Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, June 17, 2011

ప్రేయర్స్ టూ షిరిడీ"

0 comments Posted by tyagaraju on 8:15 AM








17.06.2011 శుక్రవారము


సాయిబంథువులకు ఒక మనవి
సాయి సోదరుడు శ్రీ సతీష్ గారు జూలై నెల 2 వ తారీకున షిరిడీ దర్శిస్తున్నారు. సాయి బంథువులు తమ తమ కోర్కెలని శ్రీ సతీష్ గారి మైల్ ఐ.డీ. కి జూలై 1 వ తారీకులోగా పంపించమని కోరుతున్నారు. మీరు మైల్ కి సబ్జెక్ట్; "ప్రేయర్స్ టూ షిరిడీ" అని ఇవ్వండి.

మైల్. ఐ . డీ gudari2986@gmail.com


శ్రీ సతీష్ గారికి బాబా వారు శుభాశీస్సులను అందించుగాక.

షివపూర్ బాబా మందిరం లీలలు - 3

0 comments Posted by tyagaraju on 6:52 AM




ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

ఈ రోజు శివపూర్ బాబా మందిరం లీలలలో మరికొన్నిటిని తెలుసుకుందాము.

షివపూర్ బాబా మందిరం లీలలు - 3

షివపూర్ బాబా మందిరానికి పక్కనే యిల్లు కట్టుకున్న గ్రామ నివాసి గుడిలో రాత్రి 2-3 గంటల మథ్య గుడిలో యెవరూ లేనప్పుడు, కాంతి కిరణాన్ని గమనించాడు. ముందర అతను గుడిలో యెవరో దొంగ ప్రవేశించి ఉంటాడు అనుకున్నాడు, మరునాటి రాత్రి కూడా అదేవిథంగా జరిగింది. సారి అతను రాత్రి గుడిలో కి వెళ్ళి , కాంతి వెంబడే వెడదామని నిర్ణయించుకున్నాడు. అతను గుడిలోకి ప్రవేశించినప్పుడు, యింకా యెవరో టార్చ్ లైట్ వేసి చూపిస్తున్నట్లుగా లైట్ కనపడింది. అతను కాంతిని అనుసరించి వెళ్ళడం ప్రారంభించాడు, అలా వెడుతుండగా, అతనికి మంచి సుగంథ పరిమళభరితమైన సువాసన వచ్చింది. అటువంటి సువాసన తన జీవితంలో యింతకు ముందెప్పుడూ ఆఘ్రాణించలేదు. యిదే విషయాన్ని ఆయన అమి అమిత్ గారితో చెప్పారు. ఆయన అనుకున్నదేమంటే బాబా గుడిచుట్టూ తిరుగుతున్నారని, ఆయన మాత్రమే అటువంటి సుగంధ పరిమళాన్ని యివ్వగలరని భావించారు.

వెదురు కఱ్ఱలతో నిర్మించబడిన మందిరాన్ని తిరిగి మరలా నిర్మిస్తున్నారు. నిర్మాణం యింకా జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం పెద్ద గాలివాన వచ్చి రెండుగంటలపాటు పెద్ద వర్షం పడింది. అది మథ్యాన్న సమయం, పనిచేసేవాళ్ళు, గ్రామస్తులు అందరూ కూడా అది నిద్ర పోయే సమయం. గుడిలో యెవరూ లేరు. వర్షం తగ్గగానే పనిచేసేవాళ్ళంతా గుడిలోకి దూసుకుని వెళ్ళారు కట్టిన కట్టుబడి యెలా ఉందో చూద్దామని. బాబాని ఉంచడానికి కొత్తగా కట్టిన పీఠం వర్షానికి పూర్తిగా కొట్టుకునిపోవడం చూడగానే వారు ఖిన్నులయారు. గ్రామస్తులంతా కూడా బాబా యిక్కడున్నా యెలా జరిగిందని కలవర పడ్డారు. కూలీలంతా చాలా విచారించారు, యెందుకంటే యిక వారివద్ద థనంలేదు, యిక ముందు నిర్మాణం జరుగుతుందని కూడా ఖచ్చితంగా తెలీదు. మరునాడు ఉదయం, కూలీలు, గ్రామస్తులు అందరూ మరలా కట్టడం పని ప్రారంభించడానికి వచ్చినప్పుడు, యింతకుముందు పాడయిపోయిన పీఠం పూర్తిగా తిరిగి నిర్మించబడి ఉండటంతో చాలా ఆశ్చర్యానికి లోనయ్యారు, కాని పాడయిపోయిన మిగతావి మట్టుకు అలాగే పాడయిపోయి ఉన్నాయి. కార్యం బాబా వారు తప్ప యెవరు చేయగలరు?

