Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, June 3, 2011

సాయి భక్తి పరిమళాలు

0 comments Posted by tyagaraju on 8:04 AM




సాయి భక్తి పరిమళాలు

03.06.2011

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి


సాయి బంథువులందరికి బాబా వారి శుభాశీస్సులు


ఈ రోజు యేమి పోస్ట్ చేయడానికి యింకా నిర్ణయించుకోలేదు. కాని సాయి భక్తి ని గురించిన సమాచారం రేపు శనివారం లో సత్సంగంలో చెపుదామనే ఆలోచన వచ్చింది. ఈ సమాచారాన్నే మన సాయి బంధువులకు కూడా తెలియచేద్దామనే ఆలోచన నాలో కలిగి, బాబా అనుగ్రహంతో దీనిని మీకు అందిస్తున్నాను.

ఈ రోజు మనము సాయి భక్తి పరిమళాలను గురించి తెలుసుకుందాము.
( ఫ్రాగ్రన్స్ ఆఫ్ సాయి భక్తి లో ని విషయానికి తెలుగు అనువాదము)

ప్రేమ అనేది భక్తికి పునాది. భక్తి అనే భవనాన్ని ఘనమైన బలమైన పునాది మీదనే నిర్మించగలం. అందుచేత ప్రేమను పుట్టించాలి, ప్రేమను పండించాలి, ప్రేమను పంచాలి, ప్రేమ అనే గాలిని పీల్చాలి, ప్రేమను భుజించాలి, ప్రేమ స్వప్నాలు కనాలి, ప్రేమ గురించి ఆలోచన, ఇలా నీ శరీరమంతా ప్రేమతో నిండి పోయి నీ చుట్టూ ప్రేమ అనే పరిమళం వ్యాపించాలి. సాయికి నీకు మథ్య ఉన్న ద్వైతమనే అడ్డు తెర నిర్మూలింపబడుతుంది.(ద్వైతం అనగా జీవాత్మ, పరమాత్మ రెండు వేరు వేరు)


భక్తికి యెవరి అంతస్థు కాని, బాహ్య సంబంథమైన విషయాలతో గాని సంబంథం లేదు. అంటే భక్తికి యివేమీ అడ్డు కాదు. భక్తి అనేది మనలో ఉన్నటువంటి ఆభరణం. దానిని వెలికి తీయాలి.


భక్తి మనకి సర్వ శ్రేష్టమయిన సంతోషాన్ని కలుగ చేసి మనలో ప్రశాంతతను పుట్టిస్తుంది. నిరంతరం వుండే కనరాని ఈ ప్రశాంతత మనకి చేసే సహాయం యెంతో ఉదాత్తమయినది.

భక్తుడైనవాడు ధృఢమైన, అథికమైన నమ్మకం తనలో కలిగి ఉండాలి. యింకా తన యిష్ట దైవము మీద కూడా కలిగి ఉండాలి. సాయి భక్తి అనే దారిలో నిబ్బరంగా ఉన్నవాడు తప్పకుండా తన గమ్యాన్ని చేరతాడు. ప్రతీవాడు తన ప్రారబ్ధ కర్మకి బథ్థుడై
ఉంటాడు కాబట్టి తనకి యేది ప్రాప్తమో అదే పొందుతాడు.

నీ పూర్వజన్మలో నువ్వు చేసుకున్నపుణ్యాన్ని బట్టే ఈ జన్మలో ఫలాన్ని పొందుతావు. పుణ్యాన్ని బట్టి పుణ్య ఫలం, పాపాన్ని బట్టి పాప ఫలం. కర్మని యెవరూ తప్పించలేరు. ఈ కర్మ ఫలాన్ని కొంతవరకైనా తొలగించుకోవాలంటే సాయి చరణాలను పట్టుకోవడమే మనమంతా చేయవలసినది.


అంతే మిగతాదంతా ఆయనకి వదలి వేసి నిశ్చింతగా ఉండు. అంతా ఆయనే చూసుకుంటారు. ఆయన తనని నమ్ముకున్న వారికి యేవిథమైన అన్యాయం చేయరు. కాని మనం శ్రథ్థ, సహనంతో ఉండాలి.

అందుచేత భక్తిలో శతృత్వమనె భావన ఉండకూడదు.


