Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, January 29, 2011

ప్రార్థనాష్టకము

0 comments Posted by tyagaraju on 7:10 AM






29.01.2011 శనివారము


సాయి బంథువులారా బాబాగారు మీకు శుభాశీస్సులు అందజేయమని ప్రార్థిస్తున్నాను.

ఈ రోజు సచ్చరిత్రలోని 18, 19 వ అథ్యాయము గురించి కొంత వివరణ ఇస్తాను.

మన ప్రవర్తన గూర్చి బాబా ఉపదేశము.

బాబా పలుకులు సాథారణమైనవి అయినప్పటికి అవి అమూల్యములు.
మనము చరిత్ర పారాయణ చెయ్యడమే కాదు, వినడమే కాదు, అందులో ఆయన చెప్పిన విషయాలన్నిటిని మనము వంట పట్టించుకుని ఆచరణలో పెట్టాలి. దాహము గలవారికి నీరు, ఆకలి గొన్నవారికి అన్నము పెట్టాలి. అపాత్ర దానం చేయకూడదు. బాగా ఉన్నవాడికి, మనం దానం చేసినా ఉపయోగం ఉండదు.

మనకి మితృలని చేసినా, శత్రువులని చేసినా, మన నాలుకే. అందుకే నాలుకను అదుపులోపెట్టుకోవాలి. దీని అర్థం, ఇతరులను దూషించవద్దని బాబా గారు చెప్పారు. ఇతరులను దూషించేవారిని వరాహముతో పోలిచారు.

బాబా కి మనకి మథ్య అడ్డుగోడ గా ఉండేది మాయ.
ఆ మాయని ఛేదించాలి . మనకి అడ్డుగోడగా నిలిచేవి ఈ ప్రాపంచిక విషయాలు. ఇవే మనకి ఆనందాన్ని ఇచ్చేవి అనుకుంటాము. ఇవే శాశ్వతమైనవి అనుకుంటాము. కాని నిజమైన శాశ్వతానందన్నిచ్చేది భగద్దర్శనము.

మనము సాయి బంథువులయ్నిప్పుడు మనము యెదటివారిలోనే కాదు, మన కుటుంబ సభ్యులందు కూడా సాయిని చూడగలగాలి. అప్పుడు కుటుంబ సభ్యుల మథ్య తగాదాలకి ఆస్కారము ఉండదు. మన హృదయంలో సాయి ఉన్నడని మనము నమ్మితే, యెదటివారిలో కూడా ఉన్నది సాయే అనుకుని ప్రవర్తించాలి.

అంతా సాయి మయం, ఈ జగమంతా సాయి మయం అనుకుందాము.

ఈ రోజు సాయి ప్రార్థనాష్టకము, సాయి విభూతి థారణ అందచేస్తున్నాను.



శ్రీ సాయి ప్రార్థనాష్టకం

1. శాంతచిత్తా మహాప్రజ్ఞా సాయినాథా దయాథనా
దయాసింథో సత్యస్వరూపా మాయాతమ వినాశనా

2. జాతా గోతాతీతా సిథ్థా అచింత్యా కరుణాలయా
పాహిమాం పాహిమాం నాథా శిరిడీ గ్రామనివాసయా

3. శ్రీజ్ఞానార్క జ్ఞానదాత్యా సర్వమంగళ కారకా
భక్త చిత్త మరాళ హే శరణాగత రక్షక

4. సృష్టి కర్తా విరంచీ తూ పాతాతూ ఇందిరాపతి
జాగత్రయాలయానేతా రుద్రతో తూచ నిశ్చింతీ

5. తుజ వీణే రితా కోఠే ఠావనాయా మహీవరీ
సర్వజ్ఞతూసాయినాథా సర్వాంచ్యా హృదయాంతరీ

6. క్షమా సర్వాపరాథాంచీ కరానీ హేచీమాగణే
అభక్తి సంశయా చ్యాత్యాలాటా శ్రీఘ్రనివారిణే

7. తూథేను వత్సమీతాన్ హే తూ ఇందుచంద్రకాంత మీ
స్వర్నదీరూప త్వత్వాదా ఆదరేదా సహానమీ

8. ఠేవ ఆతా శిరీమాజ్యా కృపేచాకర పంజర
శోకచింతా నివారా గుణూహా తవకింకరహ

(శ్రీ సాయిబాబాని ప్రత్యక్షంగా సేవించిన గొప్ప భక్తుడు దాసగణు మహరాజ్. వీరి పూర్తిపేరు గణేశ్ దత్తాత్రేయ సహస్రబుథ్థే. బాబా లీలలను వర్ణించి యెన్నో కీర్తనలు రచించి గానం చేసిన మేటి కీర్తనకారుడు. వీరు రచించిన సాయి స్థనవనమంజరి అనే గ్రంథములో ఈ ప్రార్థనాష్టకము చాలా మహిమగలది. ఆశీర్వాదం పొందబడింది. శ్రథ్థాభక్తులతో పఠించిన వారి సమస్యలు పరిష్కరించబడటమే కాకుండా ఈప్సితార్థములను పొందగలరు. )

భావము: నేను యెన్నో కోట్ల జన్మలెత్తినా శాంతీ - క్షమా గుణం లేకపోతే ఈ జన్మే దండగ. నా చిత్తం మహాక్రాంతమయింది. బాబా నన్నీ మోహవారథిలోనుండి రక్షింపచేసి పరమశివుని వలన దహింపబడిన కాముడు, మరల జీవించి వచ్చి నన్ను మోహ పరవశుని గావిస్తున్నాడు. పరమ శివా సమర్థ సాయీ వాడిబారిని బడకుండా, నన్ను రక్షించు. సర్వత్రా దురాశా పాశం ఆక్రమించుకొంది. నా మనస్సు స్థిమితంగా లేదు. శ్రీ సాయి సద్గురూ నా కిప్పుడు మీ చరణాలే శరణాలు. గార్థబాలకు చూడిన పెంటలంటే యెంతో సంతోషం పొందుతాయి. అల్లాగే నాకు ఈ మాయా ప్రపంచమన్న యెంతో మక్కువ. మాతృమూర్తి ఉగ్గుపాలతో శరీర పోషణకు చేదును కలిపి ఇచ్చినట్లు మీ దయ శాంతి క్షమలను ప్రసాదించుగాక. గురువర్యా ప్రాపంచిక వాసనలలో చిక్కకుండా మీ కరుణతో దానిని చక్కదిద్దండి. నాకు తల్లివీ, తండ్రివి, గురువు, దేవుడవీ కాన, నీకు నానమస్సుమార్పణ. నాకు ఇష్టమైనదేదో శ్రేయో మార్గాన్ని యేది చూపిస్తుందో నాకు మాత్రం తెలియదు. నేను తెలిసికొనదగినచో దాని మీద నా హృదయముండదు. అందువలన మీరే నాకు శరణ్యం. మీ పాదాలకు నా వందనములు. నాకు యోగ్యత చేకూర్చేదానిని తమను అడిగే యోగ్యత కూడా నాకు లేదు. బాలుడైన కుమారుడు తండ్రికి శిక్షణనీయలేడు కదా. అందువల్ల ఈ దాసగణు చింతలను నివారించండి. మీకు నా నమస్సుమాలు. అక్కడ భిక్షమెత్తే భిక్షగాళ్ళు, దయతో థర్మం చేయడం మంచిది. ప్రేమతో అడగకుండా పెట్టడం వేరుగా ఉంటుంది కదా. యెప్పుడూ అడగడం మంచిది కాదు గదా? బ్రతికున్నంతకాలం శ్రథ్థా భక్తి విశ్వాసాలతో ఉన్నచో నీ ప్రేమ నాకు లభిస్తుంది. ఈ శరీర రథం నడవాలన్న థన ఇంథనం అవసరమే. కాని థనమే ప్రథాన సాథనం కాదు

