Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, March 26, 2011

ప్రశ్నలు - జవాబులు

0 comments Posted by tyagaraju on 12:51 AM









26.03.2011 శనివారము

ప్రశ్నలు - జవాబులు

ఈ రోజు సచ్చరిత్ర కి సంబంథీంచి మరికొన్ని ప్రశ్నలు సమాథానాలు తెలుసుకుందాము.




51. షామా గారు బాబూ దీక్షిత్ గారి వడుగుకు నాగపూర్ వెళ్ళినప్పుడు కాకా దీక్షిత్ సాహెబ్ గారు షామా కి యెంత డబ్బు ఇచ్చారు?

200 రూపాయలు

52. షామా గారు నానాసాహెబ్ చందోర్కర్ గారి కూతురు వివాహానికి గ్వాలియర్ వెళ్ళినప్పుడు, నానాసాహెబ్ చందోర్కర్గారు షామా కి యెంత డబ్బు ఇచ్చారు?

100 రూపాయలు.

53. షామా గారు నానాసాహెబ్ చందోర్కర్ గారి కూతురు వివాహానికి గ్వాలియర్ వెళ్ళినప్పుడు, శ్రీ జథర్ (నానా సాహెబ్ గారి మామగారు) షామా గారికి యెంత డబ్బు ఇచ్చారు?

100 రూపాయలు.

54. శైత్ థర్మసి జెథాభాయి థక్కర్, బాబాగారికి యెంత దక్షిణ ఇచ్చాడు?

15 రూపాయలు.

55. బాబా గారు రామ విజాయాన్ని యెన్నిరోజులు విన్నారు, దానినిని యెవరు చదివారు?

14 రోజులు, శ్రి వజె గారు చదివారు.

56. నారాయనగావ్ నించి భీమాజీ పాటిల్ గారు మొదటిసారి షిరిడీ కి వచ్చినప్పుడు, షిరిడీలో యెంత కాలము ఉన్నారు?

ఒక నెల

57. మాలేగావ్ నించి డాక్టర్ గారు మొదటిసారి షిరిడీ కి వచ్చినప్పుడు, షిరిడీలో యెంత కాలము ఉన్నారు?

4 రోజులు.

58. సప్త సృగీఇ నించి కాకాజీ వైద్య గారు మొదటిసారి షిరిడీ కి వచ్చినప్పుడు, షిరిడీలో యెంత కాలము ఉన్నారు?

12 రోజులు.

59. దహను నివాసి హరిభావ్ కార్నిక్ నారసిమ్ జీ మహరాజ్ గారి దర్శనానికి నాసిక్ వెళ్ళినప్పుడూ, నారసిమ్ జీ మహరాజ్ గారు ఆయన వద్దనించి యెంత దక్షిణ అడిగారు?

ఒక రూపాయి.

60. శేట్ థరంసి థాక్కర్ గారు బాబా దర్శనం కొరకు షిరిడి వెళ్ళినప్పుడు, బాబాకి అర్పించడానికి యెన్ని ద్రాక్షపళ్ళు తీసుకుని వెళ్ళారు?

3 శేర్లు.

62. రామదాస్ అనే భక్తుడు బాబా దర్శనానికి షిరిడీ వచ్చినపుడు, బాబాకు యేమి బహుమతి ఇచ్చాడు?

శివ లింగము.

63. రామదాస్ నించి తీసుకున్న శివలింగాన్ని బాబా గారు యెవరికి ఇచ్చారు?

షామా కి ఇచ్చారు.

64. బాబాగారి నిర్యాణము తరువాత యెన్ని గంటలకు ఆయన శరీరాన్ని సమాథి మందిరంలో ఉంచారు?

36 గంటల తరువాత.

65. కొండాజీ గారి కూతురు మరియు భార్య పేరు యేమి?

అమని (కూతురు) జమలి (భార్య)

66. బర్హంపూర్ లేడీ, ఆమె భర్త మొదటిసారి షిరిడీ వెళ్ళినప్పుడు వారు అక్కడ యెంత కాలము ఉన్నారు?

రెండు నెలలు.

67. చోల్కర్ గారు తన కోరిక తీరే వరకు యే తినే పదార్థాన్ని వదలివేశారు?

పంచదార.

68. థానే నుంచి చోలకర్ గారు బాబా దర్శనానికి షిరిడీ వెళ్ళినపుదు, పంచదార యెక్కువ వేసి టీ ఎవరు ఇచ్చారు?

ష్రీ బాపూ సాహెబ్ జోగ్

69. బుథకౌషిక ఋషి రచించిన స్తోత్రము యేది?

రామ రక్షా స్తోత్రము.

70. నానాసాహెబ్ థుమాల్ గారు యెక్కడ నివసిస్తూ ఉండేవారు, ఆయని వృత్తి యేమిటి?

నాసిక్ - ప్లీడరు

61. షామా గారికి విష్ణు సహస్ర నామ స్తోత్రం నేర్పినదెవరు?

శ్రీ దీక్షిత్ & శ్రీ నార్కె

62. బ్రహ్మోపదేశం కొఱకు బాబాగారి వద్దకు వచ్చిన మార్వాడీ గారి జేబులో యెంత డబ్బు ఉన్నది?

