద్దేశ్యం.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

సాయితో మరికొన్ని అనుభవాలలో - భూతంతో యెదురు దాడి

0 comments Posted by tyagaraju on 12:39 AM








18.08.2011 గురువారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు

సాయితో మరికొన్ని అనుభవాలలో

భూతంతో యెదురు దాడి

ప్రియమైన పాఠకులారా మనం 21 వ శతాబ్దంలో పయనిస్తున్నామని నాకు బాగా తెలుసు. దెయ్యాలు ఉన్నాయని నమ్మడం చాలా కష్టం. నేను యింజనీరుని. సైన్స్ ని గట్టిగా నమ్మేవాడిని. ఈ ప్రపంచంలో ఉన్నాను. ఈ అనుభవం మా నాన్నగారిది పైగా అది కూడా నమ్మ శక్యం కాని బాబా చేసిన దైవసంబంథమయిన కార్యాలతో పవిత్ర ప్రదేశమైన షిరిడీ బాబా వారి కర్మ భూమిలో జరిగినది.. అందుచేత నేను మా నాన్నగారు చెప్పిన ఈ అనుభవం నాలో నిక్షిప్తమై ఉన్నదాన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకుని మీకు వివరిస్తాను. ఆయన షిరిడీ కి చేసిన యాత్రలలో, ఒక యాత్రలో ఒక రోజున పొద్దున్నే ఆయన కాలకృత్యాలను తీర్చుకుంటున్నారు.

యిది నది ఒడ్డు దగ్గరున్న వాగు వద్దజరిగింది. ఆయన ఒక రావి చెట్టుకింద కుర్చున్నారు. అప్పుడు యింకా చీకటిగా ఉంది, ఆయనకు తన ముందు ఒక అడవి కోడి కనపడింది. ఆ కోడికూస్తోంది.
కాని ఆ కూత శబ్దం చాలా చోద్యంగా ఉంది. మానాన్నగారు కూడా యింతకుముందు యెప్పుడూ అటువంటి కోడి కూత వినలేదు. ఆ కోడి మా నాన్నగారి దృష్టిని తనవైపుకు ఆకర్షించుకుంది. మా నాన్నగారు దానినే గమనిస్తున్నారు. హటాత్తుగా ఆ కోడి నలుపురంగు పాముగా మారిపోయింది. ఆ పాము పైకి నిటారుగా లేచి పడగ విప్పింది. మా నాన్నగారు భయపడి బాబా సాయంకోసం ప్రార్థించారు. కొంత సేపటి తరువాత ఆ పాము ఆక్కడినుంచి మాయమయిపోయింది. మా నాన్నగారికి చావు భయం పట్టుకుంది. మా నాన్నగారు తొందరగా కాలకృత్యాలను పూర్తి కానిచ్చి ఆ చోటునించి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు.అలా ఆయన ఆ ప్రయత్నంలో ఉండగా యెవరో " హే మానసా (మానవా) నేను ప్రతీరోజూ నడిచే చోట నువ్వు కూర్చుంటున్నావు. నా దారిలోంచి వెళ్ళిపొమ్మని నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను" అని అనడం విన్నారు. వెంటనే ఆయన ముందు అందవికారంగా ఉన్న ఒక మరుగుజ్జుమనిషి నిలబడ్డాడు.
మా నాన్నగారు అతనితో, అతను వెళ్ళడానికి అతని చుట్టూ చాలా స్థలం ఉందనీ అందుచేత తన కాల కృత్యాలు పుర్తవగానే, యేమయినప్పటికీ తానా ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపోతాననీ చెప్పారు. కాని ఆ మరుగుజ్జు యింకా యింకా పొడుగ్గా పెరిగిపోవడం మొదలెట్టి "నువ్వు నన్ను గుర్తించలేదా? నేను భూతాన్ని (వేతాళ్). యిది నా రాజ్యం నేను మరొకసారి నిన్ను యిక్కడినుంచి వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను" అన్నాడు.
మా నాన్నగారు బాగా భయపడినప్పటికీ, ఆ ప్రదేశానికి బాబాయే యజమాని మరేవరూ కాదని గుర్తు చేసుకుని, షిరిడీనుంచి వెళ్ళిపొమ్మనే అధికారం బాబాకే ఉందని అనుకున్నారు. మా నాన్నగారు చేతినిండా మట్టిని తీసుకుని బాబా పేరు ఉచ్చరిస్తూ, పొడుగ్గా ఉన్న ఆ భూతం మీదకు విసిరి, రక్షించమని బాబాని ప్రార్థించారు. ఆ భూతం ఉన్న ప్రదేశంలో పొగ పెద్ద రేఖలా అవడం చూశారు. ఆ పొగ గాలిలో కలిసిపోయింది.
మా నాన్నగారు ఆ ప్రదేశం నించి పరుగెత్తుకుని వెళ్ళిపోయారు. స్నానం చేశాక పలహారం చేసి, ద్వారకామాయికి వెళ్ళారు. ఆయన బాబా పాదాల వద్దకు చేరుకోగానే బాబా పరిహాసం చేస్తున్నట్లుగా "హే భావూ! ఈ రోజు పొద్దున్నే నా ఊదీ కావాలని దేనికడిగావు?" అన్నారు. మా నాన్నగారు ఆయన పాదాలమీద పడి జరిగినదంతా చెప్పారు. అలా చెబుతూ, మా నాన్నగారు అప్పుడు తన వద్ద ఊదీ లేదని షిరిడీ మట్టిని తీసుకుని (బాబావారి కర్మ భూమి) దానిని ఊదీగా భావించి ఆ భూతం మీదకు విసిరానని చెప్పారు. అది విని బాబా "భావూ ! నువ్వీరోజు మంచి పని చేశావు. నువ్వు ఆ భూతానికి ముక్తి కలిగించావు" అన్నారు. మా నాన్నగారు, తాను, తన దేవుడు అనగా బాబా నించి వచ్చిన సూచనల ప్రకారమే చేశానని కారణం ఆ భయానక క్షణంలో తనకు ఆలోచనాశక్తి నశించిందని చెప్పారు. ఆయన బాబాకు మనఃపూర్వకమైన థన్యవాదాలు తెలుపుకున్నారు. బాబా అనుమతితో ఈ ప్రపంచంలో భూతాలు, దెయ్యాలు నిజమేనా అని బాబాని అదిగారు. బాబా, "భావూ ! యిది కూడా భగవంతుని సృష్టి, కాని గుర్తుంచుకో నాశనకారికన్న రక్షించేవాడు యెప్పుడూ శక్తిమంతుడు. నేనిక్కడ పవిత్రమయిన ద్వారకామాయిలో కూర్చుని వుండగా నీకెవరూ హాని చేయలేరు. షిరిడీలో థైర్యంగా ఉండు" అని సమాథానమిచ్చారు.