----------------------------------------------------------------------------

శ్రీ సాయి విభూతి థారణ

మహాగ్రహ పీడాం మహోత్పాదపీడాం

మహారోగ పీడాం మహా తీవ్ర పీడాం

హరత్యాశుచే ద్వారకామాయి భస్మం

నమస్తే గురుశ్రేష్ఠ సాయీశ్వరాయ

శ్రీకరం నిత్యం శుభకరం దివ్యం

పరమం పవిత్రం మహాపాపహరం

బాబా విభూతిం థారయామ్యహం

పరమం పవిత్రం లీలా విభూతిం

పరమం విచిత్రం లీలా విభూతిం

పరమార్థ ఇష్టార్థ మోక్షప్రదాతం

బాబా విభూతిం యిదమాశ్రయామి

సాయిబాబా విభూతిం అహమాశ్రయామి

Friday, January 28, 2011

సచ్చరిత్ర - బాబా గారు ఇచ్చే సందేశములు

0 comments Posted by tyagaraju on 5:56 AM





28.01.2011 శుక్రవారము
సచ్చరిత్ర ద్వారా బాబా గారు ఇచ్చే సందేశములు


మన సాయి బంథువులందరికి కూడా బాబా గారే మనకు, తల్లి, తండ్రి, గురువు, దైవం. మన ఇంటిలో బాబా గారి ఫోటో, లేక విగ్రహమున్నా బాబా గారు మన ఇంటిలో ఉన్నట్లే.

బయటకు వెళ్ళేటప్పుడు, బాబా ఊదీ నుదుట పెట్టుకుని, బాబా గారి, ఫొటొ ముందుగాని, విగ్రహం ముందు గాని నిలబడి , బాబా వెళ్ళి ఒస్తానని చెప్పి వెళ్ళండి. మన యోగక్షేమాలు ఆయనే చూసుకుంటారు. వచ్చాక మళ్ళీ వచ్చాను బాబా అని చెప్పండి. ఇప్పుడు మన ఇంటిలో పెద్దవారు అంటే, తండ్రిగాని, తాతగారు గాని, లేక అమ్మకి గాని యెలా చెప్పి వెడతామో అలాగే, బాబా గారికి కుడా మనము చెప్పి వెళ్ళాలి. మన సాయి బంథువులందరూ ఇది అలవాటు చేసుకోవాలి.
మనకి యేదయినా సమస్య వచ్చినప్పుడు బాబా చరిత్రని చేతిలో పెట్టుకుని మనసమస్య మనసులో బాబాకి చెప్పుకుని పరిష్కారము చూపించమని అడిగి, పుస్తకము తెరవాలి. మన సమస్యకి పరిష్కారము ఆయనే చూపిస్తారు.
కాని నాకు, సమస్య అడగకుందానే జరగబోయే సంఘటన తెలియచేశారు. బాబా లీలలు నిగూఢంగా ఉంటాయి.

ఈ రోజు 2009 సం.లో నాకు కలిగిన అనుభూతి గురించి వివరిస్తాను.

నేను చదువుకునే రోజులలో యెప్పుడైనా డిక్ షనరీ తీసి మూసిన పుస్తకంలోనుంచి యేదొ ఒక పేజీ తీసి యే మాట వస్తుందో చూసేవాడిని. ఇది నేను చాలా తక్కువ సార్లే చేశాను.

యెప్పుడైనా పుస్తకాల ఎక్జిబిషన్ కి కి వెళ్ళినప్పుడు యేదొ పేజీ తీసి విషయము బాగుంటే వెంటనే కొనడం అలవాటు.
నా దగ్గర శ్రీ ఓరుగంటి రామకృష్ణ ప్రసాద్ గారు వ్రాసిన శ్రీ సద్గురు సాయిబా జీవిత చరిత్ర - నిత్య పారాయణ గ్రంథం ఉంది. ఈ పుస్తకము నా స్నేహుతుడు యెప్పుడొ ఇచ్చాడు. అతను కొన్ని సంవత్సరాల క్రితం కాలుకి ఫ్రాక్చర్ అయ్యి ఇంటిలో ఉన్నప్పుడు అతనికి నేను ఇటువంటి పుస్తకం ఇచ్చి పారాయణ చేయమని ఇచ్చాను. అతనికి బాబా పరిచయం ఈ పుస్తకము ద్వారానే అయింది మొదటిసారిగా. అప్పటినుంచి అతను తనకు తెలిసినవారికి ఇటువంటి పుస్తకం కొని ఇస్తూ ఉన్నాడు.

అసలు విషయానికి వస్తాను. ఈ పారాయణ పుస్తకం నా కంప్యూటర్ టేబులు మీదే పెట్టుకున్నాను. ఒకసారి 2009 మార్చ్ నెలకి ముందు ఈ పుస్తకము చేతిలోకి తీసుకుని కళ్ళు మూసుకుని యేదో ఒకపేజీ తీసి ఒపేజీలొ ఒకచోట వేలుపెట్టి కనులు తెరచి చదివాను.

అది 97 పేజీ. అందులొ నేను వేలు పెట్టిన చోట ఇలా ఉంది>

" ఈ రోజు నీకు దుర్దినం. నీ ప్రాణానికే ప్రమాదం జాగ్రత్త" ఇది చదవగానే ఇంక మిగతా పేరా చదవకుండా పుస్తకం మూసేశాను. భయం వేసి మిగతాది చదవలేదు. ఇలా ఆ నెలలో చాలా సార్లు యెప్పుడు తీసిన ఇదే పేజీ ఇదే పేరా రావడం జరిగింది. యేమిటి ఇలావస్తొంది అనుకున్నాను. బాబా గారి మీద పూర్తి విశ్వాసం ఉంది , కాని యేమిటి ప్రతీసారి ఇలా వస్తోంది అనుకున్నాను.

అసలు విషయమేమంటే ఆ అథ్యాయంలో నానా సాహెబ్ డెంగ్లీ శ్రీ మాన్ బూటీని ఇలా హెచ్చరించాడు. బూటీ భయపడిపోయాడు. తరువాత బాబా గారు బూటీని చూస్తూ "యేమిటి, డెంగ్లీ యేమంటున్నాడు? నీకు చావును సూచిస్తున్నాడా? భయపడకు థైర్యంగా ఉండు, నాకె ప్రమాదం లేదని అతనితో గట్టిగా చెప్పు. నువ్వు ద్వారకామాయి బిడ్డవు. " ఆ పేరాలో ఉన్న మొత్తము విషయము అది.

ప్రతీసారి అదేపేజీ రావడానికి నేను ఆ పుస్తకాని ప్రతీరొజు పారాయణ చెయ్యటల్లేదు. మరి యెందుకని అదే వస్తోందొ నాకు అర్థము అవలేదు.

మార్చ్ నెలలో మా ఆవిడ బంథువులతో షిరిడి వెళ్ళడం జరిగింది. అక్క్డ డినించి శ్రీప్రత్తి నారాయణరావు గారిచే రచింపబడిన శ్రీ సాయి సచ్చరిత్రము పుస్తకము తెచ్చింది.

ఒకరోజు నేను ఇంతకుముందు చెప్పిన పుస్తకములో యెప్పుడూ కుడివైపు పేజీ మాత్రమే చూస్తున్నాను, అనుకుని ఈ సారి ప్రత్తి నారాయణరావు గారి పుస్తకము తీసాను. ఆ పుస్తకము చేతిలోకి తీసుకుని కళ్ళు మూసుకుని తెరిచి యెడమవయిపు పేజీ తీసి వేలు పెట్టి చూసాను. అది 22 అథ్యాయములోని చివరి పేరా. అందులో కూడా పాము గురించి ఉంది. ఆ పేరాలో "పాములు, తేళ్ళతో సహ సక ల ప్రాణులు భగవదాజ్ఞను శిరసా వహించును " అన్న వాక్యములు ఉన్నాయి.