250/- రూపాయలు

63. విజయానందస్వామి యెక్కడనుంచి షిరిడీ వచ్చారు, యెక్కడకు వెడదామనుకున్నారు, ఆయన యెక్కడ చనిపోయారు?

మద్రాస్, మానస సరోవర్, షిరిడీ.

64. ద్వారకామాయిలో బాబా గారి ఆరతి జరిగిటేప్పుడు, ఆడవారు, మగవారు యెక్కడ నిలబడేవారు?

ఆడవారు ద్వారకామాయిలో, మగవారు ద్వారకామాయి ముందు ఆరుబయట నిలబడేవారు.

65. చాంద్ భాయ్ బాబాగారిని యే చెట్టుకింద చూశాడు?

మామిడి చెట్టు కింద.

66. ఒక వ్యక్తి బాబాగారి దర్శనానికి వచ్చి తన చెప్పులను పోగొట్టుకున్నాడు. అతని పేరు యేమిటి, అతను యెక్కడనించి వచ్చాడు?

పేరు హరి, బొంబాయి నించి వచ్చాడు.

67. చావడిలో బాబాగారి ఆరతి, భజన యెప్పుడు ప్రారంభించబడింది?

10.12.1910, శనివారము.

68. బాబాగారు ద్వారకామాయిలో కూర్చున్నప్పుడు, యేదిక్కుకు మొహము పెట్టుకుని వుండేవారు?

దక్షిణము వైపు

69. ఇద్దరు భార్యలను ఒకే సమయములో కలిగిన ముగ్గురు భక్తులు యెవరు?

1. దామూన్న కాసర్ (రసానే)
2. నానాసాహెబ్ డెంగ్లె
3. బాలా నెవాస్కర్ పాటిల్.

70. నేను చనిపోలేదు, బ్రతికే ఉన్నాను, ద్వారకామాయికి వచ్చి ఆరతి జరిపించు, ఈ మాటలు బాబా యెవరితో అన్నారు?

లక్ష్మణ్ మామా పూజారితో.

71. బాబా మరియు బలరాం థురందర్ వీరిద్దరిది ఎన్నిజన్మల సంబంథము?

60 జన్మలు.

72. బాబావారి మొదట థరించిన దుస్తులు యేమిటి?

తెల్లని పంచె, చొక్కా, తెల్లని తలపాగా.

73. మామలత్దార్ శ్రీ రాటే మాథవరావు దేష్పాండే పేరుమీద యెన్ని మామిడిపండ్లను పంపించారు?

300 పైగా.

74. షిరిడీకి వచ్చేముందు సిద్దిక్ ఫాల్కె దర్శించిన యాత్రా స్థలాలు యేవి? అతను యెక్కడ నివసిస్తూ ఉండేవాడు?
మక్కా, మదీనా, కళ్యాన్ లో ఉండేవాడు.

75. షిరిడి లో రామనవమి ఉత్సవము యెప్పుడు ప్రారంభించబడింది?
1911 సంవత్సరం రామనవమి రోజునుంచి ప్రారంభించబడింది.



సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Thursday, March 24, 2011

ఛండీఘర్ బాబా మందిరము - అద్భుత చరిత్ర

0 comments Posted by tyagaraju on 10:32 PM














25.03.2001 శుక్రవారము క్యాంప్: బంగళూరు.
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి.

ఛండీఘర్ బాబా మందిరము - అద్భుత చరిత్ర

ప్రశ్నలు సామాథాలను కొంచెం వాయిదా వేసి ఈ రోజు బాబా మందిర నిర్మాణము వెనుక బాబా గారి లీలను తెలుసుకుందాము. భాబా గుడి కట్టాలంటే యెంతో పుణ్యం చేసుకుని వుండాలి. మనలొ సంకల్పం కలగాలే గాని, బాబా గారు దగ్గిరుండి మరీ మనకు సహాయం చేస్తారు.






ఛండీఘర్ లో ని సాయిబాబా మందిరము గురించి ఈరోజు తెలుసుకుందాము.

ఈ మందిరములోని ఫోటోలన్ని వరుసలో యిస్తున్నాను.

35 సంవత్సరాల క్రితం చండీఘర్ దాని చుట్టుపక్కల గల ప్రాంతంలో చాలా మందికి సాయిబాబా గురించి తెలియదు. కొంతమంది ఆర్మీ వారు ఛండీఘర్ నుంచి పూనా వద్ద పోస్ట్ చేయబడ్డారు. ఆవిథంగా వారికి షిర్డీ సాయిబాబా గురించి తెలిసింది.