ప్రియమైన సాయి భక్తులారా యిది చెపుతున్నపుడు మీరందరూ నన్ను నమ్మండి. నా శరీరం అంతా ప్రకంపనాలు వస్తున్నాయి. నేను మీఅందరినీ కోరేదేమంటే దయ చేసి దీనిని నమ్మండి. ఏ విథంగా చూసినప్పటికి అది మానాన్నగారి భ్రమ కాదు. కారణం ఆయనలా యెందుకు చేస్తారు? మా నాన్నగారికి జిజ్ఞాసతో మనసులో ప్రశ్నలు వస్తూఉంటాయని నాకు తెలుసు. బాబా వాటిని తనదైన శైలిలో పరిష్కరిస్తూ ఉండేవారు. ఆ కాలంలో చాలా మంది ఆయన భక్తులకి యిది జరిగి ఉండవచ్చు.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు


Tuesday, August 16, 2011

సాయితో మరికొన్ని అనుభవాలలో --బాబా గారి కఫ్నీని ఉతుకుట

0 comments Posted by tyagaraju on 8:57 PM





17.08.2011 బుథవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబా వారి శుభాశీస్సులు


సాయితో మరికొన్ని అనుభవాలలో --

బాబా గారి కఫ్నీని ఉతుకుట

నా ప్రయత్నంలో యిప్పుడు యింకా ముందుకు సాగుతూ, నేను బలంగా భావించేదేమిటంటే మా నాన్నగారు తన డైరీని రాసి ఉండవలసిందని. యిది, ఆయన బాబాతో సాంగత్యం దాని ఫలితంగా మిక్కుటంగా పెరిగిన అనుభూతులు దాని వల్ల లార్డ్ సాయి మీద ఆయనకు పెరుగుతూ ఉండే ప్రేమను గురించి కాలక్రమానుసారంగా వాటిని ఒక పథ్థతిలో తెలియచెప్పి ఉండేది. ఆయన లార్డ్ సాయిని మొట్టమొదటి సారి కలుసుకున్నపుడు తాను ఒక మహాశక్తిని కసులుసున్నానని గాని అది తన జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతుందనే మంచి భావం ఆయనకి వచ్చి ఉండకపోవచ్చును. నేననుకునేదేమినటే ఆ కాలంలో శ్రీ నరసిం హ సరస్వతి అనే ఒక స్వామి, బాబా లీలలను గురించి వివరంగా తెలియ చేసే డైరీని రాశారు. యిపుడివన్నీ కూడా తరువాతి ఆలోచనలు. నేను కూడా నాకు కలిగిన కొన్ని సంఘటనలు తేదీల వారీగా వాటిని రాసి పెట్టుకోలేదు. మా నాన్నగారి అనేకమైన మహాద్భుతమైన అనుభవాలతో పోల్చుకుంటే నా అనుభవాలు చాలా కొద్ది మాత్రమేనని చెప్పనవసరం లేదు.

బాబా మీద మా నాన్నగారి భక్తి ఆరోహణక్రమంలో ఉన్నప్పటికీ, బాబాకి తన భక్తునితో బంథాన్ని బలపరచుకోవడానికి ప్రత్యేకమైన నేర్పు ఉండేది. మా నాన్నగారు షిరిడీలో ఉన్నప్పుడు అక్కడి స్థానికుల ద్వారా బాబా వారి స్నానం కూడా ఒక ప్రత్యేకమైన పథ్థతిలో ఉండేదని తెలుసుకున్నారు.

ఆయన తన శరీరాన్ని మనందరిలాగా బాహ్యంగా తోముకుని శుభ్రం చేసుకోవడమే కాదు, తన లోపలి భాగాలని కూడా తోముకుని శుభ్రం చేసుకునేవారు. ఆయన తమ ప్రేవులను బయటకు తీసి, శుభ్రం చేసుకుని తిరిగి శరీరంలో పెట్టుకునేవారు. రాముడు, కృష్ణుడు మాత్రమే అటువంటి అష్ట సిథ్థులతో జన్మించారని మా నాన్నగారు చెపుతూ ఉండేవారు. ఆ కారణం చేతనే వారు మానవ రూపంతో ఉన్న దేవుళ్ళని పిలవబడ్డారు. ఆయన అభిప్రాయం ప్రకారం బాబా పుట్టుకను గురించిన వివరాలు తెలియవు. కాని ఆయన లీలలు అన్ని విషయాలలోనూ సరిసమానంగా మహా శక్తితో పోటీపడుతూ, సరిపోలుతూ ఉంటాయి.