దేవుడు ఒక్కడే. సాయి, దేవుడు. అందరి దేవుళ్ళలోను సాయిని చూడు. సాయిలో అందరి దేవుళ్ళను చూడు. వినాయకుడి ని దర్శిస్తే సాయి వినాయక అనుకో. విష్ణువుని దర్సిస్తే సాయి విష్ణు, రాముణ్ణి దర్సిస్తే సాయి రామా శివుడిని దర్శిస్తే శివసాయి,లక్ష్మీదేవిని దర్శిస్తే సాయి లక్ష్మి, అనుకో.

మతానికి, కులానికి అతీతంగా ప్రతీ దేవాలయంలోను శిరసువంచి నమస్కరించు. భవుతికంగా బాబాను చూడాలనే కోరికకు ఆశ్రయమివ్వకు. ఆయన ఆకార రహితుడు. ఆయన ఈ భూమిమీద నివశించారు. ఆయన అన్నిటిలోనూ, ప్రతీచోటా ఉన్నారు. ఆయన యెక్కడ లేరు? ఆయనని నువ్వు చూడగోరితే నీ హృదయంలోపల చూడు.


(బాబా ఆకార రహితుడు అని చెప్పుకున్నాము కదా. మీకు నాకు కూడా ఒక అనుమానం వచ్చి ఉండాలి. బాబా ఆకార రహితుడు అన్నారు, బాబా ఫోటోలని, విగ్రహాలని చూస్తున్నాము కదా, మరి ఆకారం లేదంటారేమిటి? ఇదే కదా సందేహం? ఇక్కడ నా అభిప్రాయం: ఇక్కడ బాబా యేమని చెప్పారు, అందరిలోనూ తనని చూడమన్నారు. నేను ఈ ప్రపంచమంతా నిండి ఉన్నాను. అన్ని జీవులలోనూ నన్ను చూడు. అన్నారు. అంటే ప్రతీ మనిషిలోనూ, ప్రతీ జంతు జాలంలోనూ చూడమన్నారు. మరి ఆయన రూపాన్ని మనం మనసులో యేర్పరచుకుంటే ఒక ప్రాణిలో అంటే చిలుకలో, లేక నీ యెదుటి వ్యక్తిలో యెలా చూడగలవూ. బాబా విగ్రహాన్ని, కాని ఫోటొని కాని చూసినప్పుడు ఆయన రూపమదే అని మనసులో ముద్రించుకో. కాని యెదటివారిలో గాని యితర జంతుజాలంలో గాని సాయిని నిరాకారంగా చూడు.

అంటే సాయి ఉన్నాడు అనే భావంతో చూడు
ఇది నా అభిప్రాయం. దీనికి యింకా యెవరైనా వివరణ ఇవ్వాలనుకుంటే నాకు మైల్ పంపండి. బ్లాగులో పోస్ట్ చేస్తాను.)


నువ్వు బాబాని చూడలేదు, బాబాతో జీవించలేదు? కాని బాబా నీతో నిరంతరం ఉన్నట్టుగా కనిపిస్తాడు. యెప్పుడు? పైన చెప్పిన సాయి భక్తి అనే ప్రేమ పరిమళం నీ చుట్టూ వ్యాపించి, ఆ పరిమళాన్ని నువ్వు ప్రేమ తో అందరికి పంచినప్పుడు.

యివ్వడం అనేది జీవితంలో ఒక భాగమయిపోవాలి. అంటే యితరులకి పెట్టాలి. నీవు తినేది యితరులకి పంచాలి. బాబా సచ్చరిత్రలో కూడా చెప్పినదిదే. వంటరిగా తినకు అని. నువ్వు తినేటప్పుడు నీప్రక్క వారికి కూడా పెట్టు. ఒకవేళ యెవరూ లేకపోతే బాబాకి నివేదించి తిను. నీవు వంటరిగా ఉన్నా, అందరితో ఉన్నా ముందర బాబాకి నివేదించడం అలవాటు చేదుకో.


అవసరమయినవారికి వినయంతో పంచు.


నువ్వు పూజ చేసే చోట బాబా పఠాలు యెంత తక్కువగా వీలయితే అంత తక్కువగా ఉంచు. యెందు చేతనంటే నీ దృష్టి అన్నిటి మీద మరల కుండా ఉంటుంది. యేకాగ్రత చెడకుండా ఉంటుంది. నువ్వు యెంచుకున్న బాబా స్వరూపం మీదే నీ దృష్టి లగ్నం కావాలి. బాబా రూపం మీద చక్కటి యేకాగ్రత కుదురుతుంది.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.