ప్రతీరోజు రేడియో వినేవారికి భక్తి సంగీతం గురించి తెలుసు. 1980 ప్రాంతాల్లో పొద్దున్న, మథ్యాన్నం భక్తి సంగీతం ప్రసారమవుతూ ఉండేది. ప్రతిరోజు మథ్యాన్నము సాథారణంగా ప్రసారం చేసే భజన "రాం కహో రహనాం కహో, మేరే సాయీ సబ్ మే సమాయా హై, హర్ తరఫ్ కీ ఉసీ కీ చాయా, రాం కహో రహనాం కహో" ప్రజలకి షిరిడీ సాయిబాబా గురించి తెలుసుకోవడానికి ఇదొక ప్రచార మాథ్యమం. ఆ రోజుల్లో ఛండీఘర్ ప్రాంతంలో శ్రీ ఐ.పీ. మెహతా అనే సామాన్య వ్యక్తి పోస్ట్ మాన్ గా పనిచేస్తూ ఉండేవారు.
అతని జీవనాథారం అతని ఉద్యోగమే. అతను ఛండీఘర్ లో సెక్టార్ 30 లో ఉండేవాడు. బహుశా కొంతమంది ఆర్మీ వారు ఛండీ ఘర్ లో ఒక చిరునామాకి సాయి లీల పత్రిక పోస్ట్ లో పంపడం జరిగింది. మెహతా గారికి పోస్ట్ లో వచ్చిన ఈ సాయి లీల పత్రికను చూద్దామనే తలంపు కలిగింది. ఆయన పుస్తకం తెరచి చదివి మరల కవరులో పెట్టి ఆ పుస్తకం యెవరికి వచ్చిందో వారికి అందజేశాడు. ఆయన ఆ పత్రిక చదివాక శ్రథ్థ కలిగి మరొక సంచిక కోసం ఆత్రుతగా యెదురు చూశాడు. ఇక్కడ బాబా గారి లీల తన భక్తులని యెలా రప్పించుకుంటున్నారో చూడండి. పత్రిక, చందా వల్ల క్రమం తప్పకుండా వస్తోంది. మెహతా గారు పత్రిక రాగానే దానిని పూర్తిగా చదివాక మరునాడు, దానిని స్వంత చిరునామాదారునికి అందచేస్తూ ఉండేవారు. ఆయనకి బాబా పట్ల భక్తి ప్రేమ వృథ్థి చెంది, షిరిడీ వెళ్ళాలనే కోరిక పెరగడం మొదలు పెట్టింది. కేవలం పత్రిక చదివినందువల్లనే మెహతాగారు బాబా వారి వద్దకు లాక్కోబడ్డారు. బాబా గారే తన గురువు అనే విషయం కూడా ఆయనకి తెలియదు. ఇదంతా కూడా 30 - 35 సవంత్సరాల నాటి మాట. ఇదంతాకూడా భక్తులకి కూడా అర్థముకాని బాబా లీల. ఆ విథంగా మరొక పిచ్చుక షిరిడీకి లాగబడింది.

మెహతా గారు బాబా గారికి శరణాగతుడయ్యారు. ఒకరోజు ఆయనకు బాబా సత్సంగము చేయమని స్వప్న దర్శనం కలిగింది. ఒకరోజు ఆయనకి వేరు వేరు యిండ్లలో సత్సంగములు జరిపించమని కల వచ్చింది. ఆయన ఈ విషయాన్ని కొంతమందికి చెప్పారు, కాని యెవరూ ఆసక్తి కనపరచలేదు. నా యింట్లో సాయి సత్సంగము చేస్తే యెవరూ రారు అనుకుని, సెక్టార్ 21 లో ఉన్న బాబా మందిరంలో చేద్దామని నిశ్చయించుకున్నాడు. బహుశా అదే ఛండీఘర్ లో జరిగిన మొట్టమొదటి సాయిబాబా సంత్సంగం. సత్సంగానికి ప్రజలను ఆకర్షించడానికి బయట బోర్డ్ ని వేళ్ళాడగట్టాడు. ఆ బోర్డ్ చదివి ఆయన దగ్గరివారు, బంథువులే కాకుండా మరికొంత మంది కూడా అక్కడికి వచ్చారు. వారు గ్రూపుగా యేర్పడదం వల్ల బాబా గారి పేరు ప్రచారంలోకి వచ్చింది. ప్రారంభంలో సమయాన్ని బట్టి వీరంతా ఒక్కొక్కరి యింటికి వెళ్ళి సత్సంగాన్ని నిర్వహిస్తూ ఉండేవారు. అక్కడ 4, 5 కుటుంబాలవారు నియమిత కాలంలో తమ తమ యిండ్లలో సత్సంగాలు పెట్టుకుంటూ ఉండేవారు. ఆ రోజుల్లో మెహతాగారికి ఒక సైకిలు ఉండేది. సైకిలికి వెనకాల డప్పు ఒకటి కట్టుకుని యింటింటికి వెళ్ళి ప్రతీవారిని మీ యింటిలో సత్సంగము పెట్టించుకొమ్మని అడుగుతూ ఉండేవారు. మెహతాగారు తనతో పాటు సైకిలు మీద డప్పుని తీసుకెళ్ళడమే కాదు, బాబాగారికి ప్రసాదాన్ని కూడా తీసుకెడుతూ ఉండేవారు. బాబాగారికి మాత్రమే తెలుసు తన పథ్థతులు, ఇంకా తనభక్తులకు యెలా యేర్పాటు చెయ్యాలో తెలుసు.

మెల్ల మెల్లగా ఇంకా ఇంకా భక్తులు ఆసక్తి చూపడం మొదలుపెట్టి, చెయ్యీ చెయ్యీ కలుపుకొని, ఛండిఘర్లో మొట్టమొదటగా "షిరిడి సేవా సమాజ్" ని ప్రారంభించారు. ఈ ఆర్గనైజేషన్ ని వారు రెజిస్టర్ చేయించారు. సభ్యులుగా ఉన్న భక్తులంతా కూడా బాబా లీలలు ప్రచారమెలా చేయాలో తమలో తాము చర్చించుకుని, బాబా వారికి మందిరం నిర్మించాలనే యేకగ్రీవ నిర్ణయానికి వచ్చారు.