ఆయన షిరిడీకి వెళ్ళినపుడు ఒకసారి, బాబా ఆయనతో తనతో కూడా తాను స్నానం చేసే ప్రదేశానికి రమ్మని అక్కడ ఒక ప్రత్యేకమయిన పని ఇస్తాననీ చెప్పారు. మా నాన్నగారు అటువంటి పనికి యెప్పుడూ ఇష్టమే. తనకు మరొక దివ్యానుభూతి కలగవచ్చని ముందే ఊహించారు. బాబా "భావూ ! ఈ పని చాలా సులువు. నేను స్నానం చేస్తాను. స్నానం చేస్తూండగా నువ్వు నా కఫ్నీని ఉతికి పెట్టు. ఉతికిన తరువాత, దానిని నీ రెండు చేతులతో యెత్తి యెండలో ఆరే దాకా పట్టుకుని వుండు. నేను చాలా సేపు స్నానం చేస్తానని నీకు తెలుసు. అంచేత నేను స్నానం పూర్తి చేసేటప్పటికి అది ఆరిపోతుంది. దానిని నేనుమరలా వేసుకుంటాను. గుర్తుంచుకో అది ఆరేటప్పుడు అది నేలను తాకకూడదు" అన్నారు.


మా నాన్నగారు వెంటనె ఒప్పుకుని ఆపని చేయడానికి తయారయారు.

వారిద్దరూ లెండీ బాగ్ కి వెళ్ళారు. అక్కడ రేకులతో కట్టబడిన గది ఉంది. ఒక పెద్ద నలుచదరంగా ఉన్న రాయి బాబా స్నానికుపయోగించేది ఉంది. మా నాన్నగారు స్నానాల గది బయట బాబా గారు, ఉతకడానికి కఫ్నీ యిస్తారని యెదురు చూస్తున్నారు.


బాబా గారు పిలిచి కఫ్నీ యింకా యివ్వకపోయేసరికి మా నాన్నగారు కొంచెం అసహనంతో ఉన్నారు. బాబా చేస్తున్న చమత్కారాలలో అది ఒకటి అనుకున్నారు. తలుపుకి ఉన్న చిన్న ఖాళీ గుండా గది లోపలికి చూద్దమని నిర్ణయించుకున్నారు. నమ్మశక్యం కాని విథంగా బాబా శరీరం ప్రతి అణువునుంచి వెలుగు కిరణాలు ప్రసరిస్తూ ఉండటం చూశారు.


అటువంటి శక్తివంతమైన కాంతిని ఆయన భరించలేకపోయారు. కళ్ళు పోతాయేమోనని భయం వేసింది. తన తప్పుడు పని కూడా బయట పడుతుందేమోనని కూడా అనుకున్నారు. అదే క్షణంలో బాబా తన కఫ్నీని తీసుకుని ఉతకమని చెప్పి పిలవడం వినపడింది. మా నాన్నగారు కఫ్నీ తీసుకుని దగ్గరనున్న బావి వద్దకెళ్ళి సబ్బుతో బాగా శుభ్రంగా ఉతికారు. నీరు బాగా పిండి, దాన్ని తన రెండు చేతులతో యెత్తి యెండలో యెత్తి పట్టుకున్నారు. బాగా తేలికగా ఉండటంతో మొదట బాగానే భరించారు, కాని సమయం గడిచే కొద్దీ యెండకు యెండి తేలికవడానికి బదులు బరువుగా అవడం మొదలెట్టింది. తాను ఆపరీక్షలో తప్పుతానని మా నాన్నగారికి అర్థమయింది. కారణం తొందరలోనే కఫ్నీ నేలని తాకుతుంది. ఈ కఠినతరమైన కార్యంలో కృతకృత్యుడవటానికి తగిన బలాన్నిమ్మనమని ఆయన హనుమంతుడిని ప్రార్థించి ఆయన సహాయం తీసుకుందామని నిర్ణయించుకున్నారు. ఆయన హనుమంతుడిని ప్రార్థిస్తుండగా బాబా లోపలినించి అరుస్తూ "హే భావూ ! హనుమాన్ ని సహాయం కోసం యెందుకు పిలుస్తున్నావు?" అన్నారు. సంశయం లేకుండా బాబా 'అంతర్ద్యాని' (మనసులోని ఆలోచనకు గ్రహించే శక్తి కలిగి ఉండటం) మనసులోని ఆలోచనను ఉన్నది ఉన్నట్లుగా చదవగలగడం. బాబా దిగంబర శరీరాన్ని చూడటానికి ప్రయత్నించి తప్పు చేశానని అందుకు మన్నించమని మా నాన్నగారు బాబాని కోరారు. బాబా ఆయన తప్పుని మన్నించగానే, మా నాన్నగారు కఫ్నీ తేలికగా అయిపోవడం గమనించారు. మా నాన్నగారు బాబాకు కృతజ్ఞతలు చెప్పి, అటువంటి సాహసకార్యాలు చేయనని ఒట్టు పెట్టుకున్నారు. బాబా నుంచి యెవరూ యేదీ దాచలేరని అర్థమయిందాయనకి.


అందుచేత బాబా వారి బోథనలు అంత గొప్పవి. మీ అనుమతితో నేను స్వతంత్రంగా ఈ మాట చెప్పనా, "బాబా ప్రత్యక్షంగా స్వయంగా చేసిన బోథనలతో దీవెనలు అందుకున్నవారు అదృష్టవంతులు"



సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు





Monday, August 15, 2011

సాయితో మరికొన్ని అనుభవాలలో - అగ్నితో యుధ్ధం

0 comments Posted by tyagaraju on 9:00 PM






16.08.2011 మంగళవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి


సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు


ఈ రోజు యితర సాయి లీలలలో మరొక లీల తెలుసుకుందాము.