14.03.2009 న శనివారమునాడు మా ఇంటిలో బాబా గారి విగ్రహము ముందు నిలబడి " బాబా నేను జ్ఞానిని కాదు, పుస్తకము తెరవగానే వచ్చే ఈ వాక్యముల అర్థము తెలియటల్లేదు, అంధు చేత ఈ రోజు నా కలలోకి వచ్చి దీనికి నివారణ చెప్పు" అని ప్రార్థించాను. ఆ రోజున మా సత్సంగములో ని ఒకరిని ఈ విషయము గురించి అడిగాను కాని వారుకూడా యెమి చెప్పలేదు.
నేను స్టేట్ బ్యాంకులో పని చేస్తున్నాను. అందులో నేను ఎస్.బీ. ఐ, లైఫ్ ఇన్సూరెన్స్ ఫెసిలిటేటర్ గా ఉన్నాను. 16.03.2009 న మరలా శ్రీ ఓరుగంటి రామకృష్ణప్రసాద్ గారి పుస్తకము తీసి, కళ్ళు మూసుకుని పేజీ తెరవగా, మరల అదే విషయము వచ్చింది. ఆ రోజున నేను స్కూటర్ మీద మా నరసాపురము నుంచి 15 కి.మీ. దూరములో ఉన్న మొగల్తూరు బ్యాంక్ కి ఇన్సూరెన్స్ పని మీద వెడుతున్నాను. నేను యెప్పుడు , బైక్ మీద వెళ్ళేటప్పుడు సాయి నామ స్మరణ చేసుకుంటూ ఉంటాను. అల్లా వెడుతుండగా సడన్ గా పైన ఆకాశంలో ఒక పక్షి వెళ్ళడం, కింద రోడ్డుమీదయేదో పడడం చూశాను. నా బైక్ కి కొంచెము దూరములోనే పడింది. చూసేటప్పటికి అది పాము, రొడ్డుమీద పడి కొంచెం తలయెత్తి ఉంది. నేను రోడ్డుకు కుడివైపున వెడుతున్నాను అది రోడ్డు మీద యెడమ ప్రక్కన పడింది . రోడ్డుకి యెడమవయిపు కాలవ, కుడివయిపు పంట పొలాలు ఉన్నాయి. నాకు శరీరంలో దడ పుట్టింది. ఆ వేగంలో పక్కనుంచి వెళ్ళిపోయాను. డ్రైవింగ్ లొ కొంచెం ముందుకు వెళ్ళి ఉంటే, అది నామీద కనక పడి ఉంటే? ఇది తలుచుకోగానే ఊహించడానికే భయము వేసింది. బాబా గారిని ఇలా ప్రార్థించాను, బాబా, నాకు ఇన్సూరెన్స్ పాలసీలు రాకపోయినా ఫరవాలేదు, ఈ రోజు నాప్రాణాల్ని, కాపాడావు, అదే చాలు అనుకుని నామస్మరణ ఆపకుండా
వెళ్ళాను. యే సత్సంగము ద్వారానయితే నాకు బాబాగారి తత్వము అవగాహనకు వచ్చిందో, ఆ సత్సంగానికి 116/- సమర్పించుకున్నాను. ఆయన చేసిన సహాయానికి 116/- కూడా తక్కువే, యేమిచ్చినా కూడా."

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Thursday, January 27, 2011

సత్సంగము

0 comments Posted by tyagaraju on 8:06 AM
















సత్సంగము


27.01.2011 గురువారము


సాయి బంథువులారా ఈ రోజు సత్సంగము గురించి, ఇక్కడ మేము చేసే సత్సంగ విథానము గురించి, వివరంగా చెపుతున్నాను.
సత్సంగము: మంచి వ్యక్తులతో సాంగత్యము. సజ్జనులతో సాంగత్యము. ఈ సాంగత్యములో మనము అందరూ కలిసి భగవంతుని గురించి, భక్తి గురించి, భగవంతుని లీలలు గురించి చర్చింకుంటూ ఉండాలి. బాబా సత్సంగము చేస్తే
ఇంకా అద్భుతంగా ఉంటుంది. బాబా లీలలని స్వయంగా అనుభవించవచ్చు. మీకు ఇంతకుముందు మా సత్సంగములోని లీలలు, సత్సంగము బాబాగారి అనుగ్రహముతో ప్రారంభించబదిన లీల గురించి తెలియచేయడం జరిగింది.
యెక్కడయితే సత్సంగము జరుగుతూ ఉంటుందో అక్కడ బాబా గారు వచ్చి కూర్చుంటారు. ఇంతకుముందు ప్రచురించిన లీలలో కూడా బాబా గారి రాక గురించి ప్రస్తావించడం జరిగింది.

మేము మానరసాపురంలో ప్రతీ శనివారము సాయంత్రము 4 గంటలకు సత్సంగము ప్రారంభిస్తాము. ఇప్పుడు సాయంత్రము 6 గంటలకు మార్చాము. ఉద్యోగస్తులకి కూడా అనుకూలముగా ఉండాలనే ఉద్దేశ్యముతో మార్చడం జరిగింది. 2 గంటలదాకా సత్సంగము నిర్వహిస్తాము.
సత్సంగము ప్రారంభించడానికి మేము యేవిథమయిన చందాలు వసూలు చేయము. యెవరిని మనంతటమనము అడగరాదు. సాయి భక్తులు యేమిస్తే అది తీసుకుంటాము. ఆ వచ్చిన సొమ్మునే సత్సంగానికి ఖర్చు పెడతాము.
సత్సంగములో బాబా ఫొటొ పెడతాము. యెవరింటిలోనయితే సత్సంగము జరిపించుకుంటారొ వారి ఇంటికి కొత్త బాబా ఫోటొ కొని పట్టికెడతాము. మా సత్సంగానికి ప్రత్యేకముగా పెద్ద ఫొటొ ఒకటి తయారు చేయించాము. సత్సంగములో మొదటగ పీఠము వేసి దాని మీద బాబా ఫొటొలు, ఇంక ఇతర దేవుళ్ళ విగ్రహాలు గాని, ఫొటోలు గాని పెడతాము. పూలతో అలంకరిస్తాము. సత్సంగము యెవరి ఇంటిలో జరుగుతోందో ఆయింటి దంపతులు బాబా ఫొటొ ముందు కూర్చుని పూజ (అష్టోత్తరం) చేస్తారు. తరువాత ప్రసాదములు యేవిచేస్తే అవి బాబా గారికి నైవేద్యము పెడతాము.

మొదటగా సాయి చాలీసా గాని, సాయి నక్షత్ర మాలిక గాని అందరము కలిసి చదువుతాము. దాని తరువాత కనులు మూసుకుని 108 సార్లు, బాబా నామ జపము చేస్తాము. 108 కి పట్టే సమయము సుమారుగ 10 లేక 12 నిమిషములు పడుతుంది. దానికి, ఒకరు సెల్ ఫోన్ లో టయిము అలారం పెట్టి టైం అవగానే గుర్తుగా "సచ్చిదానంద సాయి మహరాజ్ కీ జై" అంటారు. ఈ నామ జపము సుఖాసనములో కూర్చుని కనులు మూసుకుని చెయ్యాలి. పూర్తి అయేంతవరకు కనులు తెరవకూడదు.
తరువాత సచ్చరిత్రలో ఒకరు ఒక అథ్యాయము చదువుతారు. అంటే ప్రతీవారం ఒక అథ్యాయము చొప్పున చదువుతాము.
అనగా సత్సంగము మొట్టమొదటగా ప్రారంభిస్తే మొదటి అథ్యాయము, తరువాతనుంచి వరసగా ప్రతీవారం వరుస క్రమంలో చదువుతూ ఉండాలి.
తరువాత ఆ అథ్యాయమునకు ఒక సాయి బంథువు వ్యాఖ్యానము చెపుతారు. తరువాత బాబా లీలలు గురించి, యెవరికయినా బాబా అనుభవములు కలిగితే వాటి గురించి చెప్పుకుంటాము.