ఇక తరువాతి దశ బాబా మందిరానికి స్థలం కావాలి. అందుచేత ఆర్థిక వనరుల సమస్య ఉండటం వల్ల తమ కల నిజంకావడం అసాథ్యమనుకున్నారు. కాని, బాబా గారు ఛండీఘర్ లో మందిరం ఉండాలి అని నిర్ణయించుకొంటే యేది అడ్డుకొంటుంది? సామెత చెప్పినట్లుగా కఱ్ఱ దొరికితే బండి తయారు చేయచ్చు. ఆ రోజుల్లొ మత సమంబంథమైన సంస్థలు స్థలం కొనదలిస్తే ప్రభుత్వం ఒక స్కీమును పెట్టింది. స్థలం కావాలంటే స్థలం విలువలో 10 శాతంప్రభుత్వానికి కట్టాలి. మరలా ఆర్థిక సమస్య, కాని యెక్కువ భక్తిగల భక్తులు కొందరు తమ సంపాదన లోని ప్రతీ పైసా భక్తితో సమర్పించుకున్నారు. బాబా గారు దీనిని సాథ్యం చేశారు. ఛండీఘర్లో ని సెక్టార్ 29 లో స్థలం కేటాయించబడింది. అడ్మినిస్ట్రేటివ్ శాఖలో కొంతమంది తమంత తాముగ ఈ స్థలం కేటాయింపులో నిశ్వార్థమైన సేవ చెసి ఈ ప్రణాళికని విజయవంతం చేయడం మెహతా గారు గుర్తు చేసుకుంటూ ఉంటారు.

బాబాగారు తప్ప మరెవరు దీనిని సాథ్యం చేయగలరు....? స్థలం కేటాయించబడ్డాక, తరువాత పెద్ద దశ కట్టడం ప్రారంభించడం, కాని అప్పటికే మరల ఆర్థిక సమస్య, వారి వద్ద తాము అన్నుకున్నంత సొమ్ము లేదు. సమాజ్ లో ని భక్తులందరూ కూడా తమ శాయశక్తులా తమ వంతు సహాయం చేసి సాయి సత్సంగ్ లో విరాళాలుగా వచ్చిన సొమ్మంతా కూడా మందిర నిర్మాణానికి కావలసిన నిథులకే సమర్పించారు. కాని వసూలయిన చందా అంత యెక్కువకాదు, మందిర నిర్మాణమంటే అది ఒక బృహత్కార్యం.

మెహతా గారు తన భార్య నగలు అమ్మి ఆ సొమ్ముతో యిటుకలు, ఇంకా మందిరం కట్టడానికి కావలసిన యితర సామగ్రి కొనడానికి వినియోగించారు. కూలీ ఖర్చు పొదుపు చేయడానికి సాయి సమాజ్ సభ్యులందరూ కూడా, నిర్మించే పని తామే స్వయంగా చేయడానికి నిర్ణయించుకున్నారు. వారు మట్టి ని తవ్వి, అందరూ కూడా ఒక వరుసలో గొలుసులా నిలబడి యిటుకలు, సిమెంట్ బేసిన్ లు అన్ని అందించుకున్నారు. ఇవన్నీ మెహతా గారు గుర్తు చేసుకున్నారు. ఈ విథంగా సాయి మందిర శంకుస్థాపన, సాయి సమాజ్ సభ్యులందరి కఠోర శ్రమతో జరిగింది.

సమాజ్ సభ్యులందరిదీ కూడా యెంత భక్తి? వారి చేతులతో స్వయంగా వారు సుందరమైన సాయి మందిరానికి శంఖుస్థాపన చేశారంటే చాలా మెచ్చుకోదగ్గ విషయం. వారు యెంతటి అదృష్టవంతులో కదా.....!

ఈ బృహత్కార్యంలో వివిథ కుటుంబాల వారందరూ కూడా ఒకొళ్ళకొకళ్ళు భోజన పదార్థాలు తీసుకుని వచ్చి బాబా గారికి సమర్పించిన తరువాత స్వీకరిస్తూ ఉండేవారు.

వారెంతటి పుణ్యం చేసుకున్నారో కదా..

ఒక్కక్కప్పుడు వీరంతా రాత్రి పొద్దుపోయేదాకా కూడా, వారి గురువు, ... మన గురువు.... మన సాయి... కి సుందరమైన నివాసం కొరకు ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుంటు పని చేశారు. సాయి ఆజ్ఞ లేనిదే సాయి మందిర నిర్మాణము జరగదని మనకు తెలుసు, పైగా సాయి మందిర నిర్మాణము యెక్కడయితే జరుగుతూ ఉంటుందో అక్కడకు బాబా గారు స్వయంగా వస్తారనే నమ్మకం కూడా ఉంది. ఇది ఛండీఘర్ సాయి మందిరంలో కూడా జరిగింది.

భక్తులు చాలా సార్లు రాత్రిళ్ళప్పుడు బాబాగారిని చూశారు. ఒక్కొక్కసారి ఆయన సెక్యూరిటీ గార్డ్ లాగా, ఒక్కొక్కసారి ముసలి ఫకీరు లాగా వచ్చి గుడి నిర్మాణం పర్యవేక్షిస్తూ ఉండేవారట. ఒక భక్తునితో మాట్లాడిన తరువాత మాయమయిపోటూ ఉండేవారట.