సాయితో మరికొన్ని అనుభవాలలో


అగ్నితో యుధ్ధం

ప్రియమైన సాయి భక్తులారా ! ప్రమాదవశాత్తు కొలిమిలో పడ్డ కుమ్మరివాని కుమార్తెను బాబా రక్షించారని మీకు తెలుసు. అలా చేస్తున్నపుడు ఆయన చేతులకి విపరీతంగా కాలిన గాయాలయ్యాయి. భాగోజీ షిండే అనే కుష్టువాడు ఆయన గాయాలకు నెయ్యి రాసి గుడ్డ పీలికలతో కట్టు కట్టేవాడు. బాబా తనచేతులనే తెడ్డుగా ఉపయోగించి వేడి పప్పును గాని మాంసపు కూరను గాని కలియబెట్టే వారు. ఈ పదార్థాలనే ఆయన భక్తులకు ప్రసాదంగా యిచ్చేవారు. ఆయన పవిత్రమైన చేతుల స్పర్శ ఆ పదార్థాలని విపరీతమైన ఔషథగుణాలతో ప్రభావితం చేసేదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. వాటిని ప్రసాదంగాతిన్నపుడు అది వెంటనే అన్ని రోగాలను పారద్రోలేది. యేమయినప్పటికి యిక్కడ మీకందరకు అపూర్వమైన సంఘటన ఒకటి వివరిస్తాను.

ఒక రోజు పొద్దున్నే మా తాతగారు ఒక కల కన్నారు. ఆయన, కలలో ఖటావూ మిల్ల్స్ అగ్నిజ్వాలలలో ఉండటం చూశారు. దాని ఫలితంగా ఆయనకి నిద్రా భంగమయింది. భోజనాల బల్ల వద్ద ఆయన మా నాన్నగారికి ఈ విషయంగురించి చెప్పినప్పుడు వారు మిల్ల్స్ యజమాని ధరంసీ ఖటావూ గారికి తెలియ చేద్దామని నిర్ణయించుకున్నారు. గ్రూపు ఆఫ్ మిల్ల్స్ కి సెక్రటరీగా ఆయన, మిల్ల్స్ కి తగిన విథంగా అగ్నిప్రమాదాలకి రక్షణగా భీమా చేయించమని మిల్ల్స్ యజమానికి సలహా యిచ్చారు. ఆ రోజుల్లో భీమ రక్షణ సాథారణం కాదు. యెందుకంటే దానికి పెట్టే డబ్బు ఖర్చు లాబాలలో తగ్గిపోతుందని

ఫైనాన్షియల్ మానేజర్స్ (ఆర్థిక నిర్వాహకులు) (మునింజీ) వ్యతిరేకించేవారు. ఆఖరికి మా తాతగారు ధర్మసీ గారిని ఒప్పించడంలో కృతకృత్యులయ్యారు. వారు మొత్తం టెక్స్ టైల్ మీల్ కి తిరిగి మదింపు చేయడానికి యేర్పాటు చేసి, మిల్ల్ యొక్క పెంచబడిన విలువకి భీమా రక్షణ తిరిగి రాయించారు.

5, 6 నెలల తరువాత ఒక రోజు పొద్దున్నే మిల్లులో అగ్నిప్రమాదం జరిగిందని మిల్లునించి ( S O S ) వార్త వచ్చింది. వారు వెంటనే బయలుదేరి మిల్లు దగ్గిరకి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న వెంటనే మిల్లులోని వీవింగ్ డిపార్ట్ మెంట్ మంటల్లో ఉండటం చూశారు.


వారిద్దరూ ఆ మంటలని ఆర్పమని, మిల్లు పూర్తిగా నాశనమవకుండా, సహాయం చేయమని బాబాని కోరుతూ ప్రార్థించారు. వారు వీవింగ్ డిపార్ట్ మెంట్ ఉన్న రెండవ అంతస్థులోకి యెక్కి వెళ్ళేసరికి, అక్కడ ఒక ఫకీరు తలకి ఒక గుడ్డ కట్టుకుని మంటల మధ్యలో నిలబడి తన రెండు చేతులను ఊపుతూ మంటలనార్పడానికి ప్రయత్నిస్తూ ఉండటం చూసి వారు చాలా ఆశ్చర్యపోయారు. మా తాతగారు మా నాన్నగారితో "మంటలనార్పడానికి ప్రయత్నిస్తున్నది మన బాబా కాదూ ?" అన్నారు. బాబా తమ ప్రార్థనలకు స్పందించారని వారికి నిర్థారణ అయింది. మంటలు అదుపులోకి రావడానికి ఒక గంట పైన పట్టింది. వీవింగ్ డిపార్ట్ మెంటుకు జరిగిన నష్టం పరిమితంగానే ఉండటం వల్ల మిల్లును మూసివేయాల్సిన అవసరం లేకపోవడంతో వారంతా ఊపిరి పీలుచుకున్నారు. భీమా రక్షణ కూడా ఉండటంవల్ల ఆర్థికంగా జరిగిన నష్టాలకి భీమా నష్ట పరిహారం కూడా వచ్చింది.

మిల్లులో కార్యకలాపాలు సాథారణ స్థితికి చేరుకోగానే వారిద్దరూ షిరిడి వెళ్ళి బాబాకు థన్యవాదాలు తెలుపుకున్నారు. వారు ద్వారకామాయి మెట్ల దగ్గర ఉన్నప్పుడు బాబా మా తాతగారితో, "ఏయ్ ! ముసలివాడా ! (మ్హతార్యా) నీ మిల్లుని యెవరు నిర్వహిస్తున్నారు?" అన్నారు. మా తాతగారు ఆయన పాదాల ముందు సాగిలపడి తమందరిమీద నిరంతరం ఆయన దీవెనలు యిస్తూ ఉండమని చెప్పారు. మంటలతో యుథ్థం చేసినందుకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఆయన అక్కడికక్కడే, నిజమైన సెక్రటరీ ఆయనే అని బాబాకి నిర్థారణగా చెప్పారు. యిది వినగానే బాబా తన ఆసనం నించి లేచి, బాబా సాహెబ్ తార్ఖడ్ ని కిందనించి లేపి " హే ముసలివాడ, పైకి లే,అత్యంత ప్రమాదాల బారినుండి నా భక్తులను బయటకు లాగడానికి నేను కట్టుబడి ఉన్నాను గుర్తుంచుకో" అన్నారు. ఈ ద్వారకామాయినుండి నా భక్తుల కోసం నేను సర్వ కార్యములు నిర్వహిస్తాను. నాభక్తుడు నాకు ప్రమాద సంకేతం యిచ్చిన వెంటనే అతను ఈ ప్రపంచంలో యెక్కడ ఉన్నా సరే నేనక్కడ అతని సేవకై ఉంటాను."