Thursday, June 2, 2011

మన మనస్సుని గమనించే బాబా

0 comments Posted by tyagaraju on 9:20 AM
మన మనస్సుని గమనించే బాబా

02.06.2011 గురువారము



ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబా వారి శుభశీస్సులు

ఈ రోజు బాబా వారము. గురువారము నాడు కూడా యేమీ ఇవ్వలేకపోయానని నిరాశ పడకుండా బాబా అనుగ్రహంతో ఈ లీలని అందిస్తున్నాను. ఆఫీసు నించి వచ్చి, బాబా గుడికి వెళ్ళి పూర్తి చేసేటప్పటికి రాత్రి 10 గంటలు అయింది. చివరికి పూర్తి చేసి మన సాయి బంథువులందరికీ అందిస్తున్నాను. ఈ లీల యింతకుముందు శ్రీమతి ప్రియాంకా గారు బ్లాగులో ప్రచురింపబడింది.
యెవరైనా సరే బాబా విగ్రహం గానీ, ఫోటో గానీ, ఊదీ గాని, లేక పుస్తకమైనా గాని కావాలని కోరుకుంటే , బాబా వారి కోరికలని యేదోవిథంగా యెలాగోఅలా తీరుస్తారనేది నాకు అనుభవం ఇంకా విన్నాను కూడా. నేను ఈ పైన రాసిన దానికి సాక్ష్యం నేను ప్రచురించే రియాన్ యొక్క అనుభవం. సాయికి సంబంధించిన యేకోరికైనా సరే, అది యెంత కష్టమైనదైనా బాబా మనకోసం దానిని తీర్చి మన జీవితంలో తాను ఉన్నాను అని గుర్తు చేస్తూ ఉంటారు. మనకు కావలసినదల్ల బాబా చెప్పిన రెండు నాణాలు, శ్రథ్థ, సహనం. ఇప్పుడు మీ అందరికోసం రియాన్ గారి మైల్ ని జత చేస్తున్నాను.

"సాయిరాం , ప్రియాన్ కా గారు, నేను ఈ రోజు సెలవులలో, అమెరికా లోని సురినాం లో జరిగిన నా అనుభవాన్ని చెపుతాను. డిసెంబరు 2008 లో నేను నా కుటుంబంతో సెలవులు గడపడానికి సురినాం వెళ్ళాను. నేనప్పుడూ నాతో కూడా బాబా ఫోటొ గాని, ఊదీ గాని, ధగా గాని తీసుకుని వెడుతూ ఉంటాను. సురినాం వెళ్ళినప్పుడు నేనెప్పుడూ యింటి బయటే ఉంటాను. నేను నా సంచీలో కొన్ని బాబా పోస్టర్స్, కొన్ని బాబా పుస్తకాలూ సద్దుకున్నాను. నాదగ్గిర ఊదీ కూడా ఉంది. సురినాం వెళ్ళగానే నేను మొట్టమొదట, బాబా పూజ చేసుకోవడానికి గది యెక్కడ ఉందా అని వెతికాను. విజిటింగ్ రూంలో ఒక పీఠం యేర్పాటు చేసి బాబా ఫోటోలతో చిన్న మందిరం తయారు చేశాను. మా అమ్మమ్మగారు సురినాం వచ్చినప్పుడు కొన్ని నెలల క్రితం నేనామెకు ఇచ్చిన కొన్ని బాబా ఫోటోలు కూడా పెట్టారు. ప్రతీరోజు ఉదయాన్నే నేను ఆమందిరం ముందు అంతటా నిండిఉన్న బాబా కి పూజ చేస్తూ ఉండేవాడిని. ప్రతీరోజు ఉదయాన్నే యేదైనా ఒక లీల చూపమని బాబాని ప్రార్థిస్తూ ఉండేవాడిని. ప్రతీసారి నేను మా కుటుంబంతో బజారుకి వెడుతూ ఉండేవాడిని. యెప్పుడు నేను "బాబా నీకు కూడా యేదైనా కొననీ, కానీ యెలా? యిది ఒక పెద్ద ప్రశ్న. ఇక్కడ అమెరికాలో బాబా సామాగ్రికి సంబంధిచిన షాపులు యెక్కువ ఉండవు. కాలమలా గడిచిపోతోంది. రెండు వారాల తరువాత మేము ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళాము. అది ఒక భారతీయ చీరల దుకాణం. అక్కడ నేను ఒక గాజు దానిలో ఉన్న బాబా విగ్రహాన్ని చూశాను. అదిచూడగానే పిచ్చెత్తినట్టయింది, అది యెంత అని అడిగాను. ఆ సాయి మూర్తిని చూశాక నేనెంతటి ఆనందం పొందానో నేను వర్ణించలేను. నేను నా తల్లితండ్రుల దగ్గిరకి వెళ్ళి కొందామని అడిగాను, కాని వాళ్ళు వద్దు అన్నారు. (నేనిక్కడ ఆ సాయి మూర్తిని కూడా జత చేస్తున్నాను).