సత్సంగ ప్రార్థన

సత్సంగములో ఒకరు ప్రార్థన చేస్తారు. బాబా గారిని ఉద్దేశ్యించి, యెవరికయినా అనారోగ్యముగా ఉన్నా, ఒకవేళ యేదయినా పనిలొ విజయం సాథించడానికి,యెవరికయినా సమస్యలు ఉన్నా అవి తీర్చమని బాబా ని వేడుకుంటాము. ఈ సత్సంగములో పాల్గొన్న ప్రతీవారిని దయతో చూడమని బాబాని వేడుకుంటాము.
తరువాత సమయాన్ని బట్టి బాబా మీద పాటలు పాడతాము, భజనలు చేస్తాము. సయాన్ని బట్టి 4, 5 పాటలు గట్టిగా పాడుకుంటాము.
ఇక 6 గంటలు అవుతుండగా అందరమూ లేచి నిలబడి, బాబా కి ఆరతి పాటలు పాడుతూ ఆరతి ఇస్తాము.

ఆరతి అయిపోగానే సాయి బంథువులందరూ బాబా ఫోటొముందు సాష్టాంగ నమస్కారము చేసి తోచిన దక్షిణ పెడతారు.
తరువాత సాయి బంథువులందరికి ప్రసాదములు పంచి పెడతాము.
యెవరింటిలోనయితే సత్సంగము చేస్తారో వారు దక్షిణగా యేది ఇస్తే అది తీసుకుంటాము. భక్తులు వేసిన దక్షిణ అంతా తీసి ఒక రిజిస్టరు లో అంతా వివరంగా రాస్తాము.

తరువాత ఆ ఇంటివారికి సత్సంగము చేయడానికి కొన్న బాబా ఫొటొ ఇచ్చివేయడం జరుగుతుంది. ప్రతీరోజు ఆ ఫొటొకి కూడా పూజలు చేయమని చెపుతాము. పూజ గదిలో పెట్టి ప్రతీ రోజూ చేసే పూజలతో పాటుగా, పూజ చేస్తూ ఉండాలి.

దూర ప్రాంతములకు కూడా వెళ్ళి మేము సత్సంగము చేస్తాము. అప్పుడు కూడా ఈ సత్సంగమునకు వచ్చిన సొమ్మునుంచే ఖర్చు పెడతాము.

మా సత్సంగము పేరు

శ్రీ ద్వారకామాయి సాయి బంథు సేవా సత్సంగ్



సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

నా పుట్టినరోజునాడు బాబాగారి అనుగ్రహము

0 comments Posted by tyagaraju on 12:00 AM



27.01.2011 గురువారము


సాయి బంధువులకి ఒక మనవి

ఈ రోజు పోస్ట్ చేసిన శ్రిమతి ప్రియాంకాగారి అనుభవము తెలుగు అనువాదము లో కొన్ని వాక్యములు కట్ అయినవి. అందుచేత పాఠకుల సౌలభ్యంకోసం మరలా పోస్ట్ చేస్తున్నాను. ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి

నా పుట్టినరోజునాడు బాబాగారి అనుగ్రహము

ఈ రోజు గురువారము చాలా ప్రత్యేకమయినది. యెందుకంటే ఈ రోజు నా పుట్టినరొజు నాడు బాబాగారు నాన్ను అనుగ్రహించారు. కాని, ఈసారి మాత్రం నేను నా పుట్టినరోజు నా స్నేహితులతో కలిసి జరుపుకోకుండా, సాయిమా తో జరుపుకోవాలనుకున్నాను. క్రితం రోజు రాత్రి, నేను, నా భర్త, ఈ రోజు సాయి మందిరానికి వెళ్ళి అక్కడ బీదవారికి అన్నదానము చేద్దామని యోచన చేశాము. మేము వారికి ఈ రోజు పంచడానికి, వెచ్చటి శాలువాలు కూడా కొన్నాము. అంచేత ఈ యోచనతో నేను ప్రొద్దున్నే లేచి తయారయి బాబా విగ్రహానికి స్నానము చేయించి, పూజ చేసి, చందనము దిద్ది, ఆరతి ఇచ్చాను.

ఆరతి అయిపోయింది, నేను, "సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ మహరాజ్ కి జై" అని జయ థ్వానము చేశాను. బాబాగారికి జై అని చెప్పిన వెంటనే, మా ఇంటిలోకి ఒకరు వచ్చి "అమ్మా, బాబాగారు మీ ఇంటికి వచ్చారు" అన్నాడు. నేను "యెవరదీ?" యెవరు మీరు" అని ఆడిగాను.

అతడు, "నా పేరు ఆషు (ఇతను నా భర్త పని చేసే ఆఫీసులో సహొద్యోగి) నేనింకా యేదయినా అడిగేలోపే అతను మేడ మీదకొచ్చి, నేను బాబా పూజ చేస్తున్న చోట నా ప్రక్కన నుంచున్నాడు. వచ్చి, "అమ్మా, ఈ రోజు బాబాగారు సాయి మందిరమునుంచి, అదీ గురువారమునాడు మీ ఇంటికి వచ్చారు. " అని చెప్పి ఒక పాకట్ నాచేతికిచ్చాడు.

నేను అతని వద్దనుంచి ఇటువంటి బహుమతి వస్తుందని ఊహించలేదు కాబట్టి, జోక్ చేస్తున్నడనిపించింది. అతను చాలా చిన్నవాడు, పైగా అతనికి నేను సాయి భక్తురాలినని కూడా తెలియదు. అంచేత యెదో ఒక షో పీస్ తెచ్చి ఉంటాడు నాకోసం అనుకుని, దానిపైనున్న కాగితం విప్పి చూసేటప్పటికి, అందులో ఆకుపచ్చని శాలువాతో అందమైన దండ, కిరీటంతో అందమైన బాబా విగ్రహం చూసేటప్పటికి నాకు చాలా సంతోషం వేసింది. ఆ విగ్ర్రహాన్ని చూడగానే, బాబాని మా ఇంటికి ఆహ్వానిస్తున్నానా అన్నట్లుగా నా కళ్ళనుంచి ఆ విగ్రహం మీద కన్నీరు కారడం మొదలుపెట్టింది. నా శరీరంతా మంచులా చల్లగా అయింది.

నేను బాబాగారి విగ్రహాన్ని పరిశీలిస్తున్నప్పుదు, వి గ్రహం పాదాల వద్ద కొంచెం చెక్కుకు పోయి వుండడం గమనించాను. నేను ఆ విగ్రహాన్ని మార్చేద్దామనుకున్నను. మేము యెలాగూ సాయి మందిరానికి వెడుతున్నాము కాబట్టి, ఆ విగ్రహాన్ని మార్చేసి, కొత్తది తీసుకుందామని, సాయి మందిరం ఉన్న షాపు లోకి వెళ్ళాము. షాపు యజమానికి చెప్పి విగ్రహం పాదాల వద్ద కొంచెం చెక్కుకుపోయి ఉంది, ఇంకొకటి మార్చమని ఆడిగాను. ఆ షాపతనికి నేను బాగా తెలుసును కావట్టి, "ఓహ్, అవును, ఇంతకు గంటన్నర క్రితమే ఒకబ్బాయి వచ్చి, యెవరికో బహుమతిగా ఇవ్వాలని చెప్పి ఈ విగ్రహాన్ని పట్టుకు వెళ్ళాడు. అప్పుడు నేను, అవును ఈ రోజు నా పుట్టినరోజు, నాకు బహుమతిగా ఇచ్చాడు" అని చెప్పాను. షాపు యజమాని నాకు శుభాకాంక్షలు చెప్పి 5 నిమిషములు ఉండమన్నాడు.