అది ఒక అపూర్వమైన సంఘటన అని మీరంతా నాతో ఏకీభవిస్తారని నాకు తెలుసు.


ఓ లార్డ్ సాయీ నేను నీముందు నీ లీలలముందు వినయమగా నమస్కరిస్తున్నాను.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.

Sunday, August 14, 2011

సాయితో మరికొన్ని అనుభవాలలో ...

0 comments Posted by tyagaraju on 6:04 PM







సాయితో మరికొన్ని అనుభవాలలో ....
నానావలీ కోతి చేష్టలు
మోరేశ్వర్ ఆస్త్మా వ్యాధి నయమగుట
పుచ్చకాయ తొక్కను తినుట
కీటకాలను చంపుట


బాబాతో మరికొన్ని అనుభవాలు


ప్రియమైన పాఠకులారా ! యింతకు ముందు చెప్పినట్లుగా మా నాన్నగారు సుమారుగా 17 సార్లు షిరిడీకి వెళ్ళారు. అలా వెళ్ళిన ప్రతిసారి 7 రోజుల నుంచి ఒక నెల దాకా వుంటూండేవారు. అక్కడున్న కాలంలో వారు ఆసక్తికరమయిన లీలలను చూడటం జరుగుతూ ఉండేది. వారికి షిరిడీని వదలి వెళ్ళాలనిపించేది కాదు. కాని, బాబా యెప్పుడయితే వానిరి షిరిడీనించి వెళ్ళిపొమ్మనేవారో అప్పుడు వారు షిరిడీ నుంచి వెళ్ళిపోయేవారు. మా నాన్నగారి వద్ద అటువంటి మంచి అనుభవాల సేకరణ ఉంది, నాకవన్నీ గుర్తుండకపోవచ్చు. ఈ అనుభవాలలో సాయి సచ్చరిత్రలో వివరింపబడని కొన్నిటిని ఈ అథ్యాయంలో వివరించటానికి ప్రయత్నిస్తాను. ఆ రోజులలోనున్న సాయి భక్తులకు అటువంటి అనుభవాలు యెన్నో కలిగే ఉంటాయని నాకు బాగా తెలుసు, వారు వాటిని తమ దగ్గరవారికి కూడా చెప్పే ఉంటారు. బాబా మీద నాకున్న స్సచ్చమైన ప్రేమ, భక్తి వల్ల నేను వాటిని మీకు వివరిస్తున్నాను.

నానావలీ


సాయిబాబాకి తలతిక్క స్వభావం గల నానావలీ అనే భక్తుడుండేవాడు. నేనతనిని చంచల స్వభావి అని స్వేచ్చగా అనడానికి కారణం అతను కోతిచేష్టలు చేస్తూ ఉండేవాడు. అవి జనాలకి కోపం తెప్పిస్తూ ఉండేవి. వారు అతని దుష్ప్రవర్తన గురించి బాబాకి ఫిర్యాదు చేస్తూ ఉండేవారు. మానాన్నగారికి నానావలీ అంటే వేరొక విథమైన ఆదరణ ఉండేది. అతను హెర్నియాతో బాథపడుతూ ఉండటం వల్ల, అలా పెరిగిన భాగం నేలను తాకుతూ ఉండేది. అతను ఆ విథంగానే నడుస్తూ ఉండేవాడు.
అప్పుడప్పుడు అతను గుడ్డ పీలికలని తన పైజామాకి వెనకాల కట్టుకుంటూ ఉండేవాడు. అది పొడుగ్గ తోకలాగా తయారయేది. అప్పుడతను కోతిలాగా గెంతుతూ ఉండేవాడు.