నాకు చాలా విచారం వేసి, బాబా యెందుకిలా చేసావు అని అడిగాను. నాకు బాబా మీద చాలా కోపం వచ్చింది. నేను బాబాని " బాబా నేను రోజూ క్రమం తప్పకుండా నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను, నువ్వెందుకిలా చేస్తున్నావు" అని అడిగాను. ఆ రోజున షాపింగ్ అయిన తరువాత మేము మా కుటుంబ స్నేహితుల యింటికి వెళ్ళాము. మేము బయటికి వెళ్ళి రెస్టారెంట్ లో భోజనం చేద్దామనుకున్నాము. మా కుటుంబ స్నేహితులు ఒక షాపింగ్ మాల్ లో ప్రముఖమైన రెస్టారెంట్ ఉందని అక్కడికి రాత్రికి భోజనానికి వెడదామని అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది యెందుకంటే నేను బాబా విగ్రహాన్ని యెక్కడైతే చూశానో అదే మేము వెళ్ళిన షాపింగ్ మాల్. నేను బాబాతో, "నువ్వు కనక నన్ను నిజమైన భక్తుడిగా భావిస్తే, నాలో నిజమైన శ్రథ్థ, సహనం ఉంటే, అందరు దేవుళ్ళూ ఒకరే అయితే, యింకా, అల్లాహ్, భగవాన్ ఒకరే అయితే, ఈ రోజు నీ సుందరమైన విగ్రహాన్ని నేను కొనేలా చెయ్యి" అన్నాను. మేము రెస్టారెంట్ కి వెళ్ళి రాత్రి భోజనం చేయడం మొదలుపెట్టాము. అప్పుడు సమయం రాత్రి 8,45 అయింది. నా సోదరి నన్ను రొయ్యలు ఇస్తావా అని అడిగింది. నేను అలాగే అని ఒప్పుకుని కాని ఒక షరతు, నేను రొయ్యలని ఇస్తే నువ్వు నాతో కూడా వచ్చి, నాకు బాబా విగ్రహాన్ని కొనిపెట్టాలి అన్నాను. ఆమె నవ్వుతూ సమాథానం చెప్పి సరే అంది. నేను, నా సోదరి బాబా విగ్రహాన్ని చూసిన అదే చీరెల దుకాణానికి వెళ్ళాము. ఈసారి నేను బాబా మూర్తిని కొనుక్కున్నాను. నేనింకా మిగతా బాబా విగ్రహాలని చూస్తున్నాను, కాని నా విగ్రహం మిగతావాటిక్నా ప్రత్యేకంగా ఉందని గ్రహించాను. ప్రత్యేకత యేమిటొ నేను మాటలలో వర్ణించలేను. అదే రోజు అదే షాపింగ్ మాల్ కి యెలా వెళ్ళామో , బాబా విగ్రహాని యెలా కొన్నానో నిజంగా నాకర్థం కాలేదు ఇప్పటికీ. ఇది బాబా నామీద చూపించిన లీల తప్ప మరేమీ కాదు. ఇది ఆయన చరణ కమలాల ముందు నా నమ్మకాన్ని మరింత పెంచింది. సురినాం లో ఉన్న సమయంలో బాబా నాకు తన దర్శనాన్ని కూడా ఇచ్చారు. ఆఖరి రోజున నేను బజారుకి వెళ్ళినప్పుడు తెల్లని దుస్తులలో ఉన్న ఒక మనిషిని చూశాను. అతను బాబా లాగా తలకు గుడ్డ చుట్టుకుని ఉన్నాడు. అతను బాబా తప్ప మరెవరూ కాదని నాకు తెలుసు. నేను ఆ మనిషిని చూసిన మరుక్షణమే నేను, "బాబా నువ్విప్పుడు నీ భౌతిక శరీరంతో వచ్చావు, నా తప్పులన్నిటికీ క్షమాపణ అడుగుతున్నాను" అన్నాను. బాబాని తన బిడ్డలనందరిని అనుగ్రహించమని కోరాను. నా జీవితాంతము వరకు ఈ లీలని మరచిపోలేను. తన బ్లాగులో ఈ సాయి లీలని ప్రచురించినందుకు ప్రియాంకా గారికి నా థన్యవాదాలు. బాబా అందరినీ దీవించుగాక. అల్లాహ్ మాలిక్ .