మెహతాజీ గారు గుర్తు చేసుకున్న ఈ సంఘటన చూడండి. ఒకసారి ఒక మహిళా భక్తురాలు గుడి నిర్మించే స్థలం లో ఉంది. అప్పుడు బాబాగారితో జరిగిన సంభాషణ:

భక్తురాలు: బాబాజీ యెక్కడనించి వస్తున్నారు? వినమ్రంగా అదిగింది.

బాబా జవాబు: షిరిడీ

భక్తురాలి తరువాతి ప్రశ్న: యెక్కడకు వెళ్ళాలి?

బాబా జవాబూ: షిరిడీ

మరలా ఆమె తిరిగి చూసేటప్పటికి బాబా గారు అదృశ్యమయారు. ఆపుడు ఆమెకు అర్థమయింది తను కలుసుకున్నది బాబాగారిని తప్ప వేరెవరినీ కాదని.
ఓ మై సాయి దేవా... నీలీలలను నేనెట్లా వర్ణించగలను. నేనంతటి నేర్పరిని కాదు. నిన్ను వర్ణించడానికి నాకు మాటలు రావు. చేయించేవాడివి నువ్వే.

బాబా గారు ఆ విథంగా తన మందిరాన్ని నిర్మాణ దశలో ఉన్నప్పుడు పర్యవేక్షించారు.
ఒకానొక దశలో యిటుకలు సరఫరా చేసిన కంట్రాక్టర్ , యింకా యిటుకలు కావాలంటే డబ్బు కావాలని చెప్పాడు. సాయి సమాజ్ వారు, మెల్ల మెల్లగా దబ్బు యిస్తాము కాని, గుడి నిర్మణానికి సామగ్రి మాత్రం ఆపద్దు అని చెప్పారు.

మొదట కఠినంగా ఉన్నాడు, కానీ బాబాగారు తలుచుకున్నారు. బాబాగారె స్వయంగా తన మందిర నిర్మాణాన్ని పర్యవేక్షించినపుడు యేదీ ఆగదు. కాంట్రాక్టర్ కావలసిన సరుకు యెంతయినా సరఫరా చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ విథంగా ఛండీఘర్లో సుందరమైన బాబా మందిరం నిర్మించబడింది.
గుడిలో స్థాపించడానికి విగ్రహాన్ని జయపూర్నుండి తేవడానికి నిర్ణయించారు. గుడి సహాయార్థం ఒక భక్తుడు తన వ్యాపారంలో మొదటి షేర్ ప్రతినెల ఇవ్వడానికి ముందుకొచ్చాడు.

ఈ భక్తుని సహాయంతోను, సాయి సమాజ్ భక్తులందరి సహకారంతో చక్కటి సుందరమైన షిరిడి సాయి విగ్రహం ప్రతిష్టించబడింది. అటాచ్ చేసిన ఫోటో చూడండి. నిర్మాణము జరిగే సమయంలోనూ, గుడి యేర్పాటు అయిన దగ్గరనించి చాలా మంది భక్తులు బాబా లీలను చూసారు, అనుభవించారు. కొన్ని సంవత్సారల క్రితం ఈ మందిరంలో జరిగిన ఒక లీలను మీముందుంచుతున్నాను.

ఈ గుడికి దగ్గరలో ఒక ఫోటొ స్టూడియో ఉంది. ఫోటో షాపతను బాబా విగ్రహాన్ని ఫోటో తీసి పెద్దదిగా పోస్టర్ గా చేద్దామనుకున్నాడు. మందిరంలోకి వెల్లి బాబా విగ్రహాన్ని వివిథ కోణాలలొ 10 ఫోటోలు తీశాడు. షాపు కి తిరిగి వచ్చి ఫోటోలని డెవలప్ చేయడం మొదలుపెట్టాడు. కాని రీలంతా కూడా ఖాళీగా ఉండి ఒక్క ఫోటో కూడా రాకపోవడంతో అతనికి ఆశ్చర్యం వేసింది. బహుశా యెక్కడో పొరపాటు చేసి ఉంటాను అనుకుని అతను మరలా మందిరంలోకి వెళ్ళి బాబా విగ్రహాన్ని వివిథ కోణాలలో,యింకా అనేక ఫోటోలు తీశాడు. మరలా షాపుకి తిరిగి వచ్చి రీలు డెవలప్ చేసి చూద్దామనుకుంటే రీలు అంతా ఖాళీగా ఉంది. ఫోటొలన్నీ చాలా క్లియర్ గా వచ్చాయి కాని బాబా ఫోటోలు మాత్రం రాలేదు.

అతను తిరిగి మందిరంలోకి వెళ్ళి ఒక భక్తునితో మాట్లాడాడు. అతను ఫోటో తీసేముందు బాబాగారి అనుమతి తీసుకోమని చెప్పాడు. అతను బాబా అనుమతి తీసుకోనందుకు బాబాకి క్షమాపణ చెప్పి, ఈ సారి ఫోటోలు తీసుకోవడానికి బాబా గారి అనుమతి కోరాడు. ఈసారి తీసిన ఫోటోలన్నీ బాగా వచ్చాయి. తన షాపులో కూడా తను తీసిన బాబా ఫోటొ ఫ్రేం కట్టించి పెట్టాడు. యెంతటి అథ్భుతమైన బాబా లీల. నేడు ఛండీఘర్లోని బాబా మందిరం యెంతో అందంగా ఉంది. బాబా దీవెనల వల్ల సుమారు ప్రతిరోజు 1000 మంది వస్తూఉంటారు. గురువారాల్లో 2500 - 3000 మంది భక్తులు ఈ మందిరానికి వస్తూ ఉంటారు.