తరువాత చేతిలో పెద్ద విగ్రహంతో తిరిగి వచ్చాడు. ఇది పెద్ద విగ్రహం, మా ఇంటిలో ఇప్పటికే ఇలంటిది ఉందని చెప్పి, వద్దన్నాను. అప్పుడు అతను, మీరు దీనిని తీసుకోవాలి, యెందుకంటే ఇది చాలా ప్రత్యేకమయినది. నన్ను నమ్మండి. ఇందులో బాబాగారు ఉన్నారు అని చెప్పాడు. 2 నెలల క్రింతం కొంతమంది వారింటిలో పెద్ద సత్సంగము చేసుకున్నారు. ఈ సత్సంగానికి వారు 500 మంది భక్తులని పిలిచారు. అంచేత వారు నా వద్ద ఈ విగ్రహాన్ని కొన్నారు. కాని, సత్సంగము అయిన వెంటనే, నా షాపుకి వచ్చి, ఈ విగ్రహాన్ని ఇచ్చివేసి, పెద్ద బాబా ఫొటో బదులుగా తీసుకున్నారు. ఈ విగ్రహం చాలా పెద్దది, దానిని జాగ్రత్తగా చూడడం కూడా తమవల్ల కాదని చెప్పారు. ఇంతే కాకుండా షాపతను, "నాకెందుకో మనసులో ఈ విగ్రహాన్ని మీరు తీసుకోవాలని చెపుతోంది. నానుంచి ఇది మీకు బహుమతి అనుకోండి అని చెప్పాడు.
"మీరెందుకింత విలువైన విగ్రాహాన్ని నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నారు" అని అడిగాను. అప్పుడు అతను "మీరు అది అడగవద్దు ఇది బాబాగారి ఆజ్ణ" అన్నాడు.

నేనేమీ మాట్లాడకుండా ఆ విగ్రహాన్ని తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాను. కాని, నామనసు కుదురుగా లేదు. బాబాగారు నాకేదో చెబుదామని అనుకుంటున్నట్లుగా అనిపించింది. ఆషు ఇచ్చిన విగ్ర్రహానికి బదులుగా షాపతను ఇచ్చిన విగ్రహం ఫోటోని కుడా ఇక్కడ జత చేస్తున్నాను.


ఆరోజు సాయంత్రం నేను కాఫీ త్రాగుతుండగా ఈ విగ్రహం గురించి షాపతను చెప్పిన మాటలన్ని మరలా గుర్తుచేసుకోవడం మొదలుపెట్టాను. హటాత్తుగా నాకు, డెహ్రాడూన్లో తొందరలో సాయి సత్సంగము ప్రారంభించమని బాబాగారు సూచిస్తున్నట్లుగా నేను తెలుసుకున్నాను.

ఇప్పుడంతా వివరంగా చెబుతాను. కొన్ని రోజులక్రితం, త్యాగరాజు గారినుంచి, తమ ఊరిలో సత్సంగము చేస్తున్నట్లుగా, నన్నుకూడా డెహ్రాడూన్లో సత్సంగము చేయమని మెయిల్ చేయడం జ్ణప్తికి వచ్చింది. నాకు ఈ సలహా నచ్చింది, కాని నేను షిరిడీ నుంచి వచ్చాక ఒక్కసారి మాత్రమే చేదామనుకున్నాను. కాని, బాబాగారి లీలలు చాలా అద్భుతంగా ఉంటాయి.

ఈరోజు ఇంతపెద్ద విగ్రహం ఒకరి ఇంటిలో సత్సంగములో ఉండి, వెంటనే సత్సంగము ప్రారంభించమని సూచన చేస్తున్నట్లుగా మాఇంటికి తిరిగి వచ్చింది.

అందుచేత డెహ్రాడున్లో సాయి సత్సంగము నిర్వహణా బాథ్యత నేను తీసుకోవాలని బాబాగారి కోరిక, సూచన.
ఇది రాసినతరువాత నా మనసు ప్రశాంతంగా ఉంది. సాయంత్రం ఆరతి అయిన తరువాత నేను, నాపనిలో పూర్తి న్యాయం చేకూరుస్తానని బాబాగారికి మాటిచ్చాను.
సాయి సత్సంగము కురించి ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేస్తాను. యెప్పుడూ నాకు, నా పుట్టిన రోజు నాడు ఇటువంటి అనుగ్రహం రాలేదు. బాబాగారు తన విగ్రహంతో నాన్ను అనుగ్రహించారు. ఈ రోజున ఆయన నన్ను ఇల్లా దీవించారంటే నమ్మలేకపోతున్నాను.

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

Wednesday, January 26, 2011

I Was Blessed On My Birthday By Shirdi Sai Baba

0 comments Posted by Priyanka rautela dhankar on 6:43 PM

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి


27.11.2011 బుధవారము

ఈ రోజు మనము బాబాగారు శ్రీమతి ప్రియాంకా రౌతేలా గారిని యే విధముగా అనుగ్రహించారో తెలుసుకుందాము.  ఈఇ లీల ఆమె తన ఆంగ్ల బ్లాగులో అక్టోబరు 2008 లో ప్రచురించడం జరిగింది.  ఈ లీలని ఈ క్రితం రోజే పోస్ట్ చేద్దామనుకున్నాను, కాని, ఆమె పొస్ట్ చేసిన దానిలొ బాబా ఫొటోస్ నాకు అప్లోడ్ చేయడం  రాలేదు.  ఫొటోస్ లేకుండా పోస్ట్ చేయడానికి నామన్సు ఒప్పలేదు.  అందుచేత ఒక రోజు ఆలశ్యమయింది.    
                                               
                                           నా పుట్టినరోజునాడు బాబాగారి అనుగ్రహము

 రోజు గురువారము చాలా ప్రత్యేకమయినది.  యెందుకంటే  రోజు నా పుట్టినరొజు నాడుబాబాగారు నాన్ను అనుగ్రహించారు.  కానిఈసారి మాత్రం నేను నా పుట్టినరోజు నా స్నేహితులతోకలిసి జరుపుకోకుండాసాయిమా తో జరుపుకోవాలనుకున్నాను.  క్రితం రోజు రాత్రినేనునాభర్త రోజు సాయి మందిరానికి వెళ్ళి అక్కడ బీదవారికి అన్నదానము చేద్దామని యోచనచేశాముమేము వారికి  రోజు పంచడానికివెచ్చటి శాలువాలు కూడా కొన్నాము.  అంచేత యోచనతో నేను ప్రొద్దున్నే లేచి తయారయి బాబా విగ్రహానికి స్నానము చేయించిపూజ చేసి,చందనము దిద్దిఆరతి ఇచ్చాను.


ఆరతి అయిపోయిందినేను, "సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ మహరాజ్ కి జైఅని జయథ్వానము చేశానుబాబాగారికి జై అని చెప్పిన వెంటనేమా ఇంటిలోకి ఒకరు వచ్చి "అమ్మా,బాబాగారు మీ ఇంటికి వచ్చారుఅన్నాడు.   నేను "యెవరదీ?" యెవరు మీరుఅని ఆడిగాను.