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు



Tuesday, May 31, 2011

సాయి నీకు ఋణపడిఉంటారు

0 comments Posted by tyagaraju on 5:19 AM




31.05.2011 మంగళవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి


సాయి బంథువులందరికి బాబా వారి శుభాశీస్సులు

సాయి నీకు ఋణపడిఉంటారు

రోజు మనము నవీన్ గారి బాబా లీలను తెలుసుకుందాము. లీల యింతకు ముందు శ్రీమతి ప్రియాంకా రౌతేలా గారి బ్లాగులో ప్రచురింపబడినది. రోజు మనము సాయి అంటే అసలు తెలియని వ్యక్తిని బాబా తన వద్దకు యెలా రప్పించుకున్నారో, యెటువంటి అనుభవాన్ని కలిగించారో నవీన్ గారి మాటల ద్వారా తెలుసుకుందాము.



నాపేరు నవీన్. నేను నార్వే లో 40 సంవత్సరాలుగా ఉంటున్నాను. నేను భారతదేశానికి రావడం చాలా తక్కువ. అదీ కూడా 5 సంవత్సరాలకు ఒకసారి కావచ్చు, వచ్చి ఒక వారం ఉంటాను. నాకెప్పుడూ సాయిబాబా గురించి తెలియదు యెందుకంటే నేను స్వదేశం నుంచి దూరంగా ఉన్నాను కాబట్టి. బాబా మహిమల గురించి తెలియనందుకు నేను చాలా దురదృష్టవంతుణ్ణి. ఒకరోజున నార్వేలో నా స్నేహితుడి యింటికి రాత్రి భోజనాని కి వెళ్ళాను. నా స్నేహితుడు భారతీయుడు. అతను అతని భార్య భారతదేశం వెడదామనుకుంటున్నారు, షిరిడీ కూడా దర్శిద్దామనుకుంటున్నారు. షిరిడిలో యేముంది అదేమన్న విహార యాత్రా స్థలమా అని అడిగాను. ఆరోజున వారు సాయిబాబా గురించి, షిరిడీ గురించి చెప్పారు. నా స్నేహితుని భార్య తనకు కలిగిన 20 అనుభవాలని వివరించి చెప్పింది, అవన్ని కూడా హృదయానికి హత్తుకున్నాయి, నాకేమయిందో తెలియదు, కాని ఈసారి భారతదేశం వెళ్ళినప్పుడు మాత్రం షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. నేను యింటికి వచ్చాను కాని నిద్ర పట్టలేదు. ఆమె చెప్పిన బాబా అనుభవాలన్నిటిని తిరిగి గుర్తు తెచ్చుకుంటున్నాను. అప్పుడు రాత్రి 2.30 అయింది, నిద్ర పోలేకపోయాను. వెంటనే లేచి నెట్ ముందు కూర్చుని, షిరిడీ సాయిబాబా గురించి సమాచారాన్ని వెతకడం మొదలుపెట్టాను. నాకు వందల కొద్దీ సైట్లు కనిపించాయి , బాబా గురించి పూర్తి సమాచారాన్నంతా చదవగలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను సమయం చూశాను అప్పుడు ఉదయం 10.45 అయింది. ఓహ్...ఆరోజున నేను ఆఫీసుకు కూడా వెళ్ళదలచుకోలేదు. సోదరి, ప్రియాంకా సమయం యెలా గడిచిందో కూడా గమనించలేదు నేను. యేమైనప్పటికీ నేను మా ఆఫీసు వాళ్ళకి ఫోన్ చేసి నాకు వంట్లో బాగుండలేదు నాకు సెలవు కావాలని చెప్పాను. ఫోన్ చేసిన తరువాత నేను గాఢంగా నిద్ర పోయాను. నిద్రలో బాబా వారి బ్రహ్మాండమైన దర్శనం అయింది, బాబా వారు తనే నాకు షిరిడీ చూపించారు. నేను లేచిన తరువాత నా ఆనందానికి అవథులు లేవు, షిరిడీ వాళ్ళాలి అనే పిచ్చిలో పడిపోయాను. రిజర్వేషన్స్ చేసుకుని వారం తరువాత షిరిడీలో అడుగు పెట్టాను. ప్రతీదీ కూడా చాలా వేగంగా జరిగిపోయాయి. బాబా నన్ను అంత వేగంగా తనవద్దకు దగ్గరగా నన్ను లాక్కోవడం అదింకా రహస్యం. 