గీతాంజలి గారు ఈ సమగ్ర సమాచారాన్ని పంపగా, శ్రీమతి ప్రియాంకా రౌతేలా గారు తమ బ్లాగులో 2008 లొ పోస్ట్ చేయడం జరిగింది.

బాబా మందిరము ఛండీఘర్ చిరునామా:

షిర్డీ సాయి మందిర్,
సెక్టర్ 29 ఏ,
ఛండీఘర్.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Wednesday, March 23, 2011

సచ్చరిత్ర - ప్రశ్నలు జవాబులు

0 comments Posted by tyagaraju on 11:24 PM




24.03.2011 గురువారము

సచ్చరిత్ర - ప్రశ్నలు జవాబులు
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

ఈ రోజు మనము మరికొన్ని ప్రశ్నలు జవాబులు తెలుసుకుందాము.



ప్రతీరోజు పొద్దున్నే లేవగాని బాబా హారతి పాట పెట్టుకుని వినండి. మంచం మీదనించి లేచేటప్పుడు మీ రెండు అరచేతులలొకి చూసి 11 సార్లు "ఓం శ్రీ సాయిరాం" అని ఆయన నామాన్ని స్మరిస్తూ లేవండి.




31. బాబాగారు ఖండొబా మందిరంలోనికి ప్రవేశించినపుదు "ఆవో సాయీ" అని యెవరు పిలిచారు?

మహల్సాపతి

32. బాబా ముందర ఒక్క మాటయినా మాట్లాడని ముగ్గురు భక్తుల పేర్లు చెప్పండి.

శ్రీ బూటీ, శ్రీ ఖపర్డే, శ్రీ నూల్కర్

33. కప్ప , సర్పము వీటి గత జన్మలలోని పేర్లు యేమిటి?

చిన్నబసప్ప, వీరభద్రప్ప

34. భరంపూర్ మహిళ కలలో బాబాగారు తినడానికి యేమి అడిగారు?

కిచిడీ భోజనము

35. బాబాగారు షామాని ప్రతీరోజు యే స్తోత్రము చదవమన్నారు?

విష్ణు సహస్ర నామం

36. కాకాసాహెబ్ దీక్షిత్, షాం కోపర్గావ్ రైలులో వచ్చినప్పుడు, వారి యే క్లాసులో ప్రయాణించారు?


ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంటులో ప్రయాణించారు.

37. యే రోజున మేఘా బాబావారిని తలనించి పాదముల దాకా స్నానము చేయించాడు?

మహా సంక్రాంతి రోజున.

38. నానా చందార్కర్ గారి అమ్మాయి జామ్నర్ లో ప్రసవ వేదన పడుతున్నప్పుడు,
బాపుగిర్ ద్వారా బాబా గారు నానా చదార్కర్ గారికి రెండు వస్తువులు పంపారు అవి యేవి?

మాథవరావ్ అడ్కర్ రాసిన "ఆరతి సాయిబాబా సౌఖ్య దాతార జీవా" మరియు ఊదీ.

39. నాసిక్ నివాసి మూలే శాస్త్రి గారి గురువు పేరు?

ఘోలప్ స్వామి.

40. డా.పండిత్ గారి గురువు పేరు?

కాకా పూరనిక్

41. శ్రీ బినివాలె యే దేవుని భక్తుడు?

లార్డ్ దత్తాత్రేయ భక్తుడు.

42. మేఘా యే దేవుని భక్తుడు?

లార్డ్ శివ

43. దాస్ గణు యే దేవుని భక్తుడు?

లార్డ్ విఠల్

44. రాథాక్రిష్ణ ఆయి యే దేవుని భక్తురాలు?

లార్డ్ బాలకృష్ణ

45. శ్రీ చాంద్ బాయ్ చేసే ఉద్యోగమేమిటి?

శ్రీ చాంద్ బాయ్ థూప్ ఖేడ్లో విలేజ్ యిన్ చార్జ్


46. మహల్సాపతి యే దేవుని భక్తుడు?

లార్డ్ ఖండోబా.

47. 1917 లో హోలీ పూర్ణిమ రోజున, బాంద్రాలోని (ముంబాయి) హేమాడ్ పంత్ యింటికి యే రూపములో వెళ్ళారు?

బాబా గారు ఫొటో ఫ్రేం రూపంలో హేమాడ్ పంత్ గారి యింటికి వెళ్ళారు.

48. నిరంతరంగా బాబాగారు యేనామాన్ని జపిస్తూ ఉండేవారు?

అల్లా మాలిక్ అల్లా మాలిక్

49 ద్వారకా మాయి మీద రెండు జండాలు యెగురవేయబడ్డాయి, వాటి స్వంతదారులు యెవరు?