అతడు, "నా పేరు ఆషు (ఇతను నా భర్త పని చేసే ఆఫీసులో సహొద్యోగి)   నేనింకా యేదయినాఅడిగేలోపే అతను మేడ మీదకొచ్చినేను బాబా పూజ చేస్తున్న చోట నా ప్రక్కన నుంచున్నాడు.వచ్చి, "అమ్మా రోజు బాబాగారు సాయి మందిరమునుంచిఅదీ గురువారమునాడు మీఇంటికి వచ్చారు. " అని చెప్పి ఒక పాకట్ నాచేతికిచ్చాడు.

నేను అతని వద్దనుంచి ఇటువంటి బహుమతి వస్తుందని ఊహించలేదు కాబట్టిజోక్చేస్తున్నడనిపించిందిఅతను చాలా చిన్నవాడుపైగా అతనికి నేను సాయి భక్తురాలినని కూడాతెలియదు.  అంచేత యెదో ఒక షో పీస్ తెచ్చి ఉంటాడు నాకోసం అనుకునిదానిపైనున్న కాగితంవిప్పి చూసేటప్పటికిఅందులో ఆకుపచ్చని శాలువాతో అందమైన దండకిరీటంతో అందమైనబాబా విగ్రహం చూసేటప్పటికి నాకు చాలా సంతోషం వేసింది.    విగ్ర్రహాన్ని చూడగానేబాబానిమా ఇంటికి ఆహ్వానిస్తున్నానా అన్నట్లుగా నా కళ్ళనుంచి  విగ్రహం మీద కన్నీరు కారడంమొదలుపెట్టింది.  నా శరీరంతా మంచులా చల్లగా అయింది.

                                                                            
    
నేను బాబాగారి విగ్రహాన్ని పరిశీలిస్తున్నప్పుదువి గ్రహం పాదాల వద్ద కొంచెం చెక్కుకు పోయివుండడం గమనించాను.  నేను  విగ్రహాన్ని మార్చేద్దామనుకున్నను.  మేము యెలాగూసాయి మందిరానికి వెడుతున్నాము కాబట్టి విగ్రహాన్ని మార్చేసికొత్తది తీసుకుందామని,సాయి మందిరం ఉన్న షాపు లోకి వెళ్ళాముషాపు యజమానికి చెప్పి విగ్రహం పాదాల వద్దకొంచెం చెక్కుకుపోయి ఉందిఇంకొకటి మార్చమని ఆడిగాను షాపతనికి నేను బాగాతెలుసును కావట్టి, "ఓహ్అవునుఇంతకు గంటన్నర క్రితమే ఒకబ్బాయి వచ్చియెవరికోబహుమతిగా ఇవ్వాలని చెప్పి  విగ్రహాన్ని పట్టుకు వెళ్ళాడుఅప్పుడు నేనుఅవును  రోజునా పుట్టినరోజునాకు బహుమతిగా ఇచ్చాడుఅని చెప్పాను.  షాపు యజమాని నాకుశుభాకాంక్షలు చెప్పి 5 నిమిషములు ఉండమన్నాడు.

తరువాత చేతిలో పెద్ద విగ్రహంతో తిరిగి వచ్చాడు.  ఇది పెద్ద విగ్రహంమా ఇంటిలో ఇప్పటికేఇలంటిది ఉందని చెప్పివద్దన్నాను.  అప్పుడు అతనుమీరు దీనిని తీసుకోవాలియెందుకంటేఇది చాలా ప్రత్యేకమయినదినన్ను నమ్మండి.  ఇందులో బాబాగారు ఉన్నారు అని చెప్పాడు. 2నెలల క్రింతం కొంతమంది వారింటిలో పెద్ద సత్సంగము చేసుకున్నారు సత్సంగానికి వారు 500మంది భక్తులని పిలిచారు.  అంచేత వారు నా వద్ద  విగ్రహాన్ని కొన్నారుకానిసత్సంగముఅయిన వెంటనేనా షాపుకి వచ్చి విగ్రహాన్ని ఇచ్చివేసిపెద్ద బాబా ఫొటో బదులుగాతీసుకున్నారు.   విగ్రహం చాలా పెద్దది,  దానిని జాగ్రత్తగా చూడడం కూడా తమవల్ల కాదనిచెప్పారుఇంతే కాకుండా షాపతను, "నాకెందుకో మనసులో  విగ్రహాన్ని మీరు తీసుకోవాలనిచెపుతోంది.  నానుంచి ఇది మీకు బహుమతి అనుకోండి అని చెప్పాడు.
"మీరెందుకింత విలువైన విగ్రాహాన్ని నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నారుఅని అడిగాను. అప్పుడు అతను "మీరు అది అడగవద్దు ఇది బాబాగారి ఆజ్ణఅన్నాడు.

నేనేమీ మాట్లాడకుండా  విగ్రహాన్ని తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాను.  కానినామనసుకుదురుగా లేదు.  బాబాగారు నాకేదో చెబుదామని అనుకుంటున్నట్లుగా అనిపించింది.   ఆషుఇచ్చిన విగ్ర్రహానికి బదులుగా షాపతను ఇచ్చిన విగ్రహం ఫోటోని కుడా ఇక్కడ జతచేస్తున్నాను.         

                                                           

ఆరోజు సాయంత్రం నేను కాఫీ త్రాగుతుండగా  విగ్రహం గురించి షాపతను చెప్పిన మాటలన్నిమరలా గుర్తుచేసుకోవడం మొదలుపెట్టానుహటాత్తుగా నాకుడెహ్రాడూన్లో తొందరలో సాయిసత్సంగము ప్రారంభించమని బాబాగారు సూచిస్తున్నట్లుగా నేను తెలుసుకున్నాను. 

ఇప్పుడంతా వివరంగా చెబుతాను.  కొన్ని రోజులక్రితంత్యాగరాజు గారినుంచితమ ఊరిలోసత్సంగము చేస్తున్నట్లుగానన్నుకూడా డెహ్రాడూన్లో సత్సంగము చేయమని మెయిల్ చేయడంజ్ణప్తికి వచ్చిందినాకు  సలహా నచ్చిందికాని నేను షిరిడీ నుంచి వచ్చాక ఒక్కసారి మాత్రమేచేదామనుకున్నాను.  కానిబాబాగారి లీలలు చాలా అద్భుతంగా ఉంటాయి. 

ఈరోజు ఇంతపెద్ద విగ్రహం ఒకరి ఇంటిలో సత్సంగములో ఉండివెంటనే సత్సంగముప్రారంభించమని సూచన చేస్తున్నట్లుగా మాఇంటికి 
తిరిగి వచ్చింది.

అందుచేత డెహ్రాడున్లో సాయి సత్సంగము నిర్వహణా బాథ్యత నేను తీసుకోవాలని బాబాగారికోరికసూచన.
ఇది రాసినతరువాత నా మనసు ప్రశాంతంగా ఉంది.  సాయంత్రం ఆరతి అయిన తరువాత నేను,నాపనిలో పూర్తి న్యాయం చేకూరుస్తానని బాబాగారికి మాటిచ్చాను. 
సాయి సత్సంగము కురించి ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేస్తాను.  యెప్పుడూ నాకునా పుట్టినరోజు నాడు ఇటువంటి అనుగ్రహం రాలేదు.  బాబాగారు తన విగ్రహంతో నాన్ను అనుగ్రహించారు.  రోజున ఆయన నన్ను ఇల్లా దీవించారంటే నమ్మలేకపోతున్నాను.

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు




శ్రీ సాయి చాలీసా

0 comments Posted by tyagaraju on 7:38 AM





26.01.2001 బుథవారము

ఈ రోజు మన సాయి బంథువులందరకూ శ్రీ సాయి చాలీసాను
అందిస్తున్నాను. ప్రతిరోజు లేక గురువారమునాడయినను దీనిని
చదవండి. సాయిని మదిలో నిలుపుకొనండి.