గ్రామంలోని పిల్లలంతా అతని కోతి చేష్టలకి పరిహాసంచేస్తూ ఉండేవారు. ఆ స్థితిలో అతను బాబా దగ్గిరకి పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లల తాకిడినించి రక్షించమనేవాడు. ఈ మనిషి అంత హెర్నియాతో ఉండి కూడా అంత వేగంగా యెలా పరిగెత్తగలిగాడో అని మా నాన్నగారు విస్మయం చెందుతూ ఉండేవారు. అతను పిచ్చివాడని ఆయనెప్పుడూ అనుకోలేదు. నానావలి మా నాన్నగారిని 'గవాల్యా' అని పిలుస్తూ ఉండేవాడు. ఆయనని భోజనం కోసం అర్థిస్తూ ఉండేవాడు. అప్పుడు మా నాన్నగారు సగుణ నడిపే హొటలుకు వెళ్ళి అతనికి కడుపునిండా భోజనం పెట్టమని చెప్పేవారు. మా నాన్నగారి అభిప్రాయం ప్రకారం సాయిబాబా, నానావలీ, రాముడు, ఆయన గొప్పభక్తుడైన హనుమాన్ జంటలా ఉండేవారనుకునేవారు. ఒకసారి నానావలీ బాబాతో తనని ఆయన ఆసనంలో కూర్చోనిమ్మని అథికారికంగా అడిగాడు. బాబా అతన్నదానికి అనుకూలంగా స్పందించి తన ఆసనం నుండి లేచి, నానావలిని అక్కడ కూర్చోనిచ్చారు. నానావలి అక్కడ కొంచెంసేపు కూర్చుని లేచి, "దేవా, నువ్వు మాత్రమే ఈ ఆసనాన్ని అథిష్టించగలవు. కారణం అది నీకు తగినది. నా సరియైన స్థానం నీ పాదాల దగ్గిర మాత్రమే" అన్నాడు. బాబాని అలా తన ఆసనంలో కూర్చొనిమ్మని అడగటానికి నానావలికెంత గొప్ప థైర్యం ఉందో , యింకా తనకిష్టుడైన నానావలిమీద బాబా యొక్క అమితమైన ప్రేమ ఆయనని తన ఆసనాన్ని యిచ్చేలా చేయడం మీరందరూ ఊహించుకోవచ్చు. కాని మా నాన్నగారు వారిద్దరినీ రాముడు, హనుమాన్ జంట అనుకోవడానికి కారణం వేరే ఉంది. ఒకసారి నానావలి మానాన్నగారితో " హే గవాల్యా నాతో కూడా రా, నీకొక తమాషా చూపిస్తాను" అన్నాడు. అతను మా నాన్నగారిని ద్వారకామాయికి దగ్గరగా ఉన్న చావడి లోకి తీసుకుని వెళ్ళాడు. బాబా అక్కడ చావడిలో కూర్చుని ఉన్నారు. యిక ఆలశ్యం చేయకుండా నానావలి తన ఆకారాన్ని తగ్గించుకుని 'హండీ' లో (హండీ - చావడిలో పై కప్పుకి చిన్న చిన్న తాళ్ళతో కట్టబడి ఉన్న గాజు గిన్నెలు) పట్టేటంత చిన్నగా తనకి తాను సులువుగా పైకి గెంతి పైన ఉన్న ఒక హండీలో కూర్చున్నాడు. అతను హండీలో ఒక కోతిలా కూర్చుని మా నాన్నగారిని వేళాకోళం చేశాడు. అది చూసి మా నాన్నగారు ఆశ్చర్య పోయారు. అది నమ్మశక్యం కానిది. అది ఒక అద్భుతం తప్ప మరేమీ కాదు. నానావలి తన పెద్ద శరీరంతో అంతపైకి యెలా గెంతగలిగాడు. తన శరీరాన్ని దానికి తగినట్లుగా చిన్నది చేసుకుని హండీలో యెలా కూర్చోగలిగాడు. అది సామాన్యంగా ఆశ్చర్యకరమైనదీ, నమ్మశక్యం కానిదీ. అప్పుడాయన సాయిబాబా నానావలీ యిద్దరూ రాముడు, హనుమంతుడు అవతారాలని అర్థమయింది. ఆయన వెంటనే బాబా ముందు సాష్టాంగపడి ఆయనని పూజించారు.

ప్రియమైన సాయి భక్త పాఠకులారా, బాబా సమాథి చెందిన తరువాత నానావలి చాలా విచారంలో మునిగిపోయి పదమూడవ రోజున అతను ఈ ప్రపంచాన్ని వదలి వెళ్ళిపోయాడు. లెండీ బాగ్ ద్వారానికి తూర్పువైపున నానావలి సమాథి ఉంది. నేను షిరిడీ వెళ్ళినపుడు యెప్పుడూ దానిముందు నమస్కరిస్తాను. లార్డ్ సాయికి, ఆయన లీలలకు కోటి కోటి ప్రణామాలు.



సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు


మోరేశ్వర్ ఆస్త్మా నయమగుట


మోరేశ్వర్ బాబాబాకు సన్నిహిత భక్తుడు. ఆయన బొంబాయి హైకోర్టు జడ్జీ. ఆయన ఆస్త్మాతో విపరీతంగా బాథ పడుతున్నారు. ఆయన మా తాతగారితో బ్రిడ్జ్ ఆట (పేకాట) లో భాగస్వామిగా ఉండేవారు. ఆయన ఆస్త్మా తగ్గడానికి మాతాతగారు ఆయనని షిరిడీ వెళ్ళమని సలహా యిచ్చారు. ఆయనందుకు ఒప్పుకున్నారు. ఆయన షిరిడీకి మొట్టమొదట వెళ్ళగానే, బాబా ఆయనకి స్వయంగా చిలిం (ఒక మట్టి గొట్టంతో బాబా పొగ పీలుస్తూ ఉండేవారు) యిచ్చి పీల్చమన్నారు. మోరేశ్వర్ కొంచెం ఆండోళన పడ్డారు, కాని చిలిం పీల్చారు. అది ఒక అద్భుతం. ఆక్షణం నించీ ఆయనకి ఆస్త్మా రాలేదు. ఒక వ్యక్తి వ్యాథిని నయం చేయడానికి యెటువంటి విచిత్రమైన విథానం? మోరేశ్వర్ మా తాతగారికి థన్యవాదాలు చెప్పుకున్నారు. అప్పటినుంచి ఆయన శ్రీ సాయిబాబా కి గొప్ప భక్తుడయ్యారు. అది 1918 సం. విజయదశమి రోజు మధ్యాహ్న్నం తరువాత హటాత్తుగా మోరేశ్వర్ గారికి ఆస్త్మా వచ్చింది. అది చాలా విపరీతంగా ఉండటంతో ఆయన తన సేవకుడిని బాంద్రా పంపి మా తాతగారిని శాంతాక్రజ్ లో ఉన్న తన యింటికి రమ్మన్నారు. మోరేశ్వర్ గారి సేవకుడు మా తాతగారితో తన యజమాని హటాత్తుగా జబ్బుపడ్డారని, వెంటనే వచ్చి సహాయం చేయమని అడిగాడు. మా తాతగారు మా నాన్నగారితో కలిసి యింటినుంచి బయలుదేరారు. వారు తమతో కూడా వారు ఆఖరుసారి షిరిడీ వెళ్ళినపుడు బాబా స్వయంగా యిచ్చిన ఊదీని తీసుకుని వెళ్ళారు. మోరేశ్వర్ విపరీతమైన బాథతో ఉండటం చూశారు. మాతాతగారాయనని ఓదార్చారు. మా తాతగారు గ్లాసు నీళ్ళలో ఊదీని వేసి మోరేశ్వర్ తో దానిని తాగమన్నారు. మోరేశ్వర్ ఆయనని తన సన్నిహిత స్నేహితునిగా భావిస్తున్నందున ఆయన చెప్పినట్లు చేశారు. యెప్పుడయితే ఆయన ఆనీటిని తాగారో ఆయన బాథయొక్క తీవ్రత తగ్గుతూ కొంత సేపటికి ఆయనకి నయమనిపించింది. మోరేశ్వర్ మా తాతగారితో, బాబా తన ఆస్త్మా పూర్తిగా నయమయిందని చెప్పినా మరి మరలా యెందుకు తిరగబెట్టిందని అడిగారు. మా తాతగారు ఆయనతో చింతించవద్దని, ఒకవేళ మరలా వస్తే కనక బాబా ఊదీనే మందులా తీసుకోమని చెప్పారు.
యేమయినప్పటికీ మోరేశ్వర్ యిక యేమీ చేయనవసరం లేకపోయింది. ఊదీ తీసుకున్నందువల్ల ఖచ్చితంగా ఆస్త్మా తగ్గిపోయింది కాని ఈ సంఘటన వెనుక వేరే ఏదో సందేశం ఉంది. వారికది తరువాత అర్థమయింది. అదేరోజు సుమారు మధ్యాహ్న్నం 2 గంటలకి షిరిడీ సాయిబాబా సమాథి చెందారు. అలా చెందుతూ ఆయన తనదైన సంక్లిష్టమయిన పథ్థతిలో తన అంకిత భక్తులకి తంత్ర రహిత (వైర్లెస్) సందేశం పంపించారు. మ తాతగారికి, నాన్నగారికి ఆ తంత్రరహిత సందేశం వచ్చింది. దానిని గురించి మీకు తరవాతి అథ్యాయంలో వివరిస్తాను.