మేము ప్రతీ శనివారము సత్సంగం చేస్తాము. ఒక శనివారమునాడు మాఊరిలో ఉన్న బాబా గుడిలోనే సత్సంగం పెట్టుకున్నాము. అప్పుడు అక్కడ అగరువత్తులు వెలిగించారు. సువాసన చాలా బాగుంది. నేను కూడా అటువంటిదే కొందామని దాని పేరు చూసి కొన్ని రోజుల తరువాత కొని వెలిగించాను. కాని సువాసన లేదు. గుడిలో వెలిగించినది యే రకమైన అగరువత్తులో తెలియదు. కొన్నొ రోజుల తరువాత నేను సోఫాలో కూర్చున్నాను. నేను మా అమ్మాయి, అల్లుడు, కూడా కూర్చుని మాట్లాడుకుంటున్నాము. నా వెనుక గోడమీద పెద్ద బాబా ఫొటొ ఫ్రేం కట్టించి ఉన్నది ఉంది. అప్పుడు రాత్రి 8 అయింది. హటాత్తుగా నాకు గుడిలో వెలిగించిన అగరుబత్తీల సువాసన వచ్చింది కొంతసేపు. యింటిలో అటువంటి అగరువత్తులు లేవు ఆరోజు సాయంత్రం కూడా యేమీ అగరువత్తులు వెలిగించలేదు. నేను మిగతా వారిని అడిగాను, వారికి అగరువత్తుల సువాసన వస్తోందా అని, రాలేదని చెప్పారు.

తరువాత నేను ఆలోచించాను. ఒక వేళ మరొక విథమయిన సువాసన వచ్చి ఉంటే అది బాబా అనుగ్రహమని నాకు తెలియకపోవచ్చు. మరి గుడిలో వచ్చిన పరిమళమే వచ్చిందంటే బహుశా బాబా తన ఉనికిని చాటుకున్నారని భావించాను.

2 సంవత్సరాల క్రితం మా యింటిలో సత్సంగం యేర్పాటు చేసుకున్నాము. సత్సంగాన్ని మొదటగా ప్రారంభించిన శ్రీమతి మీనాక్షి గారికి మా యిల్లు సరిగా తెలియదు. మేము సాయంత్రం 4 గంటలకు సత్సంగం యేర్పాటు చేశాము. మీనాక్షి గారు రావడం కొంచెం ఆలశ్యమయింది. మాయింటికి కొద్ది దూరంలో వీథి మలుపులో కొంచెం దూరంలో ఒక బాబా గుడి ఉంది. మీనాక్షిగారు వస్తూండగా గుడివద్దకు వచ్చేటప్పటికి అగరువత్తుల వాసన వచ్చిందిట. గుడిలో నుంచి వస్తోందేమో అనుకున్నారు గాని, అప్పటికి గుడి యింకా తెరవలేదు. తరువాత సువాసన మాయింటికి కొద్ది దూరంలో ఉన్న చిన్న కొట్టువద్ద వచ్చిందిట, మాయింటి గేటు దాకా వచ్చిందిట. మా యిల్లు రోడ్డుకు కొంచెం దూరంలో ఉండి బయట గేటు ఉంటుంది. తరువాత సువాసన మాయింటిలో వచ్చింది. సువాసన మేము వెలిగించిన అగరువత్తులదే. సువాసన అంత దూరం బాబా గుడి దాకా, కొట్టువద్దకు వ్యాపించేటంతటి గాఢమైన అగరువత్తులు కాదు. బాబా గారే ఆమెకు యింటి కి దారి అగరువత్తుల పరిమళం ద్వారా చూపించారు.

సర్వం శ్రీ సాయినాథారపణమస్తు

Wednesday, June 15, 2011

షివపూర్ బాబా మందిరం మహిమలు -- 2

0 comments Posted by tyagaraju on 7:36 AM


15.06.20011 బుథవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులందరికి బాబా వారి శుభాశీస్సులు

షివపూర్ బాబా మందిరం మహిమలు -- 2

యింతకుముందు మనము షివపూర్ బాబా మందిరం యొక్క మహిమలు గురించి తెలుసుకున్నాము. ఈ రోజు మరికొంత సమాచారం తెలుసుకుందాము.

షివపూర్ బాబా మందిరం కమిటీ చైర్మన్ గారయిన శ్రీ అమిత్ విశ్వాస్ గారు చెప్పిన వివరాలు.