మేము సత్సంగములొ మొదటగ ఈ చాలీసా చదివి సత్సంగమును ప్రారంభిస్తాము.

సాయి బంథువులందరూ కలిసి ఈ సత్సంగము యెలా చేయాలొ తరువాత వివరంగా ఇస్తాను.

---------------------------------------------------------------



శ్రీ సాయి చాలీసా


షిరిడివాస సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
దత్త దిగంబర అవతారం
నీలో సృష్టి వ్యవహారం

త్రిమూర్తి రూపా ఓ సాయి
కరుణించి కాపాడోయీ
దర్శనమీయగ రావయ్యా
ముక్తికి మార్గం చూపుమయా షిరిడి

కఫినీ వస్త్రము ధరియించి
భుజమునకు జోలి తగిలించి
నింబ వృక్షపు చాయలో
ఫకీరు వేషపు ధారణలో

కలియుగమందున వెలిసితివి
త్యాగం, సహనం నేర్పితివి
షిరిడి గ్రామం నీ నివాసం
భక్తుల మదిలో నీ రూపం షిరిడి

చాంద్ పాటిల్ ను కలుసుకొని
అతని బాథలు తెలుసుకొని
గుఱ్ఱముజాడ తెలిపితివి
పాటి ల్ బాథను తీర్చితివి

వెలిగించావు జ్యోతులను
నీవుపయోగించీ జలము
అచ్చెరువొందెను ఆ గ్రామం
చూసీ వింతైనా దృశ్యం షిరిడి

బాయీజా చేసెను నీ సేవ
ప్రతిఫలమిచ్చావో దేవా
నీ అయువును బదులిచ్చి
తాత్యాను నీవు బ్రతికించి

పశు పక్షులను ప్రేమించి
ప్రేమతో వాటిని లాలించి
జీవులపైన మమకారం
చిత్రమయా నీ వ్యవహారం షిరిడి

నీ ద్వారములో నిలిచితిని
నిన్నే నిత్యము కొలిచితిని
అభయమునిచ్చి బ్రోవుమయా
ఓ షిరిడీశా దయామయా

ధన్యము ద్వారక ఓ మాయీ
నీలో నిలిచెను శ్రీ సాయీ
నీ ధుని మంటల వేడిమికి
పాపము పోవుని తాకిడికి షిరిడి

ప్రళయకాలము ఆపితివి
భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహామారి నాశం
కాపాడీ షిరిడీ గ్రామం

అగ్నిహోత్రి శాస్త్రికి
లీలామహత్యం చూపించి
శ్యామాను బ్రతికించితివి
పాము విషము తొలగించి షిరిడి

భక్త భీమాజీకి క్షయరోగం
నశియించే అతని సహనం
ఊదీ వైద్యం చేసావూ
వ్యాథిని మాయం చేసావు

కాకాజీకి ఓ సాయి
విఠ్ఠల దర్శన మిచ్చితివి
దామూకిచ్చి సంతానం
కలిగించితివి సంతోషం షిరిడి

కరుణా సింథూ కరుణించు
మాపై కరుణ కురిపించు
సర్వం నీకు అర్పితము
పెంచుము భక్తి భావమును

ముస్లిమనుకుని నిను మేఘా
తెలుసుకొని అతని బాథ
దాల్చి శివశంకర రూపం
ఇచ్చావయ్యా దర్శనము షిరిడి

డాక్టరుకు నీవు రామునిగా
బల్వంతుకు శ్రీ దత్తునిగా
నిమోనుకరుకు మారుతిగా
చిదంబరకు శ్రీ గణపతిగా

మార్తాండ్ కు ఖండోబాగా
గణూకు సత్యదేవునిగా
నరసిం హ స్వామిగ జోషికి
దర్శనమిచ్చిన శ్రీ సాయి షిరిడి

రేయీ పగలూ నీ ధ్యానం
నిత్యం నీలీలా పఠనం
భక్తితో చేయండీ ధ్యానం
లభించును ముక్తికి మార్గం

పదకొండూ నీ వచనాలు
బాబా మాకవి వేదాలు
శరణని వచ్చిన భక్తులను
కరుణించి నీవు బ్రోచితివి షిరిడి

అందరిలోన నీ రూపం
నీ మహిమ అతిశక్తిమయం
ఓసాయి మేము మూఢులము
ఒసగుమయా నీవు జ్ఞానమును

సృష్టికి నీవేనయ మూలం
సాయి మేము సేవకులం
సాయి నామము తలచెదము
నిత్యము సాయిని కొలిచెదము షిరిడి

భక్తి భావన తెలుసుకొని
సాయిని మదిలో నిలుపుకొని
చిత్తముతో సాయి ధ్యానం
చేయండీ మీరు ప్రతినిత్యం

బాబా కాల్చిన థుని వూది
నివారించును అది వ్యాథి
సమాథి నుండి శ్రీసాయి
భక్తులను కాపాడోనోయి

మన ప్రశ్నలకు జవాబులు
తెలుపును సాయి చరితములు
వినండి లేక చదవండి
సాయి సత్యము చూడండి

సత్సంగమును చేయండి
సాయి స్వప్నము పొందండి
భేద భావమును మానండి
సాయే మన సద్గురువండి షిరిడి

వందనమయ్యా పరమేశా
ఆపద్భాందవ సాయీశా
మా పాపములు కడతేర్చు
మా మదికోరిక నెరవేర్చు

కరుణామూర్తి ఓ సాయి
కరుణతో మము దరిచేర్చోయి
మా మనస్సే నీ మందిరము
మా పలుకులే నీకు నైవేద్యం షిరిడి


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Monday, January 24, 2011

బాబా చేసిన వివాహము

0 comments Posted by tyagaraju on 3:17 AM






24.01.2011, సోమవారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి

బాబా గారి లీలలు అనంతములు అని మనకు తెలుసును. యెవరికి యెప్పుడు యేది యెలా ఇవ్వాలో ఆయనకు మాత్రమే తెలుసు. ముందర తన భక్తుడు కాకపోయినాసరే ఒక చిన్న లీల చూపించి తనవానిగా చేసుకుంటారు. ఆయన పాదాలను ఆశ్రయించైనవ్వరు ఇక యెప్పటికి ఆయనను వదలిపెట్టరు.

బాబా వల్ల ఒకామె వివాహము యెలా జరిగిందో ఈరోజు మనం తెలుసుకుందాము.

-------------------------------------------------------------------------
ఈ బాబా లీల శ్రిమతి ప్రియాంకా రౌతేలా గారు నెల క్రితం బ్లాగులో పొస్ట్ చేసినదానికి తెలుగు అనువాదము.
ఈ రోజు మనము డిల్లి నుంచి స్వాతి బక్షి గారు తెలిపిన లీల గురించి తెలుసుకుందాము. ఆమే నాకు ఈ మెయి ల్ ౩ నెలల క్రిందటనే పంపినప్పటికీ ఈ రోజున నేను దానిని పోస్ట్ చేస్తున్నాను . ఆమే చాల డిప్రెషన్ లో ఉంది, ఎందుకంటె ఆమెని పెళ్లి చేసుకోబోఏవాడు ఆమెని మోసం చేసాడు. ఆమె చెప్పిన మీదట ఈ విషయం చాల సీరియస్ అనిపించి నా సెల్ నంబర్ కూడా ఇచ్చినట్లు గుర్తు. రెండు రోజులుగా ఆమె నాకు ఫోన్ చేయలేదు, కాని ౩ రోజున రాత్రి 1.30. కి ఫోన్ చేసింది. నేను సాధారణంగా రాత్రి 7 తరువాత సైలంట్ మోడ్లో పెడతాను, మా అమ్మాయి నిద్రకి భంగము కలగకుండా. కానీ ఆరోజు న సెల్ఫోన్ సైలంట్ మోడ్ లో పెట్టడం మరిచిపోయాను. ఆమె నాకు ఫోన్ చేసినప్పుడు బాగా విచారంగా ఉంది ఏడుస్తోంది. నేనంతా పూర్తీ వివరంగా చెప్పలేను గాని , ఆమె తన కాబోయే భర్త చేత మోసగిం పబడింది. వాళ్ళు ఇంకొక రెండు వారాలలో పెళ్ళి చేసుకోబోతారనగా ఇదంతా జరిగింది. ఆమె ఇంకా ఇలా చెప్పింది, నేను నెట్ ముందు కూర్చున్నప్పుడు మీ ఐ డి కనపడింది, మెయిల్ చేద్దామనుకున్నానుగాని మాట్ల్లడడానికి మీరు తప్ప ఎవరూ లేరు నాకు, అని ఏడుస్తూ చెప్పింది. ఈ విషయంలో ఆమె నాసహాయాన్ని కోరుతోంది.