1. శ్రీ దాము అన్నా కాసర్ 2. శ్రీ నానాసాహెబ్ నిమాంకర్

50. ద్వారకామాయిలో బాబాగారితో పాటుగా యెవరు నిద్రించేవారు?

మహల్సాపతి & తాత్యా కోతే పాటిల్


(మిగతా ప్రశ్నలు జవాబులు తరువాత)

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

సచ్చరిత్ర - ప్రశ్నలు, సమాథానాలు

0 comments Posted by tyagaraju on 7:15 AM
23.03.2011 బుథవారము కాంప్: బంగళూరు
సచ్చరిత్ర - ప్రశ్నలు, సమాథానాలు


కంప్యూటర్ ప్రాబ్లం వల్ల బాబా ఫోటొ, గులాబీ, పెట్టడం సాథ్యము కాలేదు.

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి.
సాయి బంథువులకు బాబా వారి శుభాశీశ్సులు

ఇంతవరకు మనము బాబా వారు చెప్పిన సాయి ప్రేరణ శ్రథ్థగా ఆలకించాము. బాబా లీలలు తెలుసుకుంటూ మథ్య మథ్య లో కొన్ని విషయాలు కూడా చెప్పుకుందాము. బాబా మందిరాల నిర్మాణము వెనుక బాబా గారి అదృశ్య శక్తి వుంటుందనేది మనకందరకు తెలుసు. అటువంటి ఒక బాబా మందిరం గురించి నిన్న తయారు చేయడం మొదలు పెట్టాను. పూర్తి అవడానికి యింకా కొంత సమయం పట్టచ్చు. అందుకని ఈలోపు కొన్ని మిగతా విషయాలు పోస్ట్ చేద్దామనుకుని నెట్ లో వెతుకుతూండగా బాబా సచ్చరిత్రలోని క్విజ్ కనపడింది. క్విజ్ తయారు చేస్తుండగా సుకన్యగారు కూడా అదే క్విజ్ ని నాకు మైల్ చేయడం అంతా యాద్రుఛ్ఛికం, మరి బాబా అనుమతి.

బాబా లీలలు చదవడమే కాదు, చరిత్ర పారాయణ చేయడమే కాదు, అందులో మనం యెంత వరకు గ్రహించుకున్నాము అని మనకు మనమే ప్రశ్నించుకోవాలి. ఈ క్విజ్ లో మొత్తం 100 ప్రశ్నలు సమాథానాలూ ఉన్నాయి. మొదటగా 30 ప్రశ్నలు సమాథానాలు మీతోపాటు నేను కూడా తెలుసుకుంటాను.


ఇక మొదలు పెడదామా...........



1. హేమాడ్పంత్ కు సాయి సచ్చరిత్రను వ్రాయడానికి ప్రేరేపించిన సంఘటన యేది?

ఒకరోజున ద్వారకామాయిలో బాబా గారు తిరగలి విసురుతుండగా హేమాడ్పంత్ గారు చూశారు. అప్పుడే ఆయనకు బాబా సచ్చరిత్ర వ్రాయాలనే సంకల్పం కలిగింది.

2. బాబా గారు తిరగలి విసురుతున్నప్పుడు, అక్కడికి ఆవూరి ఆడవారు యెంతమంది వచ్చారు?

నలుగురు ఆడవాళ్ళు వచ్చారు.

3. బాబాగారు తను విసిరిన గోథుమ పిండిని యేమి చేశారు?

బాబా గారు ఆ పిండిని ఊరి బయట చల్లించి షిరిడీలో కలరా వ్యాథిని నిర్మూలించారు.

4. గుఱ్ఱము మీద వచ్చిన మనిషి (తన సంచీలో బల్లిని తీసుకుని వచ్చాడు) బాబా దర్శనానికి షిరిడీ వచ్చినప్పుడు, బాబా గారు యేమి చేస్తున్నారు?

ఆ సమయములో బాబా గారు స్నానము చేస్తున్నారు.

5. బాబా గారు బలరాం మాంకర్ ను ప్రాయశ్చిత్తం నిమిత్తము మచ్చిందర్ ఘడ్ కు వెళ్ళమని చెప్పి, మచ్చిందర్ ఘడ్ వెళ్ళడానికి యెన్ని రూపాయలు ఇచ్చారు?

12 రూపాయలు ఇచ్చారు.

6. హరిశ్చంద్ర పితలే షిరిడీ వెళ్ళినప్పుడు బాబా గారు ఆయనకు యెన్ని రూపాయలు ఇచ్చారు?

3 రూపాయలు ఇచ్చారు.

7. బాబా గారు ద్వారకామాయిలో యెన్ని రోజులు నిద్రించేవారు, చావడిలో యెన్ని రోజులు నిద్రించేవారు?

ఒక్ రోజు ద్వారకామాయిలో, మరునాడు చావడిలో, మరలా మరునాడు ద్వారకామాయిలో మరునాడు చావడిలో ఇలా సమాథి చెందేవరకూ నిద్రించేవారు.

8. బాబా గారు రాథాబాయ్ దేస్ముఖ్ కి యేమి మంత్రము ఇచ్చారు?

శ్రథ్థ, సబూరి

9, శ్రీమతి కపరదే కి బాబా గారు యేమి మంత్రము ఇచ్చారు?

బాబా గారు ఆమెతో "రాజారాం రాజారాం" అని ఉచ్చరించమన్నారు.