శ్రీరామ నవమి పుణ్యదినాన సంవత్సరం (2010) గుడిలో పీఠం మీద కొత్త సాయి మూర్తి ప్రతిష్టించబడింది. ఈవిగ్రహంరావడం కూడా ఒక లీల. కొత్తగా నిర్మించిన గుడిలో కమిటీ సభ్యులు ఫైబర్ గ్లాసుతో చేసిన విగ్రహాన్ని ప్రతిష్టిద్దామనేయోచనలో ఉన్నారు. లోగా బాబా , చెన్నై లో ఉన్న శ్రీ కె.వీ. రమణి గారికి, శివపూర్ లో తన ఆవిష్కరణ గురించితెలియచేసి, షిరిడీలో సమాథిమందిరంలో ప్రతిష్టించబడిన విగ్రహం అదే కొలతలతో నిలువెత్తు విగ్రహాన్ని శివపూర్ కిపంపించవలసిందిగా ఆదేశించారు. బాబా గారి దివ్యమైన ఆదేశంతో ఆయన శివపూర్ కి బాబా విగ్రహాన్ని పంపించారు.
లీల విన్న తరువాత దేవాలయ కమిటీ వారు తమ నిర్ణయాన్ని మార్చుకుని 24.03.2010 మార్చ్ శ్రీ రామనవమిరోజున ప్రతిష్టించారు. బాబా అనుగ్రహంతో కార్యక్రమాలన్నీ ఆటంకంలేకుండా విజయవంతంగా పూర్తయ్యాయి.

అదేరోజు
రాత్రి గ్రామస్తులందరూ మంచి గాఢ నిద్రలో ఉన్నారు. బాబా గారు అమిత్ విశ్వాస్ గారితో సహామరికొంతమందికి కలలో కనపడి ఇలా చెప్పారు.." గ్రామస్తులు తమ తమ యింటి ప్రవేశ ద్వారముల యెడమవైపునకనక తవ్వినట్లయితే, నా దీవెనలుగా రేపు వారికి ఊదీ కనుగొంటారు"

మరునాడు
వారు లేచేటప్పటికి విషయం గ్రామమంతా కార్చిచ్చులా అందరికీ తెలిసింది. గ్రామస్తులు జిజ్ఞాసతో బాబాకలలో చెప్పిన గుర్తులప్రకారం భూమిని తవ్వడం మొదలుపెట్టారు. నిరంతరంగా తవ్విన కొంత సేపటికి, ముందురోజుగుడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో యజ్ఞంలోజరిగిన ఊదీ, బొగ్గు, కనపడేటప్పటికి వారికి నోట మాట రాలేదు. ఇదిశివపూర్ లోను, చుట్టుపక్కల గ్రామాలలోని ప్రతి ఒక్కరి యింటిముందు జరిగింది. కొంతమంది తాము శాశ్వతంగానిర్మించిన సిమెంట్ నేల కింద కూడా చూద్దామనే ఆసక్తితో తవ్వగా వారికి కూడా అదేసమయంలో బొగ్గు, ఊదీకనిపించడంతో ఆశ్చర్యపోయారు. సమితి సభ్యులందరి నిర్థారణకోసం సంఘటనకి సంబంథించిన ఫోటోలు తీశారు. యింకా ఆశ్చర్యకరమైన విషయమేమ్నటే, వారు గుడి వద్దకి వెళ్ళి యజ్ఞ కుండంలో చూసినప్పుడు అందులో, ఊదీ, గానిబొగ్గుగాని లేవు. యిందులో యెవరికైనా సరే యేవిథమైన అనుమానాలు ఉన్నా, షివపూర్ చుట్టు పక్కల గ్రామాలలోనివారినందరినీ అడిగి తెలుసుకోవచ్చు.

విషయాన్ని షివపూర్ సమితి చైర్మన్ గారయిన శ్రీ అమిత్ విశ్వాస్ గారు చెప్పారు.

పైన చదివిన లీలలో ని విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. గ్రామస్తులు సిమెంట్ తొ చేసిన నేలను కూడా తవ్విచూశారు. ఇక్కడ వారు అయ్యో సిమెంట్ నేలను తవ్వేస్తున్నాము, పాడయిపోతుందేమో అనే సంకోచం లేకుండాతవ్వేశారు. అదే కనక వారు సంశయంతో అయ్యో సిమెంట్ నేల తవ్వేస్తున్నాము యెలాగ, మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టి చేయించుకోవాలి అని యేమీ అనుకోలేదు. ఇక్కడ కలలో కొంతమందికి కనపడ్డారు. అయినా మిగతావారు కూడాయెంతో నమ్మకంతో తవ్వి చూశారు. ఊదీ లభించింది. వారు యెంతటి అదృష్టవంతులో కదా. మనం కూడా బాబా మీదయెక్కువ శ్రథ్థ, భక్తి, విశ్వాసాలనుంచి ఆయనని ప్రసన్నుణ్ణి చేసుకుందాము.


సర్వం
శ్రీ సాయినాథార్పణమస్తు.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List