ఇది చాలా క్లిష్టమయిన సమస్య, స్వాతి చాల నిస్సహాయురాలుగా ఉంది, ఈ పరిస్థితులలొ ఆమె ఏమయినా చేసుకోవచ్చు , ఏమి జరిగిందో నాకు పూర్తిగా తెలియదుగాని, బహుశా బాబా గారే ఈ సమస్య పరిష్కరించడానికి నన్ను ఎన్నుకున్నారేమో. నేను స్వాతితో "కాస్త రిలాక్స్ అవమని, ప్రొద్దున్న తొమ్మిది గంటలకు ఫోన్ చేస్తానని చెప్పాను. సాయి సాయి సాయి అనుకోమని చెప్పాను. ఆ రోజు రాత్రంతా నేను దీనికి పరిష్కారము ఏమిటా అని ఆలోచిస్తూ, ప్రొద్దున్న 5.30 కి పూజ గదిలో కుర్చుని స్వాతి సమస్యకి పరిష్కారం చూపించమని బాబా ని కోరి ప్రార్థించాను. సాయిసచ్చరిత్ర చేతిలోకి తీసుకుని చదవడం మొదలుపెట్టాను. నేను చదువుతున్నప్పుడు స్వాతి మళ్లి ఫోన్ చేసి "అక్కా, , నాకు నిద్ర పట్టడంలేదు, నాకు చచ్చిపోవాలని ఉంది, అంది. " అప్పుడు నేను స్వాతితో ఓ కే అలాగే కానీ నువ్వు చనిపోదామనుకుంటే నేను అడ్డుపెట్టను, కానీ దీనికి పరిష్కారం ఉంది, నువ్వు ఆచరిస్తానంటే కనక చెపుతాను అని చెప్పాను. నీ చింతలన్ని పోతాయని మాత్రం నాకు నమ్మకం ఉంది అని చెప్పాను. ఇది వినగానే " ఏమిటా పరిష్కారం అని అడిగింది.

నిజానికి అప్పటికి నాదగ్గిర చెప్పటానికి పరిష్కార మార్గమెదీ లేదు, కాని సచ్చరిత్ర చేతిలో ఉంది, అందుకుని ఆమెతో నువ్వు బాబా సచ్చరిత్ర ఒక వారం రోజులు పారాయణ చెయ్యి అని చెప్పాను. నేను చెప్పిన దానికి స్వాతి సంతోషించలేదు, నేను బాబా భక్తురాలిని కాదు నేను అమ్మవారిని పూజిస్తాను అని చెప్పింది. కాని నేను గట్టిగా చెప్పినమీదట సచ్చరిత్ర చదవడానికి ఒప్పుకుంది. (నేను ఆమెకి ఒక పుస్తకం పంపాను)

దాదాపు పది రోజులదాకా నాకు స్వాతినుంచి ఎటువంటి ఫోన్ లు రాలేదు. ఒక రోజు నాకు వివాహ శుభలేఖ వచ్చింది, చూసేటప్పటికి అది స్వాతి శుభలేఖ. కెనడా లో ఉన్న ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరుతో ఆమె వివాహం. నా సంతోషానికి అవధులు లేవు. నేను వెంటనే ఇదంతా ఎలా జరిగిందని స్వాతికి ఫోన్ చేసాను. స్వాతి, “ ప్రియాంక అక్కా నాకు నువ్వు బాబా గారిని పరిచయం చేసినందుకు , సచ్చరిత్ర పంపినందుకు కృతజ్ఞతలు ఎలా చెప్పను “ ‘అని చాల సంతోషంగా చెప్పింది. నాలుగు రోజులలోనే నాకు బాబా గారి ఆశీర్వాదం లభించింది.

స్వాతి , సచ్చరిత్రలో అరవై తొమ్మిదో పేజి వద్దకి వచ్చేటప్పటికి, బాబా గారికి ధూప్ స్టిక్ , నైవేద్యానికి పంచదార పలుకులు కొని తెద్దామని షాప్ కి వెళ్ళింది. అక్కడ ఆమెకు ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. వారిద్దరికీ మొదటి చూపులోనే ప్రేమ కలిగింది. ఇద్దరిమధ్య కొంత సంభాషణ జరిగింది. ఇద్దరు ఒకరి ఫోన్ నంబర్స్ ఒకళ్ళు తీసుకున్నారు. అదే రోజు సాయంత్రం ఆ అబ్బాయి తన తండ్రి తో కలిసి స్వాతి ఇంటికి వచ్చి ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉన్నట్లు చెప్పాడు. దీనితొ స్వాతి కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఆ అబ్బాయి కెనడాలో స్థిర పడ్డ ఐశ్వర్యవంతుల కుటుంబానికి చెందినవాడు. కానీ, స్వాతి కుటుంబము మాత్రము సామాన్యులు.

ఒకరోజున జీవితాన్ని అంతం చేసుకుందామనుకున్న స్వాతి ఈ రోజు కెనడాలో తన భర్తతో సంతోషంగా ఉంది. సంతోషించవలసిన విషయం ఏమిటంటే ఇప్పుడు స్వాతి ఆమె కుటుంబ సభ్యులు షిర్డీ సాయిబాబా గారినే పూజిస్తున్నారు. తను చాలా సార్లు బాబాగారిని కలలో చూస్తున్నానని చెప్పింది. స్వాతి ఏదయితే కోరుకుందో బాబా గారు అది ఆమెకు ఇచ్చినందుకు నాకు చాల సంతోషంగా ఉంది. ఆమె సమస్యని పరిష్కరించడంలోనన్ను మార్గదర్సకురాలిగా చేసినందుకు నేను బాబాగారికి కృతజ్ఞురాలిని. ఈలీల మనకి సాయి భక్తిలో ఉన్న శక్తి మన జీవితాలని ఒక్క రాత్రిలోనే ఎంతలా మార్చి వేస్తుందో తెలియచేస్తుంది, మనకు కావలసిందల్లా శ్రథ్థ,సహనం. ఏది మంచో ఏది చెడో మనకు తెలియదు కాబట్టి మనము బాబాగారికి సర్వస్య శరణాగతి చేయడమే. కానీ బాబాగారు ఏది చేసినా అది మన మంచికే చేస్తారు. ఈ లీల పోస్ట్ చేయడనినకి అనుమనితినిచ్చినందుకు స్వాతికి ధన్యవాదములు. ఈలీలను చదివిన మనకు ముఖ్యముగా యువతకి ప్రయోజనము చేకూరుట నిశ్చయము. ఆశను వీడకండి, బాబా మీద నమ్మకముంచండి మీ భవిష్యత్తును చూడండి అది మీ ఊహకందనిది.



సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List