10, బాబా గారు సమాథి చేందేముందు లక్ష్మీ బాయికి యంత డబ్బు యెన్ని వాయిదాలలో ఇచ్చారు?

బాగారు ఆమెకు 9 రూపాయలు ఇచ్చారు . మొదట 5 రూపాయలు, తరువాత 4 రూపాయలు.

11. బాబాగారు యెవరి వళ్ళో తన ఆఖరి శ్వాసను విడిచారు?

బాయాజీ కోతే పాటిల్.

12. బాబా గారు సన్యాసి రూపములో యిద్దరు చిన్న పిల్లలతో కలిసి దహానూలో ఉన్న శ్రి బీ.వీ.దేవ్ గారిని చూడటానికి వారి యింటికి వెళ్ళినప్పుడు, టాంగా ను యెవరి యింటిముందు ఆపి దిగారు?

అడ్వొకేట్ పరంజపే గారి యింటి ముందు.

13 , 14. బాబా, షామా, యెన్ని జన్మల అనుబంథము.

72 జన్మలు.

15. బాబా, బలరాం థురందర్ యెన్ని జన్మల అనుబంథము.

60 జన్మలు.

16. ఒకసారి యోగా నేర్చుకుంటున్న విథ్యార్థి, బాబా దర్శనానికి వచ్చినప్పుడు, బాబాగారు యేమి చేస్తున్నారు?

బాబా గారు మిగిలిపోయిన గోథుమ రొట్టెను ఉల్లిపాయతో తింటున్నారు.

17, ప్రముఖ హారతి పాట "ఆరతి సాయిబాబా, సౌఖ్య దాతార జీవా" యెవరు వ్రాశారు?

శ్రీ మాథవరావ్ అడాకర్

18. బాబావారి పవిత్రమైన శరీరం యెవరి యింటిలో విశ్రాంతి తీసుకుంది?

శ్రీ బూటీ యింటిలో.

19. బాబాగారు యేసమయలో, యేరోజున తమ ఆత్మను బ్రహ్మానందంలో ఉంచారు?

దత్త జయంతి రోజున రాత్రి 10 గంటలకు.

20. ద్వారకామాయిలో బాబా గారు చెక్క ఊయల మీద నిదురించేటప్పుడుం యెన్ని మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగింపబడినవి?

నాలుగువైపులా 4 దీపాలు.
21. యెంతమంది అమ్మాయిల తరువాత నాందేడ్లో ని సేట్ రతంజీ పార్శీ గారికి మగపిల్లవాడు జన్మించాడు?

12 మంది ఆడపిల్లల సంతానం తరువాత మగపిల్లవాడు జన్మించాడు.

22. సఖారాం ఔరంగాబాద్కర్ గారి సవతి కొడుకు పెరు యేమిటి? యెన్ని సంవత్సారాల తరువాత సఖారాం గారికి మొట్టమొదటి సంతానం కలిగింది? పుట్టిన సంతానం ఆడా? మగా?

సవతి కొడుకు పేరు విశ్వనాథ్, 27 సంవత్సరాల తరువాత మగపిల్లవాడు జన్మించాడు.

23. లక్ష్మీ చంద్ గారు దాసుగణు కీర్తన వినడానికి ముంబాయి వెళ్ళినప్పుడు ఆ సమయంలో దాసుగణుగారు తమ కీర్తనలో యెవరి గురించి వర్ణిస్తున్నారు?

సంత్ తుకారాం గారి కథ.

24. షామా గారు కాశీ, గయ, ప్రయాగ, అయోథ్య యాత్రలకు వెళ్ళునప్పుడు, నంద్ రాం మార్వాడీ వారి వద్ద యెంత అప్పు తీసుకున్నారు?

100 రూపాయలు.

25. షిరిడీ వెళ్ళునప్పుడు లక్ష్మిచంద్ గారు తన సోదరుని వద్ద యెంత సొమ్ము అప్పుగా తీసుకున్నారు?

15 రూపాయలు.

26. మూలే శాస్త్రిగారు, బాబా దర్శనానికి షిరిడి వెళ్ళినప్పుడు, బాబాగారు ఆయనకు యెన్ని అరటిపండ్లను ఇచ్చారు?

నాలుగు అరటిపండ్లు.

27. రఘునాథరావ్ టెండూల్కర్ గారు పదవీ విరమణ చేసినతరుచ్వాత నెలకు యెంత పెన్షన్ తీసుకుంటూ వుండేవారు, బాబాగారు ఆయనకు నెలకు యెంత పెన్షన్ ఇచ్చారు?

నెలకు 75 రూపాయలు, కాని బాబా దయ వల్ల నెలకు 110 రూపాయలు పెన్షన్ వచ్చింది.

28. రాంగిరీ బువాగారు సల్గావ్ రైల్వే స్టేషన్లో దిగినప్పుడు ఆయన జేబులో యెంత డబ్బు మిగిలింది?

రెండు అణాలు మాత్రమే.

29, బాబా గారు కొన్ని రోజులు యేగురువుకు శిష్యుడుగా ఉన్నారు?

జవహర్ ఆలీ

30. బాబా గారు మెరిసే రాయి కాదు, వజ్రం అని షిరిడీవాసులతో అన్నది యెవరు?

ఆనందనాథ్ మహరాజ్.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List