2008 డిసెంబరు 2 నేను షిరిడీలో ఉన్నాను. నేను షిరిడీ వెళ్ళగానే చాలా సంతోషించాను యెందుకంటే బాబా నాకు యింతకుముందే ప్రదేశాన్ని నాకు కలలో చూపించారు. నేను సమాథి మందిరంవైపు నడుస్తూండగా ఒక ఫకీర్ నావద్దకు వచ్చ్చి ఇలా అన్నాడు "బేటా నాకు ఆకలిగా ఉంది, నాకేమన్న కొంత ఆహారం ఇవ్వగలవా" నేనతనితో, "బాబా డబ్బు తీసుకో నీకేది తినాలనిపిస్తే అది తిను" అని అతనికి 500 రూపాయలు ఇచ్చాను. ఫకీర్ బాబా నన్ను మనస్ఫూర్తి గా దీవించి ఇలా అన్నాడు "మేరా సాయి తుఝే యె పైసా దోగ్నా కర్కే దేగా తూనే ఇసే ఫకీర్కా పేట్ భరా హై జీతే రహో బేటా". నాకు చాలా ఆనందం వేసి మరలా సమాథి మందిరంవైపు నడవడం మొదలుపెట్టాను. సమాథి మందిరం చేరుకున్నాను, బాబా దయ వల్ల బొంబాయిలో ఉండే నా మితృడి ద్వారా నాకు వీ పీ పాస్ లభించింది. సాయంత్రం 5.20 కి నేను సమాథి మందిరంలోకి అడుగు పెడుతున్నాను, కాని లోపలికి అడుగుపెడుతున్నప్పుడు సమాథిమందిరంలో నేలమీద 1000 రూపాయల నోటు కనపడింది. నోటు తీసుకుని యెవరైనా బీదవానికి దానం చేద్దామని నా వద్ద ఉంచుకున్నాను. తరువాత నేను శేజ్ హారతికి పూర్తిగా ఉన్నాను. బాబా దర్శనం చాలా బాగా జరిగింది నాకు చాలా తృప్తిగా ఉంది. కాని నేనింకా ఆశ్చర్యపోతూ ఉంటాను, అక్కడంతమంది భక్తులు, సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నా 1000 రూపాయలనోటు నాకే యెందుకు కనిపించిందా అని. అవును, నేను ప్రత్యేకత పొందినవాడిగా భావించుకున్నాను. సమాథి మందిరానికి వచ్చేముందు నాకు కనపడినఫకీర్ యొక్క ఆశీర్వాదమే అని గ్రహించుకున్నాను. సాయి బాబా నేనిచ్చినదానికి రెట్టింపుచేసి తిరిగి ఇచ్చారని ఋజువయింది. నేను ఆబాబా కి 500/- ఇచ్చాను, సాయి నాకు 1000/- ఇచ్చారు... ఇది ఒక అద్భుతమైన లీల కాదూ...? మరునాడు నేను అదే ఫకీర్ బాబా మరలా కనిపిస్తాడేమోనని నా గది నుంచి బయటకి వచ్చి చూశాను, కాని యెక్కడా కనపడలేదు. బాబాయే స్వయమగా నన్ను కలిశారని గ్రహించుకున్నాను. నేను తిరిగి నార్వే వెళ్ళి నాకు బాబా ని పరిచయం చేసిన నా మితృడికి నాకు జరిగిన అనుభవాన్నంతా వివరంగా చెప్పాను. నాకు కలిగిన అనుభూతిని మిగతా భక్తులందరితోనూ పంచుకోవాలనుకున్నాను, కాని యెలా? .... తెలియదు. నిన్న నెట్ ముందు కూర్చున్నప్పుడు అనుకోకుండా అద్భుతమైన సాయి లీలలతో నిండినా మీ బ్లాగు చూడటం తటస్థించింది. ఇకముందు కూడా షిరిడీలో కలిగిన యింకా నా అనుభావాలని మీకు పంపిస్తాను.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List