పుచ్చకాయ తొక్కను తినుట

బాబా గారు జీవించి ఉన్న కాలంలో షిరిడీ వెళ్ళిన కొంతమంది ఆయన ఆశీర్వాదములని పొందలేకపోయేవారు. వారికి ఆయన మీద నమ్మకం లేకపోవడం వల్ల కావచ్చు లేక వారికి సహనం లేకపోవడం వల్ల కావచ్చు. వీరంతా థనిక వర్గానికి చెందినవారు. షిరిడీ వెళ్ళినపుడు పేదవానిగా కనపడే ఆయన జీవిత విథానాన్ని చూసి అటువంటి 'ఫకీరు' తమ సమస్యలని యెలా తీర్చగలడా అని ఆలోచిస్తూ ఉండేవారు. కాని, బాబా సమస్యలని పరిష్కరించే విథానం చాలా వినోదకరంగానూ, మొదటి కలయికలోనే అర్థం చేసుకోవడానికి కష్టంగానూ ఉండేవి.

అది వేసవికాలం. తట్టనిండా పుచ్చకాయలు పెట్టుకుని అమ్ముకునే ఒకామె ద్వారకామాయి దగ్గరకొచ్చింది. బాబా మొత్తం పుచ్చకాయలన్నిటినీ కొనేశారు. ఆయన ఒకటి కోసి ముక్కలు చేసి అక్కడున్న భక్తులందరికీ పంచడం మొదలెట్టారు.


వారందరూ పుచ్చకాయ తింటూ ఆనందిస్తున్నారు. అక్కడే ఉన్న మా నాన్నగారికి బాబా పుచ్చకాయ ముక్కనివ్వలేదు. ఆ సమయంలో మంచి దుస్తులు థరించిన ఒక థనికుడు తన యిద్దరు సేవకులు తోడు రాగా ద్వారకామాయిలోకి ప్రవేశించాడు. అతను చక్కెర వ్యాథితో బాథ పడుతున్నాడు. యెవరో యిచ్చిన సలహా మీద అతను షిరిడీకి వచ్చాడు. బాబా ఒక వినోదం చేశారు. ఆయన ఒక ముక్కని తీసుకుని తొక్కని, గుజ్జు భాగాన్ని వేరు చేశారు. గుజ్జుని మా నాన్నగారికి తొక్కని థనికివ్యక్తికి యిచ్చి తినమన్నారు. ఆ థనికుడు కొంచెం కలవర పడి తొక్క తినడానికి తాను ఆవుని గాని, మేకను గాని కానని చెప్పాడు. బాబా దానినే మా నాన్నగారికిచ్చి "హే భావూ, నువ్వే దీనినిప్పుడు తినాలి" అన్నారు. మా నాన్నగారు దానిని కొరికినప్పుడు ఆశ్చర్యకరంగా అది అరటిపండులాగా మెత్తగా ఉండి తను అంతకు ముందు తిన్న గుజ్జుకన్నా మథురంగా ఉంది.తన జీవితంలో యెప్పుడు అటువంటి తీయని పుచ్చకాయను తినలేదని మా నాన్నగారు చెపుతూ ఉండేవారు. ఆ థనిక వ్యక్తి సిగ్గుపడి అక్కడినించి వెళ్ళిపోయాడు. అతను బహుశా తన చక్కెర వ్యాథిని శాశ్వతంగా నయమయే ఆవకాశాన్ని పోగొట్టుకున్నాడు. మా నాన్నగారు తన 70 వ యేట మరణించారు. అప్పటివరకూ ఆయనకు చక్కెరవ్యాథి లక్షణాలు లేవు. ప్రియమైన భక్తులారా, నిజమైన మందు ఆ పదార్థంలో లేదు కాని బాబాగారి పవిత్ర హస్తాలలో ఉంది. ఆయన ఆ పదార్థానికి పవిత్రమయిన స్పర్శనిస్తూ ఉండటంవల్ల అది మథురంగా మారుతుంది. ఈ సత్యాన్ని తెలుసుకున్న భక్తులు యెంతో లబ్ధిని పొందారు. బాబా చెప్పిన ముఖ్యమయిన సూత్రాలు 'శ్రథ్థా అంటే నమ్మకం, 'సబూరీ' అంటే సహనం. ఈ రెండు మంత్రాలని ఆచరించినవారికి జీవితంలో యెప్పుడూ విజయమే.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు


కీటకాలను చంపుట

బాబా ఉన్నకాలంలో భక్తులు షిరిడీకి వచ్చినప్పుడు వారు స్వచ్చందంగా కొన్ని పనులు చేస్తూ ఉండేవారు. (విథులు నిర్వర్తిస్తూ ఉండేవారు) ద్వారకామాయిని శుభ్రం చేయడం, బాబా ద్వారకామాయి నుండి లెండీ బాగ్ కి రోజూ నడచి వెడుతూండే దారిని శుభ్రం చేయడంవంటివి చేస్తూ ఉండేవారు. ఈ విథులు యెవరికీ కూడా చేయమని యెవరూ అప్పగించలేదు. కాని భక్తులే అటువంటి సామాజిక సేవల ద్వారా తమ భక్తిని (పూజని) బాబాకి సమర్స్పిస్తున్నట్లుగా వాటిని చేస్తూ ఉండేవారు. షిరిడీలో నివసించే భక్తులు అటువంటి విథులన్నిటినీ క్రమం తప్పకుండా చేస్తూ ఉండేవారు. మా నాన్నగారు షిరిడీ వెళ్ళినపుడెల్లా పెట్రొ మాక్స్ దీపాలను శుభ్రం చేయడం, సాయంత్రం వేళల్లో వాటిని వెలిగించి ద్వారకామాయి అంతటా వాటి వాటి స్థానాల్లో వేలాడదీయడం వంటి బాథ్యత ఆయన తీసుకుని చేసేవారు.

ఆయన తన మనసులో సందేహాలు యేమన్నా ఉంటే బాబాని అడిగి వాటిని నివృత్తి చేసుకోవడానికి ఆ సమయాన్ని ఉపయోగించుకుంటూ ఉండేవారు. ఒక సారి ఆయన తానింక పెట్రో మాక్స్ దీపాలను వెలిగించనని యెందుకంటే ఆ పని తనని పాపిని చేస్తోందని చెప్పేశారు. లాంతరులు వెలిగంచగానే తరువాత చీకటి పడుతోందనీ, యెన్నో పురుగులు దీపాల చుట్టూ చేరి కొంతసేపు తిరుగుతూ దీపాల కింద పడి చనిపోతున్నాయనీ అటువంటప్పుడు తాను దీపాలను వెలిగించకపోతే కనక పురుగులు రావు అంచేత పురుగులు చనిపోయే అవకాశం ఉండదు కదా.

మా నాన్నగారు ప్రాథమికంగా, దేవుడు అటువంటి విపరీతాన్ని యెందుకు సృష్టించాడనీ ఆ విషయంలో బాబా వివరణను తెలుసుకోవాలనుకున్నారు. బాబా ఆ ప్రశ్నకు నవ్వి, " హే భావూ ! నువ్వు పిచ్చివాడివి. నువ్వు లాంతరులు, దీపాలు వెలిగించనంత మాత్రాన ఈ పురుగులన్ని చనిపోవా? అవి యెక్కడ దీపాలున్నా, వెలుతురున్నా అక్కడికి వెళ్ళి అక్కడ చస్తాయి. యిదంతా భగవంతుని సృష్టి. ఆయన వాటిని పుట్టించే సమయంలోనే వాటి చావుని కూడా నిర్ణయిస్తాడు. ఒకవేళ లాంతరుగాని, దీపంగాని లేకపోతే మరొక ప్రాణి వాటిని అంతం చేస్తాయి. ఈ విథమైన పనులన్ని కూడా మానవులకు పాపాలు జమ అవవు. నీ ముఖ్యమైన ఉద్దేశ్యందీపాలను వెలిగించి ద్వారకామాయిలో చీకటిని పారద్రోలడం. అందుచేత భక్తులు సులభంగా పూజ చేసుకోగలగడానికి. నువ్వు యెటువంటి పాపాల పనిలోనూ పాల్గోటంలేదు. పురుగులు చనిపోతున్నాయనే నిజమే నిన్ను బాథిస్తున్నదంటే, నీకు దయగల హృదయం ఉందండానికి గుర్తు. భగవంతునికి తన విథులు బాగా తెలుసు. మనం ఆయన పనులలో కల్పించుకోకూడదు. ఆయన మనలో ప్రాణం పోసినప్పుడే దాని ప్రక్కనే మన మరణాన్ని కూడా నిర్ణయించేస్తాడు. అందుచేత నువ్వు ఆందోళన పడకుండా నీకు సంతోషాన్నిచ్చే పనిని చేస్తూ ఉండు. దేవుడు నీ యెడల దయగా ఉంటాడు. (అల్లాహ్ భలా కరేగా)
బాబావారి బోథనలు చాలా సరళంగానూ, నచ్చచెప్పే పథ్థతిలోనూ ఉంటాయి. ఈ సంఘటన ద్వారా ఆయన మా నాన్నగారికి మంచి సలహా మందు వేసి భగవంతుడు చేసే పనిని గురించి యెరుకతో ఉండేలా చేశారు.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు


(మరికొన్ని తరువాయి భాగంలో